దివ్య ఖురాన్ ప్రకారం స్త్రీ,పురుషులు
ఇరువురు
సమానులే
మరియు
ఇరువురు
ఒకే జీవి నుండి సృష్టించబడినారు. విద్యార్జన స్త్రీ-పురుషులకు ముఖ్యమైన విధి.(తిర్మిజీ) విద్యను పొందటంలో స్త్రీ-పురుషుల మద్య ఇస్లాం ఎటువంటి విచక్షణ చూపదు. వాస్తవానికి అనేక మంది
ముస్లిం
స్త్రీలు
ఇస్లాం
ప్రారంభ
దశలో విద్య,జ్ఞాన
రంగముల
లోని
వివిధ
విభాగాలలో మహత్తరమైన సేవలు అంధించినారు. మతశాస్త్రం,సాహిత్యము, విద్య మరియు వైద్య రంగాలలో ముస్లిం స్త్రీలు అసమానమైన ప్రతిభను ప్రదర్శించిరి. మహాప్రవక్త (స) తన కాలంనాటి అన్సార్ మహిళల జ్ఞానశక్తిని, విద్యాపట్ల వారికున్న అబిరుచిని ఎంతొగా కొనియాడినారు.
ముస్లిం చరిత్ర ప్రారంభ దినాలలో స్త్రీలు
అనేక రంగాలలో పాల్గొన్నారు, 12వ శతాబ్ధాపు తత్వవేత్త,న్యాయవేత్త ఇబ్న్ రుష్డ్ ప్రకారం ముస్లిం స్త్రీ పురుషులు ఇరువురు సమానులే, ముస్లిం మహిళలు మొదటినుంచి సామాజిక, ఆర్థిక రంగాలలో
తమ సేవలను అంధించేవారు.
అనేక మంది ముస్లిం మహిళలు విప్లవాత్మక మరియు వీరోచిత నాయకులు గా పనిచేశారు. ఆధునిక
యుగములో రాజకీయ రంగములో స్త్రీ సాదికారికత
సాదించిన మహిళలు గా బెనెజీర్ భుట్టో(పాకిస్తాన్), మెగవతి సుకర్నొపుత్రి(ఇండోనేషియా), తన్సు సిల్లర్ (టర్కీ) బేగమ్ ఖలీదా జియా (బంగ్లాదేశ్) బేగమ్ హసీనా (బంగ్లాదేశ్) ను పేర్కొన వచ్చును.
బంగ్లాదేశ్ మరియు మాలి ప్రస్తుత ప్రధానమంత్రులు గా
కొనసాగుతున్న షేక్ హసీనా వాజీద్, సిసి మరియం కైదమా సిదిబే(Cissé Mariam Kaïdama
Sidibé) ముస్లిం మహిళలు. అదేవిధంగా, కొసావో ప్రస్తుత అధ్యక్షురాలు అతిఫే జహాగా
( Atife Jahjaga) ప్రపంచంలోనే అతి పిన్న వయస్సు మహిళా అధ్యక్షురాలు, అలాగే ఆమె ఆ దేశం యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలు. 1988 నుండి, బంగ్లాదేశ్, ఇండోనేషియా, మాలి, పాకిస్తాన్, కొసావో, కిర్గిస్థాన్, సెనెగల్ మరియు టర్కీ, దేశాలలో ముస్లిం మహిళలు విబిన్న కాలాలలో అధ్యక్షురాలు/ప్రధాన మంత్రి గా పనిచేసారు.
అంతర్జాతీయ
మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ముస్లిం
తెలుసుకోవలసిన (ఏడవ శతాబ్దం నుండి నేటి వరకు గల) 10 మంది ప్రధాన ముస్లిం మహిళా
మణులు గురించి పరిచయం చేస్తాను. ఈ క్రింది 10 మంది అసాధారణ ముస్లిం
మహిళలు
తమ నాయకత్వ పటిమతో తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేసారు.
1.నుసైబా బిన్తె కాబ్ అల్ అన్సారియా Nusaybaa Bint ka’b Al- Ansariyah(అరేబియా- 634
C.E.)
I
నుసైబా ముస్లిం
మహిళల
హక్కుల
కోసం
పాటుపడినారు. ముఖ్యంగా ఆమె ప్రవక్త ముహమ్మద్(స) అడిగారు "ఎందుకు అల్లాహ్
(దివ్య ఖుర్ఆన్ లో) పురుషులని మాత్రమే సంబోదిస్తారు??" ఈ ప్రశ్న అడిగిన తరువాత త్వరలో ప్రవక్త(స) పై ఒక వహి
అవతరించినది. “అల్లాహ్ ను అత్యదికంగా స్మరించే వారు అయిన స్త్రీ-పురుషుల
నిమిత్తం అల్లాహ్ క్షమాబిక్షను, గొప్ప
ప్రతిఫలాన్ని సిద్దపరిచి ఉంచాడు.”-దివ్య ఖురాన్ 33:35. అనగా స్త్రీలు కూడా
పురుషుల వలేనే ప్రతి గుణాన్ని, ప్రాప్తి ని పొందవచ్చు. ఆమె తన కాలం నాటి ఒక అధ్బుతమైన,ముందుచూపు ఉన్న మహిళ గా కొనియాడబడింది.
2.రాబియా బసరి
(717-801):
ఇస్లాం మతానికి చెందిన ప్రముఖ సూఫీ కవయిత్రి, హదీసు విద్యా వేత్త. ఈమె ఒక పేద కుటుంబంలో జన్మించారు. అనాధ
అయిన
ఈమె ఆతరువాత బానిస గా అమ్మబడినది. ఈమే మహత్తును గమనించిన యజమాని ఈమెను బానిసత్వం నుండి విడుదల చేసి స్వేచ్చ ప్రసాదించినాడు. ఎడారి లో స్థిర నివాసాన్ని ఏర్పర్చుకొని, వివాహాన్ని త్యజించి, భగవంతుని ఆరాధనలో,సూఫీ తత్వవిచారం లో నిండా మునిగి తేలుతూ తన కాలాన్ని గడిపినారు. ఈమెకు అనేకమంది శిష్యులు కలరు. సూఫీ కవిత్వం లో ఈమె పేరు అజరామరం గా ఉంటుంది
717-801 C.E.)
3.ఫాతిమా అల్-ఫియరి (మొరాకో-880 C.E.)
ఫాతిమా అల్-ఫియరి ప్రపంచంలోని పురాతన పట్టా-ప్రధాన
(Degree Awarding) విశ్వవిద్యాలయ స్థాపకురాలు. ఆమెకు వంశపారoపర్యం గా లబించిన
ధనంతో ఈమె అల్ క్వరవియ్యన్ మసీదు ను నిర్మించారు. ఈ మసీదు నేడు ఒక విశ్వ
విద్యాలయంగా అబివృద్ది చేయ బడింది. గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ మరియు యునెస్కో
వారిచే అతి పురాతన ఉన్నత విద్యా సంస్థగా ఈ విశ్వ విద్యాలయం గుర్తించ బడినది.
4.రజియా
సుల్తాన్
(భారతదేశం, 1205-1240)
తుర్కమాన్ గేట్
ఢిల్లీ
సమీపంలోని బుల్బుల్-ఇ-ఖాన్ రజియా సుల్తాన్ సమాధి
రజియా సుల్తాన్ 1236 నుండి 1240 వరకు ఢిల్లీ సుల్తాన్. భారత దేశ ముస్లిం పాలకుల చరిత్రలో ఆమె మొదటి
పరిపాలకురాలు, ఆమె కు సుల్తానా అని పిలవబడటం ఇష్టం ఉండేది కాదు. ఆమె ఒక పురుషుని
వలె దుస్తులు ధరించి మరియు ఒక తలపాగా, ప్యాంటు, కోటు మరియు కత్తి ధరించెది.
రజియా సుల్తాన్ మతం యొక్క ఆత్మ దాని భాగాల కంటే మరింత ముఖ్యమైనది అని ఆమె నమ్మేది. ఆమె అనేక ప్రభుత్వ గ్రంథాలయలు,
పాఠశాలలు, విద్వత్ సంస్థలు, పరిశోధనా సంస్థలు, కేంద్రాలను ఏర్పాటు చేసింది.
5.నానా ఆస్మా (నైజీరియా, 1793-1864)
నానా ఆస్మా యువరాణి, కవయిత్రి, ఉపాధ్యాయురాలు . ఆమె అరబిక్, ఫుల్ఫుల్దే (Fulfulde),
హౌసా
మరియు
తమచక్(Tamacheq) బాషాలలో నిష్ణాతురాలు మరియు
అరబిక్, గ్రీక్ మరియు లాటిన్ కావ్యాల లో బాగా ప్రావీణ్యం సంపాదించినది. 1830 లో, ఆమె పేద, గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఉపాధ్యాయుల బృందంతో పర్యటించి గ్రామీణ పేద మహిళలలో
విద్య ను
ప్రచారం చేసినది. మహిళా
విద్య
లో ఆమె
ఆఫ్రికన్
మహిళల గుర్తుగా(symbol) మారింది. నేడు, ఉత్తర నైజీరియాలో అనే ఇస్లామిక్ మహిళా సంఘాలకు
, పాఠశాలలకు
మరియు సమావేశ మందిరాలకు
ఆమె గౌరవార్ధం ఆమె పేరు పెట్టబడినవి.
6.లీలా భక్తియార్ (అమెరికా -1938-ప్రస్తుతం)
లీలా భక్తియార్ యొక్క ఖురాన్ అనువాదం, "ఉత్కృష్టమైన ఖురాన్" (2007), ఒక అమెరికన్ మహిళ చే ఆంగ్లంలోకి దివ్య ఖురాన్ యొక్క మొదటి అనువాదం. ఆమె
దివ్య ఖురాన్ అనువాదం ను అమెరికా లో చాలా మసీదులు మరియు విశ్వవిద్యాలయాలు ఉపయోగిస్తున్నాయి
ఆమె అనువాదం ను మరియు జోర్డాన్ ప్రిన్స్ ఘాజీ బిన్ ముహమ్మద్ ప్రశంశించారు.
7.షిరిన్ ఇబాడి (ఇరాన్- 1947-ప్రస్తుతం)
2003 లో షిరిన్ నోబెల్ శాంతి బహుమతి అందుకున్న తొలి ముస్లిం మహిళ. ఇరాన్ లో న్యాయమూర్తి మరియు ప్రధాన న్యాయమూర్తి స్థానం
ను సాధించిన మొట్టమొదటి మహిళ. న్యాయవాదిగా, షిరిన్ పలు వివాదాస్పద కేసులను స్వీకరిoచారు. ఆమె దృష్టిలో ఇస్లాం
"సమానత్వo మరియు ప్రజాస్వామ్యం
ల యొక్క సామరస్యం” ఇస్లాం ఒక ప్రామాణికమైన వ్యక్తీకరణ. ఇది స్త్రీ
ని బంధించివుంచే మతం కాదు.
8.డాక్టర్ ఆమినా వదూద్ (అమెరికా - 1952-ప్రస్తుతం)
2005 లో అమీనా ఒక మిశ్రమ సమాజం(స్త్రీ-పురుష
సమూహా) ప్రార్థన కు
స్త్రీ ఇమామ్ గా నాయకత్వం వహించినది. అది
ఇస్లామిక్ ప్రపంచం లో ఒక దిగ్బ్రాంతిని కలుగ చేసింది. కొoదరు దీనిని ఒక ఒక మేల్కొలుపు మరియు ఇస్లాం మతం యొక్క సమానత్వ మార్గం గా చూసారు. కొందరు దీనిని విమర్శించారు. అమీనా ప్రకారం, "ఇస్లాం లో స్త్రీ-పురుషులు ఇరువురు సమాన మనే భావన ఇస్లాం
మూల సూత్రం తవహిద్ లో ఉంది. కాబట్టి పూర్తి మానవ గౌరవం సమానత్వం,
మహిళలకు ఇవ్వాలని ఇస్లాం మతం చెబుతుంది.
9.డైసీ ఖాన్ (అమెరికా -1958-ప్రస్తుతం)
2005 లో, డైసీ ఖాన్ ఆధ్యాత్మికత మరియు సమానత్వం
కోసం ప్రపంచ ముస్లిం మహిళల సంస్థను Women's Islamic Initiative in Spirituality and Equality (WISE), స్థాపించినది. ఆ సంస్థ ద్వారా ప్రపంచ
వ్యాప్త ముస్లిం
మహిళల
మానవ
హక్కులు
మరియు
సామాజిక
న్యాయం
కోసం కృషి చేసింది. ఇంకా 2008 లో డైసీ
ఖాన్ 26 దేశాల నుండి ప్రముఖ ముస్లిం మతం మహిళ పండితులు, కార్యకర్తలు, న్యాయవాదులతో కలసి గ్లోబల్ ముస్లిం మహిళల షూరా
కౌన్సిల్ స్థాపించినది.
గ్లోబల్
ముస్లిం
మహిళల
షూరా కౌన్సిల్ యొక్క
అభిప్రాయాలు అనేక దేశాల విశ్వవిద్యాలయలకు,
న్యాయ విభాగాలకు తెలియజేసింది. డైసీ
ఖాన్ ను ప్రపంచ ముస్లిం కమ్యూనిటీ లోపల ఒక విశ్వసనీయ మానవత్వ మరియు సమాన గొంతుక
గా పరిగణించాలి.
10. అనుషే అన్సారీ (అమెరికా - 1966-ప్రస్తుతం)
2006లో అనుషే అన్సారి అంతరిక్ష యానం చేసిన
మొట్టమొదటి ముస్లిం మహిళ. తన అంతరిక్ష నౌక నుండి ఆమె ప్రసంగిస్తూ “ప్రపంచవ్యాప్త
ముఖ్యంగా పురుషాదిక్యత ఉన్న మద్య ప్రాచ్య దేశాల లోని యువకులు, మహిళలు, యువతులు తమ
బంగారు కలలను మర్చిపోవద్దు. వాటిని కొనసాగించండి. అది అసాద్యం అనిపిచవచ్చు, కాని ఆ
కలలు తమ హృదయాలలో సుస్థిరంగా ఉంచుకొంటే వాటిని సాకారం చేసుకోవచ్చని నమ్ముతున్నాను”
అని అన్నది.
ముగింపు:
ఇస్లాం ప్రకారం స్త్రీ సమాజం లో ఒక అంతర్భాగం. స్త్రీ
విద్యాభివృద్ధి ,స్త్రీ
సాధికారికత సాదించని సమాజాలు అబివృద్ధిని సాదించలేవు. “స్త్రీ
ఉనికి ప్రపంచానికి వెలుగు నిస్తుంది, జీవితమనే సంగీత
వాయిద్యం లో స్త్రీ ప్రధాన వాయిద్యం” –మహా కవి ఇక్బాల్. (వుజూద్-ఏ-జన్ సే హై
తస్వీ-ఏ-ఖైనాత్ మే రంగ్ / ఇస్సీ కె సాజ్ సే హై జిందగీ క సౌజ్-ఏ-దరున్)-ఇక్బాల్.
No comments:
Post a Comment