29 February 2016

జ్ఞాపక శక్తీ ని పెంచే అద్భుతమైన ఏడూ ఆహార పదార్



ఏదైనా ఒక విషయం లో సంపూర్ణత సాదించడానికి ఒక ఆరోగ్యకరమైన మనస్సు మరియు దృష్టి సామర్ధ్యం కలిగి ఉండుట చాలా ముఖ్యం. మనం భౌతికo బాగా చురుకుగా ఉండటానికి మన మానసిక సామార్ద్యం పెంచుకొన వలసి ఉంది. మొత్తం శరీరం ను నియంత్రించే మెదడు యొక్క సరైన సంరక్షణ తీసుకోవాలి.  దానికి మంచి నిద్ర అవసరం అయితే కొన్ని పోషకాలను కూడా  మన  మెదడు కోసం దాని చురుకుతనం మరియు ఏకాగ్రత పెంచడానికి జోడించవచ్చు.
మెదడు జ్ఞాపక శక్తీ ని పెంచే కొన్ని ఆహార పదార్ధాలను పరిశిలించుదాము.
1.    నల్లని చాక్లెట్ (Dark Chocolate) http://doctormurray.com/wp-content/uploads/2013/06/1395483106chocolate_1.jpg

అధిక ఫ్లావర్ గల  కోకో (నల్లని  చాక్లెట్)తినుట వలన  మెదడుకు మెరుగైన రక్త ప్రవాహం అందునని  అధ్యయనాలు వెల్లడించినవి. డార్క్ చాక్లెట్ చిత్తవైకల్యం, మెమొరీ రుగ్మతలను  తగ్గించును. ఇది పలు గంటలు పాటు  మెదడుకు రక్త ప్రవాహం పెంచును.
2. వాల్నట్
http://www.allcropsolutions.com/wp-content/uploads/2014/07/WALNUT.jpg
ఇది మెదడును  పోలి ఉండుటయే కాక  ఏకాగ్రతను పెంచును. దీనిలో యాంటిఆక్సిడెంట్స్, విటమిన్లు మరియు ఖనిజాలు అధిక స్థాయిలో ఉన్నాయి. అల్జీమర్స్ వ్యాధిని తగ్గించడంలో సహాయకారిగా ఉండును. రోజు గుప్పెడు వాల్నట్స్ తినుట మంచిది.
3.మామిడికాయలు
http://media.mercola.com/assets/images/food-facts/mango-nutrition-facts.jpg
మామిడి భారతదేశం యొక్క జాతీయ పండు. దీనిని పండ్ల లో రాజు అని  అని పిలుస్తారు, మామిడి అన్ని వయసుల వారికి  అభిమాని. ఏకాగ్రత సమస్యలు ఎదుర్కొంటున్న పిల్లలకు బహు ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలోని గ్లుటమైన్ యాసిడ్ అనే  రసాయనo  మెదడులోని కణాలను  చురుకుగా ఉంచుతుంది మరియు  జ్ఞాపక  శక్తిని పెంచుతుంది. ఎండా కాలం లో  పండిన మామిడికాయ మరియు మామిడి తాండ్రను  తినటానికి ప్రయత్నించండి.
4. ఆకుపచ్చని   ఆకుకూరలు
http://www.modernreaders.com/wp-content/uploads/2016/01/0117-Greens.jpg
ఇవి విటమిన్ B. యొక్క ఉత్తమ మూలాలు. ఆకు పచ్చదనం సౌబాగ్యనికి చిహ్నం. ఆకు కూరలు సమస్యలను పరిష్కరించటానికి, మెదడు కార్యాచరణ పెంచడానికి, మానసిక  సామర్థ్యాన్ని పెంచడానికి, మూడ్ మెరుగుపరచడానికి సహాయం చేస్తవి. మలబద్దకం ను తగ్గించును. మీ రోజువారీ ఆహారంలో బచ్చలికూర, బ్రోకలీ, మరియు ముల్లంగి  చేర్చండి.
5. బెర్రీలు
http://www.hemophiliafed.org/uploads/berries.jpg
ఇవి అంటి-అక్సిడేన్ట్స్ మరియు  విటమిన్ సి తో కూడినవి. స్వల్ప కాల జ్ఞాపక శక్తి కోల్పోవడం అరికట్టును. వయస్సు సంబంధిత జ్ఞాపక శక్తీ  క్షీణత కు కనీసం వారానికి ఒకసారి బ్లూ బెర్రిస్ మరియు స్ట్రా బెర్రిలను తీసుకోవాలి. అల్పాహార తృణ ధాన్యాల (cerels)లోకి వాటిని జోడించవచ్చు.
6. టొమాటోస్
http://assets.inhabitat.com/wp-content/blogs.dir/1/files/2012/06/red-tomato-meteorite.jpg
వీటిని రామ ములగ కాయలు అని కూడా కొన్ని ప్రాంతాలలో పిలుస్తారు. టొమాటోస్ లైకోపీన్ కు గొప్ప మూలం ఇది కొత్త మెదడు కణాల నిర్వహణ మరియు ఉత్పత్తిలో సహాయపడుతుంది. టొమాటోస్ మీ సలాడ్ లో తప్పక ఉండాలి. వాటిని రుచికరమైన సూప్ గా వండుతారు లేదా ఇంట్లో సాస్ వంటి వాటితో  జోడించవచ్చు.
7. ఒమేగా 3 ఫాటీ ఫుడ్స్
http://thescienceofeating.com/wp-content/uploads/2012/02/Book-Omega-3-Sources.jpg
ఒమేగా 3 కొవ్వులు మెదడు లో  60% వరకు ఉన్నవి మరియు ఆరోగ్యకరమైన మెదడు పని తీరులో  కీలక పాత్ర పోషిస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలను  విభిన్న మూలాల నుండి పొందవచ్చు. శాకాహారులు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను  సోయా బీన్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్  మరియు అవిసె నూనె నుండి పొందవచ్చు. ఇతరులు వారి ఆహారంలో కనీసం వారానికి ఒకసారి చేపలు చేర్చవచ్చు. చేప ను ఫ్రై చేయరాదు.  




No comments:

Post a Comment