బెల్లం లేదా గుర్
శతాబ్దాలుగా భారత సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా ఉన్నది. ఇది చెరుకు రసం లేదా
ఖర్జూరం సిరప్ ను వేడి చేయడం ద్వారా తయారుచేస్తారు. శుద్ధి చేసిన చక్కెర ప్రవేశంతో, మన వంటకాలలో
ఈ అంబర్ రంగు తీపి ని(బెల్లం ను) సంవత్సరాలుగా తగ్గించారు. అయితే తెల్ల చక్కెర కాకుండా, బెల్లం విలువైన పోషకాల తో నిండినది.
బెల్లం లో నల్ల బెల్లం,
తాటి బెల్లం, పటిక బెల్లం అనే రకాలు ఉన్నవి. శ్రీరామ నవమి పండుగ రోజున బెల్లం తో
చేసిన పానకం, వడపప్పు, కొబ్బరి ముక్కలు సేవిస్తారు. మంగళగిరి పానకాల స్వామికి
బెల్లం పానకం నైవేద్యం గా సమర్పిస్తారు. వ్యవసాయదారులు పంట ఇంటికి
వచ్చినప్పుడు కొత్త బియ్యం, బెల్లం తో చేసిన
పాయసం చేసుకొంటారు.
రోజువారీ ఆహారంలో బెల్లం వాడకం
తో మన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి:
జీర్ణక్రియకు
తోడ్పడును.
బెల్లం ఆహార జీర్ణక్రియ కు తోడ్పడి జీర్ణ ఎంజైములను క్రియాశీలపరుచును. ఇది ప్రేగు కదలికలను
క్రమబద్దం చేసి మలబద్ధకంను నిరోధిస్తుంది. బెల్లం ముక్క మీద నల్ల మిరియాలు
చల్లుకోని విందు తర్వాత ఆరగించిన అది ఉత్తమ ఫలితాలు ఇచ్చును.
రక్తహీనత నిరోధిస్తుంది
బెల్లం రక్తంలోని
హెమోగ్లోబిన్ శాతం పెంచి ఎర్ర రక్తకణాల
సంఖ్యను పెంచును తద్వారా రక్తహీనత ను
తగ్గించును. ఇది గర్భిణీ స్త్రీల మీద బాగా పనిచేస్తుంది.
ఎముకల పటుత్వం
పెంచును.
బెల్లం లో అధిక కాల్షియం ఉండుట వలన ఎముకలు దృఢత్వాన్ని పొందును.
రుచి కోసం బెల్లం ముక్కలను సలాడ్లు తో
కలిపి తీసుకొన్న శరీర ఆరోగ్యం కాపాడ బడును
.
వ్యాధినిరోధక
శక్తిని పెంచును.
జింక్ మరియు సెలీనియం
వంటి అత్యవసర ఖనిజ లవణాలు బెల్లం లో అధికంగా ఉండటం వలన అంటువ్యాధులకు వ్యతిరేకంగా వ్యాధినిరోధక వ్యవస్థ బాగా
మెరుగుపడుతుంది. బెల్లం లోని అంటి-అక్సిడేట్స్
వృద్ధాప్య ప్రక్రియ ను మందగింప జేయును. రోజు రెండు టీ-స్పూన్ల బెల్లం ను
వెచ్చటి పాలతో కలిపి తీసుకొన్న రోగనిరోధక శక్తి పెరుగును.
ఫ్లూ లక్షణాలు
నుంచి ఉపశమనo
బెల్లం ను దగ్గు, జలుబు, మైగ్రేన్ మరియు
వాపులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఉత్తమ
ఫలితాల కోసం బెల్లం ను వెచ్చని నీటితో లేదా అల్లం టీ తో కలిపి తీసుకోండి.
ఉద్రిక్తతలు
సడలించడానికి తోడ్పడును:
నిరాస, నిస్పృహ,మానసిక
ఆశాంతి లేదా పీరియడ్స్ కాలం లో ఇది కండరాల
ఉద్రిక్తత ను సడలిoఛి నరములు రిలాక్స్ అగుటకు కావలసిన ఎండార్ఫిన్లు లేదా హ్యాపీ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది
చర్మం ను కాంతివంతం గా ఉంచును.
బెల్లం చర్మం ను పోషించును మరియు మోటిమలు తగ్గించే అనేక ముఖ్యమైన ఖనిజాలు సమృద్ధిగా ఉండుట చర్మం ను ప్రకాశింప జేసి చర్మం ముడుతలు పడకుండా
ఉంచును. ఆరోగ్యకరమైన చర్మం కోసం వారానికి
ఒకసారి ముఖం మీద బెల్లం, నువ్వు విత్తనాల మిశ్రమం పూయవలయును.
రక్తపోటు ను నియంత్రిస్తుంది
బెల్లం లో ఉండే పొటాషియం
మరియు సోడియం కలిగి రక్తపోటు ను వాంఛనీయ స్థాయిలలో ఉంచును. అలాగే, పొటాషియం శరీరంలో నీరు నిలుపుదల సామర్ధ్యం తగ్గించి
శరీర బరువు ను తగ్గించును. రోజూ బెల్లం వినియోగించే అలవాటు శరీరo అద్భుతాలు సృష్టిస్తుంది.
Ø గుండె సమస్యలు, బ్లడ్ షుగర్, మధుమేహం మరియు
ఊబకాయం ఉన్నవారు బెల్లం వినియోగం లో వైద్యుని సలహా అనుసరించాలి
Ø చక్కెర కు
ప్రత్నాయం గా బెల్లం వాడండి కానీ కేవలం పోషక విలువల కోసం దానిని వాడవద్దు.
Ø సూర్యాస్తమయ సమయం
తరువాత జీవక్రియ(metabolism) రేటు తగ్గును
కాబట్టి బెల్లం తో సహా ఏ తీపిని తీసుకోకండి.
Ø రోజువారీ 2-3 టీ-స్పూన్ ల బెల్లం తీసుకోవడం
ద్వారా మంచి లాభాలను పొంద గలరు.
No comments:
Post a Comment