21 March 2016

భోపాల్ లోని చారిత్రాత్మిక ఇక్బాల్ లైబ్రరీ డైమండ్ జూబ్లి ఉత్సవాలు


 
జాతీయ కవి ఇక్బాల్ పేరిట స్థాపించిన భోపాల్ లోని ఇక్బాల్ లైబ్రరి 75 వసంతాలు పూర్తి చేసుకొన్నది. ఇక్బాల్ మరణించిన రెండు సంవత్సరాల అనంతరం 1940 లో  ఈ లైబ్రరీ భోపాల్ లో స్థాపించబడినది. ఫిబ్రవరి 14న లైబ్రరీ డైమండ్ జూబ్లి ఉత్సవాలు జరిగినవి ప్రస్తుతం ఈ లైబ్రరీ లో ఒక లక్ష గ్రంధాలు కలవు.

స్వచ్చంద సంస్థ చే స్థాపించ బడిన ఈ లైబ్రరీ 75 సంవత్సరాల కాలం పూర్తి  చేసుకొని దేశం లో కెల్లా అత్త్యుతమ లైబ్రరీ గా దినదినం వృద్ది చెందుతుంది అందుకు ప్రధాన కారణం భోపాల్ ఉర్దూ ప్రేమికులు. ఈ లైబ్రరీ ని స్థాపించినది ఆసిఫ్ షామిరి. దీనిని వృద్ది చేసినది  మంనూన్ హసన్ ఖాన్. ఉమర్ అన్సారి దిని కోసం తన జీవితాన్ని దార పోసినారు.  తరువాత రషీద్ అంజుం దిని అభివృద్ధి కోసం పాటు పడినారు.

ప్రస్తుతం  లైబ్రరీ నిధుల కొరత,  పాటకుల అనాసక్తి, దాతల  కొరత, ప్రబుత్వ సహాయం తగ్గుట, వంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.  ఈ లైబ్రరీ లో  ఉర్దూ, అరబిక్, పెర్షియన్, హిందీ, ఇంగ్లీష్ మరియు మరాటి కు సంభందించిన అమూల్యమైన, అలబ్యం అయిన గ్రంధాలూ కలవు. పుస్తకాల తో పాటు పురాతన ఉర్దూ  మ్యాగజైన్స్, ఫైల్స్ ఇతర పబ్లికేషన్లు లైబ్రరీ లో అందుబాటు లో కలవు.
చరిత్రాత్మికంగా ప్రసిద్ది గాంచిన ఇక్బాల్ మైదాన్ లో కల ఇక్బాల్ లైబ్రరీ గురించి భోపాల్ లోని చాలా మంది కి తెలియదు. ఇక్బాల్ మైదాన్ లోని ఇతర   ప్రసిద్ద కట్టడాలు మోతి మహల్, షోకత్ మహల్, మరియు శిష్ మహల్. భోపాల్ వచ్చినప్పుడు ఇక్బాల్, భోపాల్ నవాబ్ అతిద్యంను, భోపాల్ శిష్ మహల్ లో స్వీకరించారు
.
డైమండ్ జూబ్లి ఉత్సవం సందర్భం గా వక్తలు ఇక్బాల్ లైబ్రరీ ప్రాముఖ్యతను కొనియాడారు. .   

No comments:

Post a Comment