11 June 2016

పాలస్తీనా మరియు అల్-అక్సమస్జిద్

పాలస్తీనా మరియు మస్జిద్ ఆల్-అక్స గురించి చారిత్రక వాస్తవాలు తెలిసుకోనుట ముఖ్యం. చాలా మంది ముస్లింలకు ముస్లింల అత్యంత గౌరవనీయ ప్రవక్తలు మరియు అల్లాహ్  దూతలు  అల్లాహ్  యొక్క సూచనలతో పాలస్తీనా పవిత్ర స్థలం వలస వెళ్లి అక్కడ ప్రఖ్యాత అఖ్సా మస్జిద్ నిర్మించారు అన్న విషయం తెలియదు. 

ప్రవక్త అబ్రహాం తన మేనల్లుడి తో మొదట పాలస్తీనా వలస వెళ్లారు  ఆ ప్రదేశం ను  'సుగుణాలు  మరియు దీవెనలు' (‘Virtues and Blessings’) కల ప్రదేశం అని పిలిచేవారు.ఆ తరువాత ఆరు వందల సంవత్సరాలకు   ప్రవక్త మోసెస్ సహాయంతో,ఇస్రాయిల్ వాసులు  ఫారో బానిసత్వo నుండి నుండి స్వేచ్ఛ పొంది  పాలస్తీనా ప్రాంతం లో స్థిరపడ్డారు. ఆ తరువాత మరో  మూడువందల సంవత్సరాల తరువాత ప్రవక్తలు డేవిడ్ మరియు సోలమన్ (దావూద్ మరియు సులైమాన్) వారి రాజ్యాలు ఈ పవిత్ర ప్రదేశంలో (పాలస్తీనాలో)స్థాపించారు.  620 సంవత్సరలో అల్లహ ఆజ్ఞ పై దైవ దూత జిబ్రెయిల్ ప్రవక్త(స) ముహమ్మద్ ను అల్లాహ్ ను కలవటానికి తన ప్రవిత్ర మేరాజ్ యాత్ర చేసినారు. ఇస్లాం ధర్మ ప్రవక్త ముహమ్మద్(స) దైవదూత జిబ్రైఎల్ తో కలసి బైతుల్-మక్దిస్ (పాలస్తీనా) నందు వేంచేశారు. 
అరబిక్ లో పాలస్తీనా ను బైతుల్-మక్దిస్ అని అందురు. ఇక్కడ ప్రజలు మొదట ప్రార్ధనలకు ఉపయోగించిన  ప్రసిద్ధ మస్జిద్ అల్-అక్స ఉన్నది. దానికి ఎదురుగా ప్రజలు ప్రార్ధనలు చేసేవారు. అరబిక్ లో దీనిని  'ఖిబ్లా' అని అందురు. దానికి ఎదురుగా  ముస్లింలు చాల కాలం ప్రార్థనలు జరిపారు. ఇప్పుడీ ఇది  'జెరూసలేం' ప్రాంతంగా  ఉంది.

మొదటి శతాబ్దం B.C. లో రోమన్లు ​​యెరూషలేము ను జయించి  దానికి ఇలియా (Iliya) అనే  పేరు పెట్టారు. మక్కా నుండి బైతుల్-మక్దిస్ మద్య దూరం 1300kms ఉంటుంది. బైతుల్-మక్దిస్  'జెరూసలేం' నగరంలో 31,45 'అక్షాంశం ఉత్తర మరియు 35/13' తూర్పు రేఖాంశముల మద్యన నెలకొని ఉంది. బైతుల్ లేహం (Baitul Leham) మరియు అల్-ఖలీల్ దాని దక్షిణ వైపు మరియు రామల్లా ఉత్తర వైపున ఉన్నవి. బైతుల్-మక్దిస్ పర్వతాల పై  నెలకొని ఉంది మరియు ఈ పర్వతాలలో ఒక పర్వతం  మౌంట్ జియాన్ ఉంది. జియాన్ పేరు మీద, జివోస్ (Zios) ఉద్యమం ప్రపంచంలో రాజుకుంది మరియు తర్వాత అది 'జియోనిజం' గా పేరు మారింది.
అల్లాహ్  ఆజ్ఞ ప్రకారం ప్రవక్త జాకబ్ (యాకూబ్), అతనిని  ఇజ్రాయెల్ అని కూడా అంటారు, అతను బైతుల్-మక్దిస్ శంకుస్థాపన చేసి ఆ  నగరం లో నివసించేవాడు మరియు నగరం  బాగా అభివృద్ధి చెందినది. చాలా కాలం తరువాత ప్రవక్త సోలమన్(సులేమాన్)  మస్జిద్ ఆల్-అక్స పునర్నిర్మించినాడు. ఈ  కారణం చేత జియోస్ (Zios) అక్స మసీదును హైకుల్-ఎ-సులేమాని అని అందురు.
హైకుల్-ఎ-సులేమాని మరియు బైతుల్ –మక్దిస్ రెండు బాబుల్ రాజ్య(ఇరాక్) క్రూరమైన చక్రవర్తి (ఇరాక్) భక్త్ నాసర్  దాడిలో నాశనమయ్యాయి. ఇది 586 BC లో సంభవించింది. చక్రవర్తి తనతో పాటు పది లక్షలు యూదులను  ఇరాక్ తీసుకువెళ్ళి  వారిని బానిసలుగా ప్రకటించినాడు. ఈ సమయం లో, ప్రవక్త ఓజాయిర్  ఈ స్థలం గుండా ప్రయాణించాడు. నగరం నిర్మానుషయంగా,మృతప్రాయంగా  ఉండటం గమనించినాడు. అతను  నగరం లో నిద్రించినాడు మరియు 200 సంవత్సరాల తరువాత నిద్ర లేచినాడు. అల్లాహ్ అద్బుతంతో నగరం నివాసయోగ్యంగా జనులతో నిండి ఉండటం మరియు ప్రగతి సాదించడం చూసి ఆశ్చర్య పోయినాడు. 

559 BC తరువాత పర్షియా (ఇరాన్) చక్రవర్తి సైరస్ ది గ్రేట్ బాబుల్(ఇరాక్) ను  ఆక్రమించుకొని ఇస్రాయిల్ వాసులను తిరిగి పాలస్తీనా వెళ్ళడానికి అనుమతించినాడు. అతను (సైరస్ ది గ్రేట్) బైతుల్-మక్దిస్, హైకుల్ ఎ సులేమాన్ మరియు జెరూసలేం ను  పునర్నిర్మించినాడు.  తిరిగి జెరూసలేం నగరం రోమన్ల హయాంలో రెండవ విధ్వంసం కు గురిఅయినది.  రోమన్ జనరల్ టిటస్ 70 బి.సి. లో జెరూసలేం నగరం మరియు హైకుల్ ఎ సులేమాన్ నాశనం చేసినాడు.
137 BC లో రోమన్ చక్రవర్తి హేద్రీన్ (Hedreen) పాలస్తీనా మరియు బైతుల్ మక్దిస్ నుండి కొందరు తుంటరి యూదులను బహిష్కరించాడు. అప్పుడు, క్రీస్తు శకం నాలుగో శతాబ్దంలో కొందరు యూదులు  క్రైస్తవ మతం స్వీకరించారు మరియు బైతుల్-మక్దిస్ లో ఒక చర్చి నిర్మించారు. ఇస్లాం ధర్మ యొక్క ప్రవక్త ముహమ్మద్ (స) తన  మేరాజ్ ప్రయాణంలో  బైతుల్-మక్దిస్ వద్దకు  చేరుకొని అక్కడ ఏ మసీదు లేదా ఏ హైకుల్ ను గాని   చూడ లేదు.  అందువలన దివ్య  ఖురాన్లో అక్కడ ప్రవక్త జాకబ్ నిర్మించిన అల్ అఖ్సా మసీదు వర్ణన  మాత్రమే ఉంది. 639 లో C.E. క్రైస్తవులతో జరిగిన ఒక ఒప్పందం ప్రకారం, బైతుల్-మక్దిస్ ముస్లింల నియంత్రణలోకి వచ్చింది. ఇది రెండవ ఖలీఫా ఒమర్ ఫరూఖ్ యొక్క కాలిఫెట్ సమయంలో జరిగింది. అబ్దుల్ మాలిక్ కాలిఫెట్ సమయంలో, అఖ్సా నిర్మాణం పూర్తయింది.

 1099 లో యూరోపియన్ క్రూసేడర్స్ బైతుల్-మక్దిస్ ను స్వాధీనం చేసుకొన్నారు. ఆ యుద్ధం లో సుమారు 70,000 ముస్లింలు బలి చెందారు. ఆ తరువాత 1187 C.E. సుల్తాన్ సలాహుద్దీన్ అయ్యూబీ, ఒక తీవ్ర  యుద్ధం తర్వాత బైతుల్ మక్దిస్ ను క్రైస్తవుల నుండి విముక్తి చేసారు.

సెప్టెంబర్ 1917 లో, యూరోపియన్లు బైతుల్-మక్దిస్ ను స్వాధీనం చేసుకొని యూదులకు అక్కడ స్థావరాలు మరియు నివాసం ఉండటానికి అనుమతించినారు. నవంబర్ 1947 లో ఐరాస జనరల్ అసెంబ్లీ, పాలస్తీనా ను రెండు భాగాలుగా విభజింఛి  ఒక భాగం  అరబ్బులకు  మరియొక భాగం యూదులకు  ఇచ్చినది. మే 1948 లో జనరల్ అసెంబ్లీ ఇస్రాయిల్ రాజ్య  ఏర్పాటు మరియు స్థాపన ప్రకటించడంతో, మొదటి అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభం అయినది. ఈ యుద్ధం అరబ్బులకు తీవ్ర నష్టం కలిగించినది.  ఇస్రాయెలీ సైన్యం, అధునాతన ఆయుధాలు కలిగి 78 శాతం అరబ్ భూమిని  స్వాధీనం చేసుకొంది. కానీ అప్పటికీ బైతుల్ మక్దిస్ (జెరూసలేం, తూర్పు ప్రాంతంలో) జోర్డాన్ యొక్క నియంత్రణ (ఒక ముస్లిం ఆధిపత్యం గల రాజ్యం) క్రింద ఉంది.

ఆ తరువాత, మూడవ అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం  1967 లో జరిగింది అందులో మునుపటి యుద్ధాల వలె, మిగిలి ఉన్న పాలస్తీనా లో ఎక్కువ భాగాన్ని ఇస్రాయిల్ హస్తగతం చేసుకోంది. బైతుల్ మక్దిస్ కూడా  (అఖ్సామస్జిద్ ) యూదుల నియంత్రణలోకి వచ్చింది. యథాతథ స్థితి ఇంకా మారలేదు.

బైతుల్-మక్దిస్ గోడ యొక్క ఒక చిన్న భాగం 1970 లో పాలస్తీనా విధ్వంసం తర్వాత కూడా నిలిచి ఉంది. ఈ గోడను  'ఏడ్పుల గోడ' అని అందురు మరియు యూదులు నిరంతరం అల్ అక్సా మసీదు పడగొట్టి మరియు దాని శిధిలాల మీద హైకుల్ ఎ సులేమాని నిర్మించే వారి దీర్ఘ ప్రతిష్టాత్మకమైన కల నిజం చేయడానుకి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అoతియే కాదు ఆ ప్రదేశం ను తమ రాజధానిగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.

ఇంతటితో ఒక కథ పూర్తి అయినది.యూదులకు సహాయం చేసే ఉద్దేశం తో అగ్రరాజ్యాలు ఆడిన మరో కపటనాటకానికి తేర తీయడం జరిగింది. దానిని ఇప్పుడు మనం పరిశీలించుదాము.

యూదులు 400 సంవత్సరాలవరకు ఈజిప్ట్ లో నివసించారు. ప్రవక్త మోసెస్ ఈజిప్ట్ లో  టెన్ కమాండ్మెంట్స్ పొందినాడు. యూదు తత్వవేత్త, ఫిలో మరియు రాంబన్, ఈజిప్ట్ లో నివసించారు మరియు యూదు చరిత్రలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు యెరూషలేమును  సందర్శించినారు కాని  అక్కడ స్థిర నివాసం ఏర్పర్చుకోలేదు ఎందుకంటే అప్పటికే ఈజిప్ట్ గొప్ప సాంస్కృతిక కేంద్రంగా ఉంది. క్రైస్తవు యాత్రికుల లాగా  యూదులు యెరూషలేమునకు తీర్ధయాత్ర చేపట్టలేదు.  క్రైస్తవులకు  యెరూషలేము తో మరింత బంధం ఉంది కానీ వారు ఆ పవిత్ర భూమి మీద ప్రాదేశిక హక్కులు ఎప్పుడూ కోరలేదు. అంతియే కాక క్రిస్టియన్ క్రూసేడర్స్ చాలా కఠినంగా స్థానిక యూదు సమాజo పట్ల వ్యవరించారు.

ఇటీవల కాలంలో అనగా 19 వ శతాబ్దం మధ్యలో రష్యా మరియు తూర్పు ఐరోపా లోని యూదులు పాలస్తీనా వెళ్ళుటకు  మొగ్గుచూపారు. కానీ వారి మొదటి మరియు చివరి ప్రాధాన్యత  చాలా సందర్భాలలో వెస్ట్ యూరోప్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళటం. పశ్చిమ యూరోప్ లో నివసిస్తున్న యూదులు ఆ స్థానిక పరిసరాలతో మమేక మవ్వుతు  మరియు వారు స్థిరపడిన  దేశాలకు తమ  విధేయతను చూపుతున్నారు.

కాని అగ్రరాజ్యులు అయిన అమెరికా మరియు బ్రిటన్ యూదుల పట్ల కపట ప్రేమను ప్రదర్సిస్తు వారిని తమ రాజ్యాలలోనికి రానీయకుండా ఒక జాతి-ఒక రాజ్యం(one state- one nation) అనే సిద్దాoతమును వెలుగు లోనికి తీసుకు వచ్చి   యూదల కోసం ప్రత్యేక రాజ్యం పాలస్తీనా  భూభాగం లో ఏర్పాటు చేసి అక్కడి అరబ్బులను నిరాశ్రయులు చేసినారు. అమెరికా యూదుల ఇమ్మిగ్రేషన్ పై 1924-1948 ల మద్య ఆంక్షలు విధించినది మరియు బ్రిటన్ కుడా తన దేశం లో ఎక్కువమంది యూదులు నివసించడానికి అంగీకరించలేదు.ఒక ప్రణాళికను అనుసరించి, యూదులు ఆయా దేశాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకోవటానికి అనుమతించ లేదు. పాలస్తీనా భూభాగం లోకి యూదుల బదిలీకి ప్రచారం క్రైస్తవ ధర్మోపదేశకులు(evangelists) గా ప్రారంబించినారు.


టెలి అవివ్ యూనివెర్సిటి చరిత్రశాఖాధిపతి షంలో సాండ్  (Shlomo Sand) ఇదే మాటను వేలిబుచ్చాడు. 1895 లో పాలస్తీనా కు వలస వెళ్ళిన యిట్జ్హ్క్ ఎప్స్టీన, (Yitzhk Epstein) 1907 లో అన్నాడు”అన్ని ప్రశ్న లలో ముఖ్యమైనది మరియు ప్రధాన మైనది, అరబ్బుల పట్ల మా వైఖరి?” ఈ ప్రశ్న కు సంతృప్తికరమైన సమాధానం లబించనంత కాలం పాలస్తినా కు శాంతి తిరిగి రాదు. అమెరికా, బ్రిటన్  ల వైఖరిలో గణనీయమైన మార్పు వచ్చి   స్నేహపూర్వకంగా పాలస్తీనా సమస్య పరిష్కారo అయితే గాని  మధ్య ప్రాచ్యంలో శాంతి నెలకొనదు. ప్రపంచం గమనిస్తుంది. 

No comments:

Post a Comment