21 June 2016

మంగోలియన్ సైనిక, పరిపాలక యోధుడు చెంఘీజ్ ఖాన్

మంగోలియన్ సైనిక యోధుడు మరియు పరిపాలకుడు చెంఘీజ్ ఖాన్ ఈశాన్య ఆసియాలోని ఒంటరి సంచార అనాగరిక మంగోల్ తెగలను సమైక్య పరిచి  తద్వారా ప్రపంచంలో అతి పెద్ద సామ్రాజ్యం “మంగోల్ సామ్రాజ్యం” ను స్థాపించినాడు మరియు యురేషియా భూభాగం మొత్తం ను  ఆక్రమించాడు. అతను ఆసియాలో చూసిన అత్యంత అధునాతన వ్యవసాయిక(ప్రొఫెషినల్)  సైనిక వ్యవస్థ  ను అభివృద్ధి చేసినాడు కనుక అతనిని అందరు గ్రేట్ ఖాన్  అని పిలిచేవారు.

చెంఘీజ్ ఖాన్ అసలు పేరు "తెముజిన్” ( ఒక ప్రసిద్ద తాతర్  సేనాపతి పేరు). అతను 1162 లో ఉత్తర కేంద్ర మంగోలియా లో జన్మించాడు. అతని తండ్రి పేరు ఏసుఖే(Yesukhei). తెముజిన్ బోరిజిజీన్ తెగ వాసి  మరియు 1100 సంవత్సరంలో మంగోల్ ను సమైఖ్యపరిచిన ఉత్తర చైనా కు చెందిన జిన్ (చిన్) వంశానికి చెందిన ఖబుల్ ఖాన్ వంశస్థుడు.

 మంగోలియా జానపద గాధల ప్రకారం తెముజిన్ చేతిలో రక్తపు గడ్డతో జన్మించినాడు. మంగోల్ తెగల విశ్వాసం  ప్రకారం అలా వుండటం గొప్ప నాయకుని లక్షణం. అతని తల్లి హేలున్ మంగోల్ తెగల అనైక్యతను అతనికి వివరించి మంగోల్  తెగలు అన్నింటిని సమైఖ్య పరచమని చిన్నప్పుడు నుండి భోదించేది. 
తెముజిన్ 9 సంవత్సరాల వయసులో అతని తండ్రి అతనిని భవిష్యత్ వధువు బోర్తే కుటుంబం తో నివసిoచడానికి  తీసుకుని వెళ్లాడు. ఎసుకి ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు గతం లో అతని అతిక్రమణలకు బలి అయిన తతార్ తెగ నాయకులు శాంతి విందుకు ఆహ్వానించి విందులో విష ప్రయోగం తో అతనిని సంహరించి నారు. తన తండ్రి మరణాంతరం తెముజిన్ ఇంటికి తిరిగి వచ్చి తెగ నాయక్వతం స్వికరించినాడు. తెగ లో ముఖ్యులు అతని నాయకత్వంను తిరస్కరించి సమీప తమ్ముళ్లు మరియు సగం సోదరులు కల అతని కుటుంభం ను తెగ నుండి  బహిష్కరించారు. కుటుంబం నాయకత్వం కోసం తెముజిన్ తన సవతి సోదరుడు బెక్తేర్ ను చంపి కుటుంబ నాయకుని  గా తన స్థానం సుస్థిర పరుచుకొన్నారు.

అతనికి 16 ఏళ్ల వయస్సులో కొంకిరాట్ తెగకు చెందిన బోర్తే తో వివాహం జరిగినది మరియు రెండు తెగ ల మద్య సంభంద భాంధవ్యాలు ఏర్పడినవి. అయితే ప్రత్యర్ధి మేర్కిట్ తెగ వారు బోర్తే ను అపహరించి వారి తెగ పెద్ద తో ఆమె వివాహం జరిపినారు. వారితో యుద్ధం జరిపి తెముజిన్ తన బార్యను రక్షించుకోనినాడు. వారికి మొదటి సంతానం జాచి పుట్టినాడు. అతనికి మొత్తం జీవిత కాలం లో 20 వివాహాలు జరిగినవి. ఇతర భార్యలతో అతనికి అనేక మంది సంతానం జన్మించారు. కాని బోర్తే కు మాత్రమే కలిగిన మగ సంతానం అతనికి వారసులు అయ్యారు. 
 20 ఏళ్ల వయస్సు లో    అతను ఈశాన్య ఆసియాలో అనేక మంగోల్ ఒంటరి  తెగలను  సమైక్య పరిచి ఒక పెద్ద సైన్యం నిర్మించడం మొదలుపెట్టాడు. అతను స్థాపించిన  మంగోల్ సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యానికి ముందు ప్రపంచంలో అతిపెద్ద సామ్రాజ్యం.  

సార్వత్రక పరిపాలకుడు.
20 సంవత్సరాల వయసులో తెముజిన్ తన మాజీ కుటుంబం మిత్రులు టైచిట్స్ (Taichi'uts)  ద్వారా అపహరింపబడి తాత్కాలికంగా బానిసగా  మార్చబడినాడు.ఒక మిత్రుని సహాయంతో   చెర నుండి తప్పించుకున్నాడు మరియు తన సోదరులు మరియు అనేక ఇతర తెగ సబ్యుల సహాయం తో ఒక సైనిక దళం ను ఏర్పాటుచేసినాడు.  తెముజిన్ నెమ్మదిగా 20,000 మంది  పురుషులతో  ఒక పెద్ద సైన్యంను  నిర్మించడం ద్వారా అధికారంలోకి రావడం ప్రారంబించినాడు. వివిధ తెగల మధ్య సంప్రదాయ విభేదాలను నాశనం చేసి తన పాలనలో మంగోలియా  ను  ఏకం చేసినాడు.

అసాధారణ సైనిక వ్యూహాలు  మరియు దయలేని క్రూరత్వం ప్రదర్శించి తాతర్స్ ను సమూలంగా నాశనం చేయటం ద్వారా  తన తండ్రి హత్య కు ప్రతీకారం తీర్చుకున్నాడు. మూడు అడుగుల పొడవుఉన్న   ప్రతి తతార్ మగ వాడిని హత్య చేసినాడు.  ఆ తరువాత శక్తివంతమైన టైచుట్, నైమాన్ తెగ లను ఓడించి 1206 నాటికి కేంద్ర, తూర్పు మంగోలియా తన ఆధీనం లోనికి తెచ్చుకొన్నాడు.

మంగోల్ సైన్యం యొక్క ప్రారంభ విజయాలకు   చెంఘీజ్ ఖాన్ తెలివైన సైనిక వ్యూహాలు, విస్తృతమైన గూఢచారి వ్యవస్థ, నూతన  సైనిక విధానాలు, సమర సుశిక్షితులైన 80,000 మంది మంగోల్ సైన్యం మరియు ఒక అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ తోడ్పడినవి.  ప్రతి సైనికుడు  విల్లు, బాణాలు, ఒక డాలు, ఒక డేగర్ మరియు ఒక బల్లెం  కలిగి ఉండేటట్లు  చేశాడు. ఆశ్వికులు ఒక కొక్కెం తో కూడిన ఒక కత్తి, శరీరం కవచం, ఒక గొడ్డలి లేదా జాపత్రి, మరియు బల్లెం కలిగి ఉండేవారు.  అశ్వికులు వారి కాళ్లను ఉపయోగిస్తు  వేగంగా తమ చేతులతో  బాణాలను వేస్తుండేవారు. మొత్తం సైన్యాన్ని కోసం ఒక వ్యవస్థీకృత సరఫరా వ్యవస్థ పాటించేవారు.

ప్రత్యర్థి మంగోల్ తెగలు పైన విజయాలు తర్వాత, ఇతర తెగల నాయకులు అతనితో  శాంతి కి అంగీకరించారు మరియు తెముజిన్ కు "చెంఘీజ్ ఖాన్" అనగా "సార్వత్రిక పాలకుడు." అనే బిరుదు ప్రధానం చేసారు. ఇది రాజకీయ ప్రాముఖ్యత మరియు  ఆధ్యాత్మిక ప్రాముఖ్యత  కల బిరుదు. ప్రముఖ మతాధిపతి షమన్ చెంఘీజ్ ఖాన్ ను  మొంగే కోకో టేంగ్రీ ( "ఎటర్నల్ బ్లూ స్కై") యొక్క ప్రతినిధి, మంగోలుల సుప్రీం దేవుడు అని  ప్రకటించినాడు. దైవ స్థాయిని కలిగిన ఈ ప్రకటన ప్రపంచాన్ని పరిపాలించటం  చెంఘీజ్ ఖాన్ విధి అని అంగీకరించబడింది. చెంఘీజ్ ఖాన్ "నేను దేవుని శిక్షను. మీరు గనుక పాపాలు చెయకపొయి ఉంటే, దేవుడు మీ  మీద నా లాంటి వ్యక్తిని శిక్ష గా పంపడు.”  అని ప్రకటించినాడు.
  
ఘనమైన  విజయాలు :
చెంఘీజ్ ఖాన్ తన దైవిక తనాన్ని వృధా చేయక  ఆధ్యాత్మిక స్ఫూర్తి తో తన సైన్యాన్ని ప్రేరణ కల్పించినాడు. జనాభా పెరగడంతో ఆహార మరియు వనరుల కొరత మంగోలులకు ఎదురుయ్యింది. 1207 లో, అతను గిగ్జియా రాజ్యంకు వ్యతిరేకంగా తన సైన్యాన్నిపంపి, రెండు సంవత్సరాల తర్వాత దానిని స్వాదిన పరుచు కొన్నాడు. 1211 లో, చెంఘీజ్ ఖాన్ సైన్యాలు, ఉత్తర చైనా లోని జిన్ రాజరికం కు చెందిన అంతులేని వరి పొలాలు మరియు సంపద సులభంగా స్వాదిన పరుచుకొన్నాడు.

జిన్ రాజరికo కు వ్యతిరేకంగా అతని దురాక్రమణ దాదాపు 20 సంవత్సరాల పాటు సాగిప్పటికీ, చెంఘీజ్ ఖాన్ సైన్యాలు సరిహద్దు సామ్రాజ్యాలకు  వ్యతిరేకంగా పశ్చిమ మరియు ముస్లిం ప్రపంచం ను  ఆక్రమించ దాల్చినాడు. చెంఘీజ్ ఖాన్  తుర్కిస్తాన్, పర్షియా, మరియు ఆఫ్గనిస్తాన్ కలసిన టర్కిష్ సామ్రాజ్యం లో చేరిన ఖ్వరిజం (Khwarizm) రాజ్యం తో దౌత్యం ఉపయోగిoఛి  వాణిజ్య సంబంధాలు ఏర్పాటు చేసుకొన్నాడు. . కానీ ఒక మంగోల్ కార్యవర్గం బిడారు పై ఒత్రార్ (Otrar) గవర్నర్ దాడి చేశాడు. చెంఘీజ్ ఖాన్ ఈ అమర్యాద విని ఆ గవర్నర్ ను తీసుకొనిరావడానికి ఒక దౌత్యవేత్త ను  పంపాడు.ఖ్వరిజం పాలకుడు అయిన  షా మహమ్మద్  చెంఘీజ్ ఖాన్ ఉత్తర్వు ను ధిక్కరిస్తూ మంగోల్ రాయబారి తల నరకి పంపాడు.

దీనితో ఆగ్రహం చెందిన చెంఘీజ్ ఖాన్ 1219 లో ఖ్వరిజం రాజవంశం కు వ్యతిరేకంగా 200,000 మంగోల్ సైనికులను దాడికి పంపినాడు.  మంగోల్ సైనికులు అతి కిరాతకంగా,కర్కశంగా  ప్రవర్తించి  షా మహమ్మద్ పై విజయం సాదించారు. చివరికి షా మహమ్మద్, ఆయన కుమారుడు బందిపబడి హత్య చేయబడినారు. 1221 లో ఖ్వరిజిం రాజరికం అంతరించినది.

చరిత్రకారులు ఖ్వరిజం పతనం అనంతర కాలాన్ని  అనంతర మంగోలియా కాలం అని  వివరిస్తారు. ఈ సమయం లో  చెంఘీజ్ ఖాన్ చైనా మరియు యూరోప్ యొక్క ప్రధాన వాణిజ్య కేంద్రాలలతో సంభందాలు అభివృద్ధి చేసుకొన్నారు.  మంగోల్ సామ్రాజ్యం యస్సా(Yassa) అని పేరుగల శాసన నియమావళి చే పాలించబడింది . చెంఘీజ్ ఖాన్ దానిని  మంగోల్ సాధారణ చట్టం ఆధారంగా అభివృద్ధి పరచినాడు అందు రక్తపాతం,, వ్యభిచారం, దొంగతనం మరియు అబద్ధసాక్ష్యము నిషేధించే  ఆజ్ఞలు  చేర్చాడు. ఈ చట్టాలను  అతిక్రమించే వారికి మరణ దండన విధించాడు. సైనిక వ్యవస్థలో ప్రమోషన్ కు మెరిట్ ఆధారం చేసినాడు చిరకాల మంగోల్ సంప్రదాయం ప్రతిబింబించే మత సహనం పాటించినాడు అలాగే సామ్రాజ్యం లోని  పలు మతపరమైన బృందాలకు  పన్ను రాయితీలను ఇచ్చినాడు.

ఖ్వరిజం రాజరికం పతనం తరువాత  చెంఘీజ్ ఖాన్ మరోసారి చైనా తూర్పువైపు  తన దృష్టి ని సారించినాడు.గ్జిగ్జియా యొక్క తంగుత్స్ చెంఘీజ్ ఖాన్  ఖ్వరిజం యుద్ద యాత్రకు సహకరించక అతని  ఆదేశాలను ఉల్లంఘించి బహిరంగంగా తిరుగుబాటు చేసారు.  తాంగుత్  నగరాల ను చెంఘీజ్ ఖాన్ ఓడించి దాని రాజధాని నింగ్హియా  నగరం  కొల్లగొట్టాడు. ప్రజలను చిత్రవధలకు గురిచేసినాడు. చెంఘీజ్ ఖాన్ తాంగుత్  రాచరికo దాని పాలనను  అంతం చేసినాడు.  

 చెంఘీజ్ ఖాన్ మరణం
చెంఘీజ్ ఖాన్ గ్జిగ్జియా యొక్క విజయం  తర్వాత, 1227 లో మరణించారు. అతని మరణం యొక్క ఖచ్చితమైన కారణం తెలియదు. కొందరు చరిత్రకారులు అతను వేటలో గుర్రం  నుండి క్రిందకు పడి చనిపోయాడు మరికొందరు  అలసట మరియు గాయాలవలన  మరణించాడు అని వాదిస్తున్నారు. ఇతరులు అతను శ్వాస వ్యాధి చే మరణించారు అని వాపోయారు. చెంఘీజ్ ఖాన్ సమాధి చిహ్నాలు లేకుండా తెగ ఆచారాల ప్రకారం అతనిని  ఖననం చేశారు.

తన మరణానికి ముందు, చెంఘీజ్ ఖాన్ చైనా తో  సహా తూర్పు ఆసియా ప్రాంతం  తన కుమారుడు ఒగేడి(Ogedei)కి , సామ్రాజ్యం యొక్క మిగిలిన భాగం  తన ఇతర కుమారులు మధ్య విభజించనాడు.  చాగటై మధ్య ఆసియా మరియు ఉత్తర ఇరాన్ కు రాజు అయినాడు. తోలు(Tolui) కి మంగోల్ మాతృభూమి సమీపంలో ఒక చిన్న భూభాగం అందుకున్నాడు; మరియు జోచి(Jochi) (చెంఘీజ్ ఖాన్ మరణం ముందు మరణించాడు). మరియు అతని కుమారుడు, బటు, ఆధునిక రష్యా నియంత్రణలోనికి తీసుకొని గోల్డెన్ గుంపు (Golden Horde) ఏర్పాటు చేసాడు.మంగోల్  సామ్రాజ్యం  విస్తరణ కొనసాగింది మరియు ఒగేడి  (Ogedei)ఖాన్ నాయకత్వంలో తారాస్థాయికి చేరుకుంది.

మంగోల్ సైన్యాలు పర్షియా, దక్షిణ చైనా మరియు బాల్కన్ జయించారు. మంగోల్ సైన్యాలు వియన్నా, ఆస్ట్రియా జయించిన తరువాత గ్రేట్ ఖాన్ ఒగేడి మరణ వార్త విని  ప్రముఖ కమాండర్ బటు, మంగోలియా తిరిగి వచ్చాడు. అ తరువాత మంగోల్ దండయాత్ర ఊపు  కోల్పోయింది మరియు  యూరప్ యొక్క ఈశాన్య ప్రాంతం జయించలేక పోయింది.

చెంఘీజ్ ఖాన్ వంశస్థులలో అతని చిన్న కుమారుడు తోలు యొక్క కుమారుడు కుబ్లై ఖాన్ ముఖ్యుడు. . యుక్తవయసులో, కుబ్లై చైనీస్ నాగరికత అందు  అత్యంత ఆసక్తిని చూపేవాడు మరియు  తన జీవితాంతం మంగోల్ పాలన లోకి చైనీస్ సంప్రదాయాలు మరియు సంస్కృతి చొప్పించే కృషి చేసాడు. కుబ్లీఖాన్  పెద్ద సోదరుడు మొంగ్కే ఖాన్  మంగోల్ సామ్రాజ్య ఖాన్ గా నియమింప బడి దక్షిణ భూభాగాలకు కుబ్లీఖాన్ ను  గవర్నర్ గా నియమించాడు.  

 కుబ్లీఖాన్  వ్యవసాయ ఉత్పత్తి పెoఛి మరియు మంగోల్ భూభాగంను  విస్తరించినాడు.  మొంగ్కే మరణానంతరం, కుబ్లై ఖాన్  మరియు అతని మరో తమ్ముడు అరిక్ బోకే సామ్రాజ్యంలో నియంత్రణ కొరకు పోరాడారు. ఆ వారసత్వ  యుద్ధం లో కుబ్లైఖాన్  విజేతగా నిలిచి  గొప్ప ఖాన్ మరియు చైనా యువాన్ రాజవంశం యొక్క స్థాపక చక్రవర్తిగా అయ్యాడు.

సంగ్రహ జీవిత చరిత్ర
·        పేరు:చెంఘీజ్ ఖాన్
·        వృతి:సైనిక నాయకుడు
·        పుట్టిన తేదీ: 1162
·        మరణ తేదీ:1227
·        పుట్టిన స్థలం:మంగోలియా
·        మరణం స్థానం:మంగోలియా
·        ఇతర పేర్లు: చిన్గ్గిస్ ఖాన్, జిన్గిస్, చెంఘీజ్ ఖాన్
·        అసలు పేరు:తెముజిన్.

"నేను దేవుని శిక్షను. మీరు గనుక పాపాలు చెయకపొయి ఉంటే, దేవుడు మీ  మీద నా లాంటి వ్యక్తిని శిక్ష గా పంపడు.” చెంఘీజ్ ఖాన్ .No comments:

Post a Comment