8 June 2016

ముస్లిం ఉమ్మః రాజకీయ ఎదుగుదల మరియు పతనం లేదా కాగితం తయారిని ముస్లింలు కనుగొనుట.


తొలి అబ్బాసీయద్ చక్రవర్తుల  పరిపాలనా కాలంలో ఖలీఫా  అబూ- అల్ అబ్బాస్- అల్-సుఫియా పరిపాలన లో 134 AH లో ముస్లింలకు  మరియు చైనీస్ కు మద్య ఒక యుద్ధం జరిగింది.  ఈ యుద్ధంనకు రాజకీయంగా అంతా  ప్రాధ్యాన్యత లేదు మరియు ఎ పుస్తకాలలో ఇది  పేర్కొన్నబడలేదు. కాని తలస్ యుద్ధంగా పిలవబడే ఈ యుద్ధం మొత్తం మానవ జాతి చరిత్ర గతిని మార్చినది. ఈ యుద్ధం నేటి కజకస్తాన్ మరియు కిర్గిస్తాన్ సరిహద్దుల మద్య  జరిగింది.

ఈ యుద్ధంలో ముస్లిం సైన్యం చైనీస్ టాంగ్ రాజవంశం పాలించిన ఒక చిన్న భూభాగం ను జయించినది మరియు కొందరు యుద్ధ ఖైదీలను పట్టుకొoది. ముస్లిం సైన్యం కాగితం తయారు చేసే కళ తెలిసిన ఒక రహస్య గిల్డ్ కు చెందిన ఇద్దరు  ఖైదీలను పట్టుకోంది. కాగితం తయారీ చైనా కు చెందిన ఈ రహస్య గిల్డ్ కు మూడు వందల సంవత్సరాల పైగా తెలుసు అయితే వారు కాగితం ను కళాఖండాలు తయారు చేయడానికి మాత్రమే  ఉపయోగిoచేవారు. ముస్లిం సైన్యం  కాగితం తయారీ గురించి విన్నది, ఇప్పుడు దానిని తయారుచేసే ఇద్దరు ఖైదీలు దొరికారు.

ఈ గిల్డ్ యొక్క రహస్య కార్యకలాపాల తీవ్రత తెలిసిన ముస్లిం జనరల్ ఆ ఇద్దరు యుద్ద ఖైదీలను సాయుధబలాల పర్యవేక్షణ లో వెంటనే ఖలీఫా ప్రధాన కార్యాలయం బాగ్దాద్ పంపినాడు. కాగితo గురించి విన్న  ఖలీఫా ఆ ఇద్దరు యుద్ద ఖైదీలను, ముస్లింలకు కాగితం తయారు చేసే విధానం నేర్పితే తమ మాతృ దేశానికి తిరిగి పంపుతాను అని అన్నాడు. యుద్ద ఖైదీలు  ఈ ప్రతిపాదనను ఆమోదించి ముస్లింలకు మొదటిసారి కాగితం తయారు చేసే కళ సమర్ ఖండ్  లో నేర్పారు.

ఇక్కడ మనకు స్పష్టం గా అర్ధం అవ్వాలిసింది ఏమిటంటే ముస్లిమేతరుల నుండి జ్ఞాన సముపార్జనకు  ఖలీఫా మరియు ముస్లింలు తొలినుండి సిద్దపడినారు.  ముస్లిమేతరుల నుండి జ్ఞానాన్ని స్వీకరించడానికి తొలుత  పవిత్ర ప్రవక్త ముహమ్మద్ (స) బద్ర్ యుద్ధం సందర్భంగా అంగీకరించారు. యుద్ధం లో పట్టుబడ్డ యుద్ధ ఖైదీలను వారి లో ప్రతి ఒక్కరు 10 మంది ముస్లిం పిల్లలకు  చదవటం మరియు వ్రాయటం నేర్పితే వారు వదిలివేయబడతారు అని స్పష్టంగా చెప్పారు.దానిని   అమలుచేయడం జరిగింది.

ఆ  సమయం వరకు పాపిరస్ ను రాయడం కోసం వాడుతున్నారు కానీ అది కొంత కాలం తరువాత పాడు అవుతుంది. మనకు అప్పటి పాపిరస్ పురాతన గ్రంధాల యొక్క అవశేషాలు లబించ  లేదు కానీ సీరః- ఇబ్న్ హసిం మరియు ఇతరులు వ్రాసిన   కొన్ని శకలాలు ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ మ్యూజియంలలో భద్రపరచబడ్డాయి.
కాగితం రావడంతో అంతా మారిపోయింది. రెండవ అబ్బాసీయద్ ఖలీఫా అల్ మన్సూర్ (137 AH-159 AH) పాలనలో అతను మొత్తం ఉద్యోగిస్వామ్యం ను కాగితం వాడమన్నాడు.   ప్రభుత్వం లావాదేవీలు మరియు వ్యాపార లావాదేవీలకు చెందిన మొత్తం రికార్డులు పాపిరస్ నుండి కాగితం పై నమోదు చేయడానికి ఆజ్ఞ జారిచేసాడు. 153AH నాటికి ముస్లిం భూభాగాలు అంతటా పన్ను సేకరణలు మరియు ఇతర వ్యాపారాలు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు కాగితంపై వ్రాయబడినాయి.

కాగితం కు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో అప్పటికే సమర్ ఖండ్ లో  మొదటి పేపర్ తయారీ యూనిట్ ను  ఏర్పాటు చేసిన ముస్లిం పాలకులు బాగ్దాద్ లో ఒక సెకండ్ యూనిట్ ఏర్పాటు చేసారు. ఇవి  ఆ సమయంలో చైనా వెలుపల ఏర్పాటు చేసిన మొదటి పేపర్ తయారీ యూనిట్ల గా మారినవి. ఐదవ అబ్బాసీయద్ ఖలీఫా  హరూన్ అల్ రషీద్ ఆ రోజుల్లో పేపర్ ఉపయోగం ప్రాచుర్యానికి కారణమయ్యాడు అని చెప్పవచ్చు. కాగితం ను  పెర్షియన్ లో కక్యద్ (Kaqad) అని అంటారు ఇది చైనీస్ పదం కాగజ్ నుండి వచ్చింది. ఇది అబ్బాసీయద్ ఖలీఫా ల స్వర్ణ యుగం అని పిలువ బడింది.

ముస్లింలకు  కాగితం ఉపయోగించే  విధానం తెలిసే  సమయానికి పూర్తిగా జ్ఞానం యొక్క ప్రాముఖ్యత మరియు అర్థం మారిపోయినాయి. సామాజిక కోణం నుండి దేశాల పెరుగుదల మరియు పతనం విశ్లేషించిన ట్యునీషియా లో జన్మించిన ఇబ్న్ ఖాల్డన్ (1332-1406) అనే ముస్లిం తోలి సామాజిక చరిత్రకారుడు ప్రభుత్వ కార్యకలాపాల్లో మరియు  పండితుల వినియోగం కోసం మరింత నాణ్యత కల కాగితాన్ని ఆ రోజుల్లో ఉపయోగించారు అని   రాశారు. ఇబ్న్ ఖాల్డోన్ ను  పాశ్చాత్య ప్రపంచంలో సోషియాలజీ పితామహులుగా భావిస్తారు.

కాగితం  సామాజిక మార్పు, మేధో మార్పు, అక్షరాస్యత మరియు విద్య  సాధన లో ఉపయోగ పడే   ఒక యంత్రం గా మారింది. విద్య ఉత్పాదకత, మేధో మేధావితనం, ఇస్లామిక్ పండితతత్వం,  శాస్త్రీయ విచారణ కు ఉపయోగ పడినది.  ముస్లింలు కాగితం స్వీకరింఛి వారి  ఆలోచనలు, ఇస్లామిక్ స్కాలర్షిప్, పురాతన గ్రీస్ యొక్క పుస్తకాలు అనువదించే కార్యక్రమం, పుస్తకాలు వ్రాయడం ప్రారంబించారు దానితో  తోలి ఇస్లామిక్ పునరుజ్జీవనo  కాలం ప్రారంభమైంది.

కాల క్రమేణా ముస్లింలు పేపర్ తయారీ టెక్నాలజీ లో అభివృద్ధి చెందారు   మరియు వివిధ రకాల కాగితం వివిధ రకాల బ్రాండ్ల పేరు తో అందుబాటులోకి వచ్చింది. కాగితపు వివిధ బ్రాండ్స్ లో ప్రధానమైనవి  సులేమాన్ కాగితం, అహ్మది కాగితం, నూరానీ కాగితం, మొదలైనవి గా ఉన్నాయి.మరో ముఖ్యమైన అభివృద్ధి ఆ రోజుల్లో కాగితం యొక్క స్టాకింగ్ రీములు గా చేయడం  జరిగింది నేడు కాగితం యొక్క ప్రమాణమును రీం  అంటారు. కాగితం స్టాకింగ్ ను బండిల్స్ గా చేసి వాటి అంచులను  కలవడం ద్వారా పుస్తకo సృష్టించబడినది. పుస్తకాల అభివృద్ధి అనే ఆధునిక భావన ముస్లిమ్స్ కనుగొన్నారు.
 ఫిజిక్స్, కెమిస్ట్రీ, అంకగణిత, ఆల్జీబ్రా, బయాలజీ, ఖగోళ శాస్త్రం, మొదలైనవి రంగాలలో ఇస్లామిక్ నాగరికత ఉచ్ఛదశకు చేరుకొంది. ముస్లిం భూభాగం లో కాగితం విస్తృతంగా వాడబడినది. 8-9 శతాబ్దాలలో పాశ్చాత్య ప్రపంచం చీకటి యుగo గా ఉంది మరియు వారికి కాగితం వినియోగం తెలియదు. చివరికి వారు 489 AH లో కాగితం గురించి తెలుసుకొన్నారు. ఆ సమయం లో ముస్లిం భూభాగం పై జరిగిన క్రూసేడ్స్(మత యుద్దాలు) దాడులలో దాదాపు ఒక మిలియన్ కు పైగా పురుషులు, మహిళలు మరియు పిల్లల ఊచకోత కు గురి అయినారు.  బహుశా మొదటి సారి అప్పుడే  యూరోపియన్లకు ముస్లిముల విజ్ఞానం  తో పరిచయం ఏర్పడింది. వారి  శాస్త్రీయ అభ్యాసం మరియు పుస్తకాలు యురోపియన్స్ చూడగలిగారు. వారు యూరోప్ కు చాలా పుస్తకాలు తీసుకు వెళ్లారు కాని కాగితం తయారు చేసే కళ వారికి  చిక్కలేదు.

యూరోపియన్లు తిరిగి ఆక్రమించిన ముస్లిం భూభాగాలు రెండు ఉన్నవి.479 హిజ్రీ సంవత్సరం నుండి యూరోపియన్లు ముస్లిం ప్రాంతాలను తిరిగి ఆక్రమించ సాగరు. అందులో ఒకటి అండలుషియా(స్పెయిన్). 544 హిజ్రీ సంవత్సరం లో యూరోపియన్లు మొదటి కాగితం తయారీ యూనిట్ ను ఏటివా (yetiva) అన్న ప్రదేశం లో పట్టుకొన్నారు.  అది ఆధునిక ముర్సియా (mursia) నగరం కు దగ్గిరగా ఉంది. ప్రతిసారీ యూరోపియన్లు అండలుషియా(స్పెయిన్) నగరాలను జయించినప్పుడు, వారు ప్రజలను  ఊచకోత కోయసాగారు కానీ కాగితం తయారీ సాంకేతిక నిపుణులను మాత్రం  సజీవంగా ఉంచేవారు. కాగితం తయారు చేసే కళ నేర్చుకొన్న తరువాత వారిని హత్య చేసారు.

యూరోపియన్లు ఆక్రమించుకొన్న మరో ముఖ్యమైన ప్రదేశం సిసిలీ అనే ఒక ద్వీపం. అది ఇప్పుడు  ఇటలీ లో ఒక భాగంగా ఉంది. రోజర్ 1540 AH లో సిసిలి ని తిరిగి ఆక్రమించడానికి ముందు అది 200 సంవత్సరాలు ముస్లిం పాలనలో ఉండేది. అతను యూరోపియన్ల మధ్యయుగ మనస్సుల్లో అనేక సంస్కరణలు తీసుకురావడానికి కారణమయ్యాడు అంతియే కాక అతని పరిచయం తోనే కాగితం సిసిలీ నుండి యూరప్ కు వచ్చింది.

ఇటాలియన్లు ముస్లింలు నుండి కాగితం తయారీ సాంకేతిక సొంతం చేసుకొన్న తరువాత  దానిలో మరింత నైపుణ్యం, మన్నిక కోసం హైడ్రో పవర్ పద్దతి ప్రవేశపెట్టినారు. ఈ కొత్త ప్రక్రియ సన్నగా, మన్నికైన మరియు ఉన్నతమైన నాణ్యత కాగితం ఉత్పత్తి కి సాయపడింది. ఇటాలియన్లు కాగితం తయారీలో నైపుణ్యత సాదించి  మొదటిసారి 13 వ శతాబ్దంలో వాటర్-మార్కింగ్ (watermarking) ప్రవేశ పెట్టారు.  పేపర్ ఉత్పత్తి లో ముస్లిం తయారీదారుల గుత్తాధిపత్యం రద్దయిపోయింది. 14వ శతాబ్దం చివరినాటికి కాగితం ముస్లిం భూభాగం కు ఎగుమతి చేయబడింది. ఈ శతాబ్దంలో మరింత ఇస్లామిక్ సాహిత్యం యూరోప్ నుండి వచ్చిన కాగితం పై రాశారు.

తోలి రోజులలో దివ్య ఖురాన్ యొక్క ప్రారంభ కాపీలను ఇటాలియన్ తయారి కాగితం మీద రాసేవారు కాని భాదాకరమైన విషయం ఏమిటంటే రోమన్ కాథలిక్ క్రైస్తవ ప్రపంచం క్రాస్ గుర్తు ఆ కాగితం పై వాటర్  మార్కుగా ఉండేది.  16 వ శతాబ్దం నాటికి, ముస్లిం ప్రపంచంలోని పేపర్ మిల్లులు అత్యంత నాణ్యత మరియు ధర విషయం లో యూరోపియన్ల తో పోటిపడలేక   మూసిపడినవి.

1439 సంవత్సరం లో జోహాన్స్ గుటెన్బర్గ్ అతని భాగస్వాములు ఆండ్రియాస్ ద్రిత్జేన్ మరియు ఆండ్రియాస్ హీల్ మన్ తో పాటు మానవజాతి యొక్క అతిపెద్ద ఆవిష్కరణలలో ఒకటి గా పరిగణించబడే ఒక ప్రింటింగ్ ప్రెస్ ను కనుగొన్నారు. పెద్ద సంఖ్య లో పుస్తకాలు మరియు సాహిత్యం ముద్రిoచలన్న గూటెన్బర్గ్ ఆలోచన విజయం సాధించింది. 16 వ శతాబ్ద ప్రారంభo నాటికి  ఐరోపా లో పేద్ద సంఖ్య లో ముద్రించే 300 ముద్రణాలయాలు ఉన్నవి.  శతాబ్దం చివరినాటికి, వారు వివిధ భాషల లో ముద్రించిన ఇరవై మిలియన్ పుస్తకాల కాపీలు పంపిణీ చేసారు.

యూరోపియన్లు ఒక శతాబ్దం క్రితం వరకు చీకటి యుగం లో ఉన్నారు కాని ఇప్పుడు కాగితం మరియు ప్రింటింగ్ ప్రెస్ కనుగోన్నతరువాత వారు విద్యలో మరియు  శాస్త్రవిజ్ఞానం లో ముందజలో ఉన్నారు మరియు ఆధునిక ఐరోపా నిర్మాణం లో గొప్ప ముందంజ వేసారు. క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికా ఖండంలో కాలుపెట్టినాడు  మరియు మెక్సికో మరియు అనేక ఇతర ప్రదేశాలలో ముద్రణాలయాలు  స్థాపించబడినవి.

ఇప్పుడు ముస్లిం ఉమ్మః యొక్క రాజకీయ ఆధిపత్యం అంతిమ దశకు వచ్చింది. గుటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టిన తర్వాత ఒట్టోమన్ ఖలీఫా ముస్లిం భూభాగాలలో దాని వినియోగాన్ని నిషేధించింది.1485 సంవత్సరం లో ఒట్టోమన్ ఖలీఫా సుల్తాన్ బయజిడ్ (Bayazid II) ప్రింటింగ్ ప్రెస్ “హరాం” అని ప్రకటించినాడు. యూరప్ నుండి పేపర్ దాని సంభందిత ముద్రిత పుస్తకాలు మరియు సాహిత్యపు  దిగుమతి కూడా ఒక రాజ శాసనం ద్వారా నిషేధించబడినది. 1515 లో ఖలీఫా సుల్తాన్ 1వ సలీం ఉలేమా ప్రభావం తో ఒట్టోమన్ దేశాల్లో ప్రింటింగ్ ప్రెస్ పని తో ఎవరైనా దొరికిపోతే వారికి మరణ శిక్ష అమలు చేయబడుతుంది ఒక ఉత్తర్వు జారీ చేసినాడు. ఈ నిషేధం 1729 లో తప్ప తదుపరి 290 సంవత్సరాలు కొనసాగింది.

కాని కొందరు ఉలేమాలు  ఒట్టోమన్ భూభాగం లో ముద్రణాలయం కొరకు విజ్ఞప్తి చేసారు. 1729 సంవత్సరం లో ఒట్టోమన్ సామ్రాజ్యంలో మంత్రి అయిన ఒక హంగేరియాన్ కన్వర్ట్ ఇబ్రహీం ముతఫరిక్క ఒక పుస్తకం “వాసిలట్ – టాట్-తిబ్బ” ప్రచురణాలయం మీద ఒక పుస్తకం రాసాడు మరియు గ్రాండ్ ముఫ్తీ కి దానిని ఇచ్చాడు మరియు దానికి మద్దతుగా వాదించాడు. గ్రాండ్ ముఫ్తీ మూడు పరిస్థితులతో అతని వాదనతో  ఏకీభవించారు. అవి  1) అరబీ లో ప్రచురించ రాదు. 2) అవి ఏవి ఇస్లాం మతం కు సంబందించినవి అవకూడదు.  3) ప్రభుత్వం ఆమోదం పొందిన పుస్తకాలు మాత్రమే ప్రచురించాలి.

ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టిన తర్వాత 290 సంవత్సరాల తరువాత లౌకిక పుస్తకాలు టర్కిష్ భాషలో (అరబిక్ లో కాదు మరియు ఇస్లాం మతం గురించి కాదు ) ముస్లిం భూభాగంలో పరిచయం చేయబడ్డాయి. ప్రింటింగ్ టెక్నాలజీ ఫిల్టర్ జరిగిన తరువాత  మాత్రమే మధ్య ప్రాచ్యం కు  1784 సంవత్సరం లో అనుమతించ బడినవి.  1817 లో (ముద్రణ కనిపెట్టిన 378 సంవత్సరాల తర్వాత) మొదటి పుస్తకాలు ఇరాన్ లో ముద్రించబడినవి.

ప్రింటింగ్ ప్రెస్ నిషేధం ఒక్కటే పరిగణనలోనికి తీసుకునేది కాదు. దానితో పాటు ఇతర నిషేధాలు, కట్టుబాట్లు మరియు ఉత్సుకత లేకపోవడం ఒట్టోమన్ సామ్రాజ్యం విధించికొన్న ఒక స్వీయ మేధో నిర్బంధం, నియంత్రణకు దారి తీసాయి. ఈ వంచన పలు  విధాలుగా సాగింది.  ఆసియాలోని అత్యుత్తమ ఖగోళ వేధశాల 1580 లో నాశనం చేయబడింది. ఆకాశ రహస్యాలను తెలుసుకోవడం పాపంగా వాదించే షేక్-ఉల్-ఇస్లాం ద్వారా అది నాశనం చేయబడింది. యూరోపియన్ వస్తువులను దిగుమతి కి అనుమతి ఉంది, కానీ ఎగుమతి పై  నిషేదం ఉండటం తో  యూరోపియన్ ఆలోచనలు మరియు నూతన ఆవిష్కరణలు (యుద్ధతంత్రం తో సంభందించినవి మినహాయించి) నిషేదించ బడినవి. 

మరొక ముఖ్యమైన సంఘటన  1492 సంవత్సరం లో చోటు చేసుకోంది. అది  గర్ణాట (Garnata) అండులేషియా (స్పెయిన్) పతనం. ముస్లిం భూభాగం లో  లో యూదులు వలస రావడంతో, వారు వాటిని ప్రింటింగ్ ప్రెస్ ఉపయోగించడానికి అనుమతి ఇవ్వవలసినదిగా  ఖలీఫా ను  అభ్యర్థించారు. యూదులు మరియు క్రైస్తవుల కి ముద్రణకు అనుమతించబడినది కాని కేవలo వారి భాషలలో మాత్రమే  ముద్రణ చేయవచ్చు టర్కిష్ లేదా అరబిక్లో మాత్రo కాదు మరియు  ముద్రించబడిన రచనలు ముస్లింలతో పంచు కోరాదు.

ఆ నాటికి యూదులు మరియు క్రైస్తవులు మరింత అక్షరాస్యులు అయ్యారు  మరియు ముస్లిములు  విద్య మరియు శాస్త్రీయ విజ్ఞానం కోల్పోయారు. వారి సొంత భూములు అక్షరాస్యతలో బాగా వెనుకబడినవి గా మారినవి.  యూదులు మరియు క్రైస్తవులు ఒట్టోమన్ సామ్రాజ్యం లో ముఖ్యమైన అధికారిక స్థానాలో నియమించ బడినారు.

 చివరకు  నెపోలియన్ బొనపార్టే నేతృత్వంలోని ఫ్రెంచ్ ప్రభుత్వం 1798 సంవత్సరం లో ఈజిప్ట్ దాడి చేసింది. ఫ్రెంచ్ ద్వారా ఈ దాడి వలసవాదం యొక్క యుగాన్ని ప్రారంభించినది. ఫ్రెంచ్ ఈజిప్ట్ దండెత్తినపుడు, వారు ఒక ప్రింటింగ్ ప్రెస్ ను తీసుకుని వచ్చారు మరియు అక్కడ దానిని ఏర్పాటు చేసారు. ఫ్రెంచ్ పాలన చాల కాలం నిలవలేదు.1822 లో మహమ్మద్ ఆలీ బషీర్ కైరో శివార్లలో బులాక్ (Bulaq) వద్ద ఒక ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ స్థాపించినాడు.   తదనంతరం అది  అల్ అమిరియా ప్రెస్ గా పిలవ బడింది మరియు ఈజిప్ట్ ఆధునికీకరణ ప్రారంభం అయినది.

ఈజిప్షియన్లు ముస్లిం ప్రపంచంలో అగ్రగామి సంస్థగా మారారు మరియు దానిలో ప్రింటింగ్ ప్రెస్ పాత్ర చాల ఉంది.  ఈజిప్షియన్ ఇస్లామిక్ పండితులు వెనుక బడి ఉండలేదు 1870 లో తొలి ఇస్లామిక్ ప్రింటింగ్ ప్రెస్ స్థాపించారు. ముస్లిం ప్రపంచంలో మొట్టమొదటి అత్యంత విశ్వసనీయమైన మరియు అత్యంత పాండిత్యo కల  ఇస్లామిక్ పుస్తకాలు ఈ ప్రెస్ నుండి వచ్చినవి. చివరగా ముద్రణాలయాలు కైరో, బాగ్దాద్ మరియు ఇతర ముస్లిం ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు.

ఒక అరబిక్ ప్రింటింగ్ ప్రెస్ ను ముస్లిం ప్రపంచంలో స్థాపించడానికి సుమారు 383 సంవత్సరాలు పట్టింది. ఈ సమయానికి ముస్లిం భూములు వలస పాలన  లేదా వలసవాదుల బారిన పడినవి  వారి యూరోపియన్ మాస్టర్స్ ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మేధస్సు ను వినాశనం చేసే ప్రక్రియలో ఉన్నారు. తదనంతరం  మొదటి  ప్రపంచ యుద్ధం ప్రారంభం అయినది మరియు టర్కిష్ సామ్రాజ్యం రద్దయింది.
ఖలీఫా పదవిని టర్కిష్ పాలకుడు ముస్తఫా కెమాల్ పాషా రద్దు చేశాడు. ముస్లిం భూబాగం చిన్న-చిన్న ముక్కల క్రింద విభజింప పడినది. తదుపరి వచ్చిన రెండవ ప్రపంచ యుద్ధం లో పాలస్తీనా ప్రధాన భాగం యూదులకు ఇవ్వబడినది మరియు   భారతదేశ విభజన జరిగింది. ఈ సమయానికి మొత్తం సెంట్రల్ ఆసియా ముస్లిం భూభాగాలను సోవియట్లు స్వాధీనం చేసుకున్నారు
 చాలా ముఖ్యమైన పాయింట్ ఖలీఫా మరియు వారితో ఉన్న ఖుర్ఆన్ మరియు సున్నతుల జ్ఞానం గల కొందరు ముస్లిం పండితులు ఔచిత్యంతో ప్రింటింగ్ ప్రెస్, శాస్త్రీయ విజ్ఞానం మరియు కొత్త సాంకేతికను  దత్తతు తీసుకొన్నారు మరియు వారి వ్యవస్థ లో వాటిని   మిళితo చేసుకొన్నారు.  లేనియెడల బహుశా చరిత్ర మరోవిధంగా ఉండేది.  కాగితం మరియు ప్రింటింగ్ ప్రెస్ ఉపయోగించడంతో జ్ఞానం మరియు జ్ఞాన శక్తి అభివృద్ధి లోనికి వచ్చింది.


No comments:

Post a Comment