5 June 2016

కొత్త తరం ముస్లిం సంగీత ఆవిర్భావం : మెటల్, హిప్ హాప్ మరియు రాజకీయాలు (Underground Muslim Music Emerges: Metal, Hip Hop, and the Politics of a New Generation) -





ఈ మద్య ఇస్లామిక్ మ్యూజిక్ లో కొత్త వొరవడి ప్రారంభం అయినది. సమకాలిన రాజకీయాలు, అణిచివేత,సామాజిక న్యాయం, ఆర్ధిక,సాంఘిక అసమానతలు  మొదలగు అంశాల నేపద్యం లో పాలస్తీనా,సిరియా,ఇరాక్  వంటి సమకాలిన ముస్లిం సమస్యలను ప్రపంచదృష్టి కి తెస్తూ సంప్రదాయక సంగీతానికి బిన్నం గా కాన్షియస్ హిప్-హాప్, ‘హెవీ మెటల్’ పేర సరికొత్త చైతన్య,ఆలోచనాత్మక సంగీతాన్ని అందిస్తున్నారు.

నేడు హెవీ మెటల్ మరియు హిప్ హాప్ సంగీతం ప్రపంచ వ్యాప్తంగా వినపడుతున్నది. దశాబ్దాలుగా  సంగీతకారులు మరియు అభిమానులు ఇంటర్నెట్ ద్వారా ఒకటి అయినారు.  గత అర్ధ శతాబ్దంలో జన్మించిన  ఎవరికైనా ఇది వార్త కాదు. సంగీతంలో ఒక నిరసన గళం ఉంది. మెటల్ మరియు హిప్ హాప్ పేదరికం లో,  జీవితం యొక్క అవాస్తవ గొప్పతనo లో, అబద్దపు సంతోషo లో  జన్మించాయి. మెటల్ మరియు హిప్ సంగీతం ప్రపంచవ్యాప్తంగా ముస్లిం యువత  నిరసన స్వరం గా మారుతుంది.

రాక్ సంగీతపు  తీవ్రమైన లయ భాగాల చే రూపొందింపబడిన ఒక శైలిని హెవీ మెటల్ అందురు. ఇది 1960 చివరలో ఆంగ్ల పారిశ్రామిక పట్టణాలలో ప్రారంభమయిoది. న్యూ యార్క్ సిటీ మురికివాడల లో జన్మించిన సంగీత శైలిని హిప్ హాప్ అందురు. హిప్ హాప్ అనునది సౌత్ బ్రాంక్స్ లో వేసవి కాలం బ్లాక్ పార్టీలలో జమైకన్ సంగీతం మరియు సంగీతకారులు మౌఖికంగా పోషించిన ధ్వని వ్యవస్థ అని చెప్పవచ్చు. ఈ ధ్వని వ్యవస్థ లో రికార్డు టర్న్ టేబుల్స్, రికార్డు మిక్సర్, ఒక యాంప్లిఫైయర్  మరియు స్పీకర్లు అన్ని ట్రక్కుల యొక్క ఫ్లాట్ పడకల ఏర్పాటు కలిగి ఉండేవి. హిప్ హాప్ స్వరకల్పనలు  రాప్ పాటలు, లూప్డ్ వాయిద్య బీట్స్ లోకి అభివృద్ధి చెందినవి. హెవీ మెటల్ మరియు హిప్ హప్  రెండు ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనడానికి, మరియు రాజకీయ విషయాలపై దృష్టి పెట్టినవి. వాళ్ళ తరచూ  సంగీతకారులు వారి  అభిమానుల అసంతృప్తిని  వ్యక్తంచేసే  చానెల్స్ గా మారినవి.


ఇటీవలి  కాలం లో మిలియన్ల కొద్ది  పీడిత ఇస్లామిక్  ప్రజల నీచ పరిస్థితుల పట్ల నిరసన చూపే సంప్రదాయేతర ముస్లిం సంగీతం  యొక్క సంఖ్య ఎక్కువ అయినది. లిండా హీర్రెర మరియు అసేఫ్ బయాట్ (Asef Bayat) యొక్క “బీయింగ్ యంగ్ & ముస్లిం: న్యు కల్చరల్ పోలిటిక్స్ ఇన్ ది గ్లోబల్ సౌత్ అండ్ నార్త్ (2010) లో మొరాకో, ఇండోనేషియా, టర్కీ, మరియు లండన్ లోని సంగీత రాజకీయాలు గురించి అనేక కథనాలు ఉన్నాయి. ఇండీ చిత్రనిర్మాత ప్లాటన్ తేఒదోరిస్ (Theodoris) 2008  లో లుకేంబ(Lakemb) పేరుతో ఒక సినిమా లో ఆస్ట్రేలియాలోని ముస్లిం రాపర్లను  ప్రపంచంకు  పరిచయం చేసినాడు. పాలస్తీనా హిప్ హాప్ కళాకారులను  జాకీ రీం సల్లౌం యొక్క డాక్యుమెంటరీ "స్లింగ్ షాట్ హిప్-హాప్" 2008 సన్ డాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు.
ఈ రంగంలో అత్యంత విస్తృతమైన పని చరిత్రకారుడు మరియు సంగీతకారుడు మార్క్ లెవిన్ చేత “హెవీ మెటల్ ఇస్లాం : రాక్, రెసిస్టన్స్ అండ్ ది స్ట్రగుల్  ఫర్ ది సోల్ అఫ్ ఇస్లాం” (2008) (Heavy Metal Islam: Rock, Resistance, and the Struggle for the Soul of Islam) (2008) లో చేయబడినది.లెవిన్ ప్రకారం మొరాకో నుంచి  పాకిస్తాన్ వరకు ముస్లింలలో ప్రత్యామ్నాయ సంగీత శైలి పట్ల   ప్రజాదరణ విస్తరిస్తుంది. మొరాకో వంటి ప్రదేశాలలో  హిప్ హాప్ మరియు మెటల్ కచేరీలు వేలాది అభిమానులను ఆకర్షించినవి.  కానీ ఇరాన్ వంటి సంప్రదాయవాద ప్రాంతాల్లో ఇంటర్నెట్ ప్రముఖ సామాజిక నిరసన మరియు నిరోధ  సాధనంగా ఉంది. ప్రభుత్వం ఇంటర్నెట్ ను నిషేదిoచినప్పటికి  వెబ్ అవగాహన నావికులు కనెక్ట్oగ్ మార్గాలు కనుగొన్నారు. 

ప్రత్యామ్నాయ సంగీతం పట్ల పెరుగుతున్న ఆదరణకు  అనేక కారణాలు కలవు. ఒక కారణం  పెరుగుతున్న యువ జనాభా. మునుపటి వలస ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో 25 సంవత్సరాల వయస్సు  కింద వ్యక్తులు  జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్నారు.  గాజాలో సగానికి పైగా జనాభా లో 20సంవత్సరాల వారు ఉన్నారు.   పాకిస్థాన్ జనాభాలో దాదాపు నలభై శాతం మంది 15 సంవత్సరాల దిగువన  ఉన్నారు. వివాదం, పేదరికం, మరియు అవకాశాలు లేక పోవడం యువ తరo జీవితాలను ప్రభావితం చేస్తున్నవి. మెటల్ మరియు హిప్ హాప్ సంగీతం తరచూ నిరసన తెల్పుతున్నవి  మరియు నిరసన తెల్పే  ముస్లిం యువత జీవితాల్లో మెటల్ మరియు హిప్ హాప్ సంగీతంనకు  ఒక గొప్ప స్థానం ఉంది.

యునైటెడ్ స్టేట్స్ మరియు యునైటెడ్ కింగ్డమ్  వలె, ముస్లిం మతం ఎక్కువగా దేశాలలోని  మెటల్ మరియు హిప్ హాప్ కళాకారులు జీవిత కథాంశాల వైపునకు దృష్టి ని పెడుతున్నారు. గాజా రాప్ బృందం “పాలస్తీనా రాప్పర్జ్” ప్రధాన గాయకుడు మహమ్మద్ ఫర్రా ప్రకారం "రాప్ పోరాటం నుండి వచ్చింది, మరియు కనీసం ఒక రాపర్ గా  నేను  ఆక్రమణ వాస్తవాలను  తీసుకొని వాటిని పాటలుగా  మార్చుతున్నాను” అన్నాడు. మొరాకో మెటల్ బ్యాండ్ సిన్కపెయా (Syncopea) ప్రధాన గాయకుడు బద్రేద్దిన్ ఒత్కి ప్రత్యామ్నాయ సంగీతం ద్వారా  “అన్యాయం, నొప్పి, మారణహోమం, మరియు యుద్ధం” గురించి గళం విప్పుతాడు. ఇరాన్ లో అజ్ఞాత సంగీతకారులు అధికారిక సంస్కృతిలో భాగమైన బలిదానం నేపథ్యంలో జీవిత విలువల  కోసం పాడసాగారు. వెస్ట్ బ్యాంక్ రాపర్ స్త్రంత్రాప్(Stormtrap) "సంగీతం లేనిదే మాకు భవిష్యత్తు మీద ఆశ లేదు" అని  చెప్పాడు.

ఈ  నిరసన గాత్రాలు అనేక  చోట్ల ముస్లిం రాపర్ల రచనలలో ప్రతిధ్వనించుతున్నవి. సోమాలి- కెనడియన్ రాపర్ కె'నాన్, అమెరికన్ రాపర్ మోస్ డెఫ్ తమ శ్రోతల బాధలకు  విస్తృత అవగాహన కల్పించునున్నారు. వారి ప్రకారం  “ఘెట్టో” ఒక చెడు,  కానీ ప్రపంచంలోని చాలా మంది ప్రజలు కోసం “ఒక ఘెట్టో” ఉంది. డెన్మార్క్ ఆధారిత హిప్-హోప్ గ్రూప్ ఇరానియన్-ఇంగ్లీష్ గాయకుడు సామి యూసుఫ్ తో కలసి పాడిన  యుగళగీతం "Try Not to Cry అన్ని చోట్ల పిల్లల బాధ ను ఒక గుండెను పిండినట్టు పాడారు.

ముస్లింలు  మాత్రమే కాదు ఇతరుల కళాకారుల  నిరసన కూడా ముస్లిం గాత్రాలకు స్పందించినది.  వారిలో  కోబి ఫర్హి మరియు యోస్సి సస్సి సారోన్  అనే ఇజ్రాయెల్ యొక్క హిప్ హాప్ బృందం “Orphaned Land వారితో కలిసాయి. 1997 లో స్థాపించిన ఇజ్రాయిల్   పంక్ బ్యాండ్ డిర్ యాస్సిన్ (Dir Yassin) (2002 లో రద్దు అయినది) పీడిత పాలస్తీనియన్ల బాధ గుర్తించమని ఇజ్రాయిల్ కు సవాలు చేసింది.

కానీ ముస్లింలనుండి వస్తున్న ఆల్టర్నేటివ్ మ్యూజిక్ కు  ఒక ఏకైక మూలకం హింస కు వ్యతిరేకం. హింస వ్యర్ధం అని వారి తపన. కాని అదే సమయంలో వారు అన్ని విధాల  అడ్డుకోవటానికి ప్రయత్నించివారి పట్ల  నిరాశను  వ్యక్తం చేస్తున్నారు. వారి మాటలనే ఆయుధాలుగా ఉపయోగించి పాలస్తీనా రాపర్ సాజ్ చెప్పినట్లు “వారు కోపం, నిరాశ మరియు చేతకానితనం ఇతరుల హింస భావన కోసం ఒక ఇంధనo గా ఉపయోగిస్తారు”.  వెస్ట్ బ్యాంక్ రాపర్ సమూహం G-టౌన్ B-Boy ప్రకారం “ఒక రాపర్ గా నాకు హిప్ హాప్ అనేది హింసను అడ్డుకోవటానికి ఒక మార్గం చూపుతుంది. తుపాకులు మరియు రాళ్ళు బదులుగా పదాలు ఒక పరిష్కారం చూపుతున్నవి. ఇది నాకు చాల మంచి అనుభూతి”. పాలస్తీనా రాపర్ ఇబ్రహీం ఘోనీం (Ibrehiem Ghoneem) ప్రకారం “రేడియోలో ప్రేమ సంగీతంతో తన కళ వ్యత్యాసాలను పేర్కొంటు రాప్ తో మేము చేస్తుంది విబిన్నము.అది రెసిస్టన్స్(వ్యతిరేకత).   హింస తో ఏది మార్చలేము  కాబట్టి బహుశా ప్రజలు  మాతో ఈ విధంగా వింటారు”. ఇజ్రాయిల్  హిప్ హాప్ కళాకారుడు సగోల్ 59 (ఖెన్  రోటెమ్) దీనితో అంగీకరిస్తాడు. " యూదులు మరియు పాలస్తీనియన్లు మద్య హిప్-హాప్ తో  ఒక సంభాషణ సాగించగలము.  సమస్య యొక్క మూలాలు తెలుసుకోగలము.” 

తమెర్ నఫర్ ఉత్తమ పాలస్తీనా హిప్ హాప్ సమూహం DAM యొక్క నివాసం  ఇశ్రాయేలు పాలస్తీనా మురికివాడ లీద్(Lyd) లో  ఉంది. అతను డ్రగ్స్, గార్బేజ్, నేర సంస్కృతి ఉన్న  వీధుల్లో పెరిగాడు.  అతను అరబిక్, ఇంగ్లీషు, మరియు హీబ్రూ లో అడుగుతాడు "ఎవరు తీవ్రవాది?"  అది ఆ గ్రూప్ యొక్క అత్యంత ప్రసిద్ధ పాటల్లో ఒకటిగా పేరుగాంచినది. ఇది 1990 చివరిలో YouTube లో మిలియన్ల హిట్స్ సంపాదించినది. "నాకు స్వేచ్ఛ లేదు" అనే పాటలో  అతను చెప్పాడు "మేము 50 సంవత్సరాల గా ఈలాగే  ఉన్నాము. ........కానీ నేను ఆశావాదo గా  బలo గా ఉన్నాను.... నా అడుగులు  ఆలివ్ చెట్టు మూలాల పై  ఉన్నాయి. విరాజిల్లుతున్న తల్లి మరియు శాఖలుగా విస్తరిస్తూ ఉన్నాను. ప్రతి శాఖ శాంతి కోసం పెరిగినది". "చేంజ్ టుమారో" లో అతని  సహ సభ్యుడు మహమౌద్ జ్రెరి పిల్లలను  హెచ్చరిస్తు అంటాడు:

“తుపాకీ పట్టుకోవద్దు కాని ఒక కలం పట్టుకొ మరియు వ్రాయి!
నేను కవి మహమౌద్ దార్విష్ లాగా ఒక అరబ్ ను.
నేను జీవించడానికి ఇతరులకు ఎప్పటికీ చంపను.
నా గుండె గట్టిగా మనం  మానవులo అని ఘోష పెడుతుంది.”

కొంతమంది పరిశోధకులు ఇస్లామిక్ హిప్ హాప్ మరియు ఇస్లామిక్ మెటల్ ప్రస్తావించుతారు. కానీ కళాకారులు ముస్లిం అయినంత మాత్రాన అది "ఇస్లామిక్" అవుతుండా? అది నిజo అవలసిన అవసరం లేదు? సామాజిక న్యాయం మరియు మానవ గౌరవం ఇస్లామిక్ థీమ్స్ సంగీతo లో ఎక్కువ మొత్తంలో వినవచ్చు మరియు కొందరు  సంగీత కారులు తమ సంగీతo కు  ప్రేరణ  ఇస్లాం మతం అని  వివరిస్తారు. 1990 లో ఏర్పాటు చేసిన Outlandish విపటిత మతాసక్తి కలవారుగా తమ్ము తాము అభివర్ణిoచుకోంది అందులో ఇద్దరు ముస్లిం మతస్తులు (ఇస్లాం బచిరి మరియు వాకాస్ ఆలీ ఖాద్రి) మరియు ఒకరు కాథలిక్ (లెన్ని మార్టినెజ్). వారి 2005 ఆల్బమ్ "Closer than Vein “(దివ్య ఖురాన్ 50:16) " గోoతు దగ్గిర సిరలు కంటే ప్రజలకు  దగ్గర ఖురాన్” అని చెబుతుంది. ఇరానియన్ రాపర్ పీమాన్-చెట్ “తన సంగీతం సూఫీ కవి  రూమీ నుండి  స్ఫూర్తి పొందినది” అంటాడు. సల్మాన్ అహ్మద్, పాకిస్తాన్ యొక్క ప్రసిద్ధ “జునూన్” కర్త తన సూఫీ రాక్ సంగీతo తన "జిహాద్" గా పేర్కొన్నాడు. సెనెగల్ సూపర్ స్టార్ యౌస్సౌ ఎం దౌర్ ( Youssou N'Dour) యొక్క 2008 డాక్యుమెంటరీ "I Bring What I Love" ఆల్బమ్ "ఈజిప్ట్”  ఇస్లాం విశ్వాసం  చుట్టూ  విస్తరిస్తుంది.

మార్క్ లెవిన్ తన పాఠకులకు ఇరాక్ యొక్క ప్రముఖ షియా  షేక్ (ముస్లిం మత అధికారి ) చెప్పిన దాన్ని వివరిస్తాడు షేక్ మాటల్లో " నేను హెవీ మెటల్ ను అంగీకరించను ఎందుకంటి అది మత ప్రధానం కాదు లేదా  ఇస్లాం మతం కు  వ్యతిరేకం కాదు. కానీ నేను సంగీతం యొక్క ఇతర శైలులు ఇష్టపడతాను.  ఎందుకంటే. మనమందరం కలిసి డ్రమ్స్ విపరీతముగా వాయించి మరియు గాలి లో మన చేతులు వేగంగా ఊపుతున్నప్పుడు, బిగ్గరగా ప్రార్థన చేసినప్పుడు హెవీ మెటల్ ఎలాను చేస్తూనే ఉన్నాము కదా!”. అనేక రాజకీయ మరియు మతపరమైన అధికారులు మెటల్ మరియు హిప్ హాప్ ను  అన్-ఇస్లామిక్ లేదా ఇస్లామిక్ కు వ్యతిరేకo అని  నమ్మతారు  లేదా కొందరు దాన్ని  షైతాన్ తో  పోల్చుతారు.

కళాకారులు మరియు అభిమానులు ఇంటర్నెట్ కు కృతజ్ఞతల తో  మెటల్ మరియు హిప్ హాప్ ను  ఇంకా కొనసాగిస్తున్నారు. వారి పూర్వీకుల వలె కాకుండా  మెటల్ మరియు హిప్ హాప్ కళాకారులు పూర్తి ప్రపంచానికి వారి సందేశాన్ని పంపుతున్నారు.  వారు కోపం లేదా భయం తో కాకుండా  తాదాత్మ్యం తో తెలియ జేస్తున్నారు. రాజకీయ మరియు తీవ్రవాద క్రియాశీలత కన్న భావవాదం మరియు నిరసన తరంగం ద్వారా  తెలియజేయటం లో వారు విజయం పొందారో లేదో తెలియాల్సి  ఉంది. కానీ ఇది కనీసం కళాకారులు మరియు వారి  అభిమానులకు ఆశ ఇస్తుంది.

(వెస్ట్రన్ ముస్లిం హిప్-హాప్, హెవీ మెటల్ మ్యూజిక్ అందు ప్రవేశం, ఆసక్తి ఉన్నవారు ఈ వ్యాసం చదివి దీనిలోని లోటుపాట్లను దయచేసి వివరిoచ వలసినదిగా వినమ్రత తో ప్రార్దిoచుచున్నాను. వెస్ట్రన్ ముస్లిం హిప్-హాప్, హెవీ మెటల్ మ్యూజిక్ ను ప్రెజెంట్ చేయడంలో ఎంతవకు విజయం సాధించానో వివరించవలసింది గా కోరుతున్నాను. 99899 65370  9491501910  or  azgar1958@gmail.com) పూర్వ రంగం కోసం నేను రాసిన హలాల్ మ్యూజిక్ చదవండి.

No comments:

Post a Comment