భారత దేశం లో
మొదటి బాలికల విద్యాలయమును 1848 లో పూనా నగరములో ఉస్మాన్ షేక్ నివాసం లో నెలకొల్పిన
వారు సావిత్రి భాయి పూలే మరియు ఫాతిమా
షేక్. ఆ రోజులలో సంప్రదాయవాదులు స్త్రీలు ముఖ్యంగా
అంటరాని కులాలకు చెందిన వారు విద్య
నేర్చుకోవటం పాపం అని భావించే వారు. తమ ప్రాణాలను, మర్యాదను పణంగా పెట్టి అగ్ర వర్ణాల
ఆలోచలనలకు వ్యతిరేకంగా సావిత్రి భాయి ఫూలే
మరియు ఫాతిమా షేక్ బాలికా విద్యాలయం ను
స్థాపించినారు.
సావిత్రి భాయి1831 లో మహారాష్ట్ర లోని సతారా జిల్లా లో
జన్మిoచెను. తన 9ఏట 1840 లో ఆమె వివాహం జ్యోతి రావు పూలే తో జరిగినది. మియా షేక్
చెల్లెలు ఫాతిమా షేక్ 18వ శతాబ్దం లో ముస్లిమ్స్ లో మొదటి ఉపాద్యాయురాలు.
నిమ్నవర్గాల,
వెనుకబడిన, దళిత ఆడపిల్లల కు విద్యాభోధన చేయడం అగ్రవర్ణాల వారు సహించే వారు కాదు.సావిత్రి
భాయి పూలే పై అశుద్ధం మరియు పశువుల పేడ
చల్లేవారు. రాళ్ళు విసేరేవారు. దానితోస్కూల్ కు వెళ్ళేటప్పుడు సావిత్రి భాయి పూలే తన వెంట ఒక జత బట్టలను అదనంగా తీసుకు
వెళ్ళేవారు. నిమ్న వర్గాల మరియు శుద్ర వర్గాల బాలికలకు విద్య నేర్పించాలనే ఆమె
చిత్తశుద్ది ముందు ఇతరులు చేసే దుష్ట కార్యక్రమాలన్నీ ఒడిపోయాయి.
వర్ణ వ్యవస్థ,
కుల అహంకారం అధికంగా ఉన్న ఆ నాటి సమాజo లో సాంఘిక సమానత్వం సాధన, స్త్రీ విద్య
వ్యాప్తి కోసం సావిత్రి భాయి పూలే చేస్తున్న కార్యక్రమాలలో ఫాతిమా షేక్ తన సంపూర్ణ
సహకారం అందించారు. అగ్రవర్ణాల వారు సావిత్రి భాయి పూలే కార్యక్రమాలకు వ్యతిరేకంగా
ఆఖరకు ఆమెను హత్య చేయడానికి కూడా పన్నాగం పన్నారు. సావిత్రి భాయి తన భర్త
అడుగుజాడలలో నడిచి శూద్రుల ముఖ్యంగా
స్త్రీ విద్యా వికాసంనకు కృషి చేసెను. దళితుల,నిమ్న వర్గాల అబ్యున్నతి వారి విద్యవికాసం పై ఆధార
పడిఉన్నాదని సావిత్రి భాయి విశ్వసించెను.
దేశం లో కెల్లా
మొదటి బాలికా విద్యాలయము పూనా నగరంలో 1848వ సంవత్సరములో షేక్ నివాసములో ఫాతిమా
షేక్ మరియు సావిత్రి భాయి ఫూలే స్థాపించినారు. వారితో పాటు సావిత్రి భాయి ఆడపడుచు
సుగుణా భాయి కూడా బాలికా విద్యాలయములో బాలికలకు విద్య నేర్పేవారు.
1818 మరాటా
సామ్రాజ్యం అంతమైన తరువాత బ్రిటిష్ వారి పాలనా మరాఠా ప్రాంతం లో సుస్థిరమైనది. ఆ
కాలంలో జ్యోతి రావు ఫూలే ప్రముఖ సామాజిక సంస్కర్త గా పేరుగాంచారు. జ్యోతి రావు
పూలే శుద్రులు వెనుకబడి ఉండుటకు వారిలో అక్షరాస్యత లోపం ప్రధాన కారణం గా భావి
నడిచి శూద్రుల విద్యావికాసమునకు కృషి
చేసెను. జ్యోతి రావు పూలే స్త్రీ విద్యను ప్రోత్సహించి, విధవావివాహం
సమర్ధించెను. బాల్యవివాహం, సతి ఆచారం
వ్యతిరేకించెను, అనాధులకు, పేద పిల్లలకు శరణాలయాలు, స్త్రీలకు విద్యనూ బోధించే
కార్యక్రమాలు ప్రారంభించారు. జ్యోతి రావు ఫూలే అభిప్రాయం లో మన దేశం లో ఆంగ్ల
విద్య సంస్కరణ కార్యక్రమమునకు ఎంతోగా ఊతం ఇచ్చినది. దానికి తోడూ ఫూలే అనేక మంది
ముస్లిం మిత్రులను కలిగి ఉండేవారు. తన కాలం లో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మరియు
సాంప్రదాయ సమాజ వ్యవస్థ కు వ్యతిరేకంగా జ్యోతి రావు ఫూలే పోరాడినాడు. భారత దేశం లో
కులవ్యవస్థకు, వర్ణ వివక్షణ కు వ్యతిరేకంగా నిమ్న, బలహీన వర్గాల ముఖ్యంగా
స్త్రీ విద్యసాధనకు పోరాడిన వ్యక్తి
జ్యోతి రావు పూలే.జ్యోతి రావు పూలే సత్య
శోధక సమాజం ను స్థాపించెను. అతని రచనలలో “గూలంగిరి” అతి ప్రముఖమైనది.
ఫూలే దంపతులు
యశ్వంత్ అనే బాలుడిని దత్తత తిసుకోనిరి అతడు పెరిగి పెద్దవాడు అయి డాక్టర్ విద్యనూ
అబ్యసించెను. 1876-77 లో క్షామము
ఏర్పడినప్పుడు అనాధ శరణాలయము లోని 200 బాలకులను సావిత్రి భాయి స్వయముగా కన్నబిడ్డల
వలే సాకెను మరియు యస్వంత్ సాయముతో వారికి ఆరోగ్య సేవాసదుపాయాలు కల్పించెను.
భారత దేశం
కలకాలం గుర్తుoచుకోవలసిన వ్యక్తులు స్త్రీ విద్య రంగం లో విశేష కృషి చేసిన
సావిత్రి భాయి పూలే మరియు ఫాతిమా షేక్. వారి త్యాగం మరియు శ్రద్ద మరియు స్త్రీ
విద్య పట్ల వారి అంకిత భావం భారతీయ
మహిళలకు మార్గదర్శకం.
.
No comments:
Post a Comment