Union
Human Resources Minister: Prakash Javadekar
• Minister of State for Human Resources Development :
Upendra Kushwaha
• Minister of State for Human Resources Development Higher
Education:Mahendra Nath Pandey
• UGC CHAIRMAN: Ved Prakash
• NAAC Chairman: DP Singh
• AP State HRD Minister: G. Srinivasa Rao
• APSCHE Chairman: L. Venu Gopala Reddy
• Committee On NEP : TSR Subramaniyam
• భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉన్నత విద్యా వ్యవస్థ కల దేశం. భారతదేశం ఒక యువ దేశం. ప్రస్తుత గణాంకాల ప్రకారం, 600 మిలియన్ భారతీయులు 25 సంవత్సరాల లోపు వారు ఉన్నారు.
• భారత దేశం లో ప్రతి తొమ్మిది మంది పిల్లలలో ఒకరు స్కూల్ చదువు పూర్తి చేసి కళాశాల లో చేరతున్నాడు
• ఉన్నత స్థాయి విద్యా (+2) దశకు చేరుకుంటున్న 2.2 కోట్ల మంది పిల్లలల లో సగం మంది మాత్రమే +2 పూర్తి చేస్తున్నారు.
• ఉన్నత విద్య నమోదు నిష్పత్తి భారతదేశం లో 11 శాతం గా ఉంది మరియు USA
లో 83% ఉంది.
• కళాశాల లో 11వ తరగతి మరియు 12వ తరగతుల మద్య ఎన్రోల్మెంట్ సగం కు పైగా తగ్గినది కాని విశ్వవిద్యాలయం ఎన్రోల్మెంట్ మాత్రం 2008-09 నుండి పెరిగినది అని నివేదిక లో చెప్పారు.
• ఉన్నత విద్య కొరకు నమోదు అయిన బాలుర సంఖ్య 2012-13 లో 13 శాతం మరియు అమ్మాయి సంఖ్య 21 శాతం పెరిగింది.
• ఒక సర్వే ప్రకారం భారత దేశం లో ప్రతి పది మంది మానవీయ శాస్త్రాల(Arts) డిగ్రీ విద్యార్ధులలో ఒకరు మరియు ప్రతి నలుగురు ఇంజనీరింగ్ విద్యార్ధుల లో ఒకరు మాత్రమే ఉద్యోగం కలిగి ఉన్నారు.
• ఉన్నత విద్య సంస్థలలో అద్యాపకుల డ్రాప్-అవుట్ రేట్(మద్య లో వైదోలిగే వారు) చాలా అధికం మరియు IIT ల వంటి విద్య సంస్థలలో 'ఆచార్యుల’ డ్రాప్-అవుట్ రేట్ 20-30% వరకు ఉంది.
• అల్ప ఎన్రిల్మేంట్ మరియు ప్రధానమైన అవరోధాలను ఎదుర్కొనుటకు భారత దేశం లో ఉన్నత విద్యారంగం లో విద్యావకాశాల అబివృద్ది కి ప్రవేట్ రంగ పెట్టుబడులు అవసరం అని ప్రభుత్వ కమిటీలు తెల్చినవి.
• గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో(GER): ఒక విభాగం లో మొత్తం ఎన్రోల్ అయిన మొత్తం విద్యార్ధుల సంఖ్యను ఆ విభాగం లో ఉన్న మొత్తం జనాభా పెట్టి భాగించగా వచ్చునది.
• లేటెస్ట్ GER-ఉన్నత విద్య -2013. అఖిల భారత ఉన్నత విద్య సర్వే ప్రకారం: 24%
• స్టాండింగ్ కమిటీ ఫర్ ది డిమాండ్ అఫ్ గ్రాంట్స్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్:13.5%, 2002 లో GER=09%
• 2020 నాటికి 30%టార్గెట్: 30% టార్గెట్ సాదించుటకు 2013 లో రాష్ట్రీయ ఉచ్చతమ శిక్షా అబియాన్ స్థాపించ బడినది.
• ఇతర దేశాలలో GER %=
• అమేరికా,స్వీడన్,రష్యా,బ్రిటన్,జపాన్,బ్రెజిల్,చైనా,ఇండియా
• 84, 82, 71, 59, 55, 25, 23, 13.5
• ఉన్నత విద్య రంగం లో విస్తృత విస్తరణ కు ప్రబుత్వ ఆర్ధిక సహాయం సరిపోదని నేషనల్ నాలెడ్జ్ కమిషన్ పేర్కొన్నది.
• విద్యార్ధులు ఎక్కువ సంఖ్యలో ప్రవేట్ విద్యా సంస్థలలో చేరుతున్నారు దానికి కారణంఉన్నత విద్య రంగం లో ప్రవేశాలను కల్పించడం లో ప్రవేట్ రంగo ముందజలో ఉంది.
• సంస్థల భాగం ఎన్రిల్మేంట్ లో భాగం
• ప్రవేట్- పబ్లిక్ ,ప్రవేట్ ,పబ్లిక్
• 75%-25%,64%,36%
• కేంద్ర ప్రబుత్వ వ్యయం = మొత్తం వ్యయం లో 1-1.5%
• ఉన్నత విద్య పై ఖర్చు= %GDP
• అమెరికా,కేనడా, చిలి, రష్యా,ఇండియా, బ్రెజిల్
• 3%,2.5%,2%,1%1%,0.5%
• ఉన్నత విద్య రంగం లో విశ్వవిద్యాలయాల స్థాపనకు నిభందనలు రాష్టానికి రాష్టానికి మారుతున్నివి అందువలన కొన్ని రాష్ట్రాలలో ఉన్నత విద్య రంగం లో పబ్లిక్/ప్రవేట్ రంగం లో ఎన్రోలేమేంట్ మారుతున్నది.
• ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర మరియు తమిళ్ నాడు రాష్ట్రాలలో ఎక్కువ సంఖ్య లో కాలేజి లు కలవు. వాటితరువత స్థానం యు.పి. గుజరాత్ లది. అలాగే ఈ రాష్ట్రాలలో ఎక్కువ సంఖ్య లో ప్రవేట్ కాలేజి లు కలవు.
• అక్రిడిటేషన్ కౌన్సిల్ మరియు నేషనల్ అసెస్మెంట్(NAAC-నాక్) నిర్వహించిన సర్వే 70% ప్రకారం 70% విశ్వవిద్యాలయాలు మరియు 90% కళాశాలలు తక్కువ విద్యా ప్రమాణాలు కలిగి ఉన్నాయి.
• ఉన్నత విద్యాసంస్థలు అందించే విద్య నాణ్యత తీవ్ర ఆందోళన కలిగించే విషయంగా ఉంది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (NAAC) 140 విశ్వవిద్యాలయాలకు అక్రిడేషన్ ఇచ్చింది మరియు వాటిలో కేవలం A గ్రేడ్ కేవలం 32% విశ్వవిద్యాలయాలకు దక్కింది. NAAC చేత అక్రిడేషన్ పొందిన 2,780 కళాశాలల్లో కేవలం 9%కు మాత్రమే A గ్రేడ్ లబించినది.
• అక్రిడేషణ్ పొందిన, విశ్వవిద్యాలయాలలో 68 శాతం విశ్వవిద్యాలయాలు మరియు 91 శాతం కళాశాలలు NAAC పారమీటర్స్ ప్రకారం సగటు(Avarege) లేదా సగటు క్రింద(below Avarege) గ్రేడింగ్ పొందినవి.
• దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు ఐదేళ్లలో కనీసం ఒకసారి వారి జాతీయ విద్యాప్రణాళిక (national curriculum) ను సవరించు తున్నాయి.
ఉన్నత విద్య వ్యవస్థ -సవాళ్లు (CHALLENGES
• ప్రభుత్వం ప్రజలకు విద్యఅందించడం తో పాటు మరింత ముఖ్యంగా నాణ్యమైన విద్యను అందించాలి. దానికి ప్రజల/ప్రబుత్వ ఆలోచనా రీతులలో మార్పు, వినూత్న మరియు తక్షణ విధానాలు, జోక్యాలు అవసరం.
• భారతదేశం యొక్క విద్యా వ్యవస్థ సంక్షోభం పూర్తిగా మన స్వయంకృతo. ఇంకా ఈ సంక్షోభం ను సరిచేసేందుకు సమగ్ర ప్రాధమిక నిర్మాణాత్మక అడ్డంకులను తొలగించ వలసి ఉంటుంది.
• ప్రస్తుత మన సామాజిక వ్యవస్థ ప్రపంచం లో నిరంతరం మారే మార్కెట్ అవసరాలను, ప్రపంచీకరణతో పాటు మారే వినియోగదారు ఆకాంక్షలు, మారుతున్న కొత్త టెక్నాలజీలు, విద్యా పాత్రను పునర్నిర్వచించ వలసిన అవసరాన్ని తెలుపుతున్నాయి .
• మార్పు కోసంమంచి వాతావరణాన్ని సృష్టించడానికి ముందు ముఖ్యమైన మౌలిక సదుపాయాలను అందించాలి. దీనికి ముఖ్యమైన అవరోధాలు మూడు ఉన్నవి.
• మొదటిది, భారతదేశం 2020 నాటికి 30 శాతం స్థూల నమోదు రేటు లక్ష్యంను పూర్తి చేసిన ఇంకా 100 మిలియన్ అర్హతగల విద్యార్ధులకు విశ్వవిద్యాలయాలలో ప్రవేశం లేదు దాని వలన వారు తమకు ఇష్టం లేని కోర్స్ లో బలవంతంగా చేరవచ్చు లేదా ఎంచుకోవచ్చు.
• రెండవది అర్హత కలిగిన ఉపాధ్యాయులు తీవ్ర కొరత ఉంది. ఈ సమస్య ఉన్నత విద్యతో బాటు ప్రాధమిక మరియు ఉన్నత పాఠశాల దశ కు కూడా విస్తరించినది. దీనివలన మౌలిక సదుపాయాలు కూడా కూలిపోవడం జరుగుతుంది.
• విద్యా సంస్థల పనితీరును మెరుగుపరచడం కోసం విద్య విధానం మరియు దాని నిర్వహణ లో సమగ్రంగా సంస్కరణలు అవసరం. విద్య వ్యవస్థ పనితీరును సామర్థ్యాలను మెరుగు పరచకుండా ఎటువంటి సంస్కరణల వలన లాభం లేదు. అసలు ఎంత మంది మన ఉపాధ్యాయులు ఉదాహరణకు తాజా సాహిత్యం లేదా బోధనా పద్ధతుల లో నవీనమైన శిక్షణ పొందుతున్నారు? మెరుగైన పనితీరు ప్రదర్శిస్తున్నారు?
• నాలుగు ముఖ్యమైన సవాళ్లను విద్యా వ్యవస్థ ప్రధానంగా ఎదుర్కొంటున్నది : ఇంటర్నెట్ విప్లవం; డిమాండ్ మేరకు విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల లభ్యత; క్షిణ సంఖ్య లో సమర్ధ ఉపాద్యాయుల అందుబాటు, నూతన సాంకేతికతల ఆవిర్భావం మరియు నిరంతరం కొత్త డిమాండ్లను ఉంచే మార్కెట్ విధానం.
• 2020 నాటికి, భారతదేశం లో 1,000 కొత్త విశ్వవిద్యాలయాల అవసరం ఉంది అని అంచనా. చైనా లో కూడా ఇదే పరిస్థితి ఉంది.
• మార్కు లే ప్రధానం(Score
is All That Matters): మార్క్స్(Marks) కు విద్యా వ్యవస్థలో ప్రధాన ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. మార్క్స్ ద్వారా వ్యక్తి యొక్క జ్ఞానం నిర్ధారించడం ఉత్తమ ప్రమాణం అని భావిస్తారు. ప్రతి ఒక్కరూ మంచి మార్కులు కావాలని వారు వాటిని పొందడానికి ఎ పని అయినా చేస్తారు. మార్కెట్ లో పుస్తకాలు లేదా మార్గదర్శకాలు(గైడ్స్) మంచి మార్కులు సాదిoచడానికి అందుబాటులో ఉన్నాయి. అవి విజ్ఞానం అందిచటం లేదు కేవలం పరీక్ష పాస్అగుటకు అవసరమైన కనీస సమాచారాన్ని అందిస్తున్నవి. అందువల్ల నిపుణులు కాలం చెల్లిన పరీక్ష పద్ధతి మార్చమని డిమాండ్ చేస్తున్నారు.
• విద్య ఒక బిజినెస్
Education is a Business: విద్య రంగం లో కార్పోరేట్ రంగ ప్రవేశం తో ఈ రోజుల్లో విద్య చాలా ఖర్చు తో కూడినదిగా మారింది. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు విద్య లో పోటీ ని అదిగమించేందుకు ప్రైవేటు ట్యూషన్లు మరియు శిక్షణను ఆశ్రయిస్తున్నారు పాఠశాలలకు వచ్చే పిల్లలు చాలా పేద కుటుంబాలకు చెందినవారు. ఈ విద్యార్ధులు భారీ ట్యూషన్ ఫీజుల భరించలేని వారు మరియు ఇంట్లో అభ్యాసం కు తగిన వాతావరణాన్ని అలాగే అవసరమైన మౌలిక సదుపాయాలను కలిగి లేరు. చాలా మంది విద్యార్ధులు సహేతుక అధిక నాణ్యత గల విద్యాబ్యాసం కొనసాగించేందుకు తగిన ఆర్థిక బలం లేకపోవడం వంటి సమస్యను ఎదుర్కొంటున్నారు.
• రీసెర్చ్: అమెరికా ప్రస్తుతం సైన్స్ మరియు ఇంజనీరింగ్ వ్యాసాల మొత్తం ప్రపంచo యొక్క ప్రచురణ లో మూడో వంతు వాటాను కలిగి ఉంది. భారతదేశం, దీనికి విరుద్ధంగా 3% కన్నా తక్కువ ప్రచురితమైన పరిశోధన పత్రాలను మరియు 1% అనులేఖనాల (citations) వాటాను కలిగి ఉంది. భారతదేశం లో పరిశోధనా వాతావరణం మరియు సౌకర్యాలు, సంస్థలు మరియు కళాశాలల్లో అందుబాటులో లేవు.
• అసమర్థ పర్యవేక్షణ (Ineffective
Monitoring): ఉన్నత విద్య కు క్రమం తప్పకుండ తనిఖీలు మరియు నియంత్రణ సంస్థల నుండి నిరంతర పర్యవేక్షణ అవసరం. మన దేశం లో ఒకసారి ఉపాధ్యాయులకు ఉద్యోగం వచ్చిన తరువాత వారిపై నాణ్యమైన విద్యను అందించడంలో ఎటువంటి పర్యవేక్షణ మరియు వారి పనితీరు కొలిచేందుకు సూచికలు,అందుకు తగిన పారామిటరులు లేవు . దీనివలన ఉన్నత విద్యలో తీవ్రమైన అస్థిరత/అసమర్ధత నెలకొని ఉంది.
• అవినీతి (Corruption): విద్య నాణ్యత తీవ్రంగా దెబ్బతినటానికి ప్రధాన కారణం అవినీతి అని చెప్పవచ్చు. దాని వలన పేలవమైన పని తీరు ప్రదర్శించే పాఠశాలలు మరియు కళాశాలలు బయట పడుచున్నవి. ఇటీవల విడుదల అయిన విద్యలో అవినీతిపై అధ్యయనం చేసిన UNESCO
యొక్క ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశం లో 25% ఉపాధ్యాయుల గైరు హాజరు ప్రపంచంలో అత్యధికమని అని చెప్పింది.
• భారతదేశం లో ప్రభుత్వం అధికారం మరియు పెరుగుతున్నఇతర ఏజన్సీల నియంత్రణ విద్యా వ్యవస్థ యొక్క ప్రమాణాలను తగ్గించింది మరియు అవినీతి కి దారితీసింది
• మాస్ కాపీ పరీక్షా కేంద్రాలు (Mass Copy Exam Centers): భారత విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న మరొక ప్రధాన సమస్య పరీక్షలలో విద్యార్ధులు నకలు/కాపి కి పాల్పడుట. స్టూడెంట్స్ వాదన ప్రకారం కాపీ మరియు పరీక్షల లో మోసం (చిటింగ్) వారి సంప్రదాయ హక్కు. పలు సంస్థలు, కళాశాలలు మరియు పాఠశాలలలో నకలు లేదా చీటింగ్ బాగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలు, కళాశాలలు 10 వ మరియు 12 వ బోర్డ్ పరీక్షలలో మాస్ కాపీ కేంద్రాలుగా అయారు అయినవి.
• Lack of skills :
భారత దేశ ఎం.బి.ఏ.(MBA) లు ఎందుకు పనికి రావు. నాలుగు లక్షల యబ్బై వేల వాణిజ్య సంస్థలకు ప్రాతినిద్యం వహించే అసోసియేటెడ్ చాంబర్స్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రి అఫ్ ఇండియా (Assocham) వారు నిర్వహించిన అధ్యయనం ప్రకారం భారత దేశ బిజినస్ స్కూల్స్ నుంచి ఉత్తీర్ణులు అయ్యే గ్రాడ్యుయేట్ లలో కేవలం 7% మంది మాత్రమే నిజానికి ఉద్యోగానికి అర్హులు.
• విద్య కాషాయికరణ: విద్య నాణ్యత తీవ్రంగా తగ్గటానికి కారణంగా విద్యా కాషాయకరణగా పేర్కొన వచ్చును. ప్రస్తుత ప్రభుత్వం తప్పుడు సమాచారం తో పాఠ్యపుస్తకాలలో మార్పులు/సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తున్నది. స్మృతి ఇరానీ (ఎక్స్-హెచ్ఆర్డి మంత్రి) బహిరంగంగా పురాతన హిందూ గ్రంధాలు పాఠశాల పాఠ్య ప్రణాళికలో చేరుస్తామని ప్రకటించారు. ఎన్సిఇఆర్టి(NCERT) పాఠ్యపుస్తకాలు సంఘ్ లక్ష్యాల ప్రకారం తిరిగి రాయడం జరుగుతున్నది.
పరిష్కారాలు (SOLUTIONS) :
• అర్హులైన ఉపాధ్యాయులు
Competent Teachers నియామకం : అధ్యాపకులు కు జీవం కాబట్టి వారి నాణ్యత కాలేజి మెరుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తుంది. అధ్యాపకుల యోగ్యత మరియు వారి ప్రేరణ విద్యారంగంలో నాణ్యత పెంచడానికి కీలకం. ఉత్సాహభరితమైన మరియు శక్తివంతమైన అధ్యాపకులను మెరిట్ ప్రాతిపదికన నియమించాలి. అద్యాపకులకు చైతన్యపరచటంలో జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో గురువు వంటి అవార్డ్లు వలే అద్యాపకులకు జిల్లా స్థాయి లో కూడా అవార్డులు ఇవ్వాలి. శిక్షణ మరియు ప్రొఫెషనల్ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడం అoదరు అధ్యాపకులకు తప్పనిసరి చేయాలి. ఉత్తమ ప్రతిభ కలవారు అధ్యాపక వృత్తి లో చేరుటకు ప్రోత్సహించాలి. వృత్తిపరమైన అభివృద్ధి తో పాటు స్వీయ మూల్యాంకనం, నైతిక విలువలు మరియు నిరంతర అభ్యాసం ఎల్లప్పుడూ అద్యాపకుల నుండి ఆశించాలి.
• ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Information Technology): అంతర్జాల ఉపయోగం మరియు డిజిటల్ కనెక్టివిటీ విస్తరిస్తున్న ఈ సమయం లో మనము లైబ్రరీలను సందర్శించవలసిన అవసరం లేదు కావలసిన సమాచారం కేవలం బటన్ క్లిక్ తో అందుబాటులో ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్యార్ధులు వివిధ భావనలు అర్థం చేసుకోవడానికి ఒక మంచి సాధనం.
• భోధన మరియు పరీక్ష సంస్కరణలు
Curricular and Examination Reforms: కరిక్యులం లో మార్పులు లెర్నింగ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి తో విద్య యొక్క అన్ని స్థాయిలలో రూపొందించాలి. సగటున అత్యధిక భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఎనిమిది నుంచి పది సంవత్సరాలలో ఒకసారి మాత్రమే వారి కరిక్యులం సవరించబడుతుంది. కానీ వారు కరిక్యులం మార్పు ప్రాధాన్యత తెలుసుకున్నప్పుడు అది చాలా ఆలస్యం అవుతుంది. పరీక్షలు విస్తృత అవగాహన, గ్రహణశక్తి మరియు పరిష్కరించే నైపుణ్యాలను అధిక స్థితి లో ప్రాబ్లం సాల్వింగ్ సామర్థ్యం పరీక్షించడానికి రూపొందించ బడును. క్లిష్టమైన ఆలోచనా విధానం కు ప్రోత్సాహం ఇవ్వాలి.
• ఎడ్యుకేషన్ పిల్లల బహుముఖ అభివృద్ధి (భౌతిక, సామాజిక-మానసిక) కి తోడ్పడును కాబట్టి అందువలన అన్ని అంశాలను పరిగణలోనికి (కేవలం అకడెమిక్ అచీవ్మెంట్ కాకుండా) తీసుకోవాలి. పిల్లల సంపూర్ణ అభివృద్ధి పై ద్రుష్టి పెట్టాలి. ఒక ఆరోగ్యవంతమైన బిడ్డ మాత్రమె మెరుగైన అబ్యాసన చేయగలడు. పిల్లలు పెద్ద సంఖ్యలో పోషకాహార లోపం మరియు రక్తహీనత కలిగి ఉండటం కూడా అబ్యాసన దృష్ట్యా ఆందోళన కలిగించే విషయం.
• జవాబుదారీ
Accountability: జాతీయ, ప్రాంతీయ మరియు స్థానిక స్థాయిలో విద్యా సంబంధ పాలన నిర్మాణాలు బలోపేతం చేయ్యాలి. విద్యా సంబంధ నిర్వహణ కోసం ఒక జవాబు దారి వ్యవస్థ యొక్క నిర్మాణం చేయాలి.
• ప్రిన్సిపాల్ ఎంపిక
Selection of Principal: నేడు, దురదృష్టవశాత్తు పాఠశాల వ్యవస్థ ప్రధానంగా సీనియారిటీ ఆధారంగా ప్రధానోపాధ్యాయులు నియమిస్తుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మెరిట్ ఆధారంగా నియమించే ప్రక్రియ అవసరం. పరిపాలనా విధులు మరియు పెద్ద నాయకత్వ పాత్రలు చేపట్టడానికి అవసమైన నైపుణ్యాలు ప్రిన్సిపల్స్ లేదా సంస్థల నిర్వాహకులకు ఉండటం చాలా ఆవసరం మరియు తప్పనిసరి.
డిస్టన్స్ లెర్నింగ్ Distance Learning: ఓపెన్ స్కూలింగ్ సౌకర్యాలు విస్తరిoచబడాలి. వీక్లీ తరగతులు, పరీక్ష మరియు టు-వే చర్చలు దూరవిద్య కార్యక్రమం యొక్క పెంచాలి
• ఫ్రెండ్లీ శిక్షణ
Friendly Learning: సెకండరి బోర్డ్ పరీక్షలలో బాగా ఒత్తిడితో ఆత్మహత్య చేసుకొనే విద్యార్థుల సంఖ్య భయంకరంగా పెరుగుతోంది. ఆరోగ్యకరమైన వాతావరణం లో స్నేహపూర్వక జ్ఞానార్జన భావన విద్యార్థులలో ఆత్మహత్య ధోరణి అధిగమించడానికి తోడ్పడు తుంది. సమాచార-ఆధారిత విద్యా వ్యవస్థ నుండి మంచి నైతిక విలువ ఆధారిత విద్యా వ్యవస్థకు మారవలసిన అవసరం ఎంతైనా ఉంది. క్రీడలు, కళలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు వంటి వాటికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి.
• ప్రపంచ స్థాయి అంతర్జాతీయ ప్రొవైడర్లు,ఆన్లైన్ టెక్నాలజీ సంస్థలను మరియు MOOCs (భారీ ఓపెన్ ఆన్లైన్ కోర్సుల) వేదికలు, విర్చువల్ అభ్యసన(virtual
learning) సహా ద్వారా భారతీయ విద్యవ్యవస్థ ను సమూలంగా మార్చవచ్చు.
• ఈ సందర్భంలో ఒక మాట గుర్తుంచుకోవాలి 1990 లో దేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశ పెట్టినప్పడు దేశీయ వ్యాపార వర్గాలనుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వారి వ్యాపారాల మనుగడకు ముప్పు గా సంస్కరణలను భావించారు.
• భారత ప్రభుత్వం కొత్త విద్యా సంస్థల ఏర్పాటుకు బదులు తన విద్యార్ధులకు విదేశీ విద్యకు భారీ గా నిధులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించినది. (More
Over Seas Scholarships & Bank loans etc.,) ఈ కొత్త ప్రక్రియ విశ్వవిద్యాలయాలు తెరిచే కన్నా ఆర్థికంగా మరియు పాలనాపరంగా ఎంతో సమర్థవంతమైనదిగా నిరూపించబడింది. అదనంగా విదేశాలలో అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా ఆలోచించడం(గ్లోబల్ థింకింగ్) కు దారితీసినది మరియు గేమ్-చెంజర్ గా నిరూపించబడింది.
• ముగింపు:
• సృజనాత్మకత తో కూడిన చదువు(skill based education) ఒరిజినల్ ఆలోచన తో కూడిన రీసెర్చ్ మరియు కల్పన (original
thinking research and innovation) మంచి అర్హతలతో కూడిన ఆధ్యాపకులు, ఆచరణాత్మక జ్ఞానం, విద్య కోసం భారీ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమలు (Implement
massive technology infrastructure for education), విద్యా వ్యవస్థ యొక్క ప్రయోజనం పునర్: నిర్వచించడం, సరళతరమైన నిబంధనలు మరియు రిజర్వేషన్ల కు ప్రాధాన్యం ఇవ్వకుoడుట.
• విద్యా రంగంలో భారతదేశం ఎదుర్కొంతున్న సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి అందుబాటులో ఉన్న అన్నిరకాల వనరులను ఉపయోగించుకోవలసిన అవసరo ఉంది. భారత ప్రభుత్వం ప్రస్తత విద్యా విధానం యొక్క DNAను పూర్తిగా మార్చటానికి అవసరమైన ఒక అపూర్వ అవకాశం ను ఉపయోగించుకోక పోతే చరిత్ర క్షమించదు. భవిష్యత్తు/విజయం అవకాసం అంది పుచ్చుకోనే వారితోనే ఉంటుంది.
No comments:
Post a Comment