26 September 2016

విలువల ఆధారిత పెంపకం (Value-Based Parenting)





భారతదేశ  పిల్లలకు  వేల సంవత్సరాలు గా బొదిస్తున్న నైతిక విలువలు ఏమై పోయినవి? తల్లిదండ్రులు, తాతలు, అన్నలు-అక్కలు, మరియు కుటుంబం సభ్యులు మరియు ముఖ్యంగా   పెద్దల పట్ల చూపే గౌరవవిలువలు, మర్యాద, నిస్వార్ధo, సహాయం, ప్రేమ మరియు వినయం, దయ, మొదలగు సద్గుణాలు ఎమైపొయినవి?

అంతర్గత శాంతి, ఇతరులతో మంచి ఆరోగ్యకరమైన సంబంధాలను నిర్వహించడానికి మరియు అనవసరమైన వివాదాలు నివారించడానికి కావసిన సుగుణాలు ఈ నాడు పిల్లలలో లోపించినవి. అంతర్గత శాంతి మరియు సహకార భావన మొదలగు మంచి లక్షణాలను మరియు  మంచి విలువలు పాటించడం నేడు మనము పిల్లలకు  ప్రారంభ వయస్సు నుండి నేర్పుట తప్పని సరి అయింది.

చిన్న పిల్లలకు నైతిక మరియు ఆధ్యాత్మిక విలువలను నేర్పే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ  కనుమరుగవడంతో తరచుగా వారి జీవితాల్లో చాలా ముఖ్యమైన అవసరం అయిన వ్యక్తిత్వ వికాసంను  పూరించడానికి ఎవరు లేరు. ప్రస్తుత తల్లిదండ్రుల తరం, వారి తల్లిదండ్రులు ఎప్పుడూ ఊహించిన దాని కంటే ఎక్కువ ఉన్నత విద్య అబ్యసించి మరియు మంచి ఉద్యోగాలను చేస్తూ   అదృష్టంవంతులై  ఉన్నారు. వారు తమ  పిల్లలు అడిగిన  వస్తువులను అందించేoదుకు సిద్దం గా ఉన్నారు.

నేడు తల్లిదండ్రులు తమ  పనిలో తాము మునిగి ఉన్నారు  మరియు వారి పిల్లలపై  మీడియా ప్రభావం ఎక్కువ ఉన్నది. దాని ప్రభావంతో  - చెడు భాష, తక్కువ మరియు  రెచ్చగొట్టే దుస్తులు,  లైంగిక సూచనాత్మక నృత్య కార్యక్రమాలు, హింసాత్మక వీడియోలు, సినిమాలు మరియు పాటలు, డ్రగ్స్  మొదలైన వాటికి పిల్లలు  ప్రభావితం అవుతున్నారు మరియు   అనైతిక పనులు నేడు  పిల్లలు నేర్చుకోవడం జరుగుతుంది.

తమ పిల్లల  మీద  తల్లిదండ్రులకు  పర్యవేక్షణ లేదు. వారు ఎ పనులను చేస్తున్నారు? వారి స్నేహితులు ఎలాంటివారు? వారు తమ సమయాన్ని ఎక్కడ గడుపు తున్నారు? అనే దాని పై తల్లితండ్రులకు సరిఅయిన పర్యవేక్షణ  లేదు. ప్రస్తుతరం పిల్లలకు టీవీ, వీడియో గేమ్స్ మరియు సాంఘిక మీడియా కాలక్షేప సాధనాలు అయినవి. తల్లితండ్రుల పర్యవేక్షణ పూర్తిగా కోరబడిన కాలం లో పిల్లలు సహజంగా అవాoఛనియమైన పనులకు, అనైతిక విలువలకు, చెడు సావాసాలకు   అలవాటు బడుతున్నారు.

మొత్తం 30 సంవత్సరాలకు పై బడిన నా అధ్యాపక వృత్తి మరియు విద్యార్ధుల కౌన్సిలర్ గా విద్యార్ధులలో నైతిక విలువలు సన్నగిల్లటం కొన్నిసంవత్సరాలుగా గమనిస్తున్నాను. ప్రస్తుత తరం విద్యార్ధుల తల్లితండ్రులకు నేను విద్య బోధించాను. అద్యాపకుని మాట జవదాటటము, పెద్దలను అగౌరవ పరచటము, పరుష శబ్దాలను, అశ్లీల పదాలను వాడటము ఆనాటి విద్యార్ధులలో అనగా   నేటి విద్యార్ధుల తల్లితండ్రులలో నేను గమనించలేదు.

నేటి తరం విద్యార్ధుల తల్లితండ్రులను వారి పిల్లల అనాగరిక ప్రవర్తన మరియు విద్యాస్థితి గురించి వివరించడానికి పిలిచినప్పుడు వారి నుంచి వచ్చే సమాధానం కడు నిరాశజనకం గా ఉంటుంది. కొందరు తల్లితండ్రులు తమ పిల్లలను మందలించలేక ఉపాద్యాయునితో “మా పిల్లలను వదిలి వేయండి, వాడి ఇష్టం వచ్చినట్లు చేయనియండి, వాడు సంతోషం గా ఉండనీయండి” అనే సమాధానo ఇస్తున్నారు.
   
ఈ మాటలు విద్య,వినయం, శీలం, క్రమశిక్షణ నేర్చిన ఆ నాటి తరం  విద్యార్ధులు అనగా నేటి విద్యార్ధుల తల్లితండ్రుల నోటి వెంట రావడము మిక్కిలి ఆశ్చర్యాన్ని కలుగచేస్తుంది. వారు ఎందుకు తమ పిల్లల చెడు ప్రవర్తనను సహించు చున్నారు? తమ మౌనం తమ పిల్లల భవిషత్తును  పాడు చేస్తుంది అని తెలిసి కూడా ఎందుకు సహించు చున్నారు?

ప్రపంచానికి ఒక బిడ్డను పరిచయం చేసేటప్పుడు, తల్లిదండ్రులు మర్యాదపూర్వకమైన, గౌరవప్రదమైన, బాధ్యతగల  పౌరులుగా వారిని పెంచాలి మరియు ఆ బాధ్యత చాలా చిన్న వయస్సు నుండి ప్రారంభం చేయాలి. పిల్లలకి అందరు పెద్దల పట్ల, అలాగే వారి స్నేహితుల పట్ల మర్యాద గా ప్రవర్తించటం నేర్పాలి. ముందు స్కూల్ లో వారి ఉపాధ్యాయులు, సహ విద్యార్ధులు తరువాత జీవితంలో వారి యజమానులు, సహచరులు, జీవిత భాగస్వాములు మరియు సమాజం పట్ల ఆదరంగా, ప్రేమతో  ప్రవర్తించడం నేర్పాలి. పిల్లలు తమ తల్లిదండ్రుల నిజమైన వారసత్వానికి చిహ్నాలు కాబట్టి వారిలో మంచి విలువలు అభివృద్ధి చేయాలి. అది తమ కుటుంభ వారసత్వాన్ని తమ తల్లితండ్రుల కిర్తిప్రతిస్థలు పెంపొందించేదిగా ఉండాలి.

ఒక మంచి పిల్లల పెంపకం కు  షరతులు లేని  ప్రేమ, సమయం, ఓర్పు మరియు సరిఅయిన మార్గదర్శకత్వం కావలి.  డబ్బు మరియు విలాస వస్తువులు కాదు. పిల్లలు తమ తలితండ్రుల ప్రేమ, సమయం మరియు మార్గదర్సకత్వం కోరుకొంటున్నారు.  డబ్బు మరియు వస్తువులు రావచ్చు పోవచ్చు కాని జీవితాంతం నిలిచిఉండేవి మంచి విలువలు మరియు క్యారెక్టర్ (చరిత్ర).
తల్లితండ్రులతో ఆనందం తో గడిపిన వారాంతాపు సెలవు దినాలు, తల్లితండ్రుల నేర్పిన సరియిన మార్గం, పిల్లల మనస్సులో కొన్ని జీవిత పాఠాలు నేర్పుతుంది.    ఆ ఆనందకరమైన క్షణాలను, అనుభూతులను, సుఖదుఖాలను,  ఆహ్లాదకరమైన పరిస్థితులను విద్యార్ధులు ఎన్నటికి మరవలేరు వాటినుంచి కొత్తకొత్త జీవిత పాఠాలను నేర్చుకొంటారు.


ఈ వ్యాసం చదివిన వారు ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఎ విధంగా పెంచుతున్నారో విశ్లేషించమని  ప్రార్ధిస్తున్నాను. వారు తమ సమయం మరియు దృష్టిని పిల్లలకి పూర్తిగా కేటాయిస్తున్నారా? నిస్వార్థoగా ఉండటం, ఇతరుల భాదలను పంచుకోవటం మున్నగు మంచి లక్షణాలను తమ పిల్లలకు బోధిస్తున్నారా? వారికీ  కావలసినది అందిస్తున్నారా? మంచిది కాని దానికి వద్దు అనడం నేర్పిస్తున్నారా? ప్రతిది తమకే లబించాలి అనేది కాకుండా వంతుల వారిగా పొందటం నేర్పుతున్నారా?  వైఫల్యం మరియు నిరాశ ను ఎదుర్కోవటం ఎలానో నేర్పుతున్నారా? జీవితం లో ఎదురు అయ్యే అటుపోటులను తట్టుకోవడం నేర్పుతున్నారా? కష్టాలలో మన:శాంతి కోల్పోకుండా ఉండటం, వాటిని ధైర్యంగా ఎదుర్కోవటం నేర్పుతున్నారా?  గమనించండి.

కాబట్టి  మీ పిల్లలు  మరియు సమాజం కు మేలు చేయండి.  మీ పిల్లలను మంచివారిగా  పెంచి ప్రయోజకులుగా తీర్చిద్దిద్దండి. సమాజానికి అవసరమైన మంచి నాగరికులుగా తిర్చిదిద్దండి. మీ పేరు ప్రతిస్థలను  పెంచి సమాజం లోని ఇతరులకు ఆదర్సనియులుగా  ఒక బహుమతిగా రూపొందించండి. 


No comments:

Post a Comment