1 October 2016

దివ్య ఖురాన్ అద్భుతం


అవి రష్యా లో కమ్యూనిజం ఉచ్చ దశలో ఉన్న రోజులు. ఆసియా అంతా మరియు   ప్రపంచం కూడా త్వరలో ఎర్రగా మారిపోతుందా అని బయపడిన  రోజులు!.రష్యా లో మతం, మత గ్రంధాలు నిషేదింప బడిన రోజులు. ఆ రోజుల్లో ఒక భారతీయ ముస్లిం ప్రభుత్వ పనిమీద రష్యా కు శిక్షణ నిమిత్తం వెళ్ళాడు.

ఇది అతని కధ.  అతని మాటలలో

శుక్రవారం జుమ్మా ప్రార్థన కోసం  వెళదాము సిద్దంగా ఉండమని నేను నా స్నేహితులను అడిగాను. వారన్నారు ఈ దేశంలో మసీదులు గో-డౌన్లుగా మారుతున్నాయి, కొన్ని మసీదులు పర్యాటకుల కోసం మోటెల్ గా మార్చబడినవి. ఈ మాస్కో నగరం లో కేవలం ఒకటి లేదా రెండు మసీదులు మాత్రమేపేరుకు ఖాళిగా  ఉంచబడ్డాయి. అవికూడా ఎక్కువ సమయం మూసి ఉంటాయి ఆని అన్నారు.

అయితే నాకు మస్జిద్ కు దారి చూపమని నేను  అడిగాను.దారిచూపగా నేను సమీపం లో ఉన్న  మూతపడిన ఒక మస్జిద్ వద్దకు చేరాను. మస్జిద్ పొరుగున ఉన్న వ్యక్తి వద్ద తాళం ఉంది. అతనిని   ప్రార్ధన కోసం మస్జిద్  తెరవమని అడిగాను.

పొరుగు వాడు మస్జిద్ తెరుస్తాను, కాని ఆ తరువాత జరిగే పరిణామాలకు నీవు బాద్యత వహిoచాలి అన్నాడు. సరే, సోదరా, నేను భారతీయ ముస్లింను. భారత దేశం లో నేను ముస్లింను, మాస్కో లో  కూడా ముస్లిం గా ఉంటాను. భారత దేశం లో నమాజ్  చేస్తాను, ఇక్కడ కూడా నమాజ్ చేస్తాను!భారత ప్రభుత్వ ప్రభుత్వోద్యోగిని, పరిణామాల సంగతీ తరువాత చూసుకొందాము?అని అన్నాను.

మస్జిద్ తెరవబడినది. మస్జిద్ అంతా అపరిశుబ్రంగా ఉంది. త్వరగా మస్జిద్ శుబ్రం చేసి నమాజ్ కు బిగ్గరగా అజాన్ ఇచ్చాను. చాలా మంది ముసలివారు, పిల్లలు మస్జిద్ ముందు గుమికూడారు కాని ఎవరు లోనికి రావటానికి ధైర్యం చేయుట లేదు. సమూహా ప్రార్ధన కు బదులు నేను   ఒంటరిగా నమాజ్ చదివాను. అదేవిధంగా  జోహార్ (మద్యాన్న) నమాజ్ పూర్త చేసి మస్జిద్ బయటకు వచ్చాను. బయట ఉన్నవారు  అంతా ఆశ్చర్యం తో జరగరానిది ఎదో జరిగినట్లు చూస్తున్నారు!

ఒక పిల్ల్లవాడు ముందుకు వచ్చి నన్ను తన ఇంటికి టీ కి ఆహ్వానించాడు. అతని అమాయకమైన వదనం, పిలిచిన విధానం ఆకర్షించి నేను సరే అని అతని ఇంటికి వెళ్ళాను. ఇంట్లో వారు అమిత సంతోషం తో రకరకాల స్వీట్స్, హాట్లు, భోజన పదార్ధాలు  నా  ముందు ఉంచారు. నేను  వారి విందు ఆరగించి టీ తీసుకొంటూ నీకు ఖురాన్ వచ్చా? చదవ గలుగుతావా? అని ఆ బాలకుడిని ప్రశ్నించాను.

ఆ బాలకుడు నాకు ఖురాన్  వచ్చు అని పలుకగా, నేను  నా  ప్యాకెట్ లోని చిన్న సైజు ఖురాన్ తీసి ఒక ఆయత్ చూపించి  చదవమన్నాను. ఆ బాలకుడు నావైపు, ఖురాన్ వైపు, అతని తల్లితండ్రుల వైపు చూస్తు  సంకోచిస్తు  నిలబడినాడు. అతనికి  రాదు అనుకోని నేను ఆ  ఆయత్ ను చదవ సాగాను.يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا قُوا أَنْفُسَكُمْ وَأَهْلِيكُمْ

ఆశ్చర్యంగా ఆ బాలకుడి నాతో బాటు ఆ ఆయత్ ను వల్లించ సాగినాడు. ఖురాన్ చూడకుండా అతను ఆ  ఆయత్ ను వల్లించ సాగినాడు.  నేను ఆశ్చర్యం తో ఏమిటి ఇది! అని ఆ బాలకుడి తల్లితండ్రులను అడిగిను?వారు చిరునవ్వు తో “ ఇక్కడ ఖురాన్ పఠనం నిషేదింప బడినది. ఎవరైనా  ఖురాన్ ప్రతి  తో పట్టుబడితే అతనితో పాటు అతని కుటుంభం జైలు పాలు అవుతుంది. అందుకని మేము ఖురాన్ ఇంట్లో బెట్టము” అని అన్నారు.

ఎవరివద్దా ఖురాన్ కాపి లేకపోతే అతను ఎలా ఖురాన్ కంఠతా: వల్లిస్తున్నాడు? అని ఆశ్చర్యంతో అడిగాను?.

మా దగ్గిర పూర్వం అనేక మంది హాఫిజ్ లు ఉన్నారు.కానీ వారు మత,మతగ్రంధాల  నిషేధం తో వివిధ పనులు చేస్తున్నారు. కొందరు టైలర్ గా,  మరికొందరు వ్యవసాయo చేస్తూ, కొందరు కూరగాయలు అమ్ముతున్నారు. మేము మా పిల్లలను వారి దగ్గిరకు ఎదో ఒక పని మీద పంపుతాము. పిల్లలు పని తో బాటు దివ్య కొరాన్ కంఠతా: పడతారు. వారికి ఖురాన్  అంతా కంఠతా:వచ్చు.

మా వద్ద దివ్య ఖురాన్  కాపీలు లేవు. కాని ఇక్కడ ఉన్న కుటుంబాలలోఅందరు  పిల్లలకు దివ్య ఖురాన్  కంఠతా:వచ్చు, ప్రతి కుటుంభం లో హఫిజ్లు ఉన్నారు.అందుకే మీరు చదవన్నప్పుడు చదవలేక పోయారు కాని మీరు ఖురాన్ పఠoచగానే అతనుమీతో బాటు  కంఠస్థం  చేయడం ప్రారంబించి నాడు. అతనికి మొత్తం సురా వచ్చు కావాలంటే మొత్తం దివ్య కొరాన్ అప్పచేబుతాడు అని అన్నారు.

నేను ఆ రోజు ఒకటి కాదు అనేక అద్భుతాలు చూసాను. దివ్య ఖురాన్ నిషేదింప సమాజం లో అనేక తరాల వారు తమ పిల్లలకు రహస్యం గా ఖురాన్ పారాయణం నేర్పుతున్నారు. హాఫిజ్ లు అవుతున్నారు. చాలా సంతోషం వేసింది. నేను నా పిల్లలకు ఖురాన్ పారాయణం నేర్పాను వారు కూడా నేడు హఫిజ్లు అయ్యారు.
 
ఆ రోజు నాకు స్వయంగా దివ్య ఖురాన్ లోని ఆ ఆయత్ అర్ధం తెలిసి వచ్చింది.  إِنَّا نَحنُ نَزَّلْنَا الذِّكرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ(దివ్య ఖురాన్ 15:9) “మేము ఈ గ్రంధాన్ని(ఖురాన్) స్వయంగా వెలువరించాము, ఈ గ్రంధ రక్షణ భారం మాదే”

దివ్య ఖురాన్ ను నిషేదించవచ్చు కానీ మనషుల  హృదయాల లో ఉన్నదానిని ఎలా తుడిచివేయగలము!. అదే దివ్య ఖురాన్ అద్భుతం! మహత్యం!.

నేడు మాస్కో నగరం లో  40 లక్షల ముస్లిమ్స్ ఉన్నారు వేల సంఖ్య లో మస్జిద్లు, మదరసాలు ఉన్నాయి. రష్యా లోక్రైస్తవ మతం తరువాత స్థానం ఇస్లాం ది.


మరోసారి రష్యా లో ఇస్లాం మీద వ్యాసం రాస్తాను. సెలవు.


No comments:

Post a Comment