24 October 2016

ఎడ్యు టుబర్స్(EduTubers)


టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇప్పుడు మారింది. ప్రతిబావంతులైన అధ్యాపకులు యు ట్యూబ్ (YouTube) ఛానల్ ద్వారా వేల మంది విద్యార్థులకు అందుబాటులోకి వస్తున్నారు.
“ఉచిత విద్య”   యుగం ప్రారంభమైనది మరియు నాణ్యమైన విద్య అందరికి  సులభంగా అందుబాటులోకి వస్తున్నది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం, మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీ మద్రాస్ తదితర ప్రఖ్యాత సంస్థలు  ప్రతి సంవత్సరం ఉచిత ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నవి. అత్యంత ప్రాచుర్యం గల వీడియో షేరింగ్ వెబ్సైట్లలో ఒకటైన యూ ట్యూబ్ (YouTube), ఈ ప్రయోజనం కోసం ఒక అద్భుతమైన మాధ్యమంగా  నిరూపించబడింది. అనేక ప్రతిభావంతులైన వ్యక్తులు విద్యార్థులకు విజ్ఞానం అందిచడానికి యూ ట్యూబ్ వేదికను  వాడుతున్నారు.

ఎడ్యు టుబర్స్ (EduTubers,)గా పిలువబడే  ఈ వ్యక్తులు సృజనాత్మక వీడియోలను YouTube ఛానెల్ లో ఉచితంగా ప్రవేశపెట్టడం ద్వార  విద్యార్థులను ఆకర్షించు చున్నారు.

గౌరవ్ ముంజాల్, రోమన్ సైనీ, హిమేష్  సింగ్, సచిన్ గుప్తా అనే నలుగురు(చతుష్టయం)  స్థాపించిన ఉనకాడేమి ను  (Unacademy) దీనికి ఉదాహరణను గా  తీసుకోoదాo. ఐదు సంవత్సరాల క్రితం విద్యార్థుల వివిధ విద్యా సమస్యలను పరిష్కరించటం లో సహాయపడే  లక్ష్యంతో మొదలైన ఈ నలుగురు  (చతుష్టయం) కంప్యూటర్ సైన్స్ మరియు జావా వీడియోలను యూ ట్యూబ్ లో  అప్లోడ్ ప్రారంభించారు. "రెండు నెలల తరువాత, వేలాది మంది ఈ వీడియోలను చూడటం మాకు మరింత పని చేయటానికి  ప్రేరణ ఇచ్చింది," అని  గౌరవ్ అంటున్నాడు.

ఉనకాడేమి("Unacademy)  ఇతర ఉపాధ్యాయులకు  కూడా ఒక టీచింగ్ వేదికగా మారింది. 15 మంది తో కూడిన మేము మరియు దేశవ్యాప్తంగా 100 పైగా అధ్యాపకులు మాకు కంటెంట్ (లెసన్స్) తయారీలో సహాయం చేస్తున్నారు అని రోమన్ సైని అన్నాడు. నేడు ఉనకాడేమి (Unacademy) యొక్క యూ ట్యూబ్ (YouTube) ఛానల్ మూడు లక్షల మంది ఎక్కువ  చందాదారులను కలిగి ఉంది. 20 మిలియన్ వ్యూస్ (వ్యూస్) మరియు 729 వీడియోలతో    వైద్య, సివిల్ సర్వీస్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మరియు విదేశీ భాష నిపుణుల సహాయంతో విద్యార్ధుల అవసరాలు తీరుస్తుంది.

అలాగే ఆంగ్ల భాష నేర్చుకోవడం పై దృష్టి ని పెట్టిన  మరొక యూ ట్యూబ్ (YouTube) ఛానెల్  లేఅర్నేక్స్ లేట్ అజ్ టాక్   (Learnex Let’s Talk) యొక్క స్థాపకుడు మరియు సృష్టికర్త ఆకాష్ కదం. అతను ముంబై లో వ్యాపార ఇంగ్లీష్(Business English), వ్యక్తిత్వ వికాసం, ఐఇఎల్టిఎస్(IELTS), TOEFL, నైపుణ్య అభివృద్ధి (skill development) లో శిక్షణ ఇచ్చే ఇచ్చే ఒక సంస్థను నడుపుతున్నాడు.  మేము మా సంస్థ ద్వారా  ప్రతి సంవత్సరం 11,000 మంది విద్యార్థులకు  శిక్షణ ఇస్తున్నాము  మరియు వారికి అదనoగా ఏదో ఇవ్వాలని అనుకొన్నాము అలా YouTube తరగతులు ఆలోచన పుట్టింది. ఇప్పుడు మేము దాదాపు ప్రతి ప్రత్యామ్నాయ రోజు వీడియోలను పోస్ట్ చేస్తున్నాము అని ఆకాష్ వివరిoచాడు.

లేఅర్నేక్స్ (Learnex) వీడియోలు ఎక్కువగా కమ్యునికేటివే ఇంగ్లీష్ కు సంభoదించినవి అనగా ఒక ఉద్యోగ ఇంటర్వ్యూ లో తమనుతాము ఎలా పరిచయం చేసుకోవాలి మరియు ఇంటర్వ్యూ లో అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలి మొదలగునవి. వీడియోలను అనేక ఉదాహరణలు, దృష్టాంతాలతో రుపొందించి వాటిని  ఆసక్తికరమైనవిగా చేయడానికి ప్రయత్నిస్తాము అని అతను అన్నాడు.

అయితే, ప్రేక్షకుల ఆసక్తి  ఆధారంగా వీడియోలను రూపొందించడం లో సవాళ్లు లేకపోలేదు.   "కంటెంట్ సృష్టి సులభం కాదు. స్క్రిప్ట్ రాయడం ఎడిటింగ్ మరియు ప్రేక్షకులు వాటిని ఆదరించేటట్లు రూపొందించడం  ఒక కఠినమైన ప్రక్రియ. అందుకు గాను విభిన్నంగా కొత్త వ్యూహాలు రుపొందిoచ వలసి ఉంటుందని ఆకాష్ చెప్పారు. నిజానికి ఒక విజయవంత  ఛానల్ ఏర్పాటుకు   భారీ బడ్జెట్ అవసరం లేదు. నవీన్ తన YouTube ఛానల్ #crazyNK ద్వారా వ్యర్థo నుండి ఉత్తమాన్ని  బాగా చేసాడు.

"నేను చిన్నప్పుటి నుంచి తీగలు, బ్యాటరీలతో కూడిన గాడ్జెట్లతో ఆసక్తి గా ఆడే వాడిని.  నా చిన్నతనం లో  DIY YouTube వీడియోలను చూసేవాడిని వాటిని చూసిన తరువాత స్వంతంగా నేను వాటిని తయారు చేయగలనని అనిపించినది అని నవీన్ చెప్పారు. అతను గత సంవత్సరం మార్చిలో తన YouTube ఛానల్ ప్రారంభించినాడు. అది  5,90,000 మంది కంటే ఎక్కువ చందాదారులు మరియు 8 మిలియన్ వ్యూస్ తో  # crazyNK యొక్క ప్రజాదరణ స్పష్టమైంది. అతని ఛానెల్లో జనాదరణ పొందిన కొన్ని వీడియోలు హోవర్ బోర్డు, ఒక ప్లాస్టిక్ సీసా ఉపయోగించి  వాక్యూమ్ క్లీనర్  మరియు ఒక పాత CD ఉపయోగించి ఒక స్పీకర్ తయారు చేయుటగా   ఉన్నాయి. అతని వీడియోలు  సరళంగా అత్యద్భుతమైనవిగా హాస్యం తో ఉండును.  "వీడియోలు విద్యార్థులు వారి ప్రాజెక్టుల గురించి  ఆలోచనలు పొందుటకు సహాయపడుతుంది. వారు రోజువారీ వివిధ విషయాలను సరిఅయిన సమయంలో అప్లికేషన్ చేయుట తెల్పుతుందిఅని నవీన్ అంటాడు.

మరో విజయవంతమైన EduTuber ఛానల్ ఎక్జం ఫియర్ (Exam fear) రోష్ని ముఖర్జీ నడుపుతున్నది. ఆమె ఒక ఐటి సంస్థలో ఐదేళ్ల క్రితం  పని చేసినప్పుడు ఒక EduTuber గా ఆమె తన  ప్రయాణం ప్రారంభించింది. "నేను ఎప్పుడూ బోధన పట్ల మక్కువ గలిగి  ఆ రంగం లో ప్రవేశించేందుకు మార్గాలను ఆలోచిస్తూ ఉందే దానిని”. అని ఆమె అన్నారు. ఆమె తన పనిమనిషి(maid) దురవస్థ తెలుసుకొని తన సంకల్పమును  పటిష్టపరిచారు. "ఆమె పనిమనిషి  తమిళ నాడులో ఒక చిన్న గ్రామం నుండి వచ్చింది మరియు ఆమె పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు, ఆమె తరుచుగా ఆ స్కూళ్ళ విద్య నాణ్యత గా ఉండదు అని ఫిర్యాదు చేసిది.  కొన్నిసార్లు, మెట్రో నగరాల్లో ఉంటున్న ప్రజలు కూడా అలాoటి  సమస్యలు ఎదుర్కోవాల్సివచ్చేది  వారు తమ పిల్లల కోసం ఖరీదైన పాఠశాలల ఫీజ్లు కట్టలేక పోయేవారు. అందుకోసం  నేను VIII తరగతి నుంచి XII వరకు భౌతిక, గణితం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం పై వీడియో పాఠాలు అప్లోడ్ చేసాను అని ఆమె వివరిస్తుంది
ప్రస్తుత కాలం లో అందరికీ ఇంటర్నెట్ మరియు స్మార్ట్ఫోన్కి  కనెక్ట్ అయినప్పుడు, యూ  ట్యూబ్ విజ్ఞానం పొందటానికి  ఒక వర్ణనాత్మక మీడియం అని  నిరూపించబడింది. "నేను మొదటి కొన్ని వీడియోలను ట్రైల్ కోసం అప్లోడ్ చేసాను. వివిధ అంశాలు మరియు విషయాలపై వీడియోల కోసం ప్రజలు నుండి నిరంతరం ప్రవాహంలా వచ్చిన వ్యాఖ్యానాలు మరియు ఫీడ్బ్యాక్ నన్ను ప్రభావితం చేసినవి అని ఆమె అన్నారు. 
 .

ఆన్లైన్ లెర్నింగ్ వలన దాని స్వంత ప్రయోజనాలు ఉన్నాయి. ఇది విద్యార్థులు అధ్యయనం చేయడానికి వ్యక్తిగత సమయం ఇస్తుంది మరియు వారు భావనలు  సంగ్రహించడంలో సహాయపడుతుంది అని రోష్ని చెప్పారు. ఇది ఉచితం మరియు అందరూ  దీనిని పొందవచ్చు దాని మూలానా దీని  ఆకర్షణా పెరిగింది. యానిమేషన్లు మరియు నిజ జీవితంలో ఉదాహరణల సహాయంతో, విద్యార్థులు గతంలో కంటే మెరుగైన భావనలను అర్థం చేసుకోగలరు.

No comments:

Post a Comment