ఇస్లాం
ప్రారంభం నుండి విద్యకు అధిక ప్రాధ్యాన్యత ఇచ్చింది. జ్ఞానం ( 'ఇల్మ్) గురించిన 800 కంటే ఎక్కువ సూచనలు దివ్య ఖురాన్ లో
కనిపిస్తాయి. విద్య యొక్క ప్రాధాన్యతను పదేపదే, గుర్తుచేస్తూ దివ్య ఖురాన్ లో “మీలో విశ్వసించిన వారికి,
జ్ఞానం ప్రసాదింప బడిన వారికి అల్లాహ్ ఉన్నత స్థానాలు ప్రసాదిస్తాడు.(58:11) మరియు
ఓ ప్రభు! నాకు మరింత జ్ఞానం
ప్రసాదించు.”(20:114) మొదలగు ఆయతులు ఇస్లామిక్ సమాజం లో జ్ఞానం మరియు పఠనం కు ఉన్న
ప్రాధాన్యతను తెలియస్తున్నాయి.
ఇస్లామిక్
విద్యా విధానం పై దివ్య ఖురాన్ యొక్క
ప్రభావం అమితo. దివ్య ఖురాన్ వ్యక్తికి మరియు సమాజానికి జ్ఞానం యొక్క ప్రాధమిక వనరుగా
పనిచేస్తుంది. ఏడవ శతాబ్దంలో దివ్య ఖురాన్ అవతరణ తో ప్రధానంగా నిరక్షరాస్యులైన
అరేబియా సమాజం లో చాల విప్లవాత్మకమైన మార్పులు వచ్చినవి. అరబ్ సమాజం మౌఖిక సంప్రదాయంను ఆస్వాదించినది, కానీ దివ్య ఖురాన్ దేవుని వాణిగా భావిoచబడి దానిని అర్ధం చేసుకొనుటకు చదవడం మరియు వల్లెవేయడం అవసరమైంది. దీనితో దివ్య ఖురాన్ యొక్క పూర్తి
దీవెనలు పొందటానికి చదవడం మరియు రాయడం
అవసరమైనవి. ఇస్లాం ధర్మం లో విద్యకు మతసంబంధమైన
బోధనకు దగ్గిర సంభంధం ఉంది.
ఇస్లామిక్ విద్యా చరిత్ర-శిక్షణ
కేంద్రాలు: (Centres of Learning)
దివ్య ఖురాన్
మరియు ప్రవక్త(స) భోదనలు అనగా హదిస్సు లపై ఆధారపడి ముస్లిం విద్యా వ్యవస్థ
అభివృద్ధి చేయబడింది. అనేక విద్య సంస్థలు అనగా ముక్తబ్ (కుట్టాబ్) లేదా ప్రాధమిక పాఠశాల, ప్యాలెస్ పాఠశాలయిన
హల్ఖ (Halqah), లేదా స్టడీ సర్కిల్, పుస్తక దుకాణాలు మరియు సాహిత్య కేంద్రాలు మరియు కళాశాలలు, మసీదు, మదరసాలందు విద్య బోధన
జరిగేది.
అన్ని రకాల
పాఠశాలలు తప్పనిసరిగా మతసంభంద విషయాలను భోదించేవి.
ప్రారంభ ఇస్లామిక్ విద్యాసంస్థ అయిన మస్జిద్ లో దివ్య ఖురాన్ మరియు హదీసులు నేర్పేవారు. అక్కడకు వివిధ పండితులు వీటిని భోదించేవారు మసీదుల సంఖ్య ఖలీఫా ల క్రింద పెరిగింది, కొన్ని ప్రసిద్ద- మసీదులు అల్-మన్సూర్ మస్జిద్, ఇఫ్సహన్,
మశ్హాడ్, ఘోం, డమాస్కస్, కైరో మరియు అల్హంబ్ర
మస్జిద్లు ముస్లిం ప్రపంచo నుండి వచ్చే
వేల కొలది విద్యార్థులకు విద్యా కేంద్రాలు గా మారినవి. ప్రతి మసీదు సాధారణంగా అనేక స్టడీ సర్కిల్స్ (Halqah) కలిగివినవి.
ఇందు సాధారణంగా ఒక వేదిక పై గుండ్రంగా ఉన్న విద్యార్ధుల వలయం మద్య లో ఉపాద్యయుడు కూర్చునేవాడు.
అందువలననే వీటికి హల్ఖా అనే పేరు వచ్చింది.
ప్రాథమిక
పాఠశాలలు లేదా (ముక్తబ్, లేదా కుట్టాబ్) లో విద్యార్ధుల చదవడం మరియు వ్రాయడం నేర్చుకుoటారు
మరియు ప్రాథమిక ఇస్లామిక్ విషయాల్లో
శిక్షణ కోసం పొందుతారు. విద్యార్ధులు సంపూర్ణంగా దివ్య ఖురాన్ కంటస్థం చేసేవారు. కొన్ని
పాఠశాలలు కవిత్వం, ప్రాథమిక అంకగణితం, భౌతికశాస్త్రాలు, లేఖనం, నీతి (సభ్యత), మరియు ప్రాథమిక వ్యాకరణ అధ్యయనం ను వారి పాఠ్య ప్రణాళిక
చేర్చారు. మక్తాబ్లు (Maktabs) మధ్యప్రాచ్యం, ఆసియా, ఆఫ్రికా, సిసిలీ మరియు స్పెయిన్ లోని దాదాపు ప్రతి పట్టణం లేదా గ్రామం లో ఉండేవి
కుట్టాబ్
అనేక చోట్ల మసీదులు, ప్రైవేట్ గృహాలు, దుకాణాలు, టెంట్లు చివరికి బహిరంగ ప్రదేశాలలో
స్థాపించారు. ఎనిమిదవ శతాబ్దపు మధ్యలో ఇస్లామిక్ సామ్రాజ్యం లోని ప్రతి భాగం లో కుట్టాబ్లు
స్థాపించారు. కుట్టాబ్ ప్రధానంగా ప్రాథమిక
వయస్సు పిల్లలకు విద్య బోధిoచెవి , నేటికి పలు ఇస్లామిక్ దేశాల్లో మతసంబంధమైన
బోధన యొక్క ఒక ముఖ్యమైన సాధనంగా కట్టాబ్ కొనసాగుతున్నది.
కుట్టాబ్ పాఠ్యప్రణాళిక ప్రధానంగా నాలుగు
సంవత్సరాలు నిండిన మగ పిల్లలకు ఖురాన్
జ్ఞానం, ఉపవాసము మరియు ప్రార్థనతో బాటు మత విధులను నేర్పడం పై కేంద్రీకరించబడింది. ఇస్లాం విశ్వాసాల
ప్రకారం సరైన సూత్రాలు తో పిల్లలను పెంచడం, తల్లిదండ్రులు మరియు సమాజం యొక్క పవిత్ర
బాధ్యత అని వివరించబడినది. అబ్దుల్ తిబవి ప్రకారం పిల్లల మనస్సు శుభ్రమైన ఒక తెల్ల కాగితం వంటిది
దాని మీద ఏది రాసిన (తప్పు గాని ఒప్పుగాని) దానిని చెరపడం కష్టం.
ఇస్లామిక్
విద్యావిధానం లో పిల్లల బోధన విధానం కఠినమైనదిగా ఉంటుంది. సోమరితనం లేదా ఖచ్చితంగా పాఠo చెప్పలేని సమయం లో
శారీరక దండన తప్పదు. దివ్య ఖురాన్ కంఠస్థం కుట్టాబ్ పాఠ్యప్రణాళికలో కేంద్రబిందువు.
ఒకసారి విద్యార్థులు ఖురాన్ ఎక్కువ భాగం జ్ఞాపకం చేసిన తరువాత వారు విద్య యొక్క ఉన్నత దశలకు వెళ్ళే అవకాశం ఉండును. సమకాలీన
కుట్టాబ్ వ్యవస్థ నేటికి విద్య బోధనా యొక్క ముఖ్యమైన సాధనంగా కంఠస్థం మరియు
పఠనాన్ని సమర్థిస్తుంది.
పాశ్చాత్య
విశ్లేషకులు కుట్టాబ్ వ్యవస్థను సాధారణంగా పరిమిత సబ్జెక్ట్ల బోధన మరియు కంఠస్థం అనే
రెండు సూత్రాలపై విమర్శిస్తారు. ఇస్లామిక్ ప్రపంచంలోని ఆధునిక అధ్యాపకుల యొక్క అభిప్రాయం ప్రకారం విద్యార్థులు
కంటస్థం ధ్యానం పెట్టి తరచుగా విశ్లేషణ
మరియు స్వతంత్ర ఆలోచనను కల్గి ఉండటం లేదు.
ఇస్లామిక్ విద్యా లక్ష్యాలు మరియు ఆదర్శాలు (Aims and Objectives of Islamic Education):
అరబిక్ భాష లో విద్యకు మూడు పదాలు కలవు. ఎక్కువ
మంది విద్యకు అత్యంత విస్తృతంగా ఉపయోగించిన పదం తాలిం (ta'līm) అది ఆలిమా( 'alima) నుండి వచ్చింది. ఆలిమా
అనగా తెలుసుకొనుట అని అర్ధం. తర్బియా (Tarbiyah) అనే పదం “రబ” నుండి వచ్చింది
అనగా పెరుగుట అని అర్థం. తాదిబ్ (Ta'dīb) అనే పదం అదుబా (aduba) నుండి వచ్చింది అదుబా అనగా శుద్ధి
లేదా సబ్యత పొందిన అని అర్ధం. అది ఒక వ్యక్తి అభివృద్ధి చెందిన సామాజిక
ప్రవర్తనను సూచిస్తుంది.
ఇస్లాం విద్య
హేతుబద్ధమైన ఆధ్యాత్మిక, సామాజిక స్పూర్తి ని తెలుపుతుంది. ఇస్లామిక్ విద్యా
సిద్ధాంతం మానవుని సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుంది. ఇస్లామిక్ దృక్పదం
లో సంపూర్ణ మానవుని వ్యక్తిత్వం నకు ఉదాహరణ ప్రవక్త(స). అతనిని ఒక ఆదర్శం గా తీసుకోని మానవుడు తన
వ్యక్తిత్వంను పరిపూర్ణంగా వికసింప చేసుకోవాలి. అనేక ముస్లిం మతం విద్యావేత్తలు హేతువు(Reason)
కు ఆధ్యాత్మికత కన్న
ప్రాధాన్యమివ్వడం సంతులితమైన అభివృద్దికి
నిరోధకం అంటారు. ప్రేమ, దయ, కరుణ, నిస్వార్ధ సేవ మొదలగు అంశాలు ఆధ్యాత్మిక శిక్షణ ప్రక్రియల ద్వారా మాత్రమే
సాధ్యమగును.
ఇస్లాం జ్ఞానం రెండురకాలుగా
లబిస్తుంది. మేధోపరమైన పరిజ్ఞానం మరియు ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్లాం ప్రకారం విద్య(జ్ఞానం)
రెండు రకాలుగా ఉండాలి. ఇస్లాం లో జ్ఞానం(విద్య) పొందటం నైతిక మరియు ఆధ్యాత్మిక జ్ఞానం ఉద్దీపనకు ఒక సాధనంగా ఉద్దేశించబడింది.
ఇస్లామిక్ విద్యాసంస్థలు మరియు విశ్వవిద్యాలయాలు (Islamic Institutions and Universities):
మదరసాలు
9 వ శతాబ్దంలోనే ఉన్నవి కానీ చాలా
ప్రసిద్ది చెందిన మదరసా ప్రధాని నిజాం అల్
ముల్క్ ద్వారా 1057 బాగ్దాద్ లో స్థాపించబడింది. నిజామియా సున్ని అభ్యసనం కు అంకితం
అయి 1155 నుంచి 1260 సంవత్సరాల లోపు తూర్పు ఇస్లామిక్ ప్రపంచమంతటా ముఖ్యంగా కైరోలో
75 మదరసాలు, ఒక
కలిగి డమాస్కస్ లో 51 మదర్సాలను అలెప్పోలో 6నుంచి 44 మదరసాలు ఏర్పాటు చేసారు. ఉమ్మాయాద్ ల
క్రింద పశ్చిమ ఇస్లామిక్ ప్రపంచంలో
అనగా కార్డోబ, సెవిల్లె, టోలెడో, గ్రెనడా, ముర్సియా, అల్మేరియా, వాలెన్సియా మరియు కాడిజ్, (Cordoba, Seville, Toledo,
Granada, Murcia, Almería, Valencia, and Cádiz) మొదలగు
స్పానిష్ నగరాలలో మదరసాలు ఏర్పాటు చేసారు.
ఇస్లామిక్ మరియు అరబిక్ ప్రపంచంలో ఈజిప్ట్ రాజధాని అయిన కైరో
లోని అల్ అజహర్ యూనివర్శిటీ, ఒక పెద్ద ప్రజా లైబ్రరి మరియు మరియు అనేక కళాశాలలు కలిగి 970 క్రీ.శ. లో ఫాతిమిడ్స్ చే స్థాపించినబడిన ఒక ముఖ్య అధ్యయన కేంద్రం ఉంది. ఇప్పటికీ అక్కడ ప్రాధమిక అధ్యయనం గా ఇస్లామిక్ చట్టం, వేదాంతం, మరియు అరబిక్ భాష అద్యయనం
ఉంది. తర్వాత తత్వశాస్త్రం, ఔషధం(medicine) మరియు శాస్త్రాలు విద్యాప్రణాళికలో చేర్చబడ్డాయి. క్రమంగా ఈ శాస్త్రాల అధ్యయనం తగ్గింది. తిరిగి 19 వ శతాబ్దం వేదాంతం అద్యయనం ప్రారంభ
మైనది. ఆధునీకరణ తరువాత దాని కొత్త అనుబంధ
క్యాంపస్ లో సామాజిక శాస్త్రాలు, విజ్ఞాన
శాస్త్రాల అద్యయనం మొదలైనది.
అనేక ముస్లిం దేశాలలో ఇస్లామిక్ విశ్వవిద్యాలయాలు స్థాపించబడి
వేదాంతశాస్త్రం తో పాటు ఇతర శాస్త్రాల అద్యయనం
కూడా జరుగుతుంది. కానీ అవి పరిమిత సంఖ్య లో ఉన్నాయి. ముస్లిం జనాభా కలిగిన దేశాల్లో వేలకొద్ది
సంప్రదాయ మదరసా మరియు దార్-ఉల్-అలూం లో ఇస్లామిక్ థియాలజీ అండ్ రిలిజియస్
శాస్త్రాలు మరియు సామాజిక, భౌతిక శాస్త్రము మరియు జ్ఞానం(సైన్స్) యొక్క ఇతర విభాగాల్లో
శిక్షణ ఇస్తున్నారు. పలితంగా వేలకొద్ది ఉలేమా (మత పండితులు) తయారుఅగుతున్నారు.
ఇస్లామిక్ విద్యా నేర్చుకోవడం ప్రక్రియ –వివిధ పరిణామ
దశల్లో (Stages of Evolution of
Learning Process of Islamic Studies):
విద్య
మరియు నేర్చుకొనే పద్దతిని ముస్లింలలో వివిధ దశల్లో విభజించవచ్చు. ఇస్లామిక్
సంస్కృతి మరియు విద్యావిధానం ఎక్కువగా తూర్పు ఇస్లామిక్ ప్రపంచంలో 'అబ్బాసీ పాలనలో మరియు పశ్చిమ ఇస్లామిక్ దేశాల్లో ఉమ్మాయాద్
(Umayyads) పాలన కింద 800 మరియు 1000 CE లో అభివృద్ధి చెందినది. ఈ రెండో దశ ఇస్లామిక్ విద్యాదశ యొక్క స్వర్ణయుగం ప్రధానంగా
స్పెయిన్ లో అభివృద్ధి చెందినది.
అనువాదం
మరియు శాస్త్రీయ ఆలోచనల వివరణ మరియు
ఇస్లాం వేదాంత మరియు తత్వశాస్త్రం కు వాటి
అనుసరణ జరిగింది. ఈ కాలం లో హెల్లెనిస్టిక్, పెర్షియన్ మరియు భారతీయ జ్ఞానము యొక్క గణితం, ఖగోళశాస్త్రం, బీజగణితం, త్రికోణమితి, మరియు వైద్యం ఇస్లామిక్ విద్య విధానం
లో సమ్మిళితం అయినవి.
8మరియు 9వ శతాబ్దాలలో ప్రధానంగా 750-900 క్రీ.శ. మధ్య ఇస్లామిక్ సంస్కృతిని సంస్కరించటం మరియు అనుసరణ పరిచయం
చేయడం జరిగింది. ప్రారంభ ఇస్లామిక్ విద్య నీటిపారుదల వ్యవస్థలు, నిర్మాణ ఆవిష్కరణలు, వస్త్రాలు, ఇనుము మరియు స్టీల్ ఉత్పత్తులు, మట్టితో, మరియు తోలు ఉత్పత్తులు, కాగితం మరియు తుపాకిమందు తయారీకి; వాణిజ్య అభివృద్ది; మరియు వ్యాపారి నౌక నిర్వహణ అభివృద్ధికి,సాంకేతిక
నైపుణ్యం అనుసరణకు తోడ్పడినది.
10మరియు మరియు 11వ శతాబ్దాలలో వ్యాఖ్యానం, విమర్శలు జోడిoచబడినవి. 11 వ శతాబ్దం తరువాత, ప్రమాణికమైన ఉన్నత విద్యా మరియు ఇస్లామిక్
విజ్ఞాన శాస్త్రాల అభివృద్దికి తోడ్పడినది. మిలీనియం ప్రథమార్థంలో ఇస్లామిక్ నాగరికత, జ్ఞానం భౌతిక, రసాయన శాస్త్రం (alchemi), బీజగణితం, గణితం, ఖగోళశాస్త్రం, వైద్యం, సాంఘిక శాస్త్రం, తత్వశాస్త్రం మొదలగు రంగాలలో ముఖ్యంగా తూర్పు 'అబ్బాసీ కాలం మరియు పశ్చిమ (స్పెయిన్) ఉమ్మయాద్
కాలంలో అభివృద్ధి చెందినవి. ముఖ్యమైన ఇస్లామిక్ నగరాల్లో డమాస్కస్, బాగ్దాద్, మరియు కార్డోబా అందు పుస్తక దుకాణాలు,అనువాదకులు, పండితులు,
పుస్తక డీలర్స్ ప్రోత్సహించబడినారు.
పండితులు
మరియు విద్యార్ధులు పుస్తకాలు అధ్యయనం లేదా వారి వ్యక్తిగత గ్రంధాలయాల కోసం
ఇష్టమైన పుస్తకాల ఎంపికలు చేసేవారు. బుక్ డీలర్స్, కలెక్టర్లు మరియు పండితులు
కొనుగోలు మరియు పునఃవిక్రయం కోసం అరుదైన రాతప్రతులు శోధన కోసం చాలా దూరం
పయనించేవారు.
అవిసెన్నా, అల్-ఘజాలి, మరియు అల్- ఫరబీ, వంటి ప్రసిద్ధ ముస్లిం పండితుల
వ్యక్తిగత గ్రంధాలయాలను విద్యార్ధులు
పండితులు సందర్శించేవారు.10-12వ శతాబ్దం వరకు ఇస్లాం లో సృజనాత్మక విద్వత్తును ఒమర్ ఖయ్యం,
అల్-బిరునీ, ఫకర్
అద్-దిన్-అర్ రజ్వి, అవిసెన్నా (ఇబ్న్ సిన), అల్-తబరి అవేమ్పస్ Avempace (ఇబ్న్ బజ్జః Bajjah) మరియు
అవేర్రోఎస్ (ఇబ్న్ రుష్డ్ Rushd) వంటి పండితుల గ్రంధాలు ప్రదర్శించినాయి. గ్రీకు విజ్ఞానo అభ్యసించబడినది.
10
మరియు 13వ శతాబ్దాలలో ఇస్లామిక్ నాగరికత ఉచ్ఛస్థితిలో ఉంది. అది
ఇస్లామీయ సామ్రాజ్యము యొక్క స్వర్ణ యుగం.
ఇస్లామిక్ విజ్ఞానం,తార్కిక
శాస్త్రాలు, కళలు, సాహిత్యం వర్ధిల్లినవి. యురోపియన్లు
అందకారం నుంచి బయటపడి సంస్కృతిక పునర్:జీవనం పొందిన కాలం లో అరబ్ పండితుల ద్వారా గ్రీక్ వారసత్వాన్నిమరియు
గ్రీక్ గ్రంధాలను అబ్యసించారు.
ఇస్లామిక్
విజ్ఞానా కేంద్రం కార్డోబా తో వారి పరిచయం
క్రూసేడ్ ల ద్వారా జరిగింది. ఆ రోజులలో యూరోప్ లోని వారు ముస్లింల నుంచి భౌతిక శాస్త్రం, సాంకేతిక మత శాస్త్రాలతో పాటు కెమిస్ట్రీ, బోటనీ, ఫిజిక్స్, ఖనిజ, గణితం మరియు ఖగోళ శాస్త్రం మరియు ఉపయోగకరమైన ప్రాపంచిక
జ్ఞానం నేర్చుకొన్నారు. ఇస్లామిక్ ప్రపంచo అనేక శాస్త్రీయ మరియు కళాత్మక రచనలు ప్రపంచానికి అందజేసింది.
ఈ కాలంలోనే 12 మరియు 13వ శతాబ్దాలలో అరబిక్ భాష నుంచి హిబ్రూ మరియు లాటిన్ లోకి అనువాదం
ప్రారంభమైనది.
ముగింపు.
కాని తక్లిద్(taqlīd)
మరియు విదేశి దండయాత్రలు వలన 13 శతాబ్దం నాటికి క్రమంగా
ఇస్లామిక్ ప్రపంచంలో సాహిత్య కళలు, శాస్త్రీయ ఆవిష్కరణలు, లౌకిక విషయాలు మరియు సృజనాత్మక విద్వత్తు పట్ల అసహన లక్షణాలు ప్రబలినవి. తల్బని
ప్రకారం ఉలేమా లు మత సాహిత్యం మరియు మత విషయాలలో స్వయం నియంత్రణాదికారులు అయి
విజ్ఞానాన్ని పరిశోదనను నియంత్రించారు.
మునుపటి
కాలానికి అద్భుతమైన వారసత్వం ఉన్నప్పటికీ, ఇస్లామిక్ ప్రపంచం పద్దెనిమిదవ శతాబ్దం నాటికి పాశ్చాత్య అభివృద్ది దాడిని సాంస్కృతికంగా లేదా విద్యాపరంగా ఎదుర్కోలేక
పోయినది. ఐరోపా వలసరాజ్యాలు లౌకికవాదం ద్వారా
దేశీయ సాంస్కృతిక విలువలను పోగొట్టకొన్నవి. మతం నుండి రాజ్యం వేరుచేయబడినది. ఇస్లాం
మానవునికి అన్ని రంగాలలో వికాసం
ప్రసాదిస్తుంది అనే భావన స్థానం లో లౌకిక వాదం ప్రబలినది అది
ఇస్లాం కు ఒక శాపమైనది.
అదే
సమయంలో పాశ్చాత్య విద్యా సంస్థలు ఇస్లామిక్ దేశాల అధికారిక మరియు పరిపాలనా అవసరాలను తిర్చుటకు
కావలసిన అధికారులను తయారుచేయ సాగినవి. ఆధునిక విద్య పూర్తిగా ఇస్లామిక్ ఆలోచన మరియు సంప్రదాయక
జీవనశైలిని ప్రభావితం చేసింది. మత విద్య
వ్యక్తిగత విద్యగా నిలిచి ప్రభుత్వ విద్యలో
చోటు పొంద లేక పోయినది. ముస్లిం విద్యార్థులు నైతిక బోధన తో మతపరమైన శిక్షణ
కావాలనుకుంటే, వారు సంప్రదాయక
మతపరమైన పాఠశాలలు-కుట్టాబ్(kuttāb)నందు శిక్షణ పొందవలసినదే. దీనితో రెండు(ఆదునిక మరియు మత) విద్యా వ్యవస్థలు వేరు అయి ప్రభుత్వ
జోక్యం లేకుండా స్వతంత్రంగా ఉద్భవించినవి.
No comments:
Post a Comment