19 October 2016

భారత దేశము లో అండర్ ట్రయిల్ ఖైదీల సంఖ్య వెస్ట్ ఇండీస్ లోని బార్బోడోస్ జనాభా కు సమానం(Undertrial prisoners in India equals population of Barbados)









1953 లో అరెస్టు అయిన షా 1968 లో విడుదల అయి 30 సంవత్సరాలపాటు బీహార్ లోని ముజఫర్పూర్ జైలులో అండర్ ట్రయిల్ గా గడిపాడు.
ఠాకూర్ 16 సంవత్సర వయస్సు లో  అరెస్టు అయి విచారణ లేకుండా బీహార్ మధుబని జైలులో అండర్ ట్రయిల్ గా 36 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు.
ఈ రెండు ఉదాహరణలు 2014 భారత దేశ జైలు గణాంకాలు  ప్రకారం ఇండియన్ జైళ్లలో ఉన్న 282879 మంది అండర్ ట్రయిల్ ఖైదిల స్థితి ని సూచిస్తున్నాయి. ఇండియన్ జైళ్లలో ఉన్నఅండర్ ట్రయిల్ ఖైదిల సంఖ్య కరేబియన్ దేశం బార్బొడాస్ యొక్క జనాభా కు సమానంగా ఉంది.
జైలు గణాంకాల ప్రకారం 2010 మరియు 2014 మద్య ఉన్న అండర్ ట్రయిల్ ఖైదిలలో 25% మంది ఒక సంవత్సరం కన్నా ఆధికంగా జైలు లో ఉన్నారు. మొత్తం ఖైదీలలో 2010 మరియు 2014 మద్య అండర్ ట్రయిల్ ఖైదీల శాతం 65% ఉంది. 2014 లో ప్రతి 10మంది లో ఏడుగురు ఖైదీలు అండర్ ట్రయిల్స్ గా ఉన్నారు మరియు ప్రతి 10 మంది లో ఇద్దరు ఒక సంవత్సరం కన్నా అధికంగా జైలు లో శిక్ష బడకుండా అదుపులోఉన్నారు.

విచారణ లేదా విచారణ సమయంలో జైళ్లలో నిర్బంధించిన వారిని అండర్ ట్రయిల్ ఖైది అని పిలుస్తారు.  కానీ ఆ నిర్బంధ సమయంలో వారు తరచుగా  మానసిక మరియు శారీరక హింస గురి అవుతారు మరియు జైలు లో హింస మరియు పేద జీవన పరిస్థితుల బారి పడతారు. వారుతరచుగా తమ కుటుంబ సంబంధాలను,  తమ జీవనాధారాన్ని  కోల్పోతారు.

జైలు ఆవరణ లోపల న్యాయవాదులతో  సంభాషించడానికి వీరికి రెండు కారణాల వలన వీలుకాదు. వీరు పరిమిత వనరులు కలిగి  మరియు న్యాయ ప్రతినిధులతో వారు నిరోధిత యాక్సెస్ కలిగి ఉంటారు.ఒక సరసమైన మరియు వేగవంతమైన విచారణ ఖైదీలకు  లభిoచాలని 1980 సుప్రీం కోర్ట్ తీర్పు ఉన్నప్పటికీ రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం జీవితం మరియు స్వేచ్ఛ వారి ప్రాథమిక హక్కులో  భాగంగా అయిన అండర్ ట్రయిల్ ఖైదీలకు ఆ అవకాశం  లబించుట లేదు.
కోర్టుదృష్తి లో ఈ  ఖైదీలు  ఒక "డబుల్ అంగవైకల్యాన్ని" ఎదుర్కొoతున్నారు. వీరు అత్యంత పేద, వెనుకబడిన సామాజిక వర్గాలకు చెంది కొద్దిపాటి విద్య కలిగి ఉంటారు మరియు వారి స్వరo అరుదుగా వినిపిస్తుంది.

"న్యాయవ్యవస్థ మరియు ప్రభుత్వం ప్రకారం అనేక అండర్ ట్రయిల్ ఖైదిలు పేదవారు మరియు చిన్న నేరాలకు పాల్పడినవారు.దీర్ఘ కాలం నిర్భందింప పడి, వారికి వారి హక్కులు  తెలియదు మరియు న్యాయ సహాయo పొందలేరు” అని  న్యాయవాద నిపుణుల భావన.

2005 వచ్చిన సి.పి.సి. 436 సెక్షన్ నిభందనలకు బిన్నంగా వారు సంవత్సరాల తరబడి నిర్భంధం లో మగ్గుతున్నారు. ఈ సెక్షన్ నిభందనల ప్రకారం అండర్ ట్రయిల్ ఖైదీలకు వారి నేరం మీద విచారణ జరిగి  శిక్ష ఖరారు అయితే వారు  అనుభవించే  శిక్ష కాలం లో సగం అండర్ ట్రయిల్ ఖైది గా గడిపిన వారిని వక్తిగత   బ్యాండ్ పై ఎటువంటి స్యురిటి లేకుండా వారిని విడుదల చేయవచ్చు. అయితే ఈ నిభందన మరణ శిక్ష మరియు యావజ్జీవ శిక్ష అనుభవించే ఖైదీలకు వర్తించదు. కాని జైలు రికార్డ్స్ ప్రకారం సి.పి.సి. క్రింద జీవిత శిక్ష లేదా మరణ శిక్ష విధించడానికి అవకాసం ఉన్న కేసులు దాదాపు 39% కొట్టివేయబడుచున్నవి.

2014 అంతానికి 1,22,056  మంది అండర్ ట్రయిల్ ఖైదిలలో 43% మంది 6 నెలలకు మించి మరియు 5 సంవత్సరాలకు మించి  ఉంటున్నారు. వారికీ నేరం రుజువు అయి శిక్ష పడే కాలం కన్నా అధిక కాలం అండర్ ట్రయిల్ గా గడుపుతున్నారు. 3 నెలలనుంచి 5 సంవత్సరాల వరకు  అండర్ ట్రయిల్ గా ఉన్న ఖైది ల సంఖ్య లో పెరుగుదల కన్పిస్తుంది

2014 నాటికీ భారతదేశం లోని 16 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో 25% మంది 1 సంవత్సరం కన్నా అధికంగా ఉన్న అండర్ ట్రయిల్ ఖైదీలు వున్నారు. జమ్మూ-కాశ్మీర్ లో 54% మంది గోవా లో 50% గుజరాత్ లో 42% యు.పి. లో 18.21 మంది ఉన్నారు

2013 లో మాజీ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ప్రబుత్వ, కోర్ట్  ఉత్తర్వులకి బిన్నంగా భారత దేశం లోని 1382 జైల్స్ లో కల అమానవీయ దుర్భర పరిస్థితులను న్యాయస్థానం దృష్టి కి ఒక లేఖ ద్వారా తెచ్చారు.  ఆ లేఖను ఒక పిల్ గా పరిగణించిన న్యాయస్థానం 2014 లో ఇచ్చిన తన తీర్పు లో సి.పి.సి. 436 సెక్షన్ క్రింద అర్హత ఉన్నఅండర్ ట్రయిల్ ఖైదీలను వెంటనే విడుదల చేయమని  మరియు 2013 ఇంటిరియం ఆర్డర్ లో సూచించినట్లు ప్రతి జిల్లా లో అండర్ ట్రయిల్ రివ్యూ కమిటి లను ఏర్పాటు చేయమని ఆదేశాలు జారి చేసింది.

అండర్ ట్రయిల్ రివ్యూ కమిటి లో జిల్లా న్యాయమూర్తి, జిల్లా మ్యాజిస్త్రటే మరియు సూపరింటెండెంట్ అఫ్ పోలిస్ ఉంటారు. వీరు త్వరిత విచారణకు మరియు కేసుల రివ్యు కు బాధ్యత వహిస్తారు. దీని పలితంగా జూలై 1,15 నుంచి జనువరి 31, 16 వరకు సుమారు 36000 మంది అండర్ ట్రయిల్ ఖైదిలు విడుదల చేయ బడ్డారు. ఇది ఒక శుభ పరిణామం అని ఒక న్యాయవాది అభిప్రాయపడ్డారు

అయితే విడుదల అయిన మొత్తం భారత దేశం లోని వివిధ జైల్స్ లో అండర్ ట్రయిల్ ఖైదిలలో 2% మాత్రమే. ఐ.పి.సి. నేరాల క్రింద పెండింగ్ క్రైమ్స్ 2014, 2015లలో వరుసరగా 84%86% ఉన్నాయి.

పెండింగ్ కేసులు పెరుగుటకు ప్రధాన కారణం దిగువ న్యాయస్థానాలలో న్యాయమూర్తుల కొరత. 25 మిలియన్ల పెండింగ్ కేసులను క్లియర్ చేయుటకు భారత న్యాయస్థానములకు కనీసం 10-12 సంవత్సరాలు పట్టును.

సిమినల్ ప్రోసిజర్ కోడ్ గురించి పోలీస్ వారికి, జైల్ లో నిర్భందించిన వారికి అవగాహన లేదు.    
పనిచేయని అండర్ ట్రయిల్ రివ్యూ కమిటి, జైలు రికార్డ్స్ లో తేడాలు, సమాచార వ్యవస్థ సరిగా లేకపోవుట, న్యాయ సహాయం లబించక పోవుట, పోలిస్ ఎస్కార్ట్ లేక విచారణ ఆగిపోవటం, విడియో కాన్ఫరెన్స్ సదుపాయం లేకపోవుట వలన భారత దేశం జైల్స్ లో అండర్ ట్రయిల్ ఖైది లు అధికం గా ఉంటున్నారని  అమ్నేస్టి ఇంటర్నేషనల్ అభిప్రాయం. 
.

No comments:

Post a Comment