4 October 2016

ఆహారం వృథా (FOOD WASTAGE).


ప్రపంచ ఆహార సంస్థ  ప్రకారం, సుమారు 3.1 మిలియన్ పిల్లలు ప్రతి సంవత్సరం (మరణాలలో  దాదాపు 45%) కుపోషణ మరియు ఆకలి తో మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తం గా 66 మిలియన్ ప్రాధమిక పాఠశాల వయస్సు గల పిల్లలు ఆకలితో తరగతులకు హాజరుఅవుతున్నారు అందులో   ఒక్క ఆఫ్రికాలోనే  23 మిల్లియన్లు పిల్లలు ఉన్నారు.

UN ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) ప్రకారం, అరబ్ దేశాలు (సుమారు 367 మిలియన్ జనాభా) వారి ఆహార అవసరాలకు దాదాపు 50% దిగుమతి చేసుకొంటున్నారు. ఈ దేశాలలో చాలా వరకు సమీప భవిష్యత్తులో తీవ్రమైన ఆహార భద్రత సంక్షోభం లోకి వెళతారని (మేరీ కాథరిన్ ఓ 'కానర్ @ mcoc సంస్థ ) అంచనా వేసింది. 1996 ప్రపంచ ఆహార సమ్మేళనం "అన్ని సమయాల్లో అoదరు ప్రజలు ఒక ఆరోగ్యకరమైన మరియు చురుకైన జీవితం నిర్వహించడానికి తగినంత, సురక్షితమైన, పుష్టికరమైన ఆహారం అందుబాటు లో " ఉండాలని ఆహార భద్రతను నిర్వచించినది.

ఆహార భద్రత తరచుగా సరఫరా వైపు సమస్య గా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ అధ్యయనం డిమాండ్ వైపు దృష్టి ని పెట్టడం మరియు ఆహారo తీసుకోనే పద్దతులను  మార్చడం మరియు ఆహార వ్యర్థంను  తగ్గించడం ద్వారా ఆహార భద్రత మెరుగుదల కొరకు సామర్థ్యాన్ని అన్వేషించడానికి ఉద్దేశింప బడినది

ఈ క్రింది మూడు పరిస్థితులు ఆహార భద్రత నెరవేర్చడానికి అవసరము.

1. ఆహారo అందుబాటులో ఉండాలి
2. ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండాలి
3. వినియోగించే ఆహారo పోషక అవసరాలు తీర్చేదిగా ఉండాలి.

ఆ మూడు పరిస్థితులలో  మా దృష్టిలో మరింత ముఖ్యమైనది చివరిది.

ఆహార వ్యర్థం ఒక ప్రపంచవ్యాప్త సమస్యగా  ఉంది మరియు రోజువారీ మానవ వినియోగం కోసం ఉత్పత్తి అయ్యే  ఆహారము లో   మూడవవంతు వ్యర్ధం లేదా నాశనం  అగుచున్నది(FAO, 2002). కాని ప్రపంచ స్థాయిలో  అనేక మిలియన్ల మంది రోజువారి ఆహరం  లబించక ఆకలి తో ఉంటున్నారు. మొత్తం ఉప సహారా ఆఫ్రికా ఉత్పత్తి చేసే ఆహార మొత్తంకు  సమానంగా ధనిక దేశాలు వ్యర్ధం చేసే ఆహరం ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలలో  సగటు వినియోగదారుడు కొనుగోలు చేసే ఆహార పదార్థం లో  సగం లేదా మూడు వంతులలో  ఒక వంతు వృధా చేస్తున్నాడు అని  నివేదించబడింది. అనగా ఒక స్థానిక ఆహార స్టోర్ వద్ద కొనుగోలు చేసే ప్రతి 3 సంచుల కిరాణా లో ఒక సంచి వ్యర్ధం అగుచున్నాది.  

ఇస్లామిక్ దేశాలలో ఆహరం ఇంతగా వ్యర్ధమగుట ఆశ్చర్యం గా ఉన్నది ఎందుకంటే ఇస్లాం లో వ్యర్ధపరచటం నిషేదిoప బడినది. వ్యర్ధం చేసే వారు సైతాన్ సోదరులుగా పిలువబడినారు. పైగా రమజాన్ రోజుల్లో కూడా ఆహరం వ్యర్ధం అగుట జరుగుచున్నది.ఆహార పదార్ధాల వ్యర్థాలు పర్యావరణ, ఆర్ధిక మరియు సామాజిక ప్రభావం కలుగ చేయును. పెరిగే తలసరి ఆదాయం మరియు వ్యయం, జీవన ప్రమాణాలు, భరించగలిగే మరియు ఆహారo పట్ల  మన అజాగ్రత్త ప్రవర్తన మన పరిమిత వనరుల మీద గణనీయమైన ప్రభావం కల్పించును.

షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు మరియు తినుబండారాలు లభించే చోట కొంచంగా తిన్న లేదా పూర్తిగా వదిలివేసిన ఆహార పదార్ధాల  ప్లేట్స్ కనిపించును.  దురదృష్టవశాత్తు, సులభంగా ఆహరం లభించుట అనునది  మిడిల్ ఈస్ట్ లో ఆహార పదార్ధాల  వ్యర్థo కు దారి తీసింది. బహారిన్ లో రోజుకు మొత్తం పురపాలక వ్యర్థాలలో  11% ఆహార పదార్ధాల  వ్యర్థాలు అనగా  రోజుకు 300 టన్నుల ఆహార పదార్ధాలు వ్యర్ధం అగుచున్నవి. మధ్యప్రాచ్యం ప్రజలు ప్రధానం గా ఆహార వస్తువులను దిగుమతి చేసుకొoటున్నారని వాటిని  చెత్త లో నిర్లక్ష్యంగా విసిరి వేయకూడదని అర్థం చేసుకోవాలి. కొనుగోలు చేసిన ఆహారo లో  నాల్గవ వంతు వ్యర్ధం లేదా నాశనం అగుతున్నది దానిని ఉపయోగించక మునుపే అని అంచనా వేశారు.

ప్రారంభ సమయం నుంచి వ్యర్థo మనుషులకి పర్యావరణ సమస్యగా ఉంది. దుబార తరచూ చెత్త తో పోల్చబడింది, కానీ చెత్త కంటే ముందు వ్యర్ధం  ఉంది.  వ్యర్థాలను వివిధ రూపాల్లో గ్రహించుట ద్వారా దానిని దూరం చేయడం లేదా తగ్గించడానికి మార్గాలు గుర్తించడo సాధ్యపడుతుంది.  ఇస్లాం నుండి ఈ విషయం లో మనము మార్గదర్శకత్వం పొందవచ్చు. 

“అల్లాహ్ యే పలు రకాల తోటలను, పొలాలను పండించాడు. వాటిద్వారా రకరకాల ఆహార పదార్ధాలు లబిస్థాయి. జైతును చెట్లను దానిమ్మ చెట్లను ఉద్భావింప చేసాడు. వాటి పంట తినండి. కాపు సమయం లో పేదల హక్కుచెల్లించండి వ్యర్ధం చేయవద్దు, వ్యర్ధ పరిచే వాళ్ళను అల్లాహ్ ప్రేమించడు”. – [దివ్య ఖురాన్ 6:141]. 
 
ఈ ఆయత్ ద్వారా ఆహారం వ్యర్ధ పరిచే వస్తువులలో ఒకటి అని తెలుస్తుంది. అల్లాహ్ మనలను  వృథాచేయమనలేదు దానిని ఎలా వినియోగించాడో నేర్పాడు. అల్లాహ్ దానిని పేదవారితో పంచుకోమన్నాడు. మిగిలినది కాక ఫలసాయం ఉత్పత్తి  లో కూడా పంచుకోమన్నాడు.  పక్వత వచ్చిన  పండును పేదలతో  పంచుకొనుట ఉదారత్వంను మంచిని చాటును.
ఈ ఆయత్ సీజన్ తరువాత వచ్చే ఫలసాయం తినుటను  నిషేదించును. పండ్లను వాటి సీజన్ లో తినమనును. సీజన్ లో పండ్లను తినుట గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించి  అన్ని రకాల శిలాజ ఇంధన ఉద్గారాలను తగ్గించును. ఎక్కువ ఉండుట  కూడా ఒక సమస్యే. మామిడి  తీయగా ఉండును కాని ఎక్కువ మామిడి పళ్ళు    పండిoచిన అవి తినటానికి ఎక్కువ అయి దుబారా అగును.
అల్లాహ్ దివ్య ఖుర్ఆన్ లో అల్లాహ్ అంటాడు: “ప్రసాదించిన ధర్మసమ్మతము పరిశుద్దము అయిన ఆహారాన్ని తినండి. త్రాగండి. మితిమీర వద్దు మీతిమీరిన వాళ్ళు అంటే  అల్లాహ్ కు అయిస్టం”. [ఖురాన్ 5:87]

అదనపు ఉత్పత్తుల సాధనకు ప్రతి రైతు వివిధ మార్గాలు ప్రయత్నిస్తాడు. చిన్న కుటుంబం వ్యవసాయం విషయంలో భాగస్వామ్యo  ఎప్పుడూ ఉంటుంది. ఇస్లాం ప్రకారం అల్లాహ్ పొరుగు వారితో, పేదలతో పంట పంచుకోమంటాడు.కాని ఆధునిక  పారిశ్రామిక వాణిజ్య వ్యవసాయ పద్ధతులు కారణంగా మిగులు ఆహార పదార్ధాల వ్యర్థాలు పంచుకోక  వ్యర్ధమై  చెత్తకు  దారి తీయును.
 అధికంగా తినటం వలన దుబారా అగును: పైన వివరించిన రెండు ఆయతుల వల్ల అల్లాహ్ మనకు తినడానికి రుచికరమైన మరియు చట్టబద్ధమైన లేదా హలాల్ ఆహారం అందించారు అని అర్థం చేసుకోవచ్చు. అల్లాహ్ మనకు అందించిన అనేక రుచులు కలిగి మనకు  ఆనందం ఇచ్చును అని అర్థం. కానీ అధికంగా తినడం, మరోవైపు, ఒక భయంకరమైన శిక్షను  చేరవేస్తుంది: “మేము ఇచ్చిన పరిశుద్దమైన ఆహారాన్ని తినండి. దానిని తిని తిరుగుబాటు చేయకండి. చేస్తే నా ఆగ్రహం మీపై విరుచుకు పడుతుంది. ఎవడి మీద నా ఆగ్రహం విరుచుకు పడతుందో, అతను పతనం కావటం తద్యం”.-[దివ్య ఖురాన్ 20:81]. అధికంగా తినటం వలన ఆరోగ్య సమస్యలకు  దారితీయును. అనారోగ్యకరమయిన వినియోగం ఉదా:మందులు అతిగా తీసుకొనుట  ప్రమాదo తెస్తుంది.   “ఆదము సంతానమా!ప్రతి ఆరాధనా సమయం లో మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద వహించండి. తినండి. త్రాగండి. మీతిమీరకండి. అల్లాహ్ మీతిమీరే వారిని ప్రేమించడు. - [దివ్య ఖురాన్ 7:31]

ప్రతిష్ట కొరకు ఖర్చు: ప్రతిష్ట కొరకు ఖర్చు చేయడం గురించి ఇస్లాం లో స్పష్టంగా ఉంది. మనము   రుచికరమైన ఆహారo, మేలుఅయిన వస్త్రాలు,పానీయం, ప్రార్ధన చేస్తాము. కాని ఇస్లాం లో ఖరీదైన దుస్తుల మీద ఖర్చుపెట్టడం ద్వారా  మన  వ్యక్తిగత సంపద ను చూపటం దుబారా మరియు వృధా.
మరో హదీసు లో ప్రవక్త (స) అన్నారు, "మీరు తింటున్నపుడు ముద్ద క్రింద పడితే అది వెంటనే అందుకొని తీసి దాని లోని కొంత భాగాన్ని తొలగించి మిగిలినది తినాలి. అతను దయ్యంకు కొంత  వదిలి వేయకూడదు.”-సహి ముస్లిం.

"మీరు ఎక్కువ ఉన్నవ్యక్తిని చూడండి, తక్కువ ఉన్న వ్యక్తిని చూడండి.":
పేద వారిని సేవించడం ద్వారా వారి దీవెనలు  పొందవచ్చు. దుబార నివారణకు ఇస్లాం లో అనేక ఉదాహరణలు ఉన్నాయి. మనo దుబారాని అరికట్టితే సమాజం కూడా దానినుంచి ప్రేరణ పొందవచ్చు. పరిసర వాతావరణం మారవచ్చు. ఆహార పదార్ధాల వ్యర్ధ నివారణ కు విద్య మరియు ప్రచారం చాలా ముఖ్యం అని నమ్ముతాము. గత సంవత్సరాలలో, ప్రభుత్వం వ్యర్ధం తగ్గించే దీనికి అనేక పధకాలకు,ప్రచారాలకు   అంకురార్పణ చేసింది.  వివిధ రంగాలకు పలు కార్యక్రమాలు మరియు విద్యా ప్రచారాలు దీనికి మద్దతుగా నిలిచాయి.

ఆహార వ్యర్ధ నివారణ  కు తీసుకొవలసిన   కొన్ని చర్యలు:
1)భోజన నియమాలను పాటించుట: మన ఇంటికి ఎన్ని ఆహార పదార్ధాలు అవసరమో వారం క్రిందట ప్రణాళిక ద్వారా వాటిని కొనుగోలు చేయడం ద్వారా దుబారాను అరికట్ట వచ్చు. దీనివలన రోజుకు ఎంత అవసరమో తెలుసుతుంది మరియు మిగిలినవాటిని వచ్చే వారం వాడవచ్చు.
2)చిన్న కంచాలు: ఆహరం భుజించుటకు చిన్న కంచాలు వాడుట ఆహార మిత   వ్యయం జరుగును.  మిత  వ్యయం వలన వ్యర్ధం తగ్గును. 
3)ఆహార పదార్ధాలను శితలికరించడం: మిగిలిన ఆహరం ను దాయుటకు ఫ్రిజ్ లో ఉంచుట మంచిది. దానివలన ఆహరం చెడిపోదు. వ్యర్ధం అవదు.
4)మెరుగైన నిలువ పద్దతులు ఉపయోగించుట: వెనుకబడిన పేద  దేశాలలోని వ్యవసాయ దారులు కిటకాలు,పురుగులు మరియు రవాణా సౌకర్యాల లేమి వలన పెద్దమోత్తం లో ఉత్త్పత్తి చేసినదానిని నష్ట పోవుదురు.దీనికి గాను FAO రూపొందించిన తక్కువ ఖర్చు నిలువ సౌకర్యాలు, ఆదునిక రవాణా పద్దతులను  ఉపయోగించుకొని రైతులు లాబపడేదరు మరియు  ఆహార పదార్ధాల వ్యర్ధం అరికట్టబడును.
5) రి డిస్త్రిబ్యుషణ్ అఫ్ ఫుడ్: ఎక్కువు అయిన ఆహార పదార్ధాలను ఫుడ్ బ్యాంక్స్ ఇతర సేవాసంస్థలకు ఇచ్చి వాటిని సద్వినియోగ పరచవచ్చు.
6)సరియిన డేట్ లేబుల్స్ అంటించుట: చాలా ఆరహ పదార్ధాల మీద వాటిని ఉపయోగించవలసిన సమయం సరిగా నిర్ధరించబడదు. దీనివల్ల సమయానికి (డ్యూ డేట్) ముందే ఆహార పదార్ధాలు పారవేయబడును.బ్రిటన్ లో అలా పారవేయబడిన పదార్ధాలలో  20% ను తిరిగి ఉపయోగించవచ్చు అని తేలింది. డ్యూ డేట్స్ సరిగా అంటించడం వల్ల ఆహార పదార్ధాల దుర్వినియోగం ఆపవచ్చు.  .
7. పదార్ధాల పరిమాణం తగ్గిoపు: రేష్టారెంట్స్ మరియు బోజనశాలలు తక్కువ పరిమాణం లో ఆహారపదార్ధాలను అందించడం వలన పెద్ద మొత్తం లో ఆహార పదార్ధాల వినియోగం మిగులును. సాధారణం గా వాటిలో తినగా  మిగిలే  ఆహార పదార్ధాలు ప్లేట్స్ లో ఎక్కవ ఉండును. 
8. వినియోగ దారుల జాగృతి ఉద్యమాలు: ఆహార పదార్ధలు ఎంత పెద్ద మొత్తం లో మిగులుతున్నాయో వినియోగదారులను చైత్యన పరచటం ద్వారా వారిలో పొదుపును పెంచి వ్యర్ధం ను అరికట్ట వచ్చును. సరుకుల/కిరాణా కోట్లు ఈ ఉద్యమం లో ప్రధాన పాత్ర వహించ గలవు.
9) ఆహార పదార్ధాలు దుర్వినియోగ పరచకుండా సంస్థల తోడ్పాటు: ఆహార పదార్ధాల దుర్వినియోగ పరచకుండా సంస్థలను ఏర్పాటు చేసి వాటి తోడ్పాటుతో ఉత్పాదక కేంద్రాల వద్ద రిటైల్ షాప్స్ వద్ద,   వినియోగదారులకు ఆహార బద్రత పై సరియిన అవగాహన కల్పించుట ద్వారా ఆహార వ్యర్ధం ను అరికట్టవచ్చును.
10) ఆహార పొదుపుకు ప్రచారం: సేవ్ ఫుడ్, ఈట్ లెస్, సేవ్ ఫుడ్ అండ్ ప్రొటెక్ట్ హుమ్యనిటి అనే నినాదాల ద్వార ప్రజలను చైతన్య పరచ వచ్చును. ఇందుకు గాను ప్రభుత్వం సేవా సంస్థల సహాయం పొందవచ్చును.
11. ఎరువుగా వాడుట: తినగా మిగిలిపొయిన  ఆపిల్, మొక్కజొన్న పొత్తులు, బూజుపట్టిన స్ట్రాబెర్రీలు మరియు ఇతర రకాల  బిట్స్ తో కంపోస్ట్(ఎరువు)తయారు చేయవలయును.  కంపోస్టింగ్ వృధా కు సహజ ప్రత్యామ్నాయం. కంపోస్ట్ ఉద్యానవనాలకు ఎరువుగా పనిచేస్తుంది కాలాంతరంలో మట్టి నాణ్యతను మెరుగుపరుస్తుంది. మరియు దానిని  చేయుట  చాలా సులభం
12) విద్య మరియు అవగాహన ఏర్పరచడం: దీని ప్రారంభం పాఠశాలల్లో కావాలి. ఆహార నాణ్యత దెబ్బతినకుండా ఏవిధంగా  నిల్వ చేయవచ్చు అనేది  వివరిoచాలీ. వండిన అన్నము ను వ్యర్ధం చేయక తిరిగి అవసరమైనప్పుడు తిరిగి వేడి చేసే తినే పరిస్థితి కల్పించాలి.
13) స్వచ్ఛందoగా విరాళం ఇచ్చుట: తాజా కూరగాయలను పండ్లను స్వచ్చంద సేవా సంస్థలకు విరాళం ఇచ్చుట అలవాటు చేసుకోండి. అరబ్ దేశాలలో అనేక  మంది యువ అరబ్బులు మిగిలిన ఆహరంను పారవేసిన ఆహరం ను సేకరించి దానిని అవసరమైన వారికి అందిస్తున్నారు. ముఖ్యం గా రమాదన్ నెలలో ఈ కార్యక్రమం ఎక్కువుగా చేపట్ట  బడును.   ఇఫ్తార్ మరియు సుహూర్ సమయం లో అవసరం ఉన్న పేద వారికి అభాగ్యులకు అందించ బడును.



No comments:

Post a Comment