ప్రపంచ బ్యాంకు తన
నివేదిక లో గత మూడు దశాబ్దాలుగా అత్యంత
(extremely)పేదరికం లో ఉన్న ప్రజల సంఖ్య వేగంగా
క్షిణింస్తున్నప్పటికి ఇంకా సుమారు 400 మిలియన్ పిల్లలు ఇప్పటికీ దుర్భర పరిస్థితులలో
నివసిస్తున్నారు మరియు ఆ పరిస్థితిని అధిగమించేందుకు
సత్వర చర్యలు అవసరం అని అభిప్రాయపడినది.ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 1981 లోని పేదలు 2010 లో కూడా
పేదలుగానే ఉన్నారు అయితే దీనికి మినహాయింపు గా భారతదేశం మరియు చైనా ఉన్నాయి.
తక్కువ-ఆదాయo ఉన్న దేశం లో "సగటు" పేద వ్యక్తి 1981 లో 74 సెంట్లు తో ఒక రోజు నివసించారు అదే 2010 లో 78 సెంట్ల తో ఒక
రోజు నివసిస్తున్నాడు. కానీ, భారతదేశం లో, పేద వ్యక్తి సగటు ఆదాయం 2010 లో 96 సెంట్లు ఉండగా అది 1981 లో 84 సెంట్లు గా
ఉంది. చైనా, సగటు నిరుపేదల
ఆదాయం 67 సెంట్లు నుంచి 95 సెంట్లు కు ఇదే
కాలం లో పెరిగింది అని నివేదిక పేర్కొంది.
2010లో అత్యంత పేదరికంలో జీవిస్తున్నవారి సంఖ్య 721 మిలియన్ ప్రజల కంటే
తక్కువ ఉంది.వారిలో పిల్లలు అసమాన సంఖ్యలో ఉన్నారు. 1981లో ప్రపంచ
బ్యాంకు నివేదిక ప్రకారం రోజుకు $ 1.25 కంటే తక్కువ సంపాదిస్తున్నవారు అత్యంత పేదరికంలో ఉన్నారు. మేము గత మూడు
దశాబ్దాలుగా పేదరికం నుంచి ప్రజలు తమను తాము తొలగించుకోవడం చూసాము. కాని పేదరికంలో
నివసిస్తున్న పిల్లల సంఖ్య మారలేదు అని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్
అన్నారు.
పేదరికం తగ్గింపులో చైనా మరియు భారతదేశం వంటి మధ్య ఆదాయ దేశాల్లో
గణనీయంగా ప్రగతి చూపినప్పటికీ తక్కువ ఆదాయం గల దేశాల వారు చాలా తక్కువ పురోగతి చూపించారు అని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. 2010 లో తక్కువ ఆదాయం
గల దేశాలలో 33% అత్యంత తక్కువ ఆదాయం (extremely poor) కలవారు
నివసిస్తున్నారు అదే 1981 లో 13 శాతం నివసిస్తున్నారని ప్రపంచ బ్యాంకు మరియు అంతర్జాతీయ ద్రవ్య నిధి
యొక్క వార్షిక సమావేశo లో విడుదల చేసిన నివేదిక
వివరించింది.
400 మిలియన్లకు పైగా పిల్లలు తీవ్ర పేదరికంలో
నివసిస్తున్నారు మరియు పిల్లలు పెద్దల కంటే పేదలు అయ్యే అవకాశం
ఉంది ఇది బాల కార్మికుల సంఖ్య పెరిగేటట్లు చేస్తుంది మరియు అంతర తరాల పేదరికం
ఉచ్చులు సృష్టించవచ్చు అని కౌశిక్ బసు, చీఫ్ ఆర్థికవేత్త మరియు సీనియర్ వైస్
ప్రెసిడెంట్ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు చెప్పారు.
30 శాతం పైగా అత్యంత పేదరిక (extremely
poor) పిల్లల భారతదేశం నివసిస్తున్నారు: అని ప్రపంచ
బ్యాంక్ మరియు యునిసెఫ్ నివేదిక ప్రకారం తెలుస్తుంది. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ మరియు
UNICEF ద్వారా వెలుబడిన నూతన నివేదిక ప్రకారం, దక్షిణాసియాలోని భారతదేశం
లో సుమారు 385 మిలియన్ల మంది పిల్లల
లో అత్యధిక శాతం అనగా 30% పిల్లలు అత్యంత పేదరికంలో జీవిస్తున్నారని
తెలుస్తుంది.
' ఎండింగ్ ఎక్స్ట్రీమ్ పావర్టి: ఎ ఫోకస్ ఆన్ చిల్డ్రన్” లో తీవ్ర పేదరికంలో నివసిస్తున్న
పెద్దలు కంటే పిల్లలు రెండు రెట్లు అధికంగా ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. 2013 లో అభివృద్ధి
చెందుతున్న దేశాలలో రోజుకు తలకు $ 1.90 సంపాదిస్తున్న కుటుంబాలలో 19.5% పిల్లలు ఉన్నారు. ఆ గృహాల్లో
9.2% పెద్దలు
నివసిస్తున్నారు.
ప్రపంచవ్యాపితంగా దాదాపు 385 మిలియన్ పిల్లలు
అత్యంత పేదరికంలో జీవిస్తు ఉన్నారు. ఉప సహారా ఆఫ్రికాలో అత్యంత పేదరికం లో నివసించే పిల్లల సంఖ్య 50 శాతం కంటే అధికం
గా ఉంది మరియు వారు ప్రపంచంలోని అత్యంత పేదరిక లో
నివసించే పిల్లలలో 50% కంటే ఎక్కువ గా ఉన్నారు.
దక్షిణ ఆసియా దాదాపు 36 శాతం తో రెండోవ
స్థానం లో ఉంది. అందులో భారతదేశంలో నివసిస్తున్నఅత్యంత పేదరిక పిల్లలు 30% పైగా
ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 80% పిల్లలు అత్యంత పేదరికం లో ఉన్నారు.
పిల్లలు అసామాన్యంగా జనాభా లో మూడోవ వంతు
ఉన్నారు కాని వారిలో అత్యధిక పేదరికం తో భాదపదేవారు సగం మంది ఉన్నారు అని నివేదిక
తెలుపుతుంది.ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఐదేళ్ళలోపు పిల్లలలో
ఐదింట ఒక వంతు మంది అత్యంత పేదరిక కుటుంబాలలో
నివసిస్తున్నారు.
" పేదరికం యొక్క ప్రభావం పిల్లలపై చాలా ఎక్కువగా
ఉండును. అది వారి శరీరాభివృద్ధి కి మరియు
వారి మానసిక అభివృద్ధిని ప్రభావితం చేయును అని యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంటోనీ లేక్
చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఐదుగురు పిల్లలలో ఒకరు మరియు ఉప-సహారా
ఆఫ్రికాలో అందరు పిల్లలలో సగం మంది అత్యంత
పేదరికo లో పెరుగుతున్నారు. ఇది ఒక షాకింగ్ న్యూస్. ఇది వారి భవిష్యత్తును పరిమితం చేయడమే కాక వారి సంఘాలను క్రిందకు లాక్కువెళుతుంది అని లేక్ చెప్పారు.
ఎక్కువ మంది పిల్లలు అత్యoత పేదరికం లో ఉండటం “గర్భిణీ తల్లులకు పూర్వ-జనన
సంరక్షణ(pre-natal care) చిన్నతనంలో అభివృద్ధి సేవలు ప్రారంభo, నాణ్యత పాఠశాల, శుభ్రమైన
నీరు, మంచి పారిశుధ్యం మరియు
ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల ఆవశ్యకతను తెలుపుతుందని” సీనియర్ డైరెక్టర్, పావర్టి మరియు ఈక్విటీ ప్రపంచ బ్యాంక్ గ్రూప్ అనా రేవెంగా తెలిపారు.
ఈ సేవలను మెరుగుపరచడం, మరియు సమయం
వచ్చినప్పుడు నేటి పిల్లలు ఉద్యోగావకాశాలు పొందటం అంతర్- తరాల పేదరిక చక్రాన్ని
విచ్ఛిన్నం చేయుటకు ఒక్కటే మార్గం అని
రేవెంగా పేర్కొన్నారు. నివేదిక ప్రకారం ఎక్కవ
సంఖ్య గల కుటుంబాలలో కుడా పేదరికం పిల్లలను
అసామాన్యంగా ప్రభావితం చేయును. 45% పిల్లలు రోజుకు తలా $ 3.10 సంపాదించే గృహాలలో
ఉంటున్నారు ఆ కుటుంబాలలో 27% పెద్దవారు ఉంటున్నారు.
UNICEF మరియు ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రభుత్వాలకు జాతీయ
మరియు ఉపజాతీయ స్థాయిలో బాలల పేదరికం గణించమని మరియు 2030 లో అత్యంత పేదరిక
నిర్మూలనా చర్యల్లో భాగంగా జాతీయ పేదరిక తగ్గింపు ప్రణాళికల లో పిల్లలపై దృష్టి. పెట్టమని
పిలుపునిచ్చాయి.
వారు ప్రభుత్వాలకు పిల్లల
సెన్సిటివ్ సామాజిక రక్షణ పధకాలు అందులో పేద
కుటుంబాలకు నేరుగా ఆహారo కోసం నగదు బదిలీ కార్యక్రమాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు పేదరికం
యొక్క ప్రభావం నుండి పిల్లలను రక్షించడానికి మరియు వారి సొంత జీవితాలను అవకాశాలు
మెరుగుపరిచేందుకు ఇతర సేవలను బలోపేతం చేయాలి
అన్నారు.
పేద బాలలకు ప్రయోజనాలు
కల్పించే విద్య, ఆరోగ్యం, శుభ్రమైన నీరు, పారిశుధ్యం మరియు
అవస్థాపనా పెట్టుబడులు, అలాగే కరువులు, వ్యాధులు ఆర్థిక
అస్థిరత వంటి ఎదురుదెబ్బలు తరువాత పేదరికం లోకి తిరిగి పడకుండా ప్రజలను నిరోధించడానికి పెట్టుబడులు వంటి ప్రాధాన్యత కార్యక్రమాలను చేయవలసినదిగా సూచించారు. పేద
పిల్లలకి ప్రయోజనకరమైన ఆర్థిక వృద్ధిని
పెంచే విధాన నిర్ణయాలను తీసుకోవాలి అని అన్నారు..
No comments:
Post a Comment