12 October 2016

ఇమాం హనిఫ్ -


చాలా సంవత్సరాల క్రితం తాబిఎన్ (Tabi'een-సహాబా తరువాత ముస్లింల తరం) కాలం లో బాగ్దాద్ ఇస్లామిక్ సామ్రాజ్యపు ఒక గొప్ప నగరంగా ఉండేది. అది ఇస్లామిక్ సామ్రాజ్య రాజధానియే గాక అక్కడ ఎక్కువ సంఖ్య లో ఇస్లామిక్ పండితులు ఉండేవారు మరియు అది గొప్ప ఇస్లామిక్ విజ్ఞాన కేంద్రంగా ఉండేది.

ఆ సమయం లో ఉన్న రోమ్ పాలకుడు బాగ్దాద్ ముస్లింలకు మూడు సవాళ్లను ఒక రాయబారి ద్వారా పంపాడు. రాయబారి బాగ్దాద్ నగరం చేరుకొని  ఖలీఫా కు వర్తమానం పంపాడు తన వద్ద మూడు ప్రశ్నలు కలవని వాటికి సమాధానo ఇవ్వవలసినదని అక్కడి ముస్లింలను ప్రశ్నించినాడు.

ఖలీఫా నగరం లోని అందరు పండితులను సమావేశపరచినాడు. రోమన్ రాయబారి  ఒక ఉన్నత వేదిక ను అధిరోహించి నేను మూడు ప్రశ్నలతో వచ్చినాను,   మీరు వాటికి సమాధానం చెప్పి రోమ్ చక్రవర్తి పంపిన ఆపార సంపదను బహుమానం గా స్వికరించవచ్చు అని పలికినాడు.

ఆ ప్రశ్నలు ఈ విధంగా  ఉన్నవి.
1.“అల్లాహ్ కంటే ముందు ఏమి ఉంది?,
2.“అల్లాహ్ ఎ దిశను చూస్తున్నాడు?
3.“అల్లాహ్ ఈ సమయంలో ఏ పని అందు నిమగ్నమై ఉన్నాడు?”

పండిత  సమావేశం మూగబోయిoది. అప్పుడు ఒక ముస్లిం పండితుని కుమారుడు తను  ఆ ప్రశ్నలకు సమాదానం ఇస్తానని అందుకు ఖలీఫా అనుమతి కోరినాడు. ఖలీఫా అనుమతి ఇచ్చినాడు.

రోమన్ రాయబారి తన మొదటి ప్రశ్న "అల్లాహ్ కంటే ముందు ఉంది ఏమి ఉంది?"అని ప్రశ్నించినాడు.

అప్పుడు ఆ బాలుడు  “మీకు లెక్కించడం తెలుసా?” అని రాయబారిని అడిగినాడు. “తెలుసు” అని రాయబారి అన్నాడు. అయితే పది నుంచి క్రిందకు వరుసగా  లెక్కించండి అని బాలకుడు అనెను. రోమన్ రాయబారి "పది, తొమ్మిది, ఎనిమిది.........   ఒకటి " వచ్చే వరకు  లెక్కించి ఆపై ఆపివేసాడు.

"ఒకటి కి ముందు ఏమి వస్తుంది?" అని బాలుడు అడిగిన, “ఒకటికి ముందు ఏమీ లేదు!" అని రాయబారి అన్నాడు.
ఒకటికి ముందు ఏమి లేకపోతే సత్యం తో కూడిన, చిరంజీవుడు, పరిపూర్ణుడు మరియు శాశ్వతత్వంతో నిండిన అల్లాహ్ ముందు మరి ఎవరు ఉంటారని ఆ బాలుడు సమాధానం ఇచ్చినాడు. 

ఆప్పుడు  ఆ రాయబారి తన రెండోవ ప్రశ్న “అల్లాహ్ ఎ దిశను చూస్తున్నాడు? అని అడిగెను. అప్పుడు ఆ బాలకుడు ఒక కొవ్వోత్తి తెప్పించి దానిని వెలిగించి దాని కాంతి ఎ దిశలో ప్రసరిస్తుందని? అని రాయబారిని అడిగినాడు.

ఆ రాయబారి ఆశ్చర్యంతో దాని కాంతి నలుదిక్కుల ప్రసరిస్తుందని పలికినాడు. అప్పుడు ఆ బాలకుడు కాంతి లాగానే అల్లాహ్ యొక్క “నూర్-అస్-సమావతి- వల్’ ఆర్ద్”(కటాక్షం/దృష్టి) (Nur-us-Samawati-wal-’Ard)  భూమి ఆకాశం లో ఎల్లప్పుడూ  నలువైపులా సమానంగా ప్రసరించును అని పలికినాడు.

రోమన్ రాయబారి దిగ్భ్రమచెంది  తన చివరి ప్రశ్న అడగపోయాడు. కానీ బాలకుడు అంతకు ముందు ఒక విన్నపం చేసినాడు.”ఆగండి  మీరు ప్రశ్నలు అడుగుతున్నారు నేను వాటికి సమాధానం ఇస్తున్నాను. మీరు వేదిక పైన ఉండి ప్రశ్న అడగటం కన్నా నేను వేదిక పైకి వచ్చి సమాధానం ఇచ్చిన ఎక్కువ మంది కి స్పష్టం గా వినబడుతుంది కాబట్టి క్రిందకు రండి అని అడిగినాడు."

రాయబారికి ఇది సమంజసం అనిపించి క్రిందకు వచ్చినాడు, బాలకుడు వేదిక పైకి ఎక్కినాడు. అంతట రాయబారి తన చివరి ప్రశ్న “అల్లాహ్ ఈ సమయంలో ఏ పని అందు నిమగ్నమై ఉన్నాడు?” అని అడిగినాడు.

బాలకుడు చిరునవ్వు తో “అల్లాహ్ ఈ క్షణాన, ఒక అబద్ధాలకోరు  మరియు ఇస్లాం విరోధిని క్రిందకు దింపినాడు మరియు అల్లాహ్ యొక్క ఎకత్వభావన అందు విశ్వాసం ఉన్న వ్యక్తి ని వేదిక పై నిలిపి సత్యమును ప్రకటించినాడు. ప్రతిరోజు అతను ఇదే పని చేస్తున్నాడు”.
“మీరు మీ ప్రభువు యొక్క ఏయే ప్రశంసనీయ లక్షణాలను తిరస్కరిస్తారు?” 55:29


అంతట ఆ రోమన్ రాయబారి సంతృప్తి చెంది పరాజయంతో  తన రాజ్యమునకు తిరిగి వెళ్ళినాడు. ఆ బాలుడు పెరిగి పెద్దవాడు అయి ఇస్లాం యొక్క అత్యంత ప్రసిద్ధ పండితులలో  ఒకరు గా మారినాడు. అల్లాహ్ మహత్తరమైన  ప్రత్యేక జ్ఞానం మరియు మత జ్ఞానంతో అతని నాశీర్వదించెను. ఆ బాలుని పేరు అబూ హనీఫా మరియు అతను ఇమాం-ఎ-అదం (గ్రేట్ ఇమామ్)గా, ప్రసిద్ద  ఇస్లామిక్ పండితునిగా  పేరుగాంచినాడు.  

No comments:

Post a Comment