10 October 2016

అనువాదం

అనువాదం (Translation) అనగా ఒక భాష నుండి మరొక భాషలోని తర్జుమా చేయడం. దీనికి రెండు భాషలలోనూ ప్రావీణ్యం ఉండాలి. దీనికి నిఘంటువులు బాగా ఉపకరిస్తాయి. సాహిత్యంలో ఒక భాషలో బహుళ ప్రసిద్ధిచెందిన రచనలను ఇతర భాషలలోకి అనువాదం చేయడం వలన మంచి రచనలు అందరికీ అందుబాటులోకి వస్తాయి.అనువాదం ద్వారా ప్రపంచ సాహిత్యం అన్ని భాషల ప్రజలకు చేరువవుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాకతో అనువాదానికి గిరాకీ పెరుగుతోంది. గ్రంథాలు ఒక భాష నుంచి మరో భాషలోకి అనువాదమవుతున్నాయిఅనువాదం ప్రస్తుతం బాగా పలుకుబడి పొందుతున్న ప్రక్రియ. అనువాదం కొత్త ప్రపంచానికి తెరవబడే సరికొత్త వాకిలి. అనువాదకుడికి కేవలం రెండు భాషల లిపులతో పరిచయమున్నంతమాత్రాన సరిపోదు. ఆయాభాషల వాడుకదారుల సాంస్కృతిక జీవనంతో పరిచయముండాలి.
అనువాద రకములు:
అనువాదము రెండు విధములు1.శబ్దానువాదము 2 అర్థానువాదము. ఇదివరకు జెప్పబడిన మాటల మరల జెప్పుట శబ్దానువాదము. ఇదివరకు దెలిసిన విషయమునే మరల అన్యపదములతో జెప్పుట అర్థానువాదము.
ఒక భాషకు చెందిన వచనాలను లేదా ప్రసంగాన్ని మరొక భాషలోకి యంత్రం ద్వారా అనువాదం చేయటాన్ని యాంత్రిక అనువాదం అంటారు. ప్రస్తుతం యంత్ర అనువాదాలు కొంత గందరగోళ పరుస్తున్నాయి. పదాల పరంగా కొన్ని భాషలను యాంత్రిక అనువాదానికి అనువుగా అనువాదకులు మార్చగలిగారు. అయితే యాంత్రిక అనువాద వాక్య నిర్మాణంలో వ్యాకరణ దోషాలు ఎదురవుతున్నాయి, వ్యాకరణ దోషాలు సరిచేసేందుకు అనేకమంది అనువాదకులు కృషి చేస్తున్నారు
అనువాదకుడికి కావలసిన కావాల్సిన లక్షణాలు:
అనువాదం అనేది ఒక సృజనాత్మక కళ. అది ఒక్కరోజులో వచ్చేది కాదు. నిరంతర సాధనతోనే పాఠకులు మెచ్చే అనువాదం సాధ్యమవుతుంది. ఈ రంగంలో పనిచేయాలంటే భాషలపై అనురక్తి ఉండాలి. అందులో లోటుపాట్లను తెలుసుకోవాలి. ఒక గ్రంథంలోని భావం మారిపోకుండా దాన్ని మరో భాషలోకి తర్జుమా చేసే నేర్పు సాధించాలంటే నిత్యం నేర్చుకొనే తత్వం ఉండాలి. వివిధ దేశాల సంస్కృతులు, సంప్రదాయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ట్రాన్స్‌లేషన్‌లో అవి ప్రతిఫలించాలి.

ఆంగ్లము నుంచి తెలుగు అనువాదం లో మెళకువలు
1 అనువాదం చేసే అభిరుచీ (flair) సహజంగా ఉండాలి.
2. ఉబయ బాషలపై మంచి పట్టు ఉండాలి.
3. రోజు ఇంగ్లీష్ పేపర్ లేదా ఇంగ్లీష్ వార్తలు లేదా ఇంగ్లీష్ ఆర్టికల్స్ చదవాలి. అలాగే తెలుగు పేపర్ లేదా తెలుగు  వార్తలు లేదా తెలుగు  ఆర్టికల్స్ చదవాలి.
4. ఉదా: తెలుగు వాడు అయి హిందీ వచ్చిన వాళ్ళు హిందీ సినిమా /సీరియల్ చూస్తే  ఎలావర్డ్ టూ వర్డ్ అర్థమవుతుందో అలాగే ఇంగ్లిష్/తెలుగు అర్ధమవ్వాలి..
5. స్వంతంగా తెలుగు లో సమాన అర్ధం వచ్చేటట్లు అనువదించగలగాలి. అవసరమతే కొన్ని శబ్దాలను స్వయంగా సృష్టించ గలగాలి.
6. అనువాదకునికి తెలుగు మీద మంచి పట్టు ఉండాలి.
7. జనరల్ నాలెడ్జ్ (General knowedge),  సమకాలిన వర్తమాన సమస్యలపై మంచి అవగాహన ఉండాలి. అన్ని శాస్త్రాల గురించి కనీస జ్ఞానం ఉండాలి. వాకింగ్ (walking) ఎన్సైక్లోపీడియా లాగా అన్నింటిగురించి తెలియాలి.
8. మక్కికి మక్కి అనువదించకూడదు. చదివి భావాన్నిమాత్రమే   సరళ బాషలో అనువదించాలి.
9. మొత్తం ఆర్టికల్ ను పేరాలుగా విభజించి పేరవారిగా అనువదించాలి.
10. అనువాదము మనకు నచ్చాలి. దానిని అనేక సార్లు చదివి మళ్ళి, మళ్ళి దానిలో మార్పులు చేయాలి.
11. అన్నింటికీ కన్నా అనువాదం దైవ ప్రసాదం . అది కొందరికే వస్తుంది.
12. సాధన చేసిన కొద్ది అభివృద్ధి (improvement) కనిపిస్తుంది.
13. దేనినైనా  అనువదిస్తాను అనే ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. అది అన్నిoటికన్నా ప్రధానం.
14. తేలుగు/ఆంగ్ల సారస్వతాన్ని బాగా అధ్యయనం చేసి ఉండాలి.
15. అనువాద  సమయం లో ఆంగ్ల పదాలకు అర్ధం తెలియక పోతే వాటిని తెలుగు లో వ్రాసి బ్రాకెట్ లో ఆంగ్ల  పదముంచాలి.
16. అనువాదం ఎప్పుడు ఒకే స్ట్రెచ్ (strech) లో లేదా కనిసం కొన్ని పేరాలు అయిన అనువాదం జరగాలి. విరామం  వస్తే  భావాలు (ideas)  కూడా మారవచ్చు. చిన్నదైతే ఒకే స్ట్రెచ్ (strech) లో అనువదించటం మంచిది.
17. ఒక సారి ఒక ఆర్టికల్ ను అనువదిస్తే తిరిగి అదే ఆర్టికల్ ను తిరిగి అనువదిస్తే ఖచ్చితంగా తేడా కన్పిస్తుంది.  కనిపించాలి. లేదా సరిగా అనువాదం జరగ నట్లే.
18.అనువాదకులు తెలుగు బుక్స్, న్యూస్ పేపర్స్ విస్తృతంగా చదవాలి. అనువాదం సరళంగా వ్యవవారిక బాష లో ఉండాలి.
19. రోజు రెండు మూడు గంటలు చదవాలి.
20. ప్రాక్టిస్(practice) కోసం దేనినో ఒక దాన్ని అనువాద౦ చేయoడి. సాధన తో అబ్యాసము పెరుగును. (practice makes perfect).







No comments:

Post a Comment