18 October 2016

భారతదేశం లో ముస్లింల తోలి నివాస స్థానం (Origin of Early Muslims in India) -ఇండియా లో ఇస్లాం తొలుత అరబ్బు వర్తకుల ద్వారా ఇండియా పశ్చిమ తీరంలో అనగా మలబార్ తీరం లోను, కొంకణ్ ప్రాంతం లోను, డామన్ అండ్ డయ్యూ మరియు  గుజరాత్ తీరం లోను  ప్రవేశించింది. భారతదేశం యొక్క పురాతన మరియు మొదటి మసీదు గా  కేరళలోని కొడుంగళూర్ లోని  చేరమాన్ జామా మస్జిద్ ప్రసిద్ది కెక్కినది. ఇది మాలిక్ బిన్ దీనార్ అను సహాబా చే  చే నిర్మింపబడినది. కొడుంగళూర్ మసీదు శిలా  పలకo  మీద 9వ హిజ్ర  లేదా 629 CE లో సుమారు 1400 సంవత్సరాల క్రితం ఈ మస్జిద్ నిర్మించినట్లు ఉంది. ఈ కాలం అనగా  ముహమ్మద్ ప్రవక్త(స) జీవితకాలం (క్రీ.శ. 571 - 632 ) కు దగ్గిరగా ఉన్నది.

భారతదేశంలోనే కాక భారత ద్వీపకల్పంలోనే ఇది ప్రథమ మస్జిద్ కూడానూ మరి ఒక ముఖ్యమైన ప్రాముఖ్యతను ఈ మస్జిద్ సంతరించుకొంది. అది యేమనగా, సౌదీ అరేబియా లోని మదీనా తరువాత ఈ మస్జిద్ 'శుక్రవారపు ప్రార్థనలు' జరుపుకున్న ప్రపంచంలోనే రెండవ మస్జిద్.

చరిత్రకారుడు ఈలియట్ మరియు డౌసన్ తమ పుస్తకం "హిస్టరీ ఆఫ్ ఇండియా యాజ్ టోల్డ్ బై ఇట్స్ ఓన్ హిస్టారియన్స్" ప్రకారం, ముస్లిం యాత్రికులకు చెందిన నౌక, క్రీ.శ. 630 లో భారత తీరం లో వీక్షించబడినది. హెచ్.జీ.రాలిన్‌సన్, ఇతని పుస్తకం: "ఏన్షియంట్ అండ్ మెడీవల్ హిస్టరీ ఆఫ్ ఇండియా"  ప్రకారం, ముస్లింలు 7వ శతాబ్దంలో భారత్ తీరంలో స్థిరనివాసాలు యేర్పరచుకున్నారు. షేక్ జైనుద్దీన్ మఖ్దూమ్ పుస్తకం; 'తుహ్‌ఫతల్-ముజాహిదీన్' ప్రకారం ఇదే విషయం విశదీకరింపబడినది..'స్టర్రాక్ జే., దక్షిణ కెనరా మరియు మద్రాసు జిల్లా మాన్యవల్ (2 vols., మద్రాసు, 1894-1895) This fact is corroborated, by J. Sturrock in his South Kanara and Madras Districts Manuals, మరియు "హరిదాస్ భట్టాచార్య" తన కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా Vol. IV. లోను, ఇస్లాం మరియు అరబ్బులు, ప్రపంచంలో 'సాంస్కృతిక యుగ కర్త' లని అభివర్ణించారు. అరబ్ వర్తకుల ద్వారా ఇస్లాం అనేక చోట్ల వ్యాపించింది, వీరెక్కడ వర్తకాలు చేశారో అచ్చట ఇస్లాం ను వ్యాపింపజేశారు.

కొడుంగళూర్ ప్రాచిన కేరళ రాజుల రాజధానిగా ఉండేది మరియు 622-628 CE (హిజ్ర 29) లో చేరమాన్ పెరుమాళ్ భాస్కర  రవి వర్మ అనే పేరుతో ఒక గొప్ప రాజు ఉండేవాడు.  ఆ రోజుల్లో కేరళ పాలకులలో ముఖ్యుడుని  చేరమాన్ పెరుమాళ్ అనేవారు.

 కొందరు చరిత్రకారుల ప్రకారం, మాలిక్ బిన్ దీనార్ మరియు అతని 20మంది వాణిజ్య సహచరులు  వర్తకం నిమిత్తం కేరళ లో అడుగుపెట్టారు మరియు వాణిజ్యంలో నిమగ్నమయ్యారు.  వారి వర్తక పద్దతులు, ధార్మిక విశ్వాసాలు  అంతకు ముందు ఉన్న అరబ్ వ్యాపారుల కన్న భిన్నంగా ఉండి కేరళ ప్రజలను  ఆకర్షించినవి. ఇస్లామీయ తత్వం, ఏకేశ్వరోపాసక నియమం, సర్వమానవ సోదరభావన, సమానత్వాల ప్రవచనాలు, శాస్త్రాలతో కూడిన ఖురాన్, సాదా సీదా జీవన సరళి, మున్నగు విషయాలు ప్రజలపై ప్రభావం చూపాయి. వీరి వలన పశ్చిమ తీరంలో ఇస్లాం మతానికి మంచి స్పందన లభించినది.

చేరమాన్ రాజు ఈ అరబ్ వర్తకుల ఆశ్చర్యకరమైన వ్యాపార విధానాలు, మత విశ్వాసాలు  తెలుసుకొని  వారి వ్యాపార విధానాలను, మత అలవాట్లను   మరింత లోతుగా పరిశోధన చేయుటకు వారిని  తన రాజభవనానికి ఆహ్వానించాడు. మాలిక్ బిన్ దీనార్(ప్రవక్త(స) సహచరుడు) మరియు అతని సహచరులు తమ నిజాయితీ వ్యాపార పద్ధతులకు మూలకారణం వారు  అనుసరించిన  ఇస్లాం  విధానాలు అని అన్నారు.

చేరమాన్ రాజు అరబ్ వాసుల వ్యక్తిత్వం మరియు ప్రవర్తనను ఇస్లాం విపరీతంగా  ప్రభావితం  చేసినది అని తెలుసుకోన్నాడు. అరబ్ వర్తకులు ఇస్లాం మూల సిద్ధాంతాలను మరియు ప్రవక్త(స) నాయకత్వం మరియు అతని వ్యక్తిత్వం, గుణగుణాలు  రాజు కు  వివరించారు.  అప్పుడు రాజు వారు వివరించిన వ్యక్తి నిజానికి ఒక ప్రవక్త అని ఏ రుజువు తో అంటున్నారో  తెలుసుకోవాలనుకోన్నాడు. అప్పుడు వ్యాపారులు ప్రవక్త(స) అద్భుతాలు (Mujizaat), షాక్క్ అల్-ఖమర్ (Shaqq-al-khamar) లేదా చంద్రుడు రెండుగా  విభజిoచబడటం తో సహా వివరించారు.

చేరమాన్ రాజు అప్పుడు తన ఆస్థాన జ్యోతిష్కులను  పిలిపించి వారితో సంప్రదించగా  వారు కుడా ఆ అద్భుతాన్ని నమోదు చేసినట్లు తెలుసుకొన్నాడు. అంతట చేరమాన్ రాజు తన సింహాసనాన్ని అధికారాన్ని విడిచిపెట్టి మాలిక్ బిన్ దీనార్ తో  కలసి అరేబియా వెళ్లి అక్కడ ప్రవక్త ముహమ్మద్ (స) ను  కలసి    ఇస్లాం స్వీకరించి హజ్ యాత్ర చేసినాడు. చేరమాన్ రాజు తన తిరుగు ప్రయాణం లో అతని  ఓడ ఒక తుఫానులో మునిగి నాశనమవగా  అతని మృత శరీరం, ఒమన్ సముద్ర తీరంలో ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. నేటికి ఆయన సమాధి అక్కడ ఒక ప్రసిద్ధ ఆనవాలు గా ఉంది.

హమిదుల్లా అనే ఒక చరిత్రకారుడు లండన్ లోని  ఇండియన్ ఆఫీస్  లైబ్రరీ (రిఫరెన్స్ న. అరబిక్, 2607, 152-173) వాల్యుం16(06) నందు గల కొన్ని పాత రాతప్రతుల గురించి  తన గ్రంధం "మహమ్మద్ రసులిల్లా” లో ప్రస్తావించాడు. ఆ ప్రాచిన ప్రతుల ప్రకారం " భారతదేశం నైరుతి తీరంలో గల  మలబార్ ప్రాంత  పురాతన సంప్రదాయం ప్రకారం  చక్రవర్తి ఫర్మాస్ (బహుశా చేరమాన్ పెరుమాళ్ మరొక పేరు) చంద్రుడు రెండు గా చిలిపోవటం అన్న  అద్భుతం ను విని దానిని దేవుని సందేశహరుడు వస్తున్న దానికి ఒక సంకేతంగా భావించి తన మేనల్లుడు ను రాజప్రతినిధిగా నియమింఛి ఆ ప్రవక్త ను కలవటానికి అరేబియా  బయలుదేరాడు. అక్కడ ప్రవక్త ముహమ్మద్ (స) ను కలసి ఇస్లాం స్వీకరించి అతని అనుచరుడిగా మారినాడు. బహుశా ఈనాటి భారతదేశం లో మొట్టమొదటి ముస్లిం గా మారిన వ్యక్తిగా అతనిని చెప్పవచ్చును.”

దీనిని ద్రువికరిస్తూ ప్రవక్త(స) సహచరుడు అబూ సయీద్ అల ఖుద్రీ (ర) ప్రకారం "భారతదేశం నుండి ఒక రాజు అల్లం తో కూడిన ఒక ఊరగాయ సీసా ను అల్లాహ్ యొక్క సందేశహరుడుకి  సమర్పించారు. ప్రవక్త (స) దానని తన సహచరులు మధ్య పంపిణీ చేసారు. నేను కూడా తినడానికి ఒక ముక్క పొందాను అని ఉల్లేఖించారు.

ఇస్లాం స్వికరిoచిన పెరుమాళ్  తర్వాత పెరుమాళ్, తాజుద్దీన్ అనే  పేరు పెట్టుకొన్నాడు. కొంతమంది ఇతర చరిత్రకారులు అతనిని  అబ్దుల్లా సముద్రి అని కుడా పిలుస్తారు.ఒక ఇస్లామిక్ పండితుడి ప్రకారం  పెరుమాళ్ యొక్క అనుచరులు కేరళ చేరుకున్న తరువాత ఒక మసీదు నిర్మించారు.  మాలిక్ బిన్ దీనర్, (ప్రవక్త మొహమ్మద్ యొక్క 13 మంది అనుచరుల లో  ఒకరు)   చేరమాన్ జుమా మసీదు ను  CE 629 లో మలబార్ సుగంధ ద్రవ్యాల మార్గంలో పురాతన రేవు పట్నం  మసురిస్  చేరుకున్న తరువాత  నిర్మించారు.

మాలిక్ బిన్ దీనార్, ఒక సహాబీ.  మలబార్ లోని మాప్పిళాలు, భారదేశంలో ఇస్లాం స్వీకరించిన మొదటి సమూహం. వీరి సంబంధ బాంధవ్యాలు, వర్తకపరంగా అరబ్బులతోనూ మరియు ఇతరులతోనూ ఉండేది. మాలిక్ బిన్ దీనార్ ఆధ్వర్యంలో మతప్రచారాలు జరిగిన ఫలితంగా ఇక్కడ ఇస్లాం వ్యాప్తి జరిగింది. ఇచ్చటి అనేక సమూహాలు ఇస్లాంను స్వీకరించాయి. ఈ ప్రాంతాలలో నేటికినీ అరబ్బు జాతులను చూడవచ్చు.

మసీదు రూపకల్పన హిందూ దేవాలయ శైలి (కేరళ శైలి) లో  జరిగింది. ఇది కేరళ లో ఇరిన్నజలకుడా(Irinjalakuda) రైల్వే స్టేషన్ నుండి 20 కిలోమీటర్ల దూరం లో గల  కొడుంగళూర్  సమీపం లోని మతాల (Mrthala) గ్రామంలో కలదు. మసీదు ప్రాంగణంలో మాలిక్ బిన్ దీనర్ మరియు అతని  సోదరికు చెందిన  రెండు సమాధులు ఉన్నాయి. 1984 లో స్థానిక ముస్లిం జమాత్ చేరమాన్ మస్జిద్ భవనం మరమ్మతులు నిర్వహించి  కొత్త మినార్ల తో నిర్మాణం మరింత ఇస్లామిక్ గా రూపొందించినారు.    మస్జిద్ యొక్క అంతర్గత ఆకృతీకరణను  నిలుపుకుంటూనే, బాహ్యఆకృతిని  పూర్తిగా మార్చారు
.
 మొదట ఇస్లాం మతం 9 హిజ్రీ (628/29 CE) లోనే మాలిక్ బిన్ దీనార్ (RA) ద్వారా మలబార్ తీరం చేరింది మరియు క్రమంగా భారతీయ ఇతర  తీర ప్రాంతాలకు చేరింది.  ఇస్లాం మతం 15 హిజ్రీ సంవత్సరం లో  ఖలీఫా హజ్రత్ ఉమర్ (RA) కాలం లో కొంకణ తీరం చేరింది.

మహారాష్ట్ర రాష్ట్రంలోని  కొంకణ్ తీర ప్రాంత రాయ్ గడ్ జిల్లా లో శివవర్ధన్ సమీపాన షరీ మస్జిద్(Sharie Masjid) కలదు ఇది  మహారాష్ట్ర రాజధాని నగరం మరియు భారతదేశం యొక్క ఆర్థిక రాజధాని అగు ముంబై నుండి 200 కిలోమీటర్ల దూరం లో  ఉంది. దానిని  15 హిజ్రీ సంవత్సరం అంటే దాదాపు 636 CE మద్య  హజ్రత్ ఉమర్ (ర) కాలిఫెట్ సమయంలో నిర్మించారుమరియు అక్కడ మస్జిద్ ఆవరణ లో  ప్రవక్త మహ్మద్ (స) సహచరుల (సహాబాల) సమాధులు కలవు.  శివవర్ధన్ జామా మస్జిద్ సమీపంలో ప్రముఖ మసీదు-ఇ –షరీ కలదు. మసీదు ను అరేబియా సముద్రం ఒడ్డున ఒక చిన్న ట్రాక్ పై నిర్మించారు. అక్కడి వాతావరణం మరియు పరిసరాల  దృశ్యం అద్భుతమైనది గా  ఉంది.

అరబ్ వర్తకులు స్థానికులతో సంభంద బాoధవ్యములను నెలకొల్పుకొన్నారు. కొందరు తిరిగి అరేబియా తిరిగి వెళ్ళిన భారతదేశం యొక్క పశ్చిమ తీర ప్రాంతాల్లో ఇప్పటి వరకు వారి సంతతి కనిపిస్తూనే ఉంది. ఉంటుంది.

ఈ విధంగా తొలుత భారత దేశం లోని పశ్చిమ తీరంలో (మలబార్, కొంకణ్, దయ్యూ,డామన్ మరియు గుజరాత్ తీరాలకు) అరబ్ వర్తకుల ద్వార ఇస్లాం ప్రవేశించినది.  ఆ పిదప ఎనిమదవ శతాబ్దపు తొలి పాదము నుండి భారతదేశముపై జరిగిన దండయాత్రల వల్ల (అరబ్బులు, తుర్కులు, పర్షియన్లు, అఫ్ఘాన్లు, మంగోలులు వగైరా) కోటానుకోట్ల ప్రజలు మతాంతరీకరణ చేయబడ్డారు.ముహమ్మద్ బిన్ ఖాసిం లేదా మహమ్మద్ గజని  భారతదేశం లో ఇస్లాం మూలకర్తలు  కాదు కానీ వారు భారతదేశం లో  ముస్లిం పాలకులు గా  ఉన్నారు. ఆ తరువాత  క్రీ.శ. 1300 లో అరబ్బులునాగూరు, కిలక్కరై, అడిరాంపట్టణం, కాయల్పట్నం, ఎర్వాడి మరియు శ్రీలంక లలో షాఫయీలు, (వీరు ఈ ప్రాంతాలలో మరక్కర్ లు గా గుర్తింపు కలిగినవారు) స్థిరనివాసాలేర్పరచుకున్నారు. ఈ మరక్కర్ మిషనరీలు, ఇస్లామీయ బోధనలు వ్యాప్తిచేస్తూమలయాఇండోనేషియా ప్రాంతాలలో ఇస్లాంను వ్యాపింపజేశారు

.
 No comments:

Post a Comment