5 March 2017

ప్రపంచం లో అతి వేగం గా విస్తరిస్తున్న మతం ఇస్లాం- ప్యూ సంస్థ వివేదిక లోని ముఖ్య అంశాలు.


జనాభామతపరమైన అంశంపై అద్యయనం చేసిన అమెరికా కు చెందిన ఫ్యూ(Pew) సంస్థ నిర్వహించిన సర్వే నివేదిక ప్రకారం 2050 నాటికి  ప్రప్రంచం లో  వేగంగా విస్తరిస్తున్న మతం గా ఇస్లాంఅవిర్భవించ బోతున్నది.
Ø 2050 నాటికి క్రైస్తవుల సంఖ్య 290 కోట్లు (తొలి స్థానం)ఉంటుందనిముస్లింల సంఖ్య 280 కోట్లకు(రెండో స్థానం)చేరుతుందని పేర్కొంది.
Ø మొదటి సారిగా 2050 లో  ప్రపంచ జనాభా లో ఇస్లాం క్రైస్తవం  దాపుకు చేరబోతున్నది. 2070 నాటికి ఇస్లాం క్రైస్తవాన్ని అధిగామించవచ్చు.
Ø ముస్లిం జనాభా లో ప్రతి ముగ్గిరిలో ఒకరు 15 సంత్సర లోపు వారిగా ఉంటారు. ప్రతి ముస్లిం స్త్రీ సగటున 3 పిల్లలను కలిగిఉంటుంది.
Ø  2050 నాటికి ప్రపంచ జనాభా 900కోట్ల కు చేరవచ్చు అప్పట్టికి ప్రపంచ జనాభా లో 1/3వంతు ముస్లింలు ఉంటారు. మరియు  ప్రపంచ జనాభా లో ప్రతి 10 మంది లో ఆరుగురు క్రైస్తవులు + ముస్లిం లు అయి ఉంటారు.
Ø హిందువుల జనాభా కూడా ప్రపంచవ్యాప్తంగా 34 శాతం పెరిగి  140 కోట్లకు చేరుతుందని అంచనా. ప్రపంచం లో 3వ అతిపెద్ద జనాభా గా హిందువులు ఉంటారు.
Ø 2050 నాటికి భారత దేశంలోని హిందువుల జనాభా 79.5% నుంచి 76.7% కు తగ్గుతుంది,ముస్లిం  జనాభా 18% కు పెరుగుతుంది.
Ø భారత్ హిందూ మెజారిటీ దేశంగానే కొనసాగుతుందని పేర్కొంది..

Ø 2050 నాటికి ప్రపంచ జనాభా లో క్రైస్తవులు 31%, ముస్లింలు 30% ఉంటారు. హిందువులు 14.9% ఉంటారు.
Ø ప్రపంచ వ్యాప్తంగా  నాస్తికుల సంఖ్య 13.2% పెరగనుంది. వీరు బ్రిటన్ లో   అత్యధికం గా ఉంటారు. ఇక బోద్దమత పురోగతి కి అవకాసం లేదు.
Ø ప్రపంచంలో అత్యధిక ముస్లీంలను కలిగిన దేశo గా  2050 నాటికి భారత్ మొదటి స్థానానికి వస్తుందనీ ఆ సంస్థ వెల్లడించింది.
Ø యూరప్ జనాభా లో 10% ముస్లింలు ఉంటారు. ప్రతి పది మందికి ఒకరు ముస్లిం అయి ఉంటారు.
Ø బ్రిటన్ అత్యధిక ముస్లిం జనాభా కలిగిన 3వ దేశం గా మారుతుంది. 2050 నాటికి బ్రిటన్ లో ప్రతి తొమ్మిది మంది లో ఒకరు ముస్లిం గా ఉంటారు.
Ø అమెరికా లో ముస్లిమ్స్ జనాభా పెరిగి  యూదుల కన్న అతి పెద్ద నాన్-క్రిస్టియన్ వర్గంగా రుపొందుతారు.
Ø ప్రపంచ దేశాలలో క్రైస్తవ మెజారిటి కల దేశాల సంఖ్య 151 కు తగ్గుతుంది.
Ø  51 పైగా దేశాల జనాభా లో ముస్లిమ్స్ 50% కి పైగా ఉంటారు.

ముస్లింలు మరియు ఇస్లాంగురించి టాప్10 పుస్తకాలు (Top 10 Books About Muslims And Islam)





ప్రింట్ మీడియా/ఎలెక్ట్రానిక్ మీడియా లో  ముస్లింలు గురించి తప్పుగా రాయడం/చిత్రీకరించడం  కొత్త ఏమీ కాదు.నేడు ప్రపంచంలో, అనేక మందికి ముఖ్యంగా  అమెరికన్లకు ఇస్లాం గురించి తెలియదు. ప్రపంచం లోని అధిక శాతం  మంది ప్రజలు ముస్లింల గురించి తెలుసుకోవాలి అనుకొంటున్నారు. నా ఉద్దేశం లో ముస్లిమ్స్  గురించి చదవడం కన్నా వారిని ప్రతక్షం గా కలవడం ద్వారా మరియు పరిచయాలు ఏర్పరచుకోవడం ద్వారా వారి గురించి ఎక్కువ అవగాహన ఏర్పరచుకోవచ్చు. ఉదాహరణకు, "ముస్లిం " లేదా "ఇస్లాం "గురించి మార్కెట్ లో అనేక బుక్స్ ఉన్నాయి కానీ అవి ముస్లిమ్స్ గురించిన  నిజాలు వేల్లడించడం లేదు.

నిజానికి ముస్లిమ్స్ గురించి వాస్తవాలు ఉన్నాయన్న బుక్స్ లో కూడా ముస్లిమ్స్ గురించి అనేక ఘోరమైన, అస్పష్టమైన, తప్పుడు చిత్రణలు/అపోహలు  ఉన్నాయి. షరియా అంటే తెలియని వారు లేదా ఇస్లాం మూలా సూత్రాలు గురించి తెలియని వారు వాటి గురించి వ్రాస్తున్నారు. శాంతి మరియు సత్యాన్ని చాటే ఇస్లాం ను అనుసరించే కొన్ని బిలియన్ల విశ్వాసకుల(muslims) గురించి సత్యాన్ని తెలిపే బుక్స్ అతి తక్కువ గా  ఉన్నాయి. నా ద్రుష్టి లో ఇస్లాం గురించి సరిఅయిన  అవగాహన మరియు సత్యాన్ని తెలపడం  లో క్రింది 10 పుస్తకాలు సఫలం అయినాయి.

అమెరికన్లు లేదా ఇతరులు ముస్లింల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడే 10 అత్యుతమ ఆంగ్ల బుక్స్ ఇక్కడ ప్రస్తావిస్తాను.ముస్లింలు మరియు ఇస్లాం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే క్రింది పుస్తకాలు చదవవచ్చు.

నా అభిమాన జాబితాఈ క్రింది విధం గా  ఉంది

1.నో గాడ్ బట్ గాడ్ (No God but God) : దిని రచయిత రెజా అస్లాన్. రెజా అస్లాన్రచన పాత పుస్తకం కాని దీని ద్వారా ఇస్లాం యొక్క మూలాలు గురించి తెలుసుకొవచ్చు. ఇస్లాం యొక్క ఆరంభం, లో ముస్లింలు ఎల్లా ఉన్నారు? వారు ఇస్లాం ప్రపంచవ్యాప్తం గా విస్తరించినప్పుడు రాజకీయంగా, సంస్కృతి మరియు విశ్వాసపరంగా  ఎటువంటి మార్పులకు లోను అయ్యారో ఈ పుస్తకం వివరంగా తెలుపుతుంది. ఈ పుస్తకం నా అభిమాన పుస్తకం ఇందులో అస్లాన్ తన భావాలు పండితుడు గా వివరించినాడు కానిఒక ముస్లింగా రాయలేదు.


2. దిగ్రేట్ తెఫ్ట్(The Great Theft): దిని రచయిత ఖలేద్ అబౌ ఎల్ ఫద్ల్ (KHALID Abou El Fadl). ఇతడు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ముస్లింలు హేతుబద్ధ ఆలోచన నుండి తీవ్రవాదులు గా మారిన విధానపు సాహిత్య వివరణలు,తీవ్రవాదం మరియు కొన్నిసార్లు హింస కు పాల్పడిన విధానం గురించి  విపులం గా తన పుస్తకం లో వివరించినాడు.  నేడు కొన్ని ముస్లిం దేశాలలో చూస్తున్న రాజకీయ తిరుగుబాట్లు  మరియు విప్లవ సిద్దాంతాలను అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఒక అద్భుతమైన మార్గం.


3. జేనేరేషణ్ ఎం.(Generation M) : దీని రచయిత సెలినా జన్ మొహమేద్: ఈమె తన  పుస్తకం లో ప్రపంచవ్యాప్తం గా ముస్లిం యువత - ఆలోచన, వారి అనుభూతి మరియు వారిని నేడు ప్రపంచంలో ఏకైక శక్తిగా చేస్తున్న విధానం పై ఒక సర్వే ఉంది.వారు మతపరమైన మిల్లినియల్స్ గా రుపోoదుతున్న విధానం మరియు వ్యవస్థాపకత, సాంకేతిక, ఫ్యాషన్, ఆహారము, వినిమయతత్వం, వాతావరణ మార్పు పై వారి ఆలోచనలు చిత్రీకరించారు.


4. ది స్టొరీ ఆఫ్ఖురాన్ (The Story of the Quran)దిని రచయిత ఇంగ్రిడ్ మట్ట్సన్. ఇది ఒక చిన్న పుస్తకం. కానీ అది ఇస్లాం యొక్క పవిత్ర పుస్తకంఖురాన్ యొక్కమత, సాంస్కృతిక మరియు రాజకీయ ప్రాముఖ్యత ను  స్పష్టం చేస్తుంది. ఈ పుస్తకం ఒక ముస్లిం జీవితంలో దివ్య ఖురాన్ వహించే పాత్ర ఏమిటి, దానిని ఎవరు రాసినారు, అతడి పట్ల మన  భావాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు విపులంగా ఒక మతవేత్త మరియు టీచర్ అయిన మట్ట్సన్ సమాధానములు చెప్తారు.


5.ముహమ్మద్ ఎ ప్రోఫెట్ అఫ్ అవర్ టైం(Muhammad: A Prophet for Our Time) : ఈ పుస్తక రచయిత్రి కరెన్ ఆర్మ్ స్ట్రాంగ్. ఈమెముస్లింలందరు  గౌరవించే వ్యక్తిప్రవక్త (స) జీవితచరిత్రను తన పుస్తకం లో వివరించారు. ఇది అందరు  తప్పక చదవ వలసిన పుస్తకం.కరెన్ ఆర్మ్స్ట్రాంగ్ ఇస్లాం గురించి అనేక పుస్తకాలు రాశారుమరియు అన్ని పఠన యోగ్యం అయినవి.ప్రవక్త(స) గురించి చాలా మంది కి  తెలియదు వారికి ఇది  ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కాలం,మత విశ్వాసాలతో పని లేని చాలా అవసరమైన నిష్పాక్షికమైన, చారిత్రక గ్రంధం.


6.1001 ఇన్వెన్షన్స్(1001 Inventions): దీని రచయిత సలీం అల్ హస్సన్ని. ఈ పుస్తకం ముస్లిం నాగరికత యొక్క వికాసాన్ని తెలుపుతుంది. ముస్లింలు ప్రపంచానికి అందించిన అవిష్కరణలను  వివరించే గ్రంధం.  ఇది ఇస్లాం విమర్శకుల దృక్పదాన్ని మార్చుతుంది.  ఇది ఒక నేషనల్ జియోగ్రాఫిక్ ప్రెజెంటేషన్ మరియు కిడ్స్ వెర్షన్ కూడా కలిగి ఉంది. ముస్లిముల రూపొందించబడి నేటికీ ఉపయోగంలో ఉన్నఅమూల్యమైనవివిధ శాస్త్రీయ మరియు సాంకేతిక ఆవిష్కరణలను చూపును.




7.సర్వెంట్స్ అఫ్ అల్లాహ్ (Servants of Allah): దీని రచయిత సిల్విన్ ఎ. దియోఫ్ఫ్. ఇది ఆఫ్రికా ముస్లింలను గురించి తెల్పును. ఇది అమెరికా లో ఆఫ్రికన్ బానిసలతో ఇస్లాం యొక్క రాక మరియు మతపరమైన మనుగడ కోసం వారు చేసిన పోరాటం యొక్క పరిశోధనా అంశాలను అందిస్తుంది.



8.ముస్లిమ్స్ అండ్ ది మేకింగ్ అఫ్ అమెరికా (Muslims and the Making of America):
ఇది అమీర్ హుస్సేన్ చే అమెరికా లోని ముస్లిమ్స్ పై విబిన్న దృక్పదం తో రాయబడిన మరొక పుస్తకం. అమెరికన్ పాపులర్ కల్చర్ లో భాగం గా సంగీతం, రాజకీయాలు, నిర్మాణం మరియు స్పోర్ట్స రంగాలలో అమెరికన్ ముస్లిమ్స్ వహించిన మరుపురాని పాత్రను వివరిస్తుంది.  ఇది ఒక చిన్న పుస్తకం కాని  అత్యంత ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది.


9.ఐ స్పీక్ ఫర్ మైసెల్ఫ్(I Speak for Myself):ఇది  విశ్వాస ప్రయాణంలో తమ అనుభవాలను గురించి 40 మంది అమెరికన్ ముస్లిం మహిళలు రాసిన ఒక వ్యాసాల సిరీస్.వారి మతం ఒకటే కావచ్చు, వారి వ్యక్తిగత కధనాలు, నేపథ్యాలు బిన్నంగా కలవు. వాటిని ఇస్లాం యొక్క నేపద్యంలో సుందరంగా చిత్రించారు. అమెరికన్ ముస్లిం పురుషుల గురించిన  ఒక భాగస్వామ్య  వ్యాస సేకరణ కూడా ఉంది.


10.ది ఫియర్ అఫ్ ఇస్లాం (The Fear of Islam):


రచయిత టాడ్ హెచ్ గ్రీన్. ఈ పుస్తకం లో ఇతను  పాశ్చాత్యదేశాల్లో ప్రబలంగా ఉన్న ఇస్లామోఫోబియా యొక్క పరిచయం లేదా ముస్లింలoటే ఉన్న అకారణ భయం గురించి వివరించాడు. ఇది ఇస్లామోఫోబియా యొక్క మూలాల నుండి ప్రస్తుత సమస్యలకు వరకు ఉన్న ఒక సమగ్ర రీడర్ లేదా మీడియా సాధారణీకరణలు అర్ధం చేసుకోవటానికి  సాయపడును.

3 March 2017

ప్రముఖ సౌదీ అరేబియా ఉదారవాద కాలమిస్ట్ ఖలాఫ్ అల్- హర్బి దృష్టిలో భారత దేశం ప్రపంచంలో గొప్ప మత సామరస్య దేశం


In his latest column in 'Saudi Gazette', he heaps praises over భారతదేశం ఒక మత సామరస్యత లేని దేశం అనే వారు తప్పక చదవలసిన వార్త.
వివిధ అంశాలపై స్వేచ్చగా తన  అభిప్రాయాలు వెల్లడించి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖునిగా కొనియాడబడుతున్న  సౌదీ అరేబియా ఉదారవాద కాలమిస్ట్ మరియు ఆలోచనాపరుడు అయిన ఖలాఫ్ అల్- హర్బి  దృష్టిలో భారత దేశం భూమిపై కొనియాడదగిన మత సామరస్యాతను  పాటించే దేశం.
ఇటివల 'సౌదీ గెజిట్' లో తన తాజా కాలమ్  “ఏనుగుల సవారీలు కలిగిన ఒక దేశం - భారత దేశం” రాస్తూ భారత దేశం ను  100 బాషలు,  100 మతాలు కలిగి మత సామరస్యం పాటించే  దేశం గా అభివర్ణించాడు. ఒక దృడమైన, అబివృద్ది చెందిన దేశంగా భారత దేశం వర్ధిల్లుతుంది మరియు  అక్కడ గుండు సూది నుండి అంగారక గ్రహం వెళ్ళే రాకెట్ వరకు అన్ని తయారు చేయబడతాయి. ప్రపంచo అసహనం గురించి ఎలా మాట్లాడిన భారతదేశం, మత సామాజిక, రాజకీయ లేదా వర్గ తేడాలు లేకుండా సహనం మరియు శాంతియుత సహజీవనo నేర్పిన పురాతన మరియు అత్యంత ముఖ్యమైన పాఠశాల గా  ఉంది.  
మన మనస్సులలో వాస్తవం తో   సంబంధం లేకుండా  భారతదేశం పేదరికం మరియు వెనుకబడిన దేశం గా ఉంది. కాని ఇది భారత దేశం యొక్క నిజమైన చిత్రం కాదు. మనం
నూనె శకం ముందు పేదగా ఉన్నప్పుడు, మన మనస్సుల్లో భారతదేశం యొక్క చిత్రం గొప్పతనానికి  మరియు నాగరికత కు చిహ్నం గా ఉందేది  కానీ మన  ఆర్థిక పరిస్థితులు  మెరుగుపడిన తర్వాత పేదరికం, వెనుకబాటుతనం కలిగిన దేశం గా భారతదేశం యొక్క చిత్రం మారింది.

మనకు  వివేచన  ఉంటే, మనము భారతదేశం యొక్క గొప్పతనo లేదా  దారిద్ర్యo ను  అర్ధం చేసుకోనేవారము. భారత ప్రజలు భయం లేదా ఆత్రుత మొదలైన ఏ భావన లేకుండా విరుద్ధమైన ఆదర్శాలు మరియు ఆలోచనలు కలిగి ఉన్నారు. భారతదేశం యొక్క అపారమైన జన సామర్థ్యాన్ని చూచి మనము ముగ్ధులయ్యేవారము.

 మనము అందరు  అరబ్బులను  ఒక గొప్ప ప్రయోగంలో భాగంగా భారతదేశం లో చేర్చిన  వారు ఒక మానవ సముద్రంలో మునిగే వారు. బిన్న జాతీయ పోకడలు మరియు మత తీవ్రవాదాన్ని అనుసరించే వారు కాదు మరియు ప్రపంచంలో తమ సోదరులు  మరియు సోదరీమణులను గౌరవించే వారు. 

వైవిధ్యబరిత ఆలోచనలు మరియు నమ్మకాలు సహజీవన భారతీయ సంస్కృతి యొక్క DNA లో ఉన్నాయి. "భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద మరియు అతి పురాతన ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా ఉంది. భారత దేశం లో   మతాలు లేదా జాతుల మద్య భారీ వ్యత్యాసాలు  ఎన్నడూ లేవు. భారత దేశంకు  దాని పేద ప్రజల పట్ల  ఏహ్య భావము లేదా దాని గొప్ప పౌరుల పట్ల ద్వేషం లేదు. ఇది మహాత్మా గాంధీ జన్మించిన దేశం మరియు అదే సమయంలో బ్రిటీష్ కాలనీ వాసులు కలిగిన దేశం . "

"భారత ప్రజలు అనేకరంగాలలో గణతి పొందారు. వారు గొప్ప వ్యక్తులు. ఎవరూ నిజాన్ని తిరస్కరించలేరు ఒక్క  అసూయపడే లేదా వారు తప్ప."

"భారతదేశం లో పర్యటించే  అరబ్బులు భారతీయులను కలుషితం చేసి వారి మత మరియు జాతి పరమైన తేడాలు గుర్తు చేస్తారు. వారి మతపరమైన మరియు జాతి అసమానతలు   గుర్తు చేసి భారతీయులను ఇతరులను చంపే వారిగా  అనవచ్చు కాని  భారత దేశ ప్రజలు  కొనియాడదగిన మత సామరస్యాతను  పాటించే వారు.
.