14 October 2018

కేరళ ముస్లింలు ఆర్ధికంగా, అక్షరాస్యత పరంగా మరియు, జనాభా పరంగా వృద్ధి రేటు లో ఉన్నారు. : నివేదిక.



-

భారత దేశ మైనారిటీ పాలసీ మరియు ముస్లిం సమాజ సామాజిక మరియు ఆర్ధిక స్థాయి ని అంచనా  వేసే సెంటర్ ఫర్ పాలసీ అనాలిసిస్ ప్రకారం  కేరళలోని ముస్లిం జనాభా 2001 లో 3.18 కోట్ల నుంచి 2011లో 3.34 కోట్లకు పెరిగింది.

ఉన్నత విద్యలో తక్కువ శాతం ఉండటం  మరియు జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండటం  ప్రధానంగా ముస్లింల వెనుకబాటుతనమునకు కారణమని  నిందించినప్పటికీ, కేరళలో ముస్లిం కమ్యూనిటీ జనాభా 2001-2011 మధ్యకాలంలో 15 లక్షలు పెరిగింది అని మరియు గణనీయంగా  వారి ఆర్థిక స్థాయి మెరుగు పడినందని కొత్త గణాంకాలు తెల్పుతున్నాయి.

కేరళలో ముస్లింల ఆర్ధిక స్థితి మరియు అక్షరాస్యత స్థాయి బాగానే ఉన్నప్పటికీ, వారి జనాభా పెరుగుదల రేటు జాతీయ సగటు కన్న ఎక్కువగా  ఉన్నది. ఇది సెంటర్ ఫర్ పాలసీ అనాలిసిస్, ఒక స్వతంత్ర మరియు లాభాపేక్ష రహిత పాలసీ పరిశోధనా సంస్థ అంచనా. .

భారత దేశ మైనారిటీ పాలసీ మరియు ముస్లిం సమాజ సామాజిక మరియు ఆర్ధిక స్థాయి ని అంచనా  వేసే సెంటర్ ఫర్ పాలసీ అనాలిసిస్ ప్రకారం  కేరళలోని ముస్లిం జనాభా 2001 లో 3.18 కోట్ల నుంచి 2011లో 3.34 కోట్లకు పెరిగింది.ఈ కాలంలో రాష్ట్రంలోని  జనాభా పెరుగుదల గణనీయంగా పెరగడంతో ముస్లిం జనాభా 10.10 లక్షలు పెరిగింది. హిందూ జనాభా 3.62 లక్షల మంది, క్రైస్తవ జనాబా  84,000 పెరిగింది.

అయితే కేరళలో ముస్లింల ఆర్ధిక స్థితి మరియు వారి అక్షరాస్యత రేటు జాతీయ సగటు కంటే ఎక్కువుగా ఉంది. కేరళలో మొత్తం జనాభాలో హిందువులు 54.9 శాతం, ముస్లింలు 26.6 శాతం, క్రైస్తవులు 18.4 శాతం ఉన్నారు.

అయితే 2015 లో, హిందువుల పిల్లల జననాల (child births)  రేట్ 42.87 శాతం, ముస్లింల పిల్లల జననాల రేట్  41.5 శాతం మరియు క్రైస్తవుల పిల్లల జననాల రేట్  15.42 శాతం గా ఉంది.

విద్య మరియు శ్రామిక బలంలో ముస్లిం మహిళల కృషి గురించి మాట్లాడుతూ నివేదిక దేశంలో మైనారిటీలకు సంబంధించిన ఈ ముఖ్యమైన అంశంపై ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిoచాలని చెప్పింది.

నివేదిక ప్రకారం, మైనార్టీల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నడుపుతున్నప్పటికి, కానీ వాటి "అక్రమ improper" అమలు కారణంగా పథకాలు ఆశించిన ఫలితాలను ఇవ్వవు.


2011 జనాభా లెక్కల నివేదిక ప్రకారం జాతీయ స్థాయిలో మహిళా ఉద్యోగశక్తీ  (women participation in the workforce) 24.64 శాతం కాగా, ముస్లింలలో అది  15.58 శాతంగా ఉంది.రిపోర్ట్ ప్రకారం  తక్కువ అక్షరాస్యత రేటు ఆర్థిక అవకాశాల లభ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తోందని, ఇది శ్రామికశక్తిలో పాల్గొనడాన్ని ప్రభావితం చేస్తుంది అని చెప్పింది.

పెద్ద జాతీయ లక్ష్యాలను సాధించేందుకు మరియు మహిళల పరిస్థితి మెరుగుపర్చడానికి ప్రభుత్వం అల్పసంఖ్యాక కార్యక్రమాలలో మార్పులు తీసుకురావాలని  నివేదిక సూచిస్తుంది.


No comments:

Post a Comment