17 October 2018

భారత స్వాతంత్రఉద్యమం లో జామా మసీద్ పాత్ర Role of Jama Masjid in India’s Freedom Struggle




 

ప్రతి సంవత్సరం ఆగష్టు 15, న భారత ప్రధాని డిల్లి లోని ఎర్ర కోట పై  జండా ఎగరవేస్తారు మరియు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎర్రకోట మరియు దాని పరిసర ప్రాంతాలలో మువేన్నల  జండా రేపరెపరాడుతుంది.   స్వాతంత్ర్య దినోత్సవం నాడు చారిత్రాత్మక జామా మసీదుపై జాతీయ జెండా గర్వంగా రేపరపలాడుతుంది.

1857 లో భారతదేశ ప్రధమ స్వాతంత్ర పోరాటంలో పోరాడుతున్నప్పుడు, అజిముల్లా ఖాన్ “మా  ఔర్ వతాన్ భారత్ కీ జై” అనే నినాదం  ఇచ్చారు. జమా మస్జిద్ ఏరియా లో భారతీయ జెండా మతంతో సంబంధం లేకుండా గర్వంగా ఎగురుతూ ఉంటుంది. వాల్డ్ సిటీలో అనేక జెండా-ఎగురవేసే  వేడుకలు జరుగును. జండా గృహాలు, కార్యాలయాలు మరియు బహిరంగ ప్రదేశాల్లో ఎగురవేయబడును.

ఓల్డ్ ఢిల్లీలో నివసిస్తున్న అబు సూఫియాన్ ప్రకారం ఓల్డ్ ఢిల్లీలో ఉన్న ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకునే ఉత్సాహం మరి  ఎక్కడైనా కనుగొనడం కష్టం.

జామా మసీదు ప్రాంతంలో మరియు చుట్టుపక్కల గల వివిధ  పాఠశాలలు, హోటళ్ళు, దుకాణాలు మొదలైన వివిధ ప్రదేశాలలో అన్ని పరిమాణాల జాతీయ పతాకాలు ఎగురుతుంటాయి.జామా మసీదు యొక్క ఇరుకైన ప్రాంగాణాలలో దేశభక్తి గీతాలు బిగ్గరగా వినిపించును.

భారత స్వాతంత్ర్య పోరాటంలో జమా మసీదు పాత్ర

హిందల్ అహ్మద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ అబిప్రాయం ప్రకారం "ఎర్రకోట మరియు జామా మసీదు బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో మతం లేదా కులo కు  అతీతంగా  భారతీయ ప్రజానీకపు  రాజకీయ ప్రేరణకు ఎల్లప్పుడూ చిహ్నంగా ఉన్నాయి. వేర్వేరు నేపథ్యాల మరియు సిద్ధాంతాల నుండి వచ్చిన వివిధ రాజకీయ పక్షాల నాయకులు తమ రాజకీయ సందేశాలను అందించడానికి మసీదు యొక్క మింబర్ (పల్పిట్) ను ఉపయోగించారు. గాంధీ, నెహ్రూ మరియు ఆజాద్ – ఆర్య సమాజం నుండి  స్వామి శ్రద్దనంద మొదలగు నాయకులు ఇక్కడ ప్రసంగాలు చేశారు. కాని గుర్తించుకోవలసిన అంశం ఏమిటంటే "1946 లో ముస్లిం లీగ్ యొక్క ఊరేగింపులో పాల్గొన్నప్పటికీ, జిన్నా మసీదు లోపల ప్రసంగాన్ని ఎప్పుడూ చేయలేడు.

1857 తిరుగుబాటు:

1650 లో నిర్మించినప్పటి నుండి జుమా మసీదు ప్రార్ధనలకు మాత్రమే కాకుండా, భారత చరిత్రకు సాక్షిగా ఉంది. 1857 లో బ్రిటీష్ అధికారానికి వ్యతిరేకంగా విముక్తి మరియు తిరుగుబాటుకు ఇది సంకేతంగా ఉంది. తిరుగుబాటు తరువాత, బ్రిటీష్ వారు  మసీదును ఆక్రమించి, దానిలో ప్రార్థనలు జారకుండా  ప్రజలను నిరోధించినారు. ప్రార్ధనలు జరగకుండా ప్రవేశ ద్వారం వద్ద బ్రిటిష్ భారత దళాలు కాపలా కాస్తున్నారు. జమా మసీదును సైనికుల మెస్ గా ఉపయోగించారు, గుర్రాలు దాని కారిడార్ల లో కట్టివేయబడినవి మరియు సిపాయిలు నిండుగా ఆల్కహాల్ మత్తులో ఉగుతున్నారు.

మే-సెప్టెంబర్ నెలల్లో, మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ నేతృత్వం లో ఈస్ట్ ఇండియా కంపెనీపై భారతదేశం యొక్క సిపాయిలు మరియు స్థానికులు తిరుగుబాటు చేసారు.. 1857 నాటి వేసవి కాలము మరియు వర్షాకాల నెలలలో, జమా మసీదు ముఖ్య కేంద్రంగా షాజహానాబాద్ కూడా ఈ పోరాటానికి కేంద్రంగా ఉంది.1857 తిరుగుబాటులో ఢిల్లీ ముట్టడి సమయంలో తిరుగుబాటు సమావేశాలకు ఈ మసీదు ప్రధాన కేంద్రంగా ఉంది.

ఆ సమయం లో జమా మస్జిద్ యొక్క గోడలపై పోస్టర్స్ భారత ప్రజల మధ్య మత విభజనను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న దళాలచే పెట్టబడ్డాయి. మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ యొక్క ఆదేశాలపై వీటిని వెంటనే తొలగించారు. మౌల్వి మహ్మద్ బఖర్ తన వార్తాపత్రిక ది ఢిల్లీ ఉర్దూ అక్బర్లో ఈ పోస్టర్లను విమర్శించాడు,మరియు  హిందువులు మరియు ముస్లింలు అహల్ ఇ వతన్ (compatriots) గా పేర్కొంన్నాడు మరియు  వారు వెయ్యి సంవత్సరాలు కలిసి మెలసి జీవించారు అని అన్నాడు.

తిరుగుబాటు తరువాత బ్రిటీష్ ప్రభుత్వం   జమా మసీదును స్వాధీనం చేసుకుని, దాని కూల్చివేత ప్రణాళికను చేపట్టింది. ముస్లింలచే అసంఖ్యాకమైన పిటిషన్లు తరువాత 1862 లో, బ్రిటిష్ ప్రభుత్వం మసీదును అసలు నివాసులకు తిరిగి ఇచ్చింది.

జుమా మసీదు యొక్క లౌకిక ప్రకృతి:

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత రౌలట్ చట్టం,  ఖిలాఫత్ ఉద్యమం  మరియు నాన్-కోపరేషన్ మూవ్మెంట్  సమయంలో, , జాతీయవాద ఉద్యమం మరియు హిందూ-ముస్లిం ఐక్యత కలసి ముందుకు సాగాయి. హిందూ-ముస్లిం ఐక్యత సూత్రం ప్రపంచానికి చాటటానికి , ముస్లింలు   ఢిల్లీలోని జామా మసీద్ నుండి ఆర్య సమాజానికి చెందిన స్వామి శ్రద్దానంద ను ప్రసంగించమని అడిగారు. డాక్టర్ సైఫ్ద్దిన్ కిచ్చ్లు, కు అమృతసర్ లోని సిక్కు మందిరం అయిన స్వర్ణ దేవాలయానికి చెందిన తాళాలు keys ఇవ్వబడ్డాయి.'హిందూ-ముస్లిం కి జై'  నినాదం తో మొత్తం దేశం ప్రతిధ్వనిoచింది.

 జామ మసీదు నందు  4 ఏప్రిల్ 1919 న స్వామి శ్ర్రద్దానంద్ కుంకుమ వస్త్రాలు ధరించి, అక్కడ ప్రజలను ఉద్దేశించి హిందూ-ముస్లిం ఐక్యత మరియు బ్రిటిష్ పాలన కు వ్యతిరేకంగా ప్రసంగించారు. స్వామి శ్ర్రద్దానంద్ వేద మంత్ర ఉచ్చారణ తో  తన ప్రసంగాన్ని ప్రారంభించారు.దానికి అందరు ‘అమీన్’ అని బదులిచ్చారు.  'ఈ జాతీయ ఆలయం' లో మాతృభూమి యొక్క "ప్రేమతో కూడిన నీటితో ‘water of love’" తమ  హృదయాలను శుద్ధి చేయాలని ఆయన ప్రతి ఒక్కరిని కోరారు మరియు భారతీయులు అందరు సోదరులు మరియు సోదరీమణులు అని భోదించారు.

ఈ మసీదులో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అక్టోబరు 1947 లో తన చారిత్రాత్మక ప్రసంగాన్ని చేసారు అది  భారతదేశం కోసం త్యాగం చేసిన వారి గురించి జ్ఞాపకం చేసింది. అయన తన ప్రసంగం లో  ఇలా అన్నారు: ప్రవక్త ముహమ్మద్ (స)ప్రకారం , 'అల్లాహ్ ప్రపంచం మొత్తంను  ఒక మసీదును చేసారు.  'అందువలన స్వచ్ఛమైన (పాక్) మరియు మలినాలతో ఉన్న భూమి అన్న ప్రశ్న తలెత్తదు.


19 వ మరియు 20 వ శతాబ్దాలలో జరిగిన  స్వాతంత్ర ఉద్యమం గురించి వ్రాసిన సాహిత్యపు సరళమైన అధ్యయనం నిజానికి ఢిల్లీకి మాత్రమే కాకుండా, ముస్లింల రక్తంతో భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది అని స్పష్టపరుస్తుంది. రండి! ద్వేషం, మూఢనమ్మకం నుండి భారతీయులను మతపరమైన మార్గాల్లో విభజించాలన్న ప్రయత్నాల నుండి స్వేచ్ఛ పొందడానికి ప్రతిజ్ఞ చేద్దాం.

హిందూ హై హమ్ వతాన్ హై హిందూస్తాన్ హమారా (Hindi hain hum watan hai Hindustan hamara).

No comments:

Post a Comment