2018 ప్రపంచవ్యాప్త బహుముఖ పేదరిక(గ్లోబల్ మల్టీ డైమేన్షల్ పావర్టి ఇండెక్స్ Global Multidimensional Poverty Index) సూచిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ల మంది ప్రజలు బహుముఖ పేదరికo (మల్టీ డైమేన్షల్ పావర్టి) లో నివసిస్తున్నారు.
కొత్త గణాంకాల ప్రకారం 2005-06
నుంచి ఒక దశాబ్ద కాలంలో చారిత్రత్మికంగా 270 మిలియన్ల మందికి పైగా ప్రజలు పేదరిక
స్థాయి నుంచి బయట పడ్డారు ముఖ్యంగా పేదరికo- పిల్లలలో, పేద దేశాలలో, భారత దేశం లోని షెడ్యూల్డ్ తెగలు, ముస్లింలలో వేగంగా
తగ్గింది.
యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (UNDP) మరియు ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్
హ్యూమన్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్ (OPHI) చే విడుదల చేయబడిన 2018 గ్లోబల్ మల్టి డెమెన్స్నల్ పావర్టీ ఇండెక్స్ (MPI) ప్రకారం, 1.3 బిలియన్ల ప్రజలు
ప్రపంచవ్యాప్తంగా బహు ముఖ పేదరికంలో నివసిస్తున్నారు.
2018 గ్లోబల్ మల్టి డెమెన్స్నల్ పావర్టీ ఇండెక్స్ (MPI) సుమారు 104 దేశాల జనాభాలో దాదాపు పావువంతు జనాభా కు సమానం. ఈ 1.3
బిలియన్లలో దాదాపు 46 శాతం మంది అత్యంత పేదరికంలో జీవిస్తున్నారని భావించబడుతుoది, కాని MPI లో ఉన్న పరిమాణంలో కనీసం సగం మంది దాని నుంచి
బయటపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని అధిగమించాల్సిన అవసరం అయినప్పటికీ, అలాంటి పేదరికం పరిష్కరించబడుతుoది
అనటానికి ఆశాజనకమైన సంకేతాలు కలవు. సూచిక ప్రకారం భారతదేశంలో, 2005-06 మరియు 2015-16 మధ్యకాలంలో దాదాపు
271 మిలియన్ల మంది పేదరికం నుండి బయటికి వచ్చారు. దేశంలో పేదరికం దాదాపు పది
సంవత్సరాల కాలంలో 55 శాతం నుంచి 28 శాతానికి పడిపోయింది..
కాలక్రమేణా పురోగతిని అంచనా వేసిన మొదటి దేశం ఇండియా.
కాలక్రమేణా పురోగతిని అంచనా వేసిన మొదటి దేశం ఇండియా.
పేదరికం - ప్రత్యేకించి పిల్లలలో - పరిష్కారించగల గల పురోగతి
చూపుతుంది. భారతదేశంలోనే 271 మిలియన్లు మంది కేవలం పది సంవత్సరాల్లో బహుముఖ పేదరికాన్ని (మల్టి డెమెన్స్నల్ పావర్టీ) తప్పించుకున్నారని యుఎన్డిపి(UNDP)
అడ్మినిస్ట్రేటర్ ఆచిం స్టినేర్ చెప్పారు.
భారత దేశo లో గ్లోబల్ నిష్పత్తుల మార్పు జరిగింది. 2005-06
మరియు 2015-16 మధ్య, భారతదేశంలో బహుముఖ పేద ప్రజల (మల్టి డెమెన్స్నల్ పూర్) సంఖ్య 635 మిలియన్ల నుంచి 364 మిలియన్లకు
పడిపోయింద. ఇది ఒక చారిత్రక మార్పును
సూచిస్తుంది.
అంతేకాక, 1999-2006 మధ్యకాలంలో, పేద వర్గాల బహుముఖ పేదరికం నెమ్మదిగా తగ్గిపోయినప్పుడు, 2005-06 నుండి 2015-16 వరకూ బహుముఖ
పేదరికం స్థాయి (MPI) వేగంగా తగ్గింది. "అంటే పిల్లలలో పేదరికం తగ్గుదల, పేదరాష్ట్రాలు, షెడ్యూల్డ్ తెగలు, ముస్లింలలో వేగవంతంగా ఉంది. వారు తిరిగి పేదరికంలో వెనక్కి
వెళ్ళకుండా చాలా దూరంగా ఉన్నారు," అని అది
చెప్పింది.
వివిధ రకాలైన పేదరికాన్ని తగ్గించడంలో భారత్ అద్భుత ప్రగతి
సాధించిందని మరియు 2005-06, మరియు 2015-16 మధ్యకాలంలో బహుముఖ పేదరికం 27.5 శాతానికి తగ్గింది.
·
షెడ్యూల్డ్ కులాలలో బహుముఖ పేదరిక సూచిక (MPI) 2005-06 నుండి2015-16 వరకు 0.338 నుండి 0.145 కు పడిపోయింది.
·
ఇతర వెనుకబడిన తరగతులలో(OBC), (MPI) 2005-06 నుండి 2015-16 వరకు 0.291 నుండి 0.117 వరకు పడిపోయింది
·
ముస్లింల విషయంలో MPI 2005-06 నుండి 2015-16 వరకు 0.331 నుండి 0.144 కు
పడిపోయింది.
·
షెడ్యూల్డ్ తెగలలో MPI 2005-06 నుండి 2015-16 వరకు 0.447 నుండి
0.229 వరకు పడిపోయింది
పేదరికం తగ్గింది
మరియు ప్రస్తుత పోకడలు కొనసాగితే, అది మరింత
తగ్గటానికి సిద్దంగా ఉందని పేర్కొంది.
రాష్ట్రాలు, కులాలు, మతాలు, మరియు వయస్సు గల పేద వర్గాలలో -(MPI) 2005-06 నుండి 2015-16వరకు అతిపెద్ద తగ్గింపులను కలిగి ఉన్నాయి, అవి మరింత తగ్గింపును చూపుతున్నాయి, అయినప్పటికీ వారు ఇoకా పేదరికం యొక్క అధిక స్థాయిలను అనుభవిస్తున్నారు. 1998-99 నుండి 2005-06 మధ్యకాలంలో దీనికి వ్యతిరేక ధోరణి కొనసాగింది. భారతదేశo లోని పేద వర్గాల వృద్ధి నెమ్మదిగా పెరిగింది.
జార్ఖండ్లో మెరుగైన అభివృద్ధి జరిగింది తరువాత స్థానం
లో అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చత్తీస్గఢ్, నాగాలాండ్ ఉన్నావి. అయితే, 2015-16నాటికి బీహార్ ఇప్పటికీ అత్యంత పేద రాష్ట్రంగా ఉంది, దాని జనాభాలో సగం మంది పేదరికంలో ఉన్నారు.2015-16
నాటికి బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నాలుగు పేద రాష్ట్రాలుగా ఉన్నాయి వాటిలోని 196 మిలియన్ల మంది ప్రజలు ఇప్పటికీ పేద ప్రజలుగా
(MPI) ఉన్నారు.ఇది భారత దేశంలోని పేద
ప్రజలలో సగం మందికి సమానం.
పేదరికం తగ్గింపు యొక్క 'ధోరణి' మతాలు మరియు కుల సమూహాల్లో కూడా
కనిపిస్తుందని ఈ డేటా పేర్కొంది. పేద వర్గాలు (ముస్లింలు మరియు షెడ్యూల్డ్ తెగలులలో)
2005-06 నుండి 2015-16 వరకు పది సంవత్సరాల కాలంలో పేదరికం స్థాయిలు తగ్గిపోయాయి. అయినప్పటికీ ఈ రెండు వర్గాలు ఇప్పటికీ పేదరికం
అత్యధిక స్థాయిలో ఉన్నాయి. ఉదాహరణకి, 2005-06లో తమను తాము ఒక షెడ్యూల్డ్ తెగలగా
గుర్తించిన 80 శాతం మంది లో 2015-16 నాటికి 50శాతం మంది పేదలుగా ఉన్నారు.
భారతదేశంలో 40.4 మిలియన్ల మంది ప్రజలు జిల్లాలలో నివసిస్తున్నారు.
వారిలో 60% మంది -బీహార్లోని పేద
జిల్లాల్లో 20.8 మిలియన్లు, ఉత్తరప్రదేశ్లోని పేద జిల్లాలలో
10.6 మిలియన్లు మరియు మిగతావారు ఛత్తీస్గఢ్, గుజరాత్, , జార్ఖండ్, మధ్యప్రదేశ్ మరియు ఒడిశా లోని పేద జిల్లాలలో
నివసిస్తున్నారు.
2006 మరియు 2017 మధ్య కాలంలో, జీవన కాలపు అంచనాలు (life expectancy) సబ్ సహారా ఆఫ్రికాలో ఏడు సంవత్సరాలు పెరిగింది మరియు దక్షిణ ఆసియాలో దాదాపు నాలుగు సంవత్సరాలు, మరియు ప్రాధమిక విద్యలో నమోదు రేట్లు 100 శాతానికి పెరిగాయి. ఇది బహుముఖ పేదరికం మెరుగుదల కోసం బాగా పనిచేస్తుంది.
పేదరికంలో
జీవిస్తున్న ప్రజలలో సగం మంది 18 సంవత్సరాలు కంటే తక్కువ వయస్సు ఉన్నట్లు అంచనాలు
తెలియజేస్తున్నాయి. కొత్త గణాంకాల ప్రకారం 104 ప్రధానంగా తక్కువ మరియు మధ్య-ఆదాయం
కలిగిన దేశాలలో, 662 మిలియన్ల పిల్లలు బహుముఖ పేదరికం లో
ఉన్నారు. 35 దేశాల్లో సగం మంది పిల్లలు పేదవారే.
ప్రస్తుతం
స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో (Sustainable
Development Goals) సరిసమానంగా ఉన్న 2018 గణాంకాలు, ప్రపంచ
జనాభాలో దాదాపు మూడొంత మందిని కవర్ చేస్తున్నాయి. ప్రపంచంలోని
అన్ని అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో బహు ముఖ పేదరికం కనిపిస్తుంది, కానీ
ఇది ముఖ్యంగా సబ్-సహారా ఆఫ్రికా మరియు దక్షిణ ఆసియాలో తీవ్రoగా ఉంది.
No comments:
Post a Comment