11 October 2018

ఇస్లాం: ఒక అవలోకనం (Islam: An Overview)




 


ఈ నాడు ప్రపంచంలో అత్యధికంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న ధర్మం ఇస్లాం ధర్మం. క్రైస్తవం తరువాత ప్రపంచంలో రెండోవ స్థానం లో ఉన్న మతం ఇస్లాం. ప్రపంచం లో  ఒక బిలియన్ కన్నా అధికమంది ఇస్లాం ను అనుసరిస్తున్నారు.  ఇస్లామిక్  దేశాలు ఉత్తర ఆఫ్రికా నుండి ఆగ్నేయ ఆసియా వరకు విస్తరించి ఉన్నాయి. ముస్లింలు నలభై-ఎనిమిది దేశాల్లో మెజారిటీని కలిగి ఉన్నారు మరియు పలు ఇతర దేశాలలో గణనీయమైన మైనారిటీగా ఉన్నారు.

అరబ్ ప్రపంచం తరచుగా ఇస్లాం యొక్క హృదయం గా పరిగణించబడుతున్నప్పటికీ, ఎక్కువ మంది ముస్లింలు ఆసియా మరియు ఆఫ్రికాలో నివసిస్తున్నారు. ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారతదేశం, మధ్య ఆసియా మరియు నైజీరియాలో అతిపెద్ద సంఖ్యలో ముస్లింలు ఉన్నారు. ఇటీవల సంవత్సరాల్లో ఇస్లాం పశ్చిమ దేశాల్లో గణనీయంగా వ్యాప్తి చెందినది. ఇప్పుడు అది ఐరోపాలోని పలు ప్రాంతాల్లో రెండవ అతిపెద్ద ధర్మం గా  మరియు యునైటెడ్ స్టేట్స్లో మూడవ అతిపెద్ద ధర్మం గా పరిగణించ బడుతుంది.

ఇస్లాం అనే పదానికి  అరబిక్ మూలం సలాం (s-l-m) అనగా  "సమర్పణ" లేదా "శాంతి" అని అర్ధం. ముస్లింలు అనగా దేవుని చిత్తానికి లేదా చట్టానికి లొంగిపోయిన వారు మరియు దేవుని అందు మరియు  తమ అందు శాంతిని పొందువారు అని అర్ధం.    ఇస్లాం స్వీకరించిన వ్యక్తి ప్రపంచవ్యాప్త ఇస్లామిక్ సమాజం ఉమ్మః (faith community) లో సభ్యుడు మరియు అతను తన   వ్యక్తిగత మరియు సామాజిక జీవితo లో దేవుని చిత్తాన్ని (God's will) పాటించటానికి మరియు దానిని అమలు చేసే బాధ్యతను  కలిగి ఉంటాడు.

ఇస్లాం ధర్మానికి ప్రాతిపదిక -  ఒకే దేవుని అందు నమ్మకము(ఎకేశ్వరాధన  monotheism) మరియు దైవ గ్రంధాలను, ప్రవక్తలు, నైతిక బాధ్యత, జవాబుదారీతనం మరియు అంతిమ లేదా తీర్పు దినo అందు విశ్వాసం. యూదులు, క్రైస్తవులు, మరియు ముస్లింలు అబ్రహం (ఇబ్రహీం) కు చెందిన సంతతిగా పరిగణించబడ్డారు, అయినప్పటికీ వారు అదే కుటుంబంలోని వివిధ శాఖలకు చెందినవారు.  యూదులు మరియు క్రైస్తవులు అబ్రాహాము మరియు ఆయన భార్య శారా యొక్క వారసులు మరియు  వారి కుమారుడు ఇస్సాకు (ఇషాక్) సంతతికి చెందినవారు.  ముస్లింలు ఇష్మాయేలు (ఇస్మాయిల్) సంతితికి చెందిన వారు. ఇస్మాయిల్, సారా యొక్క ఈజిప్షియన్ సేవకురాలు  హాగరు  ద్వారా అబ్రాహాము కు జన్మించిన  మొదటి కుమారుడు. ఉత్తర అరేబియాలో ఉన్న అరబ్స్ కు ఇష్మాయేలు తండ్రి అయ్యాడు. ఇస్లాం అసలైన ఏకత్వ విశ్వాసమని ముస్లింలు భావిస్తున్నారు, ఇది అబ్రామిక్ విశ్వాసాల యొక్క అసలైన మూలనమ్మకం, జుడాయిజం మరియు క్రిస్టియానిటీలు దానిలో పుట్టిన శాఖలుగా పరిగణిస్తారు.  

అంతిమ దైవ గ్రంధం దివ్య ఖుర్ఆన్, ఏడవ శతాబ్దంలో అరేబియాలో ప్రవక్త ముహమ్మద్ (స) కు  దేవుని ద్వారా బహిర్గతమైంది. ముస్లింలు దానిని యధాతధం గా పాటిస్తారు/అనుసరిస్తారు. ఇస్లాం యొక్క కేంద్రం మరియు పునాది అల్లాహ్. ముస్లింలు అల్లాహ్ అని "సృష్టికర్త" ను పిలుస్తారు. అల్లాహ్ సర్వోత్కష్టమైన అత్యంత  శక్తిమంతుడు, సృష్టికర్త, సర్వజ్ఞుడు, పాలకుడు, పోషకుడు  మరియు న్యాయాధిపతి అని ముస్లింలు విశ్వసిస్తారు.

ఇస్లాం యొక్క ఏకేశ్వరాధనకు పునాది – తౌహీద్ అనబడే దేవుని అద్వితీయ ఏకత్వ భావన.  దేవుడు ప్రభువు (రబ్) అంటే సృష్టికర్త, పాలకుడు, పోషకుడు,సర్వాన్ని  నిర్వహిస్తున్నవాడు, తీర్పుచేసేవాడు అని అర్ధాలు వస్తాయి. ఇది దేవుని సార్వబౌమాదికారాన్ని సూచిస్తుంది.    దేవుని ఏకత్వం  అనే నియమం మరియు సంకల్పం సమగ్రమైనది మరియు అది అన్ని జీవులకు మరియు జీవితంలోని అన్ని అంశాలకు విస్తరించును.  దేవుడు అత్యంత శక్తిమంతుడు, ఘనమైనవాడే కాక   అపార కరుణామయుడు మరియు న్యాయాధిపతి. బహుమతి మరియు శిక్షలు అనేవి దేవుని ముందు వ్యక్తిగత నైతిక బాధ్యత మరియు జవాబుదారీతనం నుండి అవిర్భావిస్తాయి. ఇస్లామిక్ నీతి మానవులకు  భూమిపై ప్రత్యేక స్థితి మరియు బాధ్యత కల్పిస్తుంది.

ఇస్లాం ధర్మం కేవలం నమ్మకాన్ని   (belief) మాత్రమే  అభ్యాసాన్ని  (practice) కూడా బలంగా నిర్దేశిస్తుంది. కేవలం ఈశ్వర తత్వ విచారణే కాక ధర్మశాస్త్రం (షరియా) అనేది ఇస్లామియా జీవన విధానాన్ని నిర్దేశిస్తుంది. ఇస్లాం ధర్మం ప్రధానం ఐదు మూల స్థoభాల పై ఆధారపడినది.  అవి ఒకటి షహదహ్,  (“దేవుడు ఒక్కడే మరియు ముహమ్మద్(స) దేవుని  అంతిమ ప్రవక్త అని విశ్వసింఛి సాక్షమివ్వటం ).  రెండు ప్రతిరోజూ ఐదు సార్లు నమాజ్ చేయుట మరియు శుక్రవారం సమూహా ప్రార్ధనలో పాల్గొనుట, మూడు జకాత్, నాలుగు రమదాన్ నెలలో ఉపవాసం ఉండుట, మరియు ఐదు మక్కా యాత్ర (హజ్జ్) చేయుట(జీవితకాలంలో ఒక్కసారి అయిన)  జిహాద్, లేదా అల్లాహ్  మార్గంలో పోరాటం, కొన్నిసార్లు ఆరవ మూల స్తంభముగా పరిగణించబడుతుంది. జిహాద్ అనేది ఆధ్యాత్మిక వ్యక్తిగత పోరాటo మరియు ముస్లిం సమాజం యొక్క రక్షణ కోసం బయటి వారితో యుద్ధం రెండింటినీ కలిగి ఉంది.  

సమకాలీన పునరుజ్జీవనం లో భాగమైన పునరుద్ధరణ (తజ్జిద్ tajdid) మరియు సంస్కరణ (ఇస్లాహ్) అనేవి ముహమ్మద్(స) యొక్క మొదటి ఇస్లామిక్ ఉద్యమం, పదిహేడు మరియు పద్దెనిమిదవ శతాబ్దపు  పునరుద్ధరణ మరియు పంతొమ్మిదవ మరియు ఇరవయ్యో శతాబ్దపు ఇస్లామిక్ ఆధునిక ఉద్యమాలపై నిర్మించిన ఇస్లాం యొక్క కాలానుగుణ్యమైన గౌరవప్రదమైన సంప్రదాయంలో భాగంగా పరిగణిస్తారు.  ముస్లిం ప్రపంచం మరియు ముస్లిమ్స్ ఇస్లాం యొక్క నిజమైన మార్గం నుండి నిష్క్రమణ కారణంగా తిరోగమన స్థితిలో ఉందని సమకాలీన పునరుజ్జీవన వాదులు  భావిస్తారు. దీనికి ప్రతిపాదిత నివారణ గా ఇస్లామిక్ గుర్తింపు, విలువలు మరియు అధికారాన్ని పునరుద్ధరించడం కోసం వ్యక్తిగత మరియు ప్రజా జీవితంలో ఇస్లాం వైపు తిరిగి రావాలని వారు భావిస్తున్నారు.  

ఇస్లామిక్ రాజకీయ కార్యకర్తలకు, ఇస్లాం అనేది దివ్య ఖుర్ఆన్ లో నిర్దేశించిన సమగ్ర జీవన  మార్గం,ముహమ్మద్ ప్రవక్త (స) అనుసరించిన  జీవనవిధానం    మరియు ముస్లిం సమాజ  (ఉమ్మః) స్వభావం మరియు షరియా లేదా  దేవుని వెల్లడించిన చట్టం. ఇస్లామిక్ కార్యకర్తలు లేదా ఇస్లాంవాదులు ముస్లిం ప్రభుత్వాలు మరియు సమాజాల పునరుద్ధరణ మరియు పునరుజ్జీవనం కోసం ఇస్లామిక్ చట్టం యొక్క పునరుద్ధరణ లేదా పునఃనిర్మాణం కావాలని భావిస్తున్నారు.  ఇది ఇస్లాం మతం యొక్క మార్గదర్శకo మరియు సామాజికంగా మొత్తం ఇస్లామిక్ సమాజానికి ఒక బ్లూప్రింట్ అని వారు నమ్ముతారు. ప్రతి ముస్లిం దేశంలో మరియు అంతర్జాతీయంగా పునరుజ్జీవనం విస్తృత ఆధారిత సాంఘిక-మత ఉద్యమంగా అభివృద్ధి చెందుతోంది. దాని లక్ష్యం క్షేత్రస్థాయిలో వ్యక్తుల యొక్క ఇస్లామిక్ రూపాంతరం ద్వారా మెరుగైన సమాజం యొక్క సృష్టి.













No comments:

Post a Comment