షరియాపై ఆధారపడిన బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ వ్యవస్థ దాని
ఆర్థిక పద్ధతులు మరియు విధానాలను రిబా (వడ్డీ) ప్రమేయం నుండి విడదీస్తుంది మరియు
దానిని PLS (లాభ-నష్టం పంచుకోవడం) యంత్రాంగంతో భర్తీ చేస్తుంది, తద్వారా
అల్-ఘుర్మ్ బి అల్-ఘున్మత్ (al-ghurm bi al-ghunmthat) అంటే, రిస్క్స్ ను పంచుకోవడం ద్వారా లాభాలు పొందుతారు.దీనితో
పాటు ఘరార్
(అనిశ్చితి) మరియు మైజర్ (జూదం) కలిగిన ఉత్పత్తులు, సాధనాలు మరియు
విధానాలను తొలగిస్తారు.
ప్రస్తుత జియో-ఎకనామిక్ పరిస్థితులలో ప్రధానంగా ఇస్లామిక్
ఎకనామిక్స్ / బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ గా
పిలువబడే ఈ పిఎల్‌ఎస్ PLS ఆధారిత వడ్డీ రహిత ఆర్థిక వ్యవస్థ, పరిణామ దశలో
ఉన్నప్పటికీ అది సాంప్రదాయిక
బ్యాంకింగ్ వ్యవస్థకు నిజమైన ప్రత్యామ్నాయంగా ప్రశంసలు పొందుతుంది మరియు ప్రపంచవ్యాప్తంగా కనీసం 75 దేశాల ఆర్థిక
నియంత్రణ నిర్మాణంలో అది భాగంగా మారింది.
అధిక సంఖ్యలో ముస్లిం
జనాభా ఉన్న భారతదేశం కూడా కొన్ని సంస్థల స్థాపన ద్వారా వడ్డీ లేని బ్యాంకింగ్
మరియు ఆర్థిక యంత్రాంగo పట్ల కొంత సానుకూల
వైఖరిని ప్రదర్శించింది. భారతదేశ విస్తృత ఆర్థిక చట్రంలో వడ్డీ రహిత బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ పరిశ్రమ యొక్క
అవకాశాలను పరిశీలించడానికి, చర్చించడానికి మరియు విశ్లేషించడానికి వివిధ ఆర్ధిక వేత్తలు విశేష
ప్రయత్నాలు చేశారు.
భారతదేశ ఆర్థిక నమూనాలో ఇస్లామిక్ ఎకనామిక్స్ మరియు
ఫైనాన్స్ యొక్క ప్రస్తుత స్థితిని అంచనా వేయడానికి భారతదేశంలో ప్రత్యామ్నాయ
బ్యాంకింగ్ వ్యవస్థ అమలు కోసం 2008 లో స్థాపించబడిన ఇండియన్ సెంటర్ ఫర్ ఇస్లామిక్
ఫైనాన్స్ (ఐసిఐఎఫ్) న్యూ డిల్లి తో పాటు ఇన్స్టిట్యూట్
ఆఫ్ ఆబ్జెక్టివ్ స్టడీస్ (ఐఓఎస్), ఇస్లామిక్ ఫిఖ్ అకాడమీ ఇండియా (ఐఎఫ్‌ఎ), ఇండియన్ ఫెడరేషన్
ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (ఫిక్కీ), కేరళ స్టేట్
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (కెఎస్‌ఐడిసి) వంటి సంస్థల కృషిని గుర్తుంచుకోవాలి..
భారతదేశంలో ఇస్లామిక్ బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ వ్యవస్థను
చర్చించేటప్పుడు ఇస్లామిక్ ఎకనామిక్స్ మరియు జకాత్ వ్యవస్థను కూడా చర్చించాలి. జకాత్ యొక్క ప్రాముఖ్యత, పేదరిక
నిర్మూలనలో దాని వ్యూహాత్మక పాత్ర మరియు పేదరికాన్ని తగ్గించడానికి ఐక్యరాజ్యసమితి
సంస్థ (UNO (2016-2025) యొక్క
సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డిజి) సాధించడంలో మరియు ప్రపంచ ఆర్ధిక పరిస్థితులను కాపాడటానికి మరియు ప్రపంచవ్యాప్తంగా శ్రేయస్సును
పెంచడానికి దాని పాత్రపై దృష్టి పెట్టాలి. ఆర్థిక జీవనోపాధి, ఆర్థిక
శ్రేయస్సులో మహిళల పాత్ర గురించి ఇస్లామిక్ ఎకనామిక్స్ మరియు దాని విభిన్న కోణాలు
కూడా చర్చించాలి మరియు సామాజిక-ఆర్ధిక మరియు రాజకీయ సమస్యలను పరిష్కరించే సంస్థగా మసీదు
పాత్రను కూడా పరిశిలించాలి.
సమకాలీన కాలంలో జకాత్ మరియు బైట్ ఉల్ మాల్ యొక్క ప్రాముఖ్యతను
నొక్కిచెప్పడం లో జకాత్ విషయం లో మలేషియా
మరియు దక్షిణాఫ్రికా నమూనాలను ఉదాహరణలుగా తీసుకోవాలి. ముస్లిం
సమాజాన్ని డైనమిక్ ఎకనామిక్ ఎబిలిబిలిటీ కోసం ప్రోత్సహించడానికి, మదీనా నగరంలో
ప్రవక్త ముహమ్మద్ (స) మదీనా మార్కెట్ వ్యవస్థను ఉదాహరణగా తీసుకోవాలి. యూదులు మరియు ఇతర
ముస్లిమేతర వర్గాల జోక్యం మరియు గుత్తాధిపత్యం లేకుండా ముస్లింలు రాణించిన
ప్రత్యామ్నాయ వాణిజ్య వేదికను ఈ మార్కెట్ అందించింది
భారతదేశం లో ముస్లింలు మొత్తం జనాభాలో 14.5% ఉండి కూడా ఇంకా
అభివృద్ధి చెందని ఆర్థిక స్థితిలో నివసిస్తున్నారు (సచార్ కమిటీ విశ్లేషణ మరియు
సచార్ అనంతర విశ్లేషణ), జకాత్ వీరి అభ్యున్నతికి పరిష్కారాన్ని అందిస్తుంది. ఈ
సందర్భంలో బైట్-యు-జకాహిన్ Bait- u-Zakahin కేరళ గత 70 సంవత్సరాలుగా చేస్తున్న
కృషిని గమనించ వచ్చు.. భారతదేశంలో ముస్లిం సమాజం యొక్క ఆర్ధిక స్థిరత్వానికి అవ్కాఫ్ (Awqaf), మైక్రో ఫైనాన్స్
మరియు స్వయం సహాయక బృందాలు చేస్తున్న కృషి ముఖ్యమైనది.
భారతదేశంలో ఇస్లామిక్ బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ యొక్క అధ్యయనం
కోసం ఆర్బిఐ(RBI) 2005 లో ఆనంద్ సిన్హా ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
భారతదేశంలో ఇస్లామిక్ బ్యాంకింగ్‌ను అనుమతించడానికి 1949 బ్యాంకింగ్
రెగ్యులేషన్ చట్టంలో మరియు పన్నుల చట్టాలలో అవసరమైన మార్పులు తేవాలని ఈ కమిటీ
సిఫార్సు చేసింది. 2008 లో మాజీ ఆర్బిఐ
గవర్నర్ రఘురామ్ రాజన్ "ఆర్థిక రంగ సంస్కరణలు" పై తన నివేదికలో ఆర్థిక
సంతులిత భావన సాధన లో ఇస్లామిక్
బ్యాంకింగ్ యొక్క ప్రాముఖ్యతను పేర్కొన్నారు.
ఇస్లామిక్ ఇన్సూరెన్స్ తకాఫుల్ (takaful) భావన 2014 డిసెంబర్ 10 న రాజ్యసభలో
సమర్పించిన బీమా సవరణ బిల్లు 2008 క్లుప్త సారాంశంలో చర్చించబడింది. ఇస్లామిక్ ఫైనాన్స్ ఉత్పత్తుల
సమర్థతపై సవివరమైన నివేదికను అందించడానికి 2013 లో ఆర్థిక
మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఆర్‌బిఐ రాజేష్ వర్మ నేతృత్వంలోని ఇంటర్ డిపార్ట్‌మెంటల్
గ్రూపును ఏర్పాటు చేసింది, ఈ నివేదిక ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థ స్థాపనకు అడ్డుగు గా ఉన్న ఇండియన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ ఆక్ట్1949 మరియు దాని అనేక సెక్షన్స్ ను స్పష్టంగా పేర్కొన్నది. అయితే, భారతదేశంలో
ఇస్లామిక్ బ్యాంకింగ్ స్థాపన కోసం పార్లమెంటు ప్రత్యేక చట్టాన్ని ఆమోదించాలని
కమిటీ సూచించింది. ఇంకా, ప్రస్తుత నియంత్రణ వాతావరణంలో ఇస్లామిక్ విండో ఆచరణీయమైన
ఎంపిక కావచ్చుఅని కమిటీ సూచించింది.
బ్యాంకింగ్
రెగ్యులేషన్ యాక్ట్ 1949, ఆర్బిఐ యాక్ట్ 1934, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 మరియు కోఆపరేటివ్
సొసైటీస్ యాక్ట్ 1961 భారతదేశంలోని ఆర్థిక సంస్థలను నియంత్రిస్తాయని మనం ఇక్కడ
గమనించాలి. సంబంధిత భారతీయ బ్యాంకింగ్ చట్టాలు ఇస్లామిక్ బ్యాంకింగ్‌ను స్పష్టంగా
తిరస్కరించవు, కాని పైన పేర్కొన్న
చట్టాల లోని కొన్ని నిబంధనలు, ముఖ్యంగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, ఇస్లామిక్ బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ యొక్క పునాది కి
వ్యతిరేకం. .
ఇస్లామిక్
బ్యాంకింగ్‌కు సంబంధించి ఆర్‌బిఐ యొక్క నియంత్రణ నిభందనలు భారతదేశంలో ఇస్లామిక్
బ్యాంకుల స్థాపనకు ప్రధాన అవరోధంగా ఉన్నాయి,
కాని
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి కొన్ని నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు (ఎన్‌బిఎఫ్‌ఐలు(NBFIs) షరియా
మార్గదర్శకాలకు కట్టుబడి ఉన్నాయి ఉదా: భారతదేశం లో
ఇస్లామిక్ పెట్టుబడి సూత్రాలపై నడుస్తున్న మరియు 20 వ శతాబ్దం మొదటి భాగంలో అనగా
1930 మరియు 1940 ప్రాంతాలలో స్థాపించబడిన పట్ని కో-ఆపరేటివ్
క్రెడిట్ సొసైటీ లిమిటెడ్, సూరత్ మరియు ముస్లిం ఫండ్ మొదలగునవి. ఎన్బిఎఫ్ఐలు వడ్డీ రహిత బ్యాంకులు కావు, కాని ఇస్లామిక్
ఫైనాన్షియల్ సంస్థలు రిజర్వ్ బ్యాంక్ డైరెక్టివ్స్ ఫర్ ఎన్బిఎఫ్ఐ (ఆర్బిఐ) సవరణ
చట్టం 1997 కింద నమోదు చేయబడ్డాయి
No comments:
Post a Comment