30 August 2019

అఫ్ఘనిస్తాన్ పాలకుడు అహ్మద్ షా దుర్రానీ Ahmad Shaw Durrani The Ruler of Afganisthan




ఇతనిని  అహ్మద్  ఖాన్ అబ్దాలీ, అమాద్ షా అబ్దాలీ అని కూడా పిలుస్తారు.
ఇతని పూర్తి పేరు అహ్మద్ షా అబ్దాలి  దుర్-ఎ- దుర్రాన్(Ahmad Shah Abdali Dur-e-Durran)
 Image result for ahmad shah abdali

అహ్మద్ షా దుర్రానీ ముల్తాన్, పంజాబ్ [ప్రస్తుత  పాకిస్తాన్‌], లేదా హెరెట్ [ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్‌)లో1722? లో జన్మించినాడు  మరియు అక్టోబర్ 16/17, 1772, టోబా మారిఫ్, ఆఫ్ఘనిస్తాన్ లో మరణించినాడు.

అఫ్ఘనిస్తాన్ రాజ్య స్థాపకుడు మరియు అతని సామ్రాజ్యం అము దర్యా (పురాతన ఆక్సస్ నది) నుండి హిందూ మహాసముద్రం వరకు మరియు ఖోరాసన్ నుండి కాశ్మీర్, పంజాబ్ మరియు సింధ్ వరకు విస్తరించినది. అతను తన రాజ్య మరియు ప్రభుత్వ అధిపతిగా సంపూర్ణ అధికారం కల్గి  పౌర మరియు సైనిక విషయములలో పూర్తి  నియంత్రణను కలిగి ఉన్నాడు దానితో పాటు అంతరంగిక మరియు విదేశీ వ్యవహారాల పై  పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాడు.  షాకు పరిపాలనలో ప్రముఖ ఆఫ్ఘన్ తెగలనుండిఎంపిక చేయబడిన   ఒక ప్రధానమంత్రి మరియు తొమ్మిదిమంది  జీవితకాల సలహాదారుల మండలి సహాయపడింది.

ఇతను కులీన సదాజాయ్ (Sadōzai) వంశస్తుడు  మరియు ప్రసిద్ద అఫ్ఘాన్ అబ్దాలీ తెగకు చెందిన మొహమ్మద్  జమాన్ ఖాన్ యొక్క రెండవ కుమారుడు. అహ్మద్ పర్షియాకు చెందిన నాదిర్ షా ఆధ్వర్యంలో అబ్దాలీ అశ్వికదళ సమూహానికి నాయకత్వం వహించాడు మరియు నాదిర్ షా హత్య అనంతరం ఆఫ్ఘన్ ముఖ్యులు సబ్యులుగా ఉన్న లోయా జిర్గా లేదా గిరిజన పెద్దల సమావేశం అతనిని “షా” గా ఎన్నుకొన్నారు.

 1747 వ సంవత్సరంలో, అహ్మద్ షా దుర్రానీని ఆఫ్ఘన్ తెగల రాజుగా పట్టాభిషేకం చేశారు, అప్పుడు దుర్రానీ వయసు 25 సంవత్సరాలు. కందహార్ లో అతని పేరు మీద నాణేలు ముద్రించ బడినవి మరియు కందహర్ ను అతను తన రాజధానిగా  ఏర్పాటు చేసుకొన్నాడు. దుర్రానీ దుర్-ఇ-దుర్రానీ  లేదా పెర్ల్ ఆఫ్ పెర్ల్స్ అనే పేరు  తో ప్రసిద్దుడు. అది అతనికి నాదర్ షా ఇచ్చిన బిరుదు (అతను చెవిలో ముత్యాల చెవి రింగ్  ధరించేవాడు.), అలాగే అతను మొత్తం అబ్దాలి తెగ పేరును దుర్రానీగా మార్చాడు.

పొరుగున ఉన్న అసమర్ధ పాలకుల ఆధీనంలో ఉన్న ప్రాంతాలను జయించటానికి బయలుదేరిన అతను 1747 మరియు 1748 మధ్య, ఘజ్నిని జయించాడు మరియు కాబూల్ వరకు మరియు తరువాత పెషావర్ వరకు ముందుకు పోయాడు. 1749 నాటికి దుర్రానీ మరియు అతని సైన్యం పంజాబ్, సింధ్ మరియు కాశ్మీర్లను నియంత్రిoచ సాగాయి. 1757 నాటికి, దుర్రానీ ఆధునిక ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని నియంత్రిస్తాడు.

1747 మరియు 1769 మధ్య, షా తొమ్మిది సార్లు భారతదేశంపై దాడి చేశాడు (మరియు దోచుకున్నాడు). అతడు మరియు అతని సైన్యం డిల్లి , ఆగ్రా, మధుర మరియు బృందావన్ నగరాల ను దోచుకొన్నారు కాని అతనికి ఆ  ప్రాంతాలను పరిపాలించాలనే ఉద్దేశ్యం లేదు.

ఈ సమయంలో, అతను అప్పటి మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షా కుమార్తె అయిన హజ్రత్ బేగంను వివాహం చేసుకున్నాడు. దుర్రానీకి నలుగురు కుమారులు, సులేమాన్ మీర్జా, తైమూర్ షా ,సికందర్ మరియు పర్వేజ్.  తైమూర్ షా అతని తరువాత రాజు అయ్యాడు.  

దుర్రానీ ఆఫ్ఘనిస్తాన్లోని పష్తున్ తెగల సైన్యాలలో ఫిరంగిదళాలను ప్రవేశపెట్టినాడు మరియు సైన్యాన్ని ఒక "వృత్తి" గా రుపొందిoఛినాడు. అతని గతం కారణంగా మరియు అతను పాలించిన విధానం కారణంగా అతను మంచి ఆదరణ పొందిన నాయకుడు అయ్యాడు. విబిన్న ఆఫ్ఘన్ తెగల మద్య  సామరస్యాన్ని తెచ్చి ఆధునిక ఆఫ్ఘనిస్తాన్కు పునాదిని  వేసినాడు. ఇస్లాంను అవిశ్వాసులలో  వ్యాప్తి చేయడానికి ప్రయత్నించాడు.

"అతను ఒక పెద్దల మండలిని ఒక సైనిక పాఠశాలను, మొదటి ఆఫ్ఘన్ పోస్టల్ సేవను మరియు మొదటి పత్రికా ప్రచురణను    స్థాపించాడు. అతని సైన్యం 40,000 మందితో కూడి బలంగా ఉంది, అతను "విస్తృత మనస్సు మరియు సానుభూతి వైఖరి" కలిగి ఉన్నాడు. అని స్కాటిష్ చరిత్రకారుడు మౌంట్‌స్టూవర్ట్ ఎల్ఫిన్‌స్టోన్ దుర్రానీ గురించి రాశాడు.

అతని తన కుమారుడు తైమూర్ ను పంజాబ్ వైస్రాయ్ గా నియమించినాడు మరియు తైమూర్ భారతదేశ నామక చక్రవర్తి 2వ ఆలంగిర్ కుమార్తె ను  వివాహం చేసుకున్నాడు.  

1758 లో సిక్కులు, మొఘలులు మరియు మరాఠాల బలం తైమూర్ ను తరిమికొట్టారు, కాని 1759-61లో అహ్మద్ షా మరాఠాలను పంజాబ్ నుండి తుడిచిపెట్టి, వారి పెద్ద సైన్యాన్ని డిల్లి కి ఉత్తరాన ఉన్న పానిపట్ వద్ద మూడవ పానిపట్ యుద్ధంలో (జనవరి 14, 1761). ఓడించినాడు.  1760లలో అతను సిక్కులను అణిచివేసేందుకు నాలుగుసార్లు ప్రయత్నించాడు, కాని అతని సామ్రాజ్యం లో తీవ్రమైన తిరుగుబాటులు జరిగినవి దానితో అతను పంజాబ్ సిక్కులపై నియంత్రణను కోల్పోయాడు.

1770 ల ప్రారంభంలో, "క్యాన్సర్” పిడితుడు అయ్యాడు మరియు అతను తన జీవితంలోని చివరి పదేళ్ళు కాబూల్ నుండి గడిపాడు, అక్కడ నుండి తన దేశీయ మరియు విదేశీ వ్యవహారాలను నిర్వహించెవాడు. జూన్ 1773 లో దుర్రానీ చివరకు క్యాన్సర్తో హెరాత్ ప్రావిన్స్‌ లోని ముర్ఘాలో యాభై సంవత్సరాల వయసులో మరణించాడు. అతన్ని కందహార్‌లోని ఒక   సమాధిలో ఖననం చేశారు.

దుర్రానీ కవిత్వం

అహ్మద్ షా దుర్రాని  కవి, అతడు తన స్థానిక పాష్టో బాష లో మరియు  పెర్షియన్ భాషలో కవితలు వ్రాశాడు:అతను రాసిన అత్యంత ప్రసిద్ధ పాష్టో పద్యం లవ్ ఆఫ్ ఎ నేషన్:

 

 

 

 

 

 

 

 

 

 

 
















No comments:

Post a Comment