తైమూర్, (అతనిని టామెర్లేన్ అని కూడా
పిలుస్తారు) అసాధారణమైన క్రూరత్వానికి ప్రసిద్ది చెందాడు. 1336 లో ఆధునిక
ఉజ్బెకిస్తాన్‌లో జన్మించిన తైమూర్ తైమురిడ్ రాజవంశాన్ని స్థాపించారు మరియు
భారతదేశం నుండి రష్యా మరియు మధ్యధరా ప్రాంతాల వరకు విస్తారమైన భూములను స్వాధీనం
చేసుకున్నారు.
తైమూర్ మంగోల్ ఉప తెగ అయిన బార్లాస్ (Barlas) తెగ సభ్యుడు.
అతని తెగ ఈ ప్రాంతంలో
స్థిరపడటానికి ముందు చెంఘిజ్ ఖాన్ కుమారుడు చాగటై ట్రాన్సోక్సానియా విజయాలలో
పాల్గొన్నది. తైమూర్ ఆశయం ఖాన్ మంగోల్ సామ్రాజ్యాన్ని పునరుద్ధరించటం మరియు 1370 లో ఒకప్పటి తన మిత్రుడు అమీర్
హుస్సేన్‌కు వ్యతిరేకంగా తిరిగిన తిరుగుబాటుతో తన జైత్రయాత్రలను ప్రారంభించాడు.
తరువాతి దశాబ్దంలో, అతను జుటా ఖాన్ల (Khans of Jutah) కు
వ్యతిరేకంగా పోరాడాడు మరియు 1380 లో కష్గర్ను (Kashgar) ఆక్రమించాడు. అతను క్రిమియాకు
చెందిన మంగోల్ ఖాన్ (Mongol khan of Crimea) రష్యన్‌లతో
పోరాడటానికి సహాయం చేశాడు మరియు పోల్టావా (Poltava). సమీపంలో
జరిగిన యుద్ధంలో లిథువేనియన్ దళాలను ఓడించడానికి ముందు అతని దళాలు మాస్కోను అదుపులోకి
తీసుకున్నాయి.
1383 లో పర్షియాపై అతని క్రూరమైన దండయాత్ర ప్రారంభమైంది, మరియు అతను
ఖోరాసన్ మరియు తూర్పు ప్రుస్సియా (Eastern
Prussia) మొత్తాన్ని రెండు సంవత్సరాలలో జయించాడు మరియు 1386 మరియు 1394 మధ్య అతను అర్మేనియా, ఇరాన్, మెసొపొటేమియా, అజర్‌బైజాన్ మరియు జార్జియాలను జయించాడు. తైమూర్ గోల్డెన్ హోర్డ్ ఖాన్‌ను కూడా
అధికారం నుంఛి తొలగించాడు మరియు 1395 లో మాస్కోను ఒక సంవత్సరం ఆక్రమించాడు. అతను దూరంగా ఉన్నప్పుడు, పర్షియాలో
భారీ తిరుగుబాటు జరిగింది, తైమూర్ తన విలక్షణమైన క్రూరత్వంతో తిరుగుబాటును అణచివేసాడు. అతను నగరాలను నాశనం చేశాడు, మొత్తం
జనాభాను ఊచకోత కోశాడు మరియు సైనిక టవర్లు నిర్మించడానికి వారి పుర్రెలను ఉపయోగించాడు.
తరువాత, అతను 1398 లో భారతదేశంపై దాడి చేశాడు అతను డిసెంబరులో డిల్లి సుల్తాన్
సైన్యాన్ని నాశనం చేశాడు మరియు డిల్లి నగరాన్ని ధ్వంసం చేశాడు. కొంతకాలం
స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత, తైమూర్ 1399 లో సిరియాపై
దాడి చేసి 1401 నాటికి అలెప్పో, డమాస్కస్ మరియు బాగ్దాద్లను జయించాడు. అనటోలియాపై దాడి చేసి 1402 లో అంకారా
యుద్ధంలో గెలిచినాడు. ఈజిప్ట్ సుల్తాన్
మరియు బైజాంటైన్ సామ్రాజ్యం చక్రవర్తి ఇద్దరూ సమర్పణ (submission) ఇచ్చిన
తరువాత సమర్ఖండ్ తిరిగి వచ్చాడు.
డిసెంబర్ 1404 లో ప్రారంభమైన చైనాపై దండయాత్రను ప్రారంభించినాడు కాని దురదృష్ట వశాత్తూ అతను
అనారోగ్యానికి గురై ఫిబ్రవరి 1405 లో మరణించాడు. చరిత్రకారుల ప్రకారం, అతని విజయాలలో 17 మిలియన్ల
మంది మరణించారు అది ఆ సమయంలో ప్రపంచ
జనాభాలో 5% కి సమానం.
No comments:
Post a Comment