ఖలీద్ ఇబ్న్ అల్-వాలిద్ ను
“సయీఫ్ అల్లాహ్ అల్-మస్లుల్” అని కూడా పిలుస్తారు, ఖలీద్ ఇబ్న్
అల్-వాలిద్ ఇస్లాం యొక్క మొట్టమొదటి గొప్ప సైనిక కమాండర్. అతను సౌదీ అరేబియాలోని
మక్కాలో 585 లో జన్మించాడు
మరియు ముహమ్మద్ ప్రవక్త(స) యొక్క సహచరుడు.
ఖలీద్ మొదట మక్కన్ తెగ
ఖురైష్కు కమాండర్. ఇది ముహమ్మద్(స)
వంశానికి వ్యతిరేకంగా ఉంది. వాస్తవానికి, 625 లో ముస్లింలపై ఉహుద్ యుద్ధంలో ఖలీద్ కీలక
పాత్ర పోషించాడు. అయినప్పటికీ, అతని తెగ ముస్లింలతో పదేళ్ల శాంతి ఒప్పందం (హుదైబియా
ఒప్పందం) పై 628 లో సంతకం
చేసింది. ముహమ్మద్ ప్రవక్త (స) ఖలీద్ సోదరుడు వాలిద్‌తో 'ఖలీద్ లాంటి
వ్యక్తి ఇస్లాం నుండి ఎక్కువ కాలం తనను తాను దూరంగా ఉండలేడు' అని అన్నారు. వాలిద్
తన సోదరుడికి ఇస్లాం ధర్మాన్ని స్వికరించమని విజ్ఞప్తి చేస్తూ అనేక లేఖలు రాశాడు. ఖలీద్ చివరికి ఇస్లాం
ధర్మం స్వికరించినాడు.
అతను త్వరలోనే ముస్లిం
సైన్యానికి విలువైన వ్యక్తి గా నిరూపించబడ్డాడు మరియు 629 లో ముతా
యుద్ధంలో ముగ్గురు ప్రముఖ నాయకులు మరణించిన తరువాత కమాండర్‌గా ఎంపికయ్యాడు.
ఘసానిడ్స్ మరియు బైజాంటైన్‌లకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో ఖలీద్ సంఖ్యలో
తక్కువగా ఉన్న ముస్లిం దళాలను సర్వవినాశం నుండి విజయవంతమైన వ్యూహాత్మక
తిరోగమనానికి వ్యూహం రచించినాడు. ఈ యుద్ధం తరువాత అతనికి ‘దేవుని కత్తి’ పేరు ఇవ్వబడింది.
తరువాతి తొమ్మిదేళ్ళలో, ఖలీద్ వందకు పైగా
యుద్ధాల్లో పాల్గొన్నాడు మరియు ఎప్పుడూ ఓడిపోలేదు. ముహమ్మద్(స) మరణం తరువాత, బలమైన అరబ్ తెగలు
విడిపోయి తిరుగుబాటు చేశాయి. వరుస విజయాల తర్వాత తిరుగుబాటులను అరికట్టే పనిని
ఖలీద్‌కు అప్పగించారు. డిసెంబర్ 632 లో జరిగిన యమమా యుద్ధం తో అతడు ఈ పనిని విజయవంతంగా ముగించాడు.
ముహమ్మద్ మరణం తరువాత మొట్టమొదటి ముస్లిం ఖలీఫా అయిన అబూ బకర్(ర) మరియు ముస్లిం సామ్రాజ్యాన్ని
విస్తరించడo పై తన దృష్టిని ఉంచాడు.
పర్షియాలోని
సస్సానిడ్ సామ్రాజ్యంపై ముస్లింల దండయాత్ర జరిగింది. పెర్షియా బైజాంటైన్‌లతో పావు శతాబ్దం యుద్ధం తరువాత
తీవ్రంగా బలహీనపడింది. 633 లో ఖలీద్ పెర్షియన్
సామ్రాజ్యాన్ని, ఫిరాజ్ కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత అబూ బకర్(ర) ఖలీద్‌ను
రోమన్ సిరియాపై దాడి చేయాలని ఆదేశించాడు. ఇది ముస్లింలను బైజాంటైన్ సామ్రాజ్యంతో
ప్రత్యక్ష వివాదంలో పడేసింది. ఖలీద్ 634 సెప్టెంబరులో డమాస్కస్‌ను
జయించాడు, కొత్త ఖలీఫా ఉమర్(ర) ఆదేశం మేరకు పదవి నుండి విముక్తి
పొందాడు.
కొత్త కమాండర్ నాయకత్వం
లో ముస్లిం సైన్యం అబూ-అల్-కుడ్స్ వద్ద చుట్టుముట్టబడినది. వారిని రక్షించడానికి
తిరిగి ఖలీద్ పంపబడ్డాడు మరియు పట్టణానికి
సమీపంలో అతను బైజాంటైన్ మరియు క్రిస్టియన్ అరబ్ సైన్యాన్ని ఓడించాడు.
636 లో యార్మౌక్ యుద్ధంలో ఖలీద్
తన గొప్ప విజయాన్ని సాధించినాడు. అతను
బైజాంటైన్ సైన్యాన్ని నాశనం చేశాడు మరియు లెవాంట్ (Levant) లో వారి పలుకుబడిని
తగ్గించాడు. అర్మేనియా మరియు అనటోలియాలో విజయాల తరువాత, ఖలీద్ ఒక జాతీయ హీరో అయినాడు మరియు తన సైనికులచే అమితంగా ప్రేమించబడ్డాడు. కాని నిధుల దుర్వినియోగం
ఆరోపణలపై అతన్ని కమాండ్ నుండి తొలగించబడినాడు.
ఖలీద్ 642 లో మరణించాడు, మరియు అతని సమాధి
మీద అతను గెలిచిన 50 ప్రధాన యుద్ధాల
జాబితా పొందు పరచబడినది. అతను ఎల్లప్పుడూ పోరాటంలో అజేయంగా ఉండేవాడు.! అతను మరియు
అతని విశ్వసనీయ అధికారులు యుద్ధానికి ముందు శత్రు సైన్యాల కమాండర్లను ద్వంద్వ
పోరాటానికి సవాలు చేసే వారు. అందులో విజయం సాధించి ప్రత్యర్థుల మనోధైర్యాన్ని
నాశనం చేసేవారు. రెండు(పెర్షియ, బైజాంటిన్) గొప్ప సామ్రాజ్యాల యొక్క ఉత్తమ సైనిక
మనస్సులుకూడా ఈ మేధావిని ఓడించటానికి
కమాండర్ లేదా సైనికుడిని తాయారు చేయలేక పోయినవి.ఇది అతని సైనిక నైపుణ్యంను చాటు
చున్నది.
No comments:
Post a Comment