28 July 2019

నూతన విద్యావిధాన(NEP) 2019 డ్రాఫ్ట్ లో ముస్లింల విద్యా వెనుకబాటుతనం గురించి అల్ప ప్రస్తావన




సూచనలు మరియు సలహాల కోసం ఇటీవల బహిరంగపరచబడిన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి), 2019 యొక్క ముసాయిదా మతపరమైన మైనారిటీల అల్ప విద్యాస్థాయిని గుర్తించడం లో విఫలమైనది. భారత జనాభాలో 14.22 శాతం ఉన్న ముస్లింల విద్యా వెనుకబాటుతనాన్ని పరిష్కరించే ఆలోచన చేయలేదు. 484 పేజీల నివేదికలో, ఒకటిన్నర పేజీ మాత్రమే మైనారిటీ విద్యకు అంకితం చేయబడింది. వారి పరిస్థితిని చక్కదిద్దడానికి ఆలోచనను అందించడంలో ఇది పూర్తిగా విఫలమైంది.

ముస్లింల విద్యా వెనుకబాటుతనం గురించి 1983 లో ఏర్పడిన  గోపాల్ సింగ్ కమిటీ నివేదిక మరియు 1986 నాటి నూతన విద్యా విధానం ముస్లింలను జాతీయ స్థాయిలో విద్యాపరంగా వెనుకబడినవారిగా గుర్తించింది. ముస్లింల విద్యా వెనుకబాటుతనం గురించి 2006 లో సచార్ కమిటీ నివేదికలో మరోసారి తెలియజేసారు.  ఈ నివేదికల యొక్క ఫలితాలు దశాబ్దాల సంస్థాగత నిర్లక్ష్యం మరియు పక్షపాతానికి సాక్ష్యం. ముస్లింలు  విద్య మరియు ఉపాధి రంగాలలో ఇతర సామాజిక-మత వర్గాల కంటే చాలా వెనుకబడి ఉన్నారు.  

ఎన్‌ఇపి ప్రకారం, అండర్-రిప్రజెంటేటెడ్ గ్రూపుల (యుఆర్‌జి) అల్ప విద్యస్థాయికి  ప్రధాన కారణం నాణ్యమైన పాఠశాలల  కోరత. తక్కువ హాజరు, తక్కువ అభ్యాస ఫలితాలు మరియు అధిక డ్రాప్ అవుట్ రేటు అభ్యాసానికి ఇతర అడ్డంకులు గా  అని చెప్పవచ్చు.

ముసాయిదా NEP, విద్యాపరంగా తక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని మైనారిటీ లేదా మత వర్గాలకు చెందిన పిల్లల విద్యను ప్రోత్సహించడానికి జోక్యాల (interventions) యొక్క ప్రాముఖ్యతను అంగీకరిస్తుంది. సాంఘిక న్యాయం మరియు సమానత్వం సాధించడానికి విద్యను ఏకైక గొప్ప సాధనంగా గుర్తించి ముసాయిదా NEP సంతులిత విద్యావ్యవస్థను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

సమగ్ర విద్యా లక్ష్యాన్ని సాధించడానికి వెనుకబడిన ప్రాంతాలలో ప్రత్యేక విద్యా మండలాలను ఏర్పాటు చేయడం, స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం, యుఆర్‌జిల నుండి ఉపాధ్యాయుల నియామకం, ఉర్దూ భాషా ఉపాధ్యాయుల నియామకం, మినహాయింపు పద్ధతులను తొలగించడం మొదలగు వాటిని  సూచిస్తున్నది.

ముస్లింల విద్యా వెనుకబాటుతనం తొలగించాలంటే మైనారిటీ కేంద్రీకృత జిల్లాల్లో ఎక్కువ పాఠశాలలను తెరవడం మరియు ఆ ప్రాంతాల్లో ప్రారంభించిన విద్యా సంస్థలలో వారికి కొంత శాతం సీట్లు కేటాయించడం చేయాలి.

ముస్లింలకు విద్యా సంస్థల ప్రవేశాలలో రిజర్వేషన్లు అవసరం. రంగనాథ్ మిశ్రా కమిటీ ఈ విషయంలో ఇప్పటికే ఒక ఫార్ములాను రూపొందించింది. మైనారిటీయేతర అన్ని విద్యాసంస్థలలో కనీసం 15% సీట్లను మైనారిటీల కోసం చట్టం ద్వారా కేటాయించాలని కమిటీ సిఫారసు చేసింది. ఈ సిఫార్సును అమలు చేయడానికి తగిన చట్టాన్ని తీసుకురావాలి. ముస్లిం దళితులకు ఎస్సీ హోదా కల్పించాలి.

భారతీయ ముస్లింల విద్యాభివృద్ధికి ఉర్దూ యొక్క ప్రాముఖ్యతను గ్రహించాలి. ముస్లింలలో విద్యను ప్రోత్సహించడానికి, మాతృభాష ఉర్దూ అయిన పిల్లలకు ఉర్దూ మాధ్యమం ద్వారా ప్రాథమిక విద్య సౌకర్యాలు కల్పించాలి. ముస్లిం జనాభా అదిక సాంద్రత గల ప్రాంతాలలో ఉర్దూ మీడియం పాఠశాలలు మరియు ఉర్దూ ఉపాధ్యాయులను నియమించాలి. పై చర్యల అమలు మరింత మంది ముస్లిం విద్యార్థులను ఆధునిక విద్య వైపు ఆకర్షిస్తుంది.

ముస్లిం మహిళల్లో విద్య యొక్క పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. సాంస్కృతిక సంప్రదాయాలు వలన  సాధారణంగా ముస్లిం బాలికలు  సహ-విద్యా పాఠశాలలలో  ప్రవేశం పొందరు. ప్రత్యేక బాలికల పాఠశాలల ప్రారంభం, లేడీ టీచర్ల నియామకం మరియు బాలికల హాస్టల్ ప్రారంభించడం వంటి కొన్ని ముఖ్యమైన చర్యలు అమలు చేస్తే ముస్లిం మహిళా విద్యకు ఊపు లభిస్తుంది మరియు  పాఠశాల విద్యలో బాలికలు అధికంగా ప్రవేశం పొందుతారు.

ముస్లింలు  ప్రభుత్వ లేదా  లేదా ప్రభుత్వ సహాయక పాఠశాలల పట్ల ఆకర్షితులు అవటానికి  మరియు ముస్లింలలో విశ్వాసం కలిగించడానికి దేశ విద్యావ్యవస్థను లౌకికపరచడానికి అత్యవసర చర్యలు తీసుకోవాలి. NEP మొత్తం ముసాయిదా లో లౌకికవాదంఅనే పదం స్పష్టంగా లేదు.

మదర్సాలు, మక్తాబ్‌లు మరియు ఇతర సాంప్రదాయ లేదా మత పాఠశాలలను బలోపేతం చేయడం మరియు వారి పాఠ్యాంశాలను ఆధునీకరించడం యొక్క అవసరాన్ని NEP సరిగ్గా గుర్తించింది. మదర్సా విద్య భారతదేశంలోని ముస్లింలకు విద్యాప్రదాన వ్యవస్థ  లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. మదర్సాలను ప్రధాన స్రవంతి విద్యావ్యవస్థలోకి తీసుకురావడంలో చాలా అడ్డంకులు ఉన్నాయి. వాటిని తొలగించి మదర్సా ఆధునికీకరణ ప్రభుత్వం చేపట్టాలి.

మదర్సా నుండి ఆధునిక విద్యకు మారే ప్రక్రియ సజావుగా మరియు సరళంగా ఉండాలి మరియు మదర్సా లో ఉత్తీర్ణులు అయిననవారు కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలు పొందటానికి వీలుగా మద్రాసా ధృవపత్రాలు మరియు డిగ్రీల సమానత్వం కోసం జాతీయ స్థాయిలో చర్యలు తీసుకోవాలి. పోటీ పరీక్షలలో అర్హత. దేశంలో మదర్సా విద్యను సమన్వయం చేయడానికి మరియు నియంత్రించడానికి సెంట్రల్ మదర్సా బోర్డును ఏర్పాటు చేయడం ఎంతో అవసరం.

ఉన్నత విద్యలో ముస్లింల అల్ప ప్రాతినిధ్యం  దృష్టిలో పెట్టుకొని అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం మరియు జామియా మిలియా ఇస్లామియాను పూర్తి నిధులతో కూడిన (Fully Funded)జాతీయ మైనారిటీ విద్యా సంస్థలుగా గుర్తించాలి.

-రెడియన్స్ వీక్లీ సౌజన్యం తో

No comments:

Post a Comment