7 July 2019

అహ్మద్ ఇబ్న్ మాజిద్ సముద్ర సింహం 1430-1500 Ahmad ibn Mājid (1430-1500) The Lion of The Seas.



Image result for ahmad ibn majid


“షూటింగ్ స్టార్”, ”ది లయన్ ఆఫ్ ది సీస్” (“The Shooting Star”,”The Lion of the Seas”) గా పిలువబడే అహ్మద్ ఇబ్న్ మాజిద్ (అరబిక్: أحمد بن ماجد), (అహ్మద్ ఇబ్న్ మజీద్ ఇబ్న్ ముహమ్మద్ ఇబ్న్ ఒమర్ ఇబ్న్ ఫడ్ల్ ఇబ్న్ ద్వైక్ ఇబ్న్ యూసఫ్ ఇబ్న్ హసన్ ఇబ్న్ హుస్సేన్ ఇబ్న్ అబి మొలాక్ ఇబ్న్ అబీ అల్-రాకాబ్ అల్-నజ్డే (Ahmad ibn Majid ibn Muhammad ibn Omar ibn Fadl ibn Dwaik ibn Youssef ibn Hassan ibn Hussein ibn Abi Mo’alaq ibn Abi Al-Raka’eb Al-Najdey.) ప్రసిద్ద అరేబియా నావిగేటర్ మరియు కార్టోగ్రాఫర్ మరియు రచయిత.


ఇతను యుఎఇ ఎమిరేట్స్‌లో ఒకటైన జుల్ఫర్, ప్రస్తుత రాస్ అల్ ఖైమా, యుఎఇలోని (Ras Al KhaimahUAE) ఒక ప్రసిద్ధ సముద్రయాన కుటుంబంలో క్రీ.శ 824 AH / 1421 లో లేదా 1430 లలో జన్మించాడు. ఒకప్పుడు  ఇది ఒమన్ తీరంలో భాగం. ఇబ్న్ మజీద్ 1500 లో మరణించాడు.


చిన్నపిల్లగాడుగా ఉన్నప్పుడు  అతను ఎర్ర సముద్రం మరియు హిందూ మహాసముద్రం దాటి ఉన్న భూముల గురించి ప్రసిద్ధ నావిగేటర్ అయిన తన తండ్రి నుండి కథలు విన్నాడు; వాటిలో ప్రయాణించే కలలు కన్నాడు. అతని తండ్రి అతనిని ఒక విద్యావంతుడైన నావికునిగా   రుపొందిoచినాడు. అతను దివ్య ఖురాన్ పరిపూర్ణంగా అబ్యసించినాడు మరియు తన తండ్రి సేకరించిన సముద్ర ప్రయాణానికి సంబంధించిన పుస్తకాలను చదవడం మరియు వాటిలో ఉన్న విషయాలను  సంపూర్ణం గా తెలుసుకోవడం చేసినాడు. అతను 17 ఏళ్ళ వయసులో నౌకలను స్వయంగా నావిగేట్ చేయగలిగినాడు. అతని మొదటి పని చుక్కానిని నడపటం  మరియు సరిగా నావికా కొలతలు వెయడం.

రచనలు:

నావిగేషన్‌లో  ఇబ్న్ మాజిద్ చేసిన రచనలు చాలా ఉన్నాయి, నౌక  వాణిజ్య సాధనాలపై అతని ఆవిష్కరణలు నావిగేటర్లు పనిచేసే విధానాన్ని మార్చాయి మరియు ప్రమాణికరణంగా   మారాయి. నావిగేషన్ యొక్క సూత్రాలు మరియు నియమాలపై ఉపయోగకరమైన సమాచారం ఇచ్చే పుస్తకం, అతని చే 1490 లో వ్రాయబడింది. అతని పుస్తకాలు, పటాలు సంవత్సరాల తరబడి నావికులకు మార్గనిర్దేశం చేశాయి మరియు నాటికల్ సాధనాలు మరియు నాటికల్ ఆవిష్కరణలపై అతని ఆవిష్కరణలు నావికులు ఏడు సముద్రాలను నావిగేట్ చేసిన తీరును మార్చాయి. అతన్ని సముద్ర సింహం అని కూడా పిలుస్తారు.


ఇబ్న్ మజీద్ దాదాపు నలభై కవిత్వ మరియు గద్య రచనలకు రచయిత. సముద్ర శాస్త్రం మరియు ఓడల కదలికలపై ఇబ్న్ మజీద్ అనేక పుస్తకాలు రాశారు, వాటి ద్వారా  పెర్షియన్ గల్ఫ్ ప్రజలు భారతదేశం, తూర్పు ఆఫ్రికా మరియు ఇతర గమ్యస్థానాలకు చేరుకోవడానికి సహాయపడినవి.

1490 లో అతను రాసిన “కితాబ్ అల్-ఫవాయిద్ ఫి ఉసుల్ ఇల్మ్ అల్ బహర్ వా-ఎల్-కవైద్” (బుక్ ఆఫ్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్ ఆఫ్ నావిగేషన్ Kitab al-Fawa’id fi Usul ‘Ilm al-Bahr wa ’l-Qawa’id (Book of Useful Information on the Principles and Rules of Navigation)), అతని అతి ముఖ్యమైన రచనగా పరిగణించబడుతుంది.

ఇది ఒక నావిగేషన్ ఎన్సైక్లోపీడియ., నావిగేషన్ యొక్క చరిత్ర మరియు ప్రాథమిక సూత్రాలను వివరిస్తుంది మరియు  చంద్ర భవనాలు, రూంబ్ లైన్లు (lunar mansions, rhumb lines), తీర మరియు బహిరంగ సముద్రయాన మధ్య వ్యత్యాసం, తూర్పు ఆఫ్రికా నుండి ఇండోనేషియా వరకు ఓడరేవుల స్థానాలు, నక్షత్రాల  స్థానాలు, రుతుపవనాల వివరాలు మరియు ఇతర కాలానుగుణ గాలులు, ప్రొఫెషనల్ నావిగేటర్లకు టైఫూన్లు మరియు ఇతర విషయాలు వివరించును.

అతను కితాబ్ అల్-ఫవాయిద్ [ఫౌండేషన్ ఆఫ్ ది సీ అండ్ నావిగేషన్ పై పాఠాల పుస్తకం] కూడా రాశాడు.ఇవి అతను తన సొంత అనుభవం నుండి మరియు ఒక ప్రసిద్ధ నావిగేటర్ అయిన తన తండ్రి మరియు హిందూ మహాసముద్రపు అనేక తరాల  నావికుల కథల నుండి తీసుకున్నాడు.


అహ్మద్ ఇబ్న్ మజీద్ తన కాలం నాటి నావికులు మరియు నావిగేటర్స్ కంటే  గొప్పవాడు.అతను కేవలం నావికుడు  మాత్రమే కాదు, అతను చాలా తెలివైన మరియు నిపుణుడు అయిన నావిగేటర్, మరియు బహు బాషావేత్త. అతనికి తమిళం, తూర్పు ఆఫ్రికా బాష,  పెర్షియన్, అలాగే అరబిక్ వచ్చు.

అతను భౌగోళికo, మతం, చరిత్ర, సాహిత్యం మరియు వంశాల గురించి రాశాడు. అతను సుమారు 34 కవితలు మరియు 4,603 శ్లోకాలతో నావిగేషన్ సైన్స్ గురించి గద్యాలను వ్రాసాడు. అతను నిష్ణాతుడైన కార్టోగ్రాఫర్ కూడా. అతను చాలా ప్రసిద్ది చెందాడు మరియు నావిగేషన్ కళలో రాణించిన నావికుడిగా తన నిర్భయత, బలం మరియు అనుభవం కోసం (షూటింగ్ స్టార్) అని పిలవబడేవాడు..

దిక్సూచిని పెట్టె లోపల ఉంచడం ద్వారా అతను నావిగేషన్‌లో విప్లవాత్మక మార్పులు చేశాడు. 9 వ శతాబ్దం నుండి చైనా నావికులు దిక్సూచి ఉపయోగించారు దిక్సూచి వాడకం  ను అతను మెరుగు పరిచాడు.  అతను నావిగేషన్ లో  వేళ్ల వాడకo లో  ప్రావీణ్యం పొందాడు మరియు కమల్ అనే చెక్క టాబ్లెట్‌ ను  మెరుగుపరిచాడు, అవి రెండూ హోరిజోన్‌లో ఉన్న పోల్ స్టార్ ఎత్తు ఆధారంగా అక్షాంశాన్ని నిర్ణయించడానికి ఉపయోగించబడ్డాయి.

ఖ్యాతి (Legacy)


15 వ శతాబ్దం మధ్యలో అహ్మద్ బిన్ మాజిద్ చేసిన ప్రయత్నాలు పోర్చుగీస్ నావిగేటర్ వాస్కో డా గామాకు యూరోపియన్ నావికులకు తెలియని అరబ్ మ్యాప్‌ను ఉపయోగించడం ద్వారా యూరప్ మరియు భారతదేశం మధ్య మొట్టమొదటి సముద్ర వాణిజ్య మార్గాన్ని కనుగొనటానికి సహాయపడ్డాయని అంటారు.  పశ్చిమ దేశాలలో ఇబ్న్ మజీద్ యొక్క కీర్తి కి చాలా వరకు ఈ కథ కారణం అయితే, దీనిని మొదట ఒట్టోమన్ చరిత్రకారుడు కుతుబ్ అల్-దిన్, ఇబ్న్ మజీద్ మరణించిన సుమారు 50 సంవత్సరాల తరువాత వివరించాడు అయితే ఈ కథనo  ప్రముఖ నావికా పండితుడు - టిబెట్స్ ప్రకారం, చారిత్రాత్మకంగా ఖచ్చితమైనది కాదు.

ఇబ్న్ మాజిద్ మరియు వాస్కో డా గామా
వాస్కో డా గామా ఆఫ్రికా నుండి భారతదేశానికి వెళ్ళడానికి సహాయం చేసిన నావిగేటర్‌గా అతను పశ్చిమ దేశాలలో ప్రసిద్ది చెందాడు, దీనిని ప్రముఖ నావికా పండితుడు జి.ఆర్. టిబెట్స్, ఖండించాడు.

చాలా చరిత్ర పుస్తకాలు   15 వ శతాబ్దం మధ్యలో అహ్మద్ బిన్ మాజిద్ చేసిన ప్రయత్నాలు యూరోపియన్ నావికులకు ముఖ్యంగా పోర్చుగీస్ నావిగేటర్ వాస్కో డా గామాకు అరబ్ మ్యాప్‌ను ఉపయోగించడం ద్వారా యూరప్ మరియు భారతదేశం మధ్య మొదటి సముద్ర  వాణిజ్య మార్గాన్ని కనుగోనటం లో సహాయపడ్డాయి అని వివరిస్తాయి.  

అయితే దిని మీద బిన్న అభిప్రాయాలు కలవు. కొందరి వాదన ప్రకారం పానీయం(సారాయి) సేవిస్తున్నప్పుడు ఇబ్న్ మాజిద్ నుండి ఆ సమాచారంను వాస్కో డా గామా పొందాడు.
మరికొందరి ప్రకారం మలిండి రాజు కోరిక మేరకు ఇబ్న్ మాజిద్ అతని ఇండియా మార్గనిర్దేశికం చేసాడు. మరికొందరు ఇది అతని  శాస్త్రీయ ఆవిష్కరణ లో భాగం అంటారు.

15 వ శతాబ్దం మధ్యలో, ముస్లింలు మరియు యూరోపియన్లు వాణిజ్య మార్గాలపై ఆధిపత్యం కోసం ఎక్కువగా యుద్ధాలలో నిమగ్నమై ఉన్నారు, నావిగేటర్లు తమ పటాలను ప్రాణ ప్రదంగా అత్యంత విలువైన సంపదగా భావిస్తారు మరియు వారు వాటిని మరొక దేశం నావిగేటర్లతో  అందులోను శత్రు దేశం వారితో ఎన్నడు పంచుకోరు.

ఇబ్న్ మజీద్ పరమ ధార్మిక  ముస్లిం, అతను ఇస్లాం బోధనలకు కట్టుబడి ఉన్నాడు మరియు మద్యం సేవించడు. ఇది అతని రచనలలో కనిస్తుంది:

ఒక గురువు - ఓడ యొక్క కెప్టెన్ లేదా కమాండర్ - ధర్మవంతుడు మరియు న్యాయంగా ఉండాలి, ఎప్పుడూ అణచివేతకు గురికాకూడదు, ఎల్లప్పుడూ అల్లాహ్‌కు విధేయుడిగా ఉండాలి, అల్లాహ్‌ను తన చర్యలన్నిటిలోనూ సరిగా ఉండాలి.



وينبغي للمعلم – يقصد ربان السفينة أو قائدها – أن يكون عادلاً تقياً لا يظلم أحداً مقيماً على طاعة الله ،


متقياً الله حق اتقائه تعالى


- السفينة أو قائدها - أن يكون

హిందూ మహాసముద్రం మరియు ఎర్ర సముద్రం మీద ఇస్లామిక్ ఆధిపత్యం మరియు చైనా మరియు భారతదేశ వాణిజ్య మార్గాలపై ఇస్లామిక్ ఆధిపత్యం క్షీణతకు దోహదపడే రహస్యాన్ని ఎవరైనా ఎలా ఇస్తారు?

యుఎఇలోని అల్-షార్జా పాలకుడు షేక్ సుల్తాన్ ఇబ్న్ మొహమ్మద్ అల్-ఖాసిమి, అహ్మద్ ఇబ్న్ మజీద్ పై ఒక వ్యాసం రాశారు. అతను అరబ్, ఒట్టోమన్ మరియు అనేక పడమటి దేశాల నావికా గ్రంథాలను పరిశోధించాడు. వారి పరిశోదన ప్రకారం  హిందూ మహాసముద్రం గుండా తన మార్గంలో వాస్కో డా గామాకు మార్గదర్శకుడు ఇబ్న్ మజీద్ కాదని మలిండిలో ఉన్న భారతదేశానికి చెందిన ఒక క్రైస్తవ-గుజరాతీ నావికుడని నిర్ధారించారు. 


'ది లయన్ ఆఫ్ ది సీ' గా పిలువబడే ఇబ్న్ మజీద్ యొక్క నిజమైన వారసత్వం అతను వదిలిపెట్టిన నౌకాయాన సాహిత్యం. ఇబ్న్ మాజిద్ జీవితకాలంలో అరబ్ నౌకాయానం పరాకాష్టలో ఉంది, యూరోపియన్లు మరియు ఒట్టోమన్లు ​​హిందూ మహాసముద్రంలో భౌగోళికంపై పరిమిత అవగాహన మాత్రమే కలిగి ఉన్నారు. అతని కితాబ్ అల్-ఫవాద్ ఫై ఉసుల్ ఇల్మ్ అల్-బహర్ వాఎల్-కవాద్, అరబ్ నావికులు విస్తృతంగా ఉపయోగించారు మరియు ఖగోళ నావిగేషన్, వాతావరణ నమూనాలు మరియు ప్రయాణించే ప్రమాదకరమైన ప్రాంతాల పటాలను పరిష్కరించారు. ఇబ్న్ మాజిద్ యొక్క చేతితో వ్రాసిన రెండు ప్రసిద్ద  పుస్తకాలు ఇప్పుడు పారిస్‌లోని నేషనల్ లైబ్రరీలో ప్రముఖ ప్రదర్శనలు గా ఉన్నవి..
ఇది అత్యంత ప్రసిద్ధ నావిగేటర్ మరియు అన్వేషకులలో ఒకరి అయిన అహ్మద్ ఇబ్న్ మాజిద్  జీవిత సంగ్రహావలోకనం; అతని చరిత్రను మరియు అతని ప్రయాణాలను వివరించటానికి  అనేక వాల్యూమ్లు అవసరమని నమ్ముతున్నాను.


























No comments:

Post a Comment