26 July 2019

జాతీయ శాసనసభలలో కోటా పద్దతి మరింత మహిళా ప్రాతినిద్యం కల్పించగలదు.




రాజకీయ సాధికారత రంగంలో విస్తృత లింగ అసమానత ఉందని 2018 గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదిక పేర్కొంది. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 2018 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల శాసన సబ్యులలో మహిళా శాసనసభ్యులు కేవలం 24% మాత్రమే ఉన్నారు. కోటాపద్దతి వలన శాశన సభలలో  ఎక్కువ మంది మహిళా ప్రతినిధులు ప్రాతినిద్యం పొందగలరు.

స్త్రీలకు ప్రాతినిద్యం కల్పించే విషయం లో 11.2 మిలియన్ల జనాభా కలిగిన రువాండా మొదటి స్థానంలో ఉంది. అక్కడ దిగువ సభలో 61.3% మరియు ఎగువ సభలో 38.5% మహిళ ప్రతినిధులు ఉన్నారు. 2003 నుండి, రువాండా శాసన సభ ఎన్నికలలో 30% చట్టబద్ధమైన కోటాను అమలు చేసింది మరియు అన్ని రాజ్యాంగబద్ధ పదవుల ఎన్నికలలో ఆ దేశ రాజ్యాంగం 30% మహిళా కోటాను నిర్ణయించింది. దీనితో అన్ని పదవులలోను, శాసన సభల లోను మహిళల ప్రాతినిధ్యం పెరిగింది.

ఈ విషయం లో సుమారు 11.1 మిలియన్ల జనాభా కలిగిన అతిపెద్ద కరేబియన్ ద్వీప దేశమైన క్యూబా రెండవ ర్యాంకును కలిగి ఉంది. అక్కడ  605 మంది సభ్యులతో కూడిన ఏక శాసన సభ విధానం లో  53.2% స్థానాలు మహిళాలు  ఆక్రమించారు. క్యూబా లో స్త్రీలకు చట్టబద్ధమైన  కోటా విధానం లేదు కానీ స్వచ్ఛంద కోటా విధానమును ఆ దేశం అనుసరిస్తుంది.

కాని స్థానిక స్థాయిలో క్యూబన్ మహిళలకు తక్కువ ప్రాతినిధ్యం ఉంది. ఇక్కడ అభ్యర్థులను స్థానిక సంఘాలు ఎన్నుకొంటాయి. వారు మహిళా అభ్యర్థులకూ అంత ప్రాధాన్యత ఇవ్వరు.

ఇంటర్ పార్లమెంటరీ యూనియన్(ఐపియుIPU)లో ఐదవ ర్యాంక్ హోల్డర్ అయిన స్వీడన్ మహిళా అనుకూల  ప్రభుత్వాన్ని కలిగి ఉంది. 1990 నుండి మహిళల పార్లమెంటరీ ప్రాతినిధ్యo కనీసం 40% కలిగి ఉంది. 349 మంది సభ్యుల స్వీడిష్ పార్లమెంట్లో 46.1% ప్రాతినిధ్యంతో 161 మంది మహిళలు ఉన్నారు. మహిళలకు తప్పనిసరి ప్రాతినిధ్యం కల్పించే వహించే రాజ్యాంగ నిబంధన లేదా ఎన్నికల చట్టం స్వీడన్‌ లో  లేదు.

తప్పనిసరి మహిళా కోటా కు స్వీడన్‌ అనుకూలంగా లేదు, ఎందుకంటే అలాంటి కోటా రివర్స్ వివక్షను సృష్టిస్తుందని మరియు సమాన అవకాశాల సూత్రాలను ఉల్లంఘిస్తుందని అక్కడివారు నమ్ముతారు. దాదాపు అక్కడి అన్ని రాజకీయ పార్టీలు అన్ని స్థాయిలలో మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకున్నాయి.

అరబ్ దేశమైన UAE లో అక్కడి శాసనసభ అయిన ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ లో ప్రస్తుతం ఉన్న మహిళా ప్రాతినిద్యంను 22.5% నుండి 50% కూ పెంచుతూ ఇటివల డిక్రీ జారిచేశారు

పొరుగున ఉన్న నేపాల్ ఐపియులో 36 వ స్థానాన్ని ఆక్రమించింది మరియు దాని 275 మంది సభ్యుల లోయర్ హౌస్ 32.7% తో 90 మంది మహిళలను కలిగి ఉంది. దేశ శాసనసభతో సహా అన్ని ప్రభుత్వ సంస్థలలో మహిళలకు 33% సీట్లు కేటాయించడం ద్వారా నేపాల్ రాజ్యాంగం లింగ సమానత్వం విషయం లో దక్షిణ ఆసియాలో గుర్తింపు పొందినది.

ఐపియు జాబితాలోని 192 దేశాలలో భారతదేశం 149 వ స్థానంలో ఉన్నది.  16 వ లోక్ సభ కేవలం 11.8% మహిళల ప్రాతినిధ్యం కలిగి ఉంది. 17వ లోక్ సభ మహిళా ప్రాతినిద్యం 14.5 శాతానికి పెరిగింది. కాని  29 రాష్ట్రాల్లో కనీసం ఏడు రాష్ట్రాలు  ఒక్క మహిళా ఎంపీని కూడా ఎన్నుకోలేదు.  పార్లమెంటులో మరియు రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33% కోటాను నిర్దేశించిన 108 వ రాజ్యాంగ సవరణ బిల్లు రాజకీయ కోల్డ్ స్టోరేజీలో ఉంది.

అనేక దేశాలలో బాగా పనిచేసిన స్వచ్ఛంద కోటా వ్యవస్థ, భారతదేశం లో విజయవంతం అయ్యే అవకాశం లేదు. పంచాయతీలు మరియు మునిసిపాలిటీల విషయంలో జరిగినట్లుగా, చట్టబద్ధంగా తప్పనిసరి చేసిన కోటా మాత్రమే భారతీయ మహిళలను రాజకీయ అధికారం యొక్క ఉన్నత స్థాయిలలోకి ప్రవేశించడాన్ని నిర్ధారించగలదు

No comments:

Post a Comment