28 July 2019

పాశ్చాత్య నాగరికత వికాసం పై ఇస్లామిక్ సంస్కృతి ప్రభావం. Influence of Islamic Culture on Western Civilisation

ఆల్జీబ్రా, ఆల్కెమీ, ఆర్టిచోక్, ఆల్కహాల్ మరియు అప్రికోట్  (Algebra, alchemy, artichoke, alcohol, and apricot) మొదలగు పదాలు అరబిక్ మూలాన్ని కలిగి అవి అన్నీ క్రూసేడ్స్ యుగంలో పశ్చిమ దేశాలకు వ్యాపించినవి. తొమ్మిదవ శతాబ్దపు పెర్షియన్ పండితుడు, గణిత శాస్త్రవేత్త అల్-ఖ్వారిజ్మి గణిత శాస్త్రవేత్త అల్-ఖ్వారిజ్మి ప్రవేశపెట్టిన 0-9 సంఖ్యలు లాటిన్ లో బహుళ ప్రచారం పొందినవి. ఇస్లామిక్ సంస్కృతి పాశ్చాత్య నాగరికత వికాసంనకు కు దోహదపడిన అనేక అంశాలలో ఇది ఒకటి. ఇండో-అరబిక్ అంకెలు (0-9) రోమన్ సంఖ్యలు   సైన్స్ మరియు వాణిజ్యంలో విప్లవాత్మక మార్పులను తెచ్చాయి. అల్-ఖ్వారిజ్మి పేరు మీద అల్గోరిథం అనే పదo ఏర్పడినది.



2004లో చరిత్రకారుడు రిచర్డ్ బులియెట్ నాగరికత అనేది ప్రత్యేకమైన పాశ్చాత్య దృగ్విషయం కాకుండా నిరంతర సంభాషణ మరియు మార్పిడి అని ఆయన వాదించారు. కాని ఆస్ట్రేలియా మరియు పశ్చిమ దేశాలు ఇస్లామిక్ సంస్కృతుల (అరబిక్ మాట్లాడే, పెర్షియన్, ఒట్టోమన్ లేదా ఇతరులు) నాగరికతకు చేసిన కృషిని అంగీకరించడానికి ఇప్పటికీ అయిస్టత చూపుతున్నాయి. ఇస్లామిక్ సంస్కృతి నాగరికతను వికాసంలో అనేక గ్రంథాలను రుపొందించినది.


తాత్విక మరియు కవితా ప్రభావకాలు PHILOSOPHICAL AND LITERARY INFLUENCES

1085 లో స్పానిష్ నగరమైన టోలెడోను దాని మూరిష్ పాలకుల నుండి క్రైస్తవులు శాంతియుతంగా స్వాధీనం చేసుకున్న తరువాత అరబ్ ప్రపంచం నుండి అనేక శాస్త్రీయ ఆలోచనలు మరియు విలాస వస్తువులు పాశ్చాత్య దేశాలకు వచ్చాయి. తరువాతి శతాబ్దంలో పండితులు, అరబిక్ మాట్లాడే యూదుల సహకారంతో, టోలెడో యొక్క గ్రంథాలయాలలో భద్రపరచబడిన ఇస్లామిక్ సంస్కృతి యొక్క మేధో వారసత్వం గురించి తెలుసుకున్నారు.


పాశ్చాత్య దేశాల వారి దృష్టి ప్రధానంగా ఇస్లామిక్ ఆలోచనాపరులు  అభివృద్ధి పరిచిన తత్వశాస్త్రం మరియు విజ్ఞాన శాస్త్రం పై ఉంది. వారిలో ఒకరు ఇబ్న్ సినా. అతనిని అవిసెన్నా అని కూడా పిలుస్తారు. ఇతడు  పెర్షియన్ వైద్యుడు మరియు పాలిమత్ (చాలా పరిజ్ఞానం గల జనరలిస్ట్). ఇతను ప్లేటో మరియు అరిస్టాటిల్ ముఖ్య ఆలోచనల తాత్విక సంశ్లేషణతో ఆచరణాత్మక వైద్య అభ్యాసాన్ని కలిపాడు.


మరొకరు అండలూసియన్ వైద్యుడు మరియు పాలిమత్ అయిన ఇబ్న్ రష్ద్ (లేదా అవెరోస్). ఇతడు ఇబ్న్ సినా అరిస్టాటిల్‌ను ఆలోచలను వివరించిన తీరుపై విమర్శలు చేసినాడు. ఇవి 13 వ శతాబ్దపు  ఇటాలియన్ వేదాంతవేత్త మరియు తత్వవేత్త థామస్ అక్వినాస్‌ యొక్క తాత్విక మరియు వేదాంతపరమైన ఆలోచనలపై ప్రభావాన్ని కలిగించినవి.  ఇబ్న్ రష్ద్ సమకాలీనుడు అయిన యూదుల ఆలోచనాపరుడు మోసెస్ మైమోనిడెస్ “గైడ్ టు ది పెర్ప్లెక్స్డ్ Guide to the Perplexed” రచించినాడు. ఇది  1230లో అరబిక్ నుండి లాటిన్లోకి అనువదించబడింది. వీరు ఇరువురి ప్రభావం థామస్ అక్వినాస్‌ పై అపారంగా  కలదు.


ఇటాలియన్ రచయిత డాంటే ఇస్లామిక్ ప్రభావాలకు ఎంతవరకు గురయ్యాడనే దానిపై చర్చ జరుగుతుండగా, ప్రవక్త(స) స్వర్గానికి అధిరోహించడాన్ని వివరించే “ది బుక్ ఆఫ్ మొహమ్మద్స్ లాడ్దర్ The Book of Mohammed’s Ladder (కాస్టిలియన్, ఫ్రెంచ్ మరియు లాటిన్లోకి అనువదించబడింది) ఆయనకు తెలుసు. ఇన్ఫెర్నో నుండి పారడైజ్ వరకు ప్రయాణం గురించి డాంటే వివిరించిన డివైన్ కామెడీ దీనిని అనుకరిస్తుంది.


బాగ్దాద్‌లో అరబిక్ అధ్యయనం చేసి అక్కడ చాలా సంవత్సరాలు గడిపిన రికోల్డో డా మోంటే డి మోంటే క్రోస్ 1300 లో ఫ్లోరెన్స్  కు తిరిగి వచ్చి ఇస్లాం దేశాలలో తన ప్రయాణాల గురించి రాసినాడు. డాంటే అతని చాలా ఉపన్యాసాలు విన్నాడు. డాంటే కు ముస్లిం బోధనల  విస్తారమైన ప్రభావం గురించి తెలుసు.


స్వీయ-బోధన తత్వవేత్త అయిన జ్ఞానోదయం యొక్క అత్యుత్తమ వర్ణన ఇస్లాం మనకు అందించినది. 12 వ శతాబ్దపు అరబ్ మేధావి ఇబ్న్ తుఫాయిల్ రాసిన “హేయ్ ఇబ్న్ యక్జాన్” అనే అరబిక్ నవలలో ఎడారి ద్వీపంలో ఒంటిరిగా వదిలివేయబడిన ఒక పిల్లవాని  కథను చెబుతుంది.

హేయ్ ఇబ్న్ యక్జాన్ 1671 లో అరబిక్-లాటిన్ ఎడిషన్‌తో ఆక్స్ఫర్డ్ లో  ప్రచురించబడింది మరియు జాన్ లాక్  మరియు రాబర్ట్ బాయిల్‌ (John Locke and Robert Boyle) తో సహా సెమినల్ యూరోపియన్ తత్వవేత్తల రచనలకు ఉత్ప్రేరకంగా మారింది. ఇది 1708 లో “ది ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ రీజన్‌” గా ఆంగ్లంలోకి అనువదించబడింది మరియు  1719 లో డేనియల్ డెఫో  నవల “రాబిన్సన్ క్రూసో” ను ప్రభావితం చేసింది.

 నాగరికత ఎల్లప్పుడూ మరల మరల ఆవిష్కరించబడుతోంది. నాగరికతను కొందరు  "పాశ్చాత్య" అని పిలుస్తారు కాని ఇప్పటికీ అది  విస్తృతమైన రాజకీయ, సాహిత్య మరియు మేధో ప్రభావాల ద్వారా ప్రభావితం అవుతూనే ఉంది.

No comments:

Post a Comment