10 July 2019

అహ్మద్ ఇబ్న్ ఫడ్లాన్( 877-960) Related image
అహ్మద్ ఇబ్న్ ఫడ్లాన్ 877-960 ఇస్లామిక్ స్వర్ణ యుగంలో జన్మించారు. సున్ని ముస్లిం. ఇతను బాగ్దాద్ లో అబ్బాసిద్ ఖలీఫా ఆస్థానం లో ఉద్యోగి. వేదాంతం, ఇస్లామిక్ న్యాయశాస్త్రం,  పర్యటన ఇతని అభిమాన విషయాలు.

ఇబ్న్ ఫడ్లాన్ (అరబిక్: أحمد بن فضلان بن العباس راشد بن) గా పిలువబడే అహ్మద్ ఇబ్న్ ఫడ్లాన్   ఇబ్న్ అల్-అబ్బాస్ ఇబ్న్ రాషిద్  ఇబ్న్ హమ్మద్,) 10 శతాబ్దపు అరబ్  ముస్లిం యాత్రికుడు. బాగ్దాద్ యొక్క అబ్బాసిద్ ఖలీఫా  రాయబారి కార్యదర్శిగా  గా వోల్గా బల్గార్స్(Volga Bulgars) రాజు వద్దకు పంపబడినాడు.  ఆయన చేసిన ప్రయాణాల వివరణాత్మక వర్ణన.  అతని రిసాలా(Risala)   గ్రంధం లో లభించును. వోల్గా వైకింగ్స్ మరియు ఓడ ఖననం(ship burial) పై అతని వివరణలు చాలా ముఖ్యమైనవి.


సమకాలీన మూలాల్లో అహ్మద్ ఇబ్న్ ఫడ్లాన్ను అరబ్గా అభివర్ణించారు. ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం మరియు రిచర్డ్ ఎన్. ఫ్రై ప్రకారం అతని మూలం,  జాతి,  విద్యాభ్యాసం  లేదా పుట్టిన మరియు మరణించిన తేదీల గురించి ఖచ్చితంగా చెప్పలేము.

అందుబాటులో ఉన్న ప్రాధమిక సమాచార పత్రాలు మరియు చారిత్రక గ్రంథాలు అహ్మద్ ఇబ్న్ ఫడ్లాన్ అబ్బాసిద్ ఖలీఫా  అల్-ముక్తాదిర్ యొక్క ఆస్థానంలో ఇస్లామిక్ న్యాయ శాస్త్రం మరియు విశ్వాసం అందు నిపుణుడు మరియు అతడు ఒక ఫకీహ్ అని వెల్లడిస్తున్నాయి. తన చారిత్రాత్మక యాత్రకు  బయలుదేరే ముందు, అతను అల్-ముక్తాదిర్ ఆస్థానం లో పనిచేస్తున్నాడని అతని రచనల ద్వారా  తెలుస్తుంది. అతను అబ్బాసిడ్ ఖలీఫా సేవలో ఒక ప్రయాణికుడు మరియు వేదాంతవేత్త.  921 కి ముందు అహ్మద్ ఇబ్న్ ఫడ్లాన్ గురించి మరియు అతని ప్రయాణాల గురించి పెద్దగా తెలియదు.

921 లో బాగ్దాద్ అబ్బాసి ఖలీఫా  అల్-ముక్తాదిర్ ఇబ్న్ ఫడ్లాన్ను అల్మాలోని వోల్గా బల్గేరియా(Volga BulgariaAlmış)కు చెందిన ఇల్టాబార్ (ఖాజర్ల ఆధ్వర్యంలోని వాసల్-రాజు iltäbär (vassal-king under the Khazars)) వద్దకు రాయబారి కార్యదర్శిగా పంపినారు.

21 జూన్ 921 (11 సఫర్ AH 309), ఖలీఫా ఆస్థానం లో నపుంసకుడైన సుసాన్ అల్-రాస్సీ (Susan al-Rassi) నేతృత్వంలోని దౌత్య ప్రతినిది వర్గం  బాగ్దాద్ నుండి బయలుదేరింది. వీరి ప్రధాన లక్ష్యం  ఇటీవల మార్చబడిన బలగర్ ప్రజలకు  (ఇప్పుడు రష్యాలో ఉన్న వోల్గా నది తూర్పు ఒడ్డున నివసిస్తున్న వోల్గా  బల్గర్ ప్రజలు) కు ఇస్లామిక్ చట్టాన్ని వివరించడం.  6 శతాబ్దంలో బల్గార్ల యొక్క మరొక సమూహం పడమటి వైపుకు వెళ్లి, రోజు వారి పేరును కలిగి ఉన్న దేశంపై దాడి చేసి  క్రైస్తవులుగా మారింది. వోల్గా రాజు చేసిన అభ్యర్థన మేరకు వారి శత్రువులైన ఖాజర్లకు(Khazars). వ్యతిరేకంగా వారికి సహాయం చేయడానికి తన రాయబార వర్గాన్ని ఖలీఫా  పంపారు. ఇబ్న్ ఫడ్లాన్ రాయభార వర్గం యొక్క  సమూహం యొక్క మత సలహాదారుగా మరియు ఇస్లామిక్ మత సిద్ధాంతం మరియు చట్టానికి ప్రధాన సలహాదారుగా పనిచేశారు.

అహ్మద్ ఇబ్న్ ఫడ్లాన్ మరియు దౌత్య ప్రతినిధి వర్గం ఇప్పుడు ఉజ్బెకిస్తాన్లో భాగమైన బుఖారా వైపు ఏర్పాటు చేసిన కారవాన్ మార్గాలను ఉపయోగించుకున్నాయి, కాని తూర్పున మార్గాన్ని అనుసరించే బదులు, వారు ఈశాన్య ఇరాన్లో ఉత్తరం వైపు తిరిగారు. కాస్పియన్ సముద్రం దగ్గర గుర్గాన్ నగరాన్ని విడిచిపెట్టి, వారు వివిధ రకాల టర్కీ ప్రజలకు చెందిన భూములను ముఖ్యంగా కాస్పియన్ యొక్క తూర్పు తీరంలో ఉన్న  ఖాజర్ ఖగానేట్, ఓగుజ్ టర్క్స్(Khazar KhaganateOghuz Turks) ప్రాంతాలు మరియు ఉరల్ నదిపై పెచెనెగ్స్ మరియు ఇప్పుడు మధ్య రష్యాలో  ఉన్న బాష్కిర్స్(the Pechenegs on the Ural River, and the Bashkirs in what is now central Russia)ను  దాటారు, కానీ అతని వర్ణన లో ఎక్కువ భాగం రస్ అనగా వోల్గా వాణిజ్య మార్గంలో వరంజియన్లు ఉన్న వైకింగ్స్(Rus, i.e. the Varangians (Vikings)).గురించి చెప్పబడినది, ప్రతినిధి బృందం 4000 కిలోమీటర్లు (2500 మైళ్ళు) ప్రయాణించింది.


అహ్మద్ ఇబ్న్ ఫడ్లాన్ రచనల వివరాలు
అహ్మద్ ఇబ్న్ ఫడ్లాన్ రచనల వివరాలు అసంపూర్ణoగా మాత్రమే లబించినవి.  క్రిస్టియన్ మార్టిన్ ప్రచురించిన యాకోట్ యొక్క భౌగోళిక నిఘంటువు(1823)   లో  స్వల్పం గా  మాత్రమే లబించినవి. 1923 లో ఇరాన్లోని మషద్, అస్టేన్ కుడ్స్(Astane Quds MuseumMashhadIran) మ్యూజియంలో జెకి వాలిడి టోగన్(Zeki Validi Togan) కనుగొన్న 13 శతాబ్దం (7 శతాబ్దం హిజ్రా) నాటి 420 పేజీల మాన్యుస్క్రిప్ట్ లో ఇబ్న్ ఫల్దాన్ రచనల వివరాలు కలవు. ఇబ్న్ ఫడ్లాన్ యొక్క రచనల అదనపు భాగాలు  16 శతాబ్దపు పెర్షియన్ భౌగోళిక శాస్త్రవేత్త అమోన్ రెజా రచన హాఫ్ట్ ఇక్లామ్ ("సెవెన్ క్లైమ్స్") లో కలవు.. ఇవి అన్ని ఇబ్న్ ఫడ్లిన్ యొక్క రచనలను పూర్తి వివరాలను అందించలేదు. 

ఇబ్న్ ఫల్డాన్  -వోల్గా బల్గార్స్ వర్ణన  
వోల్గా బల్గర్ రాజు మతపరమైన బోధనకు ఇబ్న్ ఫాల్దాన్ ఆహ్వానించాడు మరియు ఫకీహ్‌గా ఇబ్న్ ఫడ్లాన్ చేసిన పని బల్గార్స్ కు మతభొధ మరియు దౌత్యనీతి.  వోల్గా బల్గర్ ప్రజలు అవలంభించే ఇస్లామిక్ ప్రార్ధనా పద్దతులను ఫల్దాన్ సంస్కరించినాడు. వోల్గా బల్గర్ ప్రజలు అసంపూర్ణ ఇస్లాంను అభ్యసిస్తున్నారని  ఇబ్న్ ఫడ్లాన్ అభిప్రాయపడినాడు.  వోడ్కా బల్గార్స్ కు చెందిన అనేక మంది ప్రజలు మరియు సమాజాలు వారి పద్దతులు  దారితప్పినట్లుగా ఉన్నాయి. వారికి దేవునితో మతపరమైన బంధాలు లేవు అని ఇబ్న్ ఫల్దాన్ అభిప్రాయపడినాడు.

ఇబ్న్ ఫడ్లాన్ రచనలలో గణనీయమైన భాగం రోస్ (روس) లేదా రసియా అని పిలిచే ప్రజల వర్ణనకు అంకితం చేయబడింది. రస్ లోని  వోల్గా బర్గర్స్ ప్రజలను,  వారి ఆచారవ్యవహారాలను, వారి ఆహార అలవాట్లను, వారి వేషభాషలను, వారి సంపదను,వారి ఆయుధాలను, వారి ఆభరణాలను ఇబ్న్ ఫడ్లాన్ వివరంగా వర్ణించినాడు.

ఇబ్న్ ఫడ్లాన్ రస్ను "పరిపూర్ణమైన" భౌతిక నమూనాలుగా మరియు రసియా యొక్క పరిశుభ్రతను అసహ్యంగా పేర్కొన్నాడు. అతని వివరణ   పెర్షియన్ యాత్రికుడు ఇబ్న్ రుస్తాతో విభేదిస్తుంది, ఇబ్న్ ఫల్దాన్  తెగ అధిపతులలో ఒకరి అంత్యక్రియలను కూడా చాలా వివరంగా వివరించాడు ఇది ఆధునిక బాలిమర్ కాంప్లెక్స్‌లో జరిగిందని కొందరు పండితులు అంటారు.

చలన చిత్రాలలో మరియు నవలలో ఇబ్న్ ఫాల్దన్  
·        మైఖేల్ క్రిక్టన్ యొక్క 1976 నవల “ఈటర్స్ ఆఫ్ ది డెడ్” లో ఇబ్న్ ఫడ్లిన్ ఒక ప్రధాన పాత్ర.,
·        “ది పదమూడవ వారియర్The Thirteenth Warrior, నవల1999” యొక్క చలన చిత్రఅనుకరణలో ఇబ్న్ ఫడ్లిన్   పాత్రను ప్రముఖ నటుడు ఆంటోనియో బాండెరాస్ పోషించినాడు.  
·        ఇబ్న్ ఫడ్లిన్ ప్రయాణం పై 2007 సిరియన్ టీవీ సిరీస్ సక్ఫ్ అల్-ఆలం నిర్మించబడినది.
No comments:

Post a Comment