30 October 2020

విద్య యొక్క ప్రాముఖ్యత పై ముహమ్మద్ ప్రవక్త(స) భావాలు What Prophet Muhammad said about the importance of education?

 


భారత ముస్లింల దుస్థితి కి  ప్రధాన కారణం అయిన విద్య (జ్ఞానం) లో వెనుకబడి ఉన్నారనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని, ముస్లిం పండితులు ముస్లింలను ప్రవక్త(స) నిర్దేశించిన విధంగా జ్ఞానాన్ని పొందమని ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైంది.

జ్ఞానం(అరబిక్ - ఇల్మ్, ఏకవచనం; ఉలూమ్ - బహువచనం) సంపాదించడం ద్వారా మాత్రమే భారతీయ ముస్లింల సమస్యలను పరిష్కరించవచ్చు.

 

ప్రపంచంలోని ఏ మూల నుంచి అయినా    జ్ఞానాన్ని పొందమని చెప్పే ప్రవక్త(స) సంప్రదాయాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. హదీసు  సాహిత్యం (ప్రవక్త యొక్క సూక్తులు) కూడా జ్ఞానం యొక్క విలువను తెలుపుతుంది..

విద్య పై ప్రవక్త(స) యొక్క కొన్ని సూక్తులు:

·       ప్రతి ముస్లిం (పురుషులు లేదా మహిళలు) జ్ఞానం పొందడం తప్పనిసరి"

·       జ్ఞానం  గల మనిషి సాతానుకు వ్యతిరేకంగా మరింత బలీయమైనవాడు

·       " చైనా వరకు వెళ్లి అయినా జ్ఞానాన్ని పొందండి."

·       అమరవీరుడి రక్తం కంటే జ్ఞానం గల వ్యక్తి సిరా పవిత్రమైనది."

·       జ్ఞానం కోసం ఎవరైనా ప్రయాణిస్తే, అల్లాహ్ అతన్ని స్వర్గం లో ప్రయాణించేలా చేస్తాడు. జ్ఞానాన్ని కోరుకునే వారితో దేవదూతలు తమ ఆనందం ప్రకటిస్తారు.

·        అల్లాహ్ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి  స్వర్గానికి వెళ్ళే మార్గాన్ని సులభతరం చేస్తాడు.

·       "భక్తుడిపై జ్ఞానం గల మనిషి ఆధిపత్యం, రాత్రి వేళ నక్షత్రాల కంటే ప్రకాశించే చంద్రుడిలా ఉంటుంది ".

·        "ఓ అల్లాహ్, ప్రయోజనకరమైన జ్ఞానం, ఆమోదయోగ్యమైన చర్య మరియు మంచి సదుపాయం కోసం నేను నిన్ను అడుగుతున్నాను

·       "జ్ఞానం అనేది ముస్లిం యొక్క కోల్పోయిన ఆస్తి; అందువల్ల మీరు ఎవరినుంచి అయినా దాన్ని పొందండి.

·        "అల్లాహ్ యొక్క సృష్టి గురించి ఒక గంట ఆలోచించడం మరియు అధ్యయనం చేయడం  ఒక సంవత్సరం ప్రార్థనల కంటే మంచిది."

·       జ్ఞానం ఒక నిధి లాంటిది.

·       "జ్ఞానాన్ని సంపాదించి ప్రజలకు ఇవ్వండి."

·       'మరణం తరువాత మనిషి వదిలివేయగల గొప్ప సంపద  అతని జ్ఞానం.'

·       "నలుగురు ముస్లింలకు  చదవడo మరియు వ్రాయడo నేర్పిస్తే యుద్ధ ఖైదీకి  స్వేచ్ఛ ఇవ్వండి" (ఇస్లాం యొక్క ప్రారంభ కాలంలో ప్రవక్త యొక్క ఆదేశం )

·       పండితుల ఏకైక వారసత్వం జ్ఞానం, కాబట్టి ఎవరైతే దాని నుండి వాటా తీసుకుంటారో, అతను నిజమైన వాటాను తీసుకున్నాడు.

·       "ఎవరు జ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళతారో అతను తిరిగి వచ్చేవరకు అతను అల్లాహ్ మార్గంలో ఉంటాడు."

·       "ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, అతని మూడు పనులు ఉంటాయి: నిరంతర దాతృత్వం (సదాకా), ఇతరులు (ఇల్మ్ నాఫ్) నుండి ప్రయోజనం పొందిన జ్ఞానం మరియు అతని కోసం ప్రార్థించే నీతిమంతుడు."

·       "ముస్లిం జ్ఞానాన్ని పొందినప్పుడు, అతడు దానిని  తన సోదరులకు (ఇతరులకు) కుడా  బోధిoచాలి.."

 

ప్రవక్త (స)సాంప్రదాయాలు) ఇస్లాం చరిత్ర అంతటా ప్రతిధ్వనించాయి మరియు ముస్లింలను జ్ఞానం కోరేలా ప్రోత్సహించాయి.ఒక మోమిన్ జీవితం "యల నుండి సమాధి వరకు నేర్చుకునే ప్రయాణం" గా ఉండాలి. ఈ సంప్రదాయాలను పాటించినందున ముస్లింలు దాదాపు పది శతాబ్దాలుగా అభివృద్ధి చెందారు. ముస్లిం నాగరికత యొక్క అత్యున్నత స్థాయికి ఎదగడానికి కారణం వారి ప్రాపంచిక జ్ఞానం. మతపరమైన జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చి ఆధునికీకరణ మార్గాన్ని వదిలివేసినప్పుడు వారి క్షీణత ప్రారంభమైంది. సుప్రసిద్ధ ఇస్లామిక్ పండితుడు మౌలానా అబుల్ హసన్ అలీ నద్వి ప్రకారం జ్ఞానం (విజ్ఞాన శాస్త్రం) ను మతంతో విడదీయడం వల్ల మానవత్వం చాలా కోల్పోయింది మరియు ఈ విభజన ఇస్లామిక్ సొసైటీకి హాని గా మారింది. 


ముస్లింలకు వారి సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ఉత్తమ మార్గం జ్ఞానాన్ని పొందడం

28 October 2020

వక్కం మౌలవి Vakkaṁ maulavi1873-1932


వక్కం మౌలవి గా ప్రసిద్ది చెందిన వక్కోమ్ మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్ మౌలావి (28 డిసెంబర్ 1873 - 31 అక్టోబర్ 1932) ఒక సామాజిక సంస్కర్త, ఉపాధ్యాయుడు, గొప్ప రచయిత, ముస్లిం పండితుడు, జర్నలిస్ట్, స్వాతంత్ర్య సమరయోధుడు మరియు స్వదేశీభీమణిSwadeshabhimani వార్తాపత్రిక యొక్క స్థాపకుడు మరియు ప్రచురణకర్త.

 

వక్కం మౌలవి 1873 లో ట్రావెన్కోర్ లోని తిరువనంతపురంలోని చిరాయింకిల్ తాలూకాలోని వక్కోంలో జన్మించారు. అతను మదురై మరియు హైదరాబాద్ పూర్వీకుల మూలాలను కలిగి ఉన్న ఒక ప్రముఖ ముస్లిం కుటుంబంలో పూంత్రాన్లో జన్మించాడు మరియు అతని మాతృ పూర్వీకులు చాలా మంది సైన్యం లో పనిచేశారు

 

వక్కం మౌలవి అతని తండ్రి, ఒక ప్రముఖ వ్యాపారి.  వక్కం మౌలవి ఏకసంతానుగ్రాహి. తక్కువ సమయంలోనే  మౌలవి అరబిక్, పెర్షియన్, ఉర్దూ, తమిళం, సంస్కృతం మరియు ఇంగ్లీష్ సహా అనేక భాషలను నేర్చుకున్నాడు

 

1900లో  అలీయార్ కుంజు పూంత్రాన్ విలకోమ్ మరియు పతుమ్మ కయాల్పురం కుమార్తె హలీమాను వక్కం మౌలవి వివాహం చేసుకున్నారు. మౌలావి - హలీమా దంపతులకు ఒక కుమారుడు అబ్దుల్ సలాం కలిగాడు. బిడ్డ పుట్టిన వెంటనే హలీమా మరణించింది. ఒక సంవత్సరం తరువాత, మౌలవి అమీనా ఉమ్మల్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు అబ్దుల్ హై, అబ్దుల్ వహాబ్, అబ్దుల్ ఖాదర్ జూనియర్, అబ్దుల్ హక్, ఒబైదుల్లా, అమీనా, యాహియా, సకీనా, మహ్మద్ ఈజా మరియు మహ్మద్ ఇక్బాల్ మొదలగు పది మంది పిల్లలు కలిగారు. వీరిలో అబ్దుల్ సలాం, అబ్దుల్ వహాబ్ మరియు మహ్మద్ ఈజా ఇస్లామిక్ అధ్యయనాల రచయితలు మరియు పండితులు మరియు అబ్దుల్ ఖాదర్ జూనియర్ రచయిత, సాహిత్య విమర్శకుడు మరియు పాత్రికేయుడు.

 

వక్కం మౌలవి మేనల్లుడు వక్కోమ్ మజీద్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు మరియు ట్రావెన్కోర్-కొచ్చిన్ స్టేట్ అసెంబ్లీ మాజీ సభ్యుడు మరియు మరొక మేనల్లుడు పి.హబీబ్ మొహమ్మద్ కేరళలోని ట్రావెన్కోర్ హైకోర్టు మొదటి ముస్లిం న్యాయమూర్తి.

 

వక్కం మౌలవి శిష్యులలో కేరళ శాసనసభ మాజీ స్పీకర్ మరియు కేరళ ముస్లింలలో సామాజిక సంస్కర్త అయిన కె.ఎం. సీతి సాహిబ్ ఉన్నారు.

 

మౌలావి 1905 జనవరి 19న స్వదేశభిమణి వార్తాపత్రికను ప్రారంభించినాడు., కాని 26 సెప్టెంబర్ 1910, వార్తాపత్రిక మరియు ప్రెస్ ను బ్రిటిష్ పోలీసులు సీలు చేసి జప్తు చేశారు, మరియు సంపాదకుడు రామకృష్ణ పిళ్ళైని అరెస్టు చేసి ట్రావెన్కోర్ నుండి తిరునెల్వేలికి బహిష్కరించారు.

 

ప్రెస్ ను  జప్తు చేసిన తరువాత, మౌలవి సామాజిక మరియు సాంస్కృతిక కార్యకలాపాలపై ఎక్కువ దృష్టి పెట్టారు, సామాజిక నాయకుడిగా ఎదిగారు, అనేక పుస్తకాలు కూడా రాశారు. దౌసాబా మరియు ఇస్లాం మతా సిదాంత సంగ్రహం Daussabah and Islam Matha Sidantha Samgraham  అనేవి ఒరిజినల్ రచనలు కాగా, ఇమామ్ గజాలి యొక్క కీమియా-ఇ-సాదత్, అహ్లూ సున్నతువాల్ జమ్మత్, ఇస్లామిక్ సందేసం, సూరత్-ఉల్ ఫాతిహా Keemiya-e- SaadatAhlu Sunnathuwal JammathIslamic SandesamSurat-ul fathiha అనేవి  అనువాదాలు.

 

మౌలవిని కేరళ ముస్లిం సమాజంలో గొప్ప సంస్కర్తలలో ఒకరిగా భావిస్తారు, మరియు అతనిని "ముస్లిం పునరుజ్జీవన పితామహుడు" అని కూడా పిలుస్తారు. మతం యొక్క ఆచారపరమైన అంశాల కంటే మత మరియు సామాజిక ఆర్థిక అంశాలను ఆయన ఎక్కువగా నొక్కి చెప్పారు. ఆధునిక విద్య, మహిళల విద్య మరియు ముస్లిం సమాజంలో దురాచారాల తొలగింపు కోసం ఆయన ప్రచారం చేశారు. ఈజిప్టుకు చెందిన ముహమ్మద్ అబ్దుహ్ మరియు అతని సంస్కరణ ఉద్యమాలచే ప్రభావితమైన మౌలావి అరబి-మలయాళంలో మరియు అల్ మనార్ మాదిరిగానే మలయాళంలో పత్రికలను ప్రారంభించాడు.

 

 “ముస్లిం” జనవరి 1906 లో మరియు తరువాత “అల్-ఇస్లాం” (1918) మరియు “దీపిక” (1931) ప్రారంభించబడినవి. ఈ ప్రచురణల ద్వారా, ఇస్లాం యొక్క ప్రాథమిక సిద్ధాంతాల గురించి ముస్లిం సమాజానికి బోధించడానికి ప్రయత్నించాడు. అల్-ఇస్లాం ఏప్రిల్1918 లో ప్రచురణ ప్రారంభించింది మరియు కేరళలో ముస్లిం పునరుజ్జీవనంలో కీలక పాత్ర పోషించింది. ఇది ముస్లిం సమాజంలో “నెర్చాస్ మరియు ఉరూస్ Nerchas and Uroos  పండుగలను వ్యతిరేకించింది, తద్వారా సనాతన ఉలేమా యొక్క  వ్యతిరేకతను పొందినది. వారు “అల్-ఇస్లాం” చదువుటకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశారు

 

ఆర్థిక ఇబ్బందులు మరియు పాఠకుల కొరత కారణంగా ఐదు సంచికలతో  “అల్-ఇస్లాం” పత్రికను మూసివేయబడినది. అయితే ఇది కేరళలోని మాపిల్లలలో మత సంస్కరణకు ప్రయత్నించిన మార్గదర్శక పత్రికగా పరిగణించబడుతుంది. “అల్-ఇస్లాం” అరబిక్-మలయాళ లిపిని ఉపయోగించి మలయాళ భాషలో ప్రచురించబడినప్పటికీ, ముస్లిం మరియు దీపిక లో  మలయాళ లిపిని  ఉపయోగించారు.

 

ట్రావెంకూర్ రాజ్యం లో మౌలావి నిరంతరం ప్రచారం చేసిన ఫలితంగా, ట్రావెంకూర్ మహారాజా ప్రభుత్వం ముస్లిం విద్యార్థులు ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అరబిక్ బోధనను ప్రవేశపెట్టి, వారికి ఫీజు రాయితీలు మరియు స్కాలర్‌షిప్‌లను అందించింది. బాలికలను ఫీజు చెల్లింపు నుండి పూర్తిగా మినహాయించారు. పిల్లలకు అరబిక్ నేర్చుకోవడానికి మౌలవి పాఠ్య పుస్తకాలు, ప్రాథమిక పాఠశాలలకు అరబిక్ బోధకులకు శిక్షణ ఇవ్వడానికి ఒక మాన్యువల్ రాశారు. మౌలావి అబ్దుల్ ఖాదిర్ యొక్క వత్తిడి తో  అరబిక్ ఉపాధ్యాయుల కోసం ట్రావెంకూర్ ప్రభుత్వం త్వరలోనే అర్హత పరీక్షలను ప్రారంభించింది, అందులో అతన్ని చీఫ్ ఎగ్జామినర్గా నియమించారు.

 

ఆ కాలం నాటి  ముస్లిం సమాజంలో వరకట్న విధానం, వివాహాలపై విపరీతమైన దుబార ఖర్చు , వార్షిక "ఉర్స్" వేడుకలు మరియు ముహర్రంలో విగ్రహారాధనకు సమానమైన అనేక ఇస్లామేతర  పద్ధతులు అమలులో కలవు. వక్కం మౌలావి తన శిష్యుల సహాయంతో మరియు సమాన అభిప్రాయాలను మరియు ఆదర్శాలు  గల వ్యక్తుల సహకారంతో ఇటువంటి పద్ధతులకు వ్యతిరేకంగా తన ప్రచారాన్ని ప్రారంభించాడు. ప్రచారం శక్తివంతమైన ఉద్యమంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు, కొంతమంది ముల్లాస్. అతనిని  "కాఫీర్" అని "ఫత్వాస్" జారీ చేశారు, మరికొందరు అతన్ని "వహాబీ" అని ముద్ర వేశారు.

 

వక్కం మౌలవి ఆల్ ట్రావెన్కోర్ ముస్లిం మహాజనసభ మరియు చిరాయింకిల్ తాలూక్ ముస్లిం సమాజం మొదలుపెట్టి ముస్లింలలో ఐక్యతను సృష్టించడానికి ప్రయత్నించాడు మరియు ట్రావెన్కోర్ ప్రభుత్వ ముస్లిం బోర్డు ఛైర్మన్గా పనిచేశాడు.

 

ఏరియాడ్, కొడుంగల్లూరు, ట్రావెన్కోర్, కొచ్చిన్ మరియు మలబార్ ప్రాంతాల ముస్లింలందరిని కూడగట్టి  "ముస్లిం ఐక్య సంఘం", ఏర్పరచినాడు. ఇతను కెఎమ్ మౌలావి, కెఎమ్ సీతి సాహిబ్, మనప్పట్ కుంజు మహ్మద్ హాజీ లతో కలిసి అలప్పుజ యొక్క లజ్నాతుల్ మొహమ్మదియ అసోసియేషన్, కొల్లంకు చెందిన ధర్మ భోషిని సభ కు మార్గనిర్దేశం చేసారు.

 

1931లో అతను ఇస్లామియా పబ్లిషింగ్ హౌస్ ను స్థాపించాడు. అతని  పెద్ద కుమారుడు అబ్దుల్ సలాం మలయాళంలో అల్లామా షిబ్లి జీవిత చరిత్ర  అల్ ఫరూక్ పేరుతో అనువాదం మరియు ప్రచురణను రెండు వాల్యూమ్లలో పర్యవేక్షించాడు.