1 November 2020

ఒక జాతీయవాది: డా. సయ్యద్ మహముద్ (1889-1971) A Nationalist: Dr. Syed Mahmud (1889-1971)



డా. సయ్యద్ మహముద్ (1889-1971) భారత స్వాతంత్ర్య ఉద్యమo లో చురుకుగా పాల్గొన్నారు  మరియు భారత జాతీయ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు.అతను జామియా మిలియా ఇస్లామియా యొక్క ఫౌండేషన్ కమిటీ సభ్యుడు.

సయ్యద్ మహముద్ 1889లో బ్రిటిష్ ఇండియా లోని యునైటెడ్ ప్రావిన్సు,   ఘాజిపూర్ జిల్లా లోని  సయ్యద్ పూర్ భితరి  Syedpur Bhitari గ్రామవాసి. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు. మహమూద్ విద్యార్థి రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు మరియు 1905 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సెషన్‌కు సైఫుద్దీన్ కీచ్లు తో పాటు హాజరయ్యాడు. మహముద్ జాతీయవాద కాంగ్రెస్ వైపు ఎక్కువ ఆకర్షితులయ్యారు. తన రాజకీయ కార్యకలాపాల వలన  అలీగర్ నుండి బహిష్కరించబడిన తరువాత, సయ్యద్ మహమూద్ ఇంగ్లాండ్ వెళ్లి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్యను అభ్యసించే ముందు లింకన్స్ ఇన్ లో బారిస్టర్ అయ్యారు.

 

1909లో లండన్లో అతనికి మహాత్మా గాంధీ మరియు జవహర్ లాల్ నెహ్రూ తో పరిచయం అయ్యింది. 1912లో జర్మనీ నుండి పిహెచ్‌డి పొందారు ఆపైన భారతదేశానికి తిరిగి వచ్చి 1913 లో మజ్జరుల్ హక్ యొక్క మార్గదర్శకత్వంలో పాట్నాలో తన న్యాయ వృత్తిని ప్రారంభించారు. 1915లో అతను మజారుల్ హక్ మేనకోడలును వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాలు లా ప్రాక్టిస్ తరువాత న్యాయవాద వృత్తిని విడిచి  భారతదేశ స్వాతంత్ర్యం ఉద్యమంలోకి ప్రవేశించారు..

 

కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ మధ్య 1916 లక్నో ఒప్పందాన్ని రూపొందించడంలో పాత్ర పోషించిన యువ ముస్లిం నాయకులలో సయ్యద్ మహముద్ ఒకరు. అతను 1916 లో ఇండియన్ హోమ్ రూల్ ఉద్యమంలో మరియు సహకారేతర ఉద్యమంలో మరియు మహాత్మా గాంధీ నాయకత్వంలో ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొన్నాడు. 1923 లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవికి ఎన్నికయ్యారు. 1930లో శాసనోల్లంఘన ఉద్యమంలో జవహర్‌లాల్ నెహ్రూతో కలిసి అలహాబాద్‌లో జైలు పాలయ్యాడు.

 

డా. సయ్యద్ మహముద్ తన కెరీర్ మొత్తంలో మత సామరస్యాన్ని నొక్కిచెప్పాడు, 1916 లో కాంగ్రెస్-లీగ్ మద్య కుదిరిన లక్నో ఒప్పందంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. హోమ్ రూల్ లీగ్, AICC తో కలిసి పనిచేశాడు మరియు ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొనడానికి తన న్యాయవాద వృత్తిని కుడా   వదులుకున్నాడు. అతను “ది ఖిలాఫత్ & ఇంగ్లాండ్” అనే పుస్తకం ను  కూడా రచించాడు. 1922 లో, అతను జైలు పాలయ్యాడు. 1923 లో, అతను జవహర్ లాల్ నెహ్రూతో పాటు AICC డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు, దీని ఫలితంగా ఇద్దరు నాయకుల మధ్య సన్నిహిత స్నేహం ఏర్పడింది.సయ్యద్ మహముద్ కుమార్తె వివాహంలో  నెహ్రూ సాక్షిగా సంతకం చేశారు.

 

1929లో M.A. అన్సారీ తో కలసి  కాంగ్రెస్‌లోనే 'ముస్లిం నేషనలిస్ట్ పార్టీ'ని ఏర్పాటు చేసి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయ్యారు మరియు 1936 వరకు ఈ పదవిలో పనిచేశారు. 1930 లో, మోతిలాల్  నెహ్రూ మరియు జవహర్ లాల్ నెహ్రు తో కలసి శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు అలహాబాద్‌లోని నైని జైలులో ఖైదు చేయబడ్డాడు.

 

1937 లో జరిగిన కేంద్ర మరియు ప్రాంతీయ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత, సయ్యద్ మహమూద్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి  బలమైన అభ్యర్థులలో ఒకరిగా పరిగణించబడ్డారు, కాని కొన్ని బక్లమైన కారణాల దృష్ట్యా మహమూద్ కు బదులు తోటి బిహారీ కాంగ్రెస్ సభ్యుడు శ్రీకృష్ణ సిన్హా ముఖ్యమంత్రి అయ్యారు. మహమూద్, శ్రీకృష్ణ సిన్హా ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా చేరారు మరియు కేబినెట్లో మూడవ స్థానం పొందారు.

1937 లో బీహార్‌లోని శ్రీ కృష్ణ సిన్హా నేతృత్వంలోని మంత్రివర్గం లో  సయ్యద్ మహమూద్‌ విద్య, అభివృద్ధి, ప్రణాళిక శాఖ మంత్రిగా పనిచేసారు. అతని ప్రాధాన్యత ప్రాధమిక విద్యను సాధ్యమైనంత ఎక్కువ మందికి అందించడం, పాఠ్యాంశాల సవరణ కోసం కృషి చేయడం, పాట్నా విశ్వవిద్యాలయంలో ఉర్దూ ఉపాధ్యాయులను నియమించడం. ప్రభుత్వ ఉద్యోగాలలో మరియు స్థానిక సంస్థలలో ముస్లింల నిష్పత్తిని పెంచడానికి ఆయన పోరాడారు

 

ఆ రోజులలో చెలరేగిన హిందీ-ఉర్దూ ఉద్రిక్తతను తగ్గించడానికి, డాక్టర్ సయ్యద్ మహముద్ “రౌష్ని” అనే ద్విభాషా (ఉర్దూ; హిందీ) వార్తాపత్రికను ప్రారంభించాడు. ప్లాన్ ఆఫ్ ప్రావిన్షియల్ రీకన్స్ట్రక్షన్ (1939) అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఇది చాలా ప్రజాదరణ పొందింది, ఇది బీహార్ యొక్క ప్రజారోగ్యం, విద్య మరియు మానవ వనరులు, భౌతిక వనరులు వంటి సమస్యల పై  అతని ఆలోచనలను వివరిస్తుంది.. పుస్తకం గ్రామీణ  రుణం మరియు వ్యవసాయ ఫైనాన్స్ గురించి సుదీర్ఘంగా వివరించింది..

 

1942 క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆమోదించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులలో మహముద్ ఒకరు, బ్రిటిష్ పాలనను వెంటనే అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆగష్టు 1942 నుండి, మహముద్ మరియు క్విట్ ఇండియా ఉద్యమంలోని ఇతర అగ్ర నాయకులందరూ ఎక్కువగా అహ్మద్ నగర్ కోటలో ఖైదు చేయబడ్డారు.

 

ప్రత్యేక ముస్లిం రాజ్యo పాకిస్తాన్ ఏర్పాటు చేయాలన్న ముస్లిం లీగ్ డిమాండ్ను వ్యతిరేకించిన లౌకిక ముస్లిం నాయకులలో ఆయన ఒకరు, బీహార్ మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ముస్లింలు మరియు హిందువుల మధ్య మత హింసకు వ్యతిరేకంగా ఇతర భారత నాయకులతో కలిసి పనిచేశారు

 

1946-52 మధ్య కాలంలో సయ్యద్ మహమూద్ బీహార్లో రవాణా, పరిశ్రమలు, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. 1949 లో దేశాన్ని చైనా నుండి కాపాడటానికి, చైనా కు వ్యతిరేకంగా పాకిస్తాన్తో ఒక నిర్దిష్ట సైనిక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని అయన  నెహ్రూ కు సూచించాడు అయితే ఇది కార్యరూపం దాల్చలేదు. భారతదేశం యొక్క మత విభజనతో బాధపడ్డాడు. 'భారతదేశం యొక్క గంగా-జమున తహజీబ్ జరుపుకుంటున్న సందర్భంగా అతనిలోని ఒక ఆశావాది హిందూ ముస్లిం అకార్డ్ (1949) అనే మరొక పుస్తకాన్ని రాయడానికి ప్రేరేపించాడు.

 

'7 డిసెంబర్ 1954 నుండి 17 ఏప్రిల్ 1957 వరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ కంటి సమస్య కారణంగా రాజీనామా చేశారు. అతను చారిత్రాత్మక బాండుంగ్ కాన్ఫరెన్స్ (1955) లో పాల్గొన్నాడు, అక్కదే పంచశీల కు శ్రీకారం చుట్టబడినది.. గల్ఫ్ దేశాలు, ఇరాన్ మరియు ఈజిప్టులతో భారతదేశం యొక్క మెరుగైన దౌత్య సంబంధాలలో అతను ముఖ్యమైన పాత్ర పోషించాడు.

 

.భారతదేశ స్వాతంత్ర్యం తరువాత, సయ్యద్ మహముద్ బీహార్లోని చంపారన్-ఈస్ట్ నియోజకవర్గం నుండి మొదటి లోకసభ (భారత పార్లమెంటు దిగువ సభ) కు మరియు రెండవ లోకసభకు బీహార్ లోని గోపాల్గంజ్ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.అతను 1954 మరియు 1957 మధ్య విదేశీ వ్యవహారాల ఉప మంత్రిగా పనిచేశాడు మరియు బాండుంగ్ సమావేశంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. డాక్టర్ సయ్యద్ మహమూద్ 1971 లో మరణించారు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment