19 November 2020

అల్లాహ్ యొక్క 99 పేర్లు (అల్ అస్మా ఉల్ హుస్నా); వాటి ప్రాముఖ్యత The 99 Names of Allah (Al Asma Ul Husna); Significance of their Learning -



 

అల్లాహ్ యొక్క 99 పేర్లు

అల్లాహ్ యొక్క 99 పేర్లు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క లక్షణాలను తెలియచేస్తున్నాయి. ఇస్లాం యొక్క మొదటి స్తంభం తౌహీద్ మరియు ముస్లిం గా అల్లాహ్ మీద మనకు గట్టి నమ్మకం ఉంది. అల్లాహ్ తన 99 పేర్లను పవిత్ర ఖురాన్లో వెల్లడించాడు, తద్వారా మనo సర్వశక్తిమంతుని గురించి బాగా అర్థం చేసుకోవచ్చు.

సర్వశక్తిమంతుడు అయిన  అల్లాహ్ పేర్ల మనకు తెలిసినప్పుడు మరియు మనం అన్ని పేర్లను అర్థం చేసుకోవడం వలన  ఆయన కొరకు మన హృదయాలలో ప్రేమ, భయం మరియు నమ్మకo ఏర్పడతాయి.


దివ్య ఖురాన్ లోని అల్లాహ్ యొక్క 99 పేర్ల ప్రాముఖ్యత

 

పవిత్ర ఖురాన్ లోని వివిధ ప్రదేశాలలో, అల్లాహ్ (SWT) తన 99 పేర్ల గురించి ప్రస్తావించాడు:

·       అల్లాహ్ మంచి పేర్లకు అర్హుడు, ఆయనను మంచి పేర్లతోనే వేడుకొండి. -(ఖురాన్ 7: 180)

·       ఆయనే అల్లాహ్,  ఆయన తప్ప మరొక  దేవుడు  లేడు.ఆయనకు  ఉత్తమమైన  పేర్లు ఉన్నాయి.-(ఖురాన్ 20: 8)

·       ఆయనకు మంచి పేర్లు ఉన్నాయి. ఆయన సర్వాధీకుడు, వివేకవంతుడు. -(ఖురాన్ 59:24)

 

 సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క 99 పేర్లను హదీసులలో నేర్చుకోవడం యొక్క ప్రాముఖ్యత

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:

·       అల్లాహ్‌కు తొంభై తొమ్మిది పేర్లు ఉన్నాయి, అనగా. వంద కన్నా ఒకటి తక్కువ  మరియు అవి తెలిసిన వారు స్వర్గానికి వెళతారు. "-(సహిహ్ బుఖారీ 50: 894)

అబూ హురైరా ప్రకారం అల్లాహ్ యొక్క దూత ఇలా అన్నారు:

·       అల్లాహ్ యొక్క తొంభై తొమ్మిది పేర్లు ఉన్నాయి; వాటిని కంఠస్థం చేసేవాడు స్వర్గంలోకి వస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ బేసి (అతను ఒకటి, మరియు అది బేసి సంఖ్య) మరియు అల్లాహ్ బేసి సంఖ్యను ప్రేమిస్తాడు .. "-(సహిహ్ ముస్లిం బుక్ -48 హదీస్ -5)

 

 

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పేర్లు

 

అరబ్బీ

పేరు

తెలుగు

అర్ధం

ఈ పేరున్న

ఖురానువాక్యం కనీసం ఒకటి

1

الرحمن

అర్-రహ్మాన్

దయాళువు, అమిత దయాశీలుడు

అల్-ఫాతిహా :2

2

الرحيم

అర్-రహీమ్

కరుణామయుడు, కృపాశీలి

అల్-ఫాతిహా : 2

3

الملك

అల్-మాలిక్

ప్రభువు, యజమాని, రాజు

అల్-ఫాతిహా : 3

4

القدوس

అల్-ఖుద్దూస్

పవిత్రుడు

హషర్ :23

5

السلام

అస్-సలామ్

శాంతి

హషర్ :23

6

المؤمن

అల్-మూమిన్

విశ్వసనీయుడు, భద్రత కల్పించేవాడు,

సత్యాన్ని ధ్రువీకరించేవాడు, పూచీనిచ్చేవాడు,

హషర్ :23

7

المهيمن

అల్-ముహైమిన్

సంరక్షకుడు

హషర్ :23

8

العزيز

అల్-అజీజ్

సర్వ శక్తుడు, స్వయంసంపన్నుడు,

మహా గౌరవనీయుడు

హషర్ :23

9

الجبار

అల్-జబ్బార్

ఎదురులేనివాడు, ఒత్తిడిచేసేవాడు,

బాగుచేసేవాడు, పునరుద్ధారకుడు, నిరంకుశుడు

హషర్ :23

10

المتكبر

అల్-ముతకబ్బిర్

గొప్పవాడు, అహంకారి, గర్వించేవాడు,

ఎవ్వరూ తిరుగుచెప్పలేని వాడు

హషర్ :23

11

الخالق

అల్-ఖాలిఖ్

సృష్టికర్త

హషర్ :24

12

البارئ

అల్-బారి

చేసేవాడు, తయారీదారుడు

హషర్ :24

13

المصور

అల్-ముసవ్విర్

రూపశిల్పి, చిత్రకారుడు

హషర్ :24

14

الغفار

అల్-గఫార్

క్షమాశీలి, సదా మన్నించువాడు

తాహా :82

15

القهار

అల్-ఖహ్హార్

అన్నిటినీ అణచివేసేవాడు

యూసుఫ్ :39

16

الوهاب

అల్-వహాబ్

వరాలిచ్చేవాడు

ఇమ్రాన్ :8

17

الرزاق

అల్-రజాక్

పోషకుడు

జారియత్ :58

18

الفتاح

అల్-ఫత్తాహ్

ప్రారంభకుడు

సబా :26

19

العليم

అల్-అలీమ్

సర్వజ్ఞాని

సబా :26

20

القابض

అల్-ఖాబిజ్

అడ్డగించేవాడు, సరిచేసేవాడు

నిసా :245

21

الباسط

అల్-బాసిత్

వ్యాప్తినొందించువాడు

నిసా :245

22

الخافض

అల్-కాఫిజ్

అణగదొక్కేవాడు, హీనపరచేవాడు

అల్ వాఖియా :56

23

الرافع

అర్-రాఫెయ్

ఘనపరచేవాడు, పైకిలేపేవాడు

గఫీర్ :16

24

المعز

అల్-ముఇజ్జు

గౌరవమిచ్చేవాడు

ఇమ్రాన్ :26

25

المذل

అల్-ముజెల్

వినాశకుడు,అణగదొక్కేవాడు

తౌబా :2

26

السميع

అల్-సమీయు

ఆలకించువాడు

షూరా :11

27

البصير

అల్-బసీర్

చూసేవాడు

ఫుర్ఖాన్ :20

28

الحكم

అల్-హకీం

పాలకుడు

నూర్ :18

29

العدل

అల్-అదల్

న్యాయమూర్తి

నహల్ :90

30

اللطيف

అల్-లతీఫ్

అతి సున్నితుడు, సూక్ష్మగ్రాహి

షూరా :19

31

الخبير

అల్-ఖబీర్

సర్వం తెలిసినవాడు

ఫుర్ఖాన్ :58

32

الحليم

అల్-హలీమ్

ప్రశాంతుడు, ఓర్చుకునేవాడు, సహనశీలి, దీర్ఘశాంతుడు

నిసా :12

33

العظيم

అల్-అజీమ్

మహోన్నతుడు

నూర్ :14

34

الغفور

అల్-గఫూర్

మన్నించువాడు

నూర్ :22

35

الشكور

అష్-షకూర్

మొర ఆలకించేవాడు

ఫుర్ఖాన్ :62

36

العلي

అల్-అలియ్

ఔన్నత్యాన్నిచ్చేవాడు, గౌరవపరచేవాడు, సన్మానించేవాడు

బఖరా :255

37

الكبير

అల్-కబీర్

గొప్పవాడు

ఫుర్ఖాన్ :58

38

الحفيظ

అల్-హాఫిజ్

కాపాడువాడు, రక్షకుడు

హూద్ :57

39

المقيت

అల్-ముఖీత్

బలపరచువాడు

నిసా :85

40

الحسيب

అల్-హసీబ్

లెక్కించువాడు

నిసా :6

41

الجليل

అల్-జలీల్

గౌరవనీయుడు

రహ్మాన్ :78

42

الكريم

అల్-కరీమ్

అమిత దయాళువు, ధర్మదాత

మూమినూన్ :116

43

الرقيب

అర్-రఖీబ్

సదా కనిపెట్టి చూసేవాడు, కాపరి

నిసా :1

44

المجيب

అల్-ముజీబ్

ఆమోదించేవాడు, స్పందించేవాడు,

జవాబిచ్చేవాడు, కోర్కెలుతీర్చేవాడు, ఆపదమొక్కులవాడు

హూద్ :61

45

الواسع

అల్-వాసియ్

సర్వ వ్యాపి

జుమర్ :10

46

الحكيم

అల్-హకీమ్

సర్వజ్ఞుడు,జ్ఞాని

నూర్ :18

47

الودود

అల్-వదూద్

ప్రేమించువాడు,

బురూజ్ :14

48

المجيد

అల్-మజీద్

మహిమాన్వితుడు

హూద్ :73

49

الباعث

అల్-బాయిత్

మృతుల్ని తిరిగి లేపేవాడు

జుమా :2

50

الشهيد

అష్-షహీద్

సాక్షి

హజ్ :17

51

الحق

అల్-హఖ్హ్

సత్యం, నిజం

నూర్:25

52

الوكيل

అల్-వకీల్

ఆదరణకర్త, ఉత్తరవాది

జుమర్ :62

53

القوى

అల్-ఖవియ్యు

బలశాలి

షూరా :19

54

المتين

అల్-మతీన్

స్థిరంగావుండేవాడు, మాటతప్పనివాడు, సదా నిలిచి ఉండేవాడు

జారియత్ :58

55

الولى

అల్-వలీయ్యు

మిత్రుడు, అభిమాని, ఆత్మబంధువు, ఆపద్బాంధవుడు

షూరా :9

56

الحميد

అల్-హమీద్

ప్రశంసా పాత్రుడు, స్తోత్తార్హుడు

షూరా :28

57

المحصى

అల్-ముహ్ సి

ఎంతైనా ఇవ్వగలవాడు, సర్వవర ప్రదాత,

సర్వం అనుగ్రహించువాడు

జుమర్ :35

58

المبدئ

అల్-ముబ్ ది

నిర్మాత, ఆవిష్కర్త, ప్రారంభించువాడు

నమల్:64

59

المعيد

అల్-ముఈద్

తిరిగి సృష్టించువాడు

సబా:49

60

المحيى

అల్-ముహియ్యు

జీవమిచ్చేవాడు

రూమ్:19

61

المميت

అల్-ముమీత్

జీవం తీసుకునేవాడు, మరణదాత, నాశనం చేయువాడు

బురూజ్:20

62

الحي

అల్-హయ్యి

సజీవుడు, అంతంలేనివాడు

ఇమ్రాన్:2

63

القيوم

అల్-ఖయ్యూమ్

అందరినీ కొరతలేకుండా పోషించేవాడు,

బురూజ్:20

64

الواجد

అల్-వాజిద్

గ్రహించేవాడు, చూచేవాడు, కనుక్కునేవాడు, గురితప్పనివాడు

అద్ దుహా:7

65

الماجد

అల్-మాజిద్

బ్రహ్మాండమైనవాడు, గొప్పవాడు, మాదిరిచూపేవాడు

హూద్:73

66

الواحد

అల్-వాహిద్

ఏకేశ్వరుడు, ఒకే ఒక్కడు

మూమినూన్:52

67

الاحد

అల్-అహద్

ఒకేఒక్కడుఅద్వితీయుడుఏకేశ్వరుడు

సర్వాంతర్యామి, అఖండుడు

ఇక్లాస్:1

68

الصمد

అస్-సమద్

స్వయం సమృద్ధుడు, నిత్యుడు,

దుర్భేద్యుడు, అజేయుడు, ఈశ్వరుడు,

ఎవరి అవసరం లేనివాడు

ఇక్లాస్:2

69

القادر

అల్-ఖాదిర్

సర్వశక్తుడు, అన్నీచేయగలవాడు

ఇనామ్:37

70

المقتدر

అల్-ముఖ్తదిర్

అన్నీ నిర్ణయించేవాడు, అధిపతి

ఖమర్:42

71

المقدم

అల్-ముఖద్దిమ్

త్వరపరచేవాడు, ముందుకునడిపేవాడు,

పనులు పూర్తిచేసేవాడు

యూనుస్:11

72

المؤخر

అల్-ముఅఖ్ఖిర్

శాంతకారకుడు

నూహ్:4

73

الأول

అల్-అవ్వల్

ఆది

హదీద్:3

74

الأخر

అల్-ఆఖిర్

అంతం

హదీద్:3

75

الظاهر

అజ్-జాహిర్

కనిపించేవాడు

హదీద్:3

76

الباطن

అల్-బాతిన్

అదృశ్యుడు, కానరానివాడు, దాగివున్నవాడు

హదీద్:3

77

الوالي

అల్-వలీ

అధికారి, దాత, ప్రోత్సాహకుడు, అభిమాని

రౌద్:11

78

المتعالي

అల్-ముతాలి

స్వీయాభిమాని, ఘనుడు

రౌద్:9

79

البر

అల్-బర్ర్

దయగలవాడు, నీతిమంతుడు

తూర్:28

80

التواب

అల్-తవ్వాబ్

బాకీ ఉంచుకోనివాడు, తిరిగి ఇచ్చేవాడు,

నూర్:10

81

المنتقم

అల్-మున్ తఖిమ్

పగతీర్చుకొనువాడు

సజ్దా:22

82

العفو

అల్-అఫువ్వు

మన్నించువాడు, పాపహరుడు

నిసా:43

83

الرؤوف

అర్-రవూఫ్

జాలిపడేవాడు, దయామయుడు

నూర్:20

84

مالك الملك

మాలిక్-అల్-ముల్క్

సృష్టి యజమాని, స్వయంభువుడు

ఇమ్రాన్:26

85

ذو الجلال|
و الإكرام

జుల్-జలాలి -
-అల్-ఇక్రామ్

ఘనతకు, దాతృత్వానికీ ప్రభువు

ఖమర్:27

86

المقسط

అల్-ముఖ్సిత్

నిష్పక్షపాతి, న్యాయమూర్తి, పగతీర్చేవాడు

ఇమ్రాన్:18

87

الجامع

అల్-జామియ్

సమకూర్చువాడు, ఐక్యపరచేవాడు

షూరా:7

88

الغنى

అల్-ఘనీ

మహా సంపన్నుడు, సర్వస్వతంత్రుడు

జమర్:7

89

المغنى

అల్-ముఘ్ ని

అమిత ధనవంతుడు, ఉదారుడు

తౌబా:28

90

المانع

అల్-మాని

హాని తొలగించేవాడు,తిరిగికాపాడేవాడు, ఆదుకునేవాడు

అల్ ఖసస్:35

91

الضار

అద్-దార్

బాధించేవాడు, కీడుకల్పించేవాడు, కొట్టేవాడు

అర్రాద్:22

92

النافع

అన్-నాఫియ్

మంచిని పుట్టించేవాడు, పరిహారంచేసేవాడు,

ప్రాయశ్చి త్తం చేసేవాడు, దోషంవదలగొట్టేవాడు

అర్రూమ్ :37

93

النور

అన్-నూర్

తేజస్వి, తేజస్సు, వెలుగు, జ్యోతి

నూర్:35

94

الهادي

అల్-హాది

ఉపదేశకుడు, బోధకుడు

ఫుర్ఖాన్:31

95

البديع

అల్-బదీయ్

పోల్చలేనివాడు, ఆవిర్భావకుడు

ఇనామ్:10

96

الباقي

అల్-బాఖి

అమృతుడు, సజీవి

రహ్మాన్:27

97

الوارث

అల్-వారిస్

వారసుడు

ఖసాస్:58

98

الرشيد

అర్-రాషిద్

మార్గదర్శి, గురువు, సర్వజ్ఞాని

హూద్:1

99

الصبور

అస్-సబూర్

సహనశీలుడు, కాలాతీతుడు.

బకరా:251

 

 

అల్లాహ్ యొక్క 99 పేర్లను తెలుసుకోవడం /నేర్చుకోవడం అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది. ఈ పేర్లను క్రమంగా పఠించడం, నేర్చుకోవడం మరియు అర్థం తెలుసుకోవడం  వలన మన జీవితంలో శాంతి మరియు ఆశీర్వాదాలు ఉంటాయి.

 

No comments:

Post a Comment