రోగులను సందర్శించడం ను అరబిక్‌లో ‘ఇయాదా iyaadah’ అని పిలుస్తారు.
జబ్బుపడినవారిని
సందర్శించడం పై హదీసులు:
కొంతమంది పండితులు ఇది
ధృవీకరించబడిన సున్నత్ (సున్నా ముఅక్కాదా Sunnah mu’akkadah) అని అభిప్రాయపడ్డారు.
·
ఇది మతపరమైన బాధ్యత (ఫర్డ్ కిఫాయ fard kifaayah) అని షేక్ అల్
ఇస్లాం (ఇబ్న్ తైమియా) అల్-ఇఖ్తియారాత్ (పేజి 85) లో అభిప్రాయపడ్డారు మరియు ఇది సరైన అభిప్రాయం.
·
అల్-సహీహాయన్ లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి
వసల్లం) ఇలా అన్నారు: "ఒక ముస్లిం తన సోదర ముస్లిం పట్ల పాటించవలసిన ఐదు
విధులు ఉన్నాయి," వాటిలో ఒకటి
జబ్బుపడినవారిని సందర్శించడం.
· అల్-బుఖారీ
ప్రవక్త (స) యొక్క మాటలను వివరిస్తూ ఇలా అన్నారు: "ఆకలితో ఉన్నవారికి ఆహారం
ఇవ్వండి, రోగులను సందర్శించండి
మరియు బందీలను విడిపించండి. ".
ఈ హదీత్ రోగిని సందర్శించడం
విధిగా ఉందని సూచిస్తుంది మరియు ఇది
ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం మరియు బందీలను విడిపించడం కూడా మతపరమైన బాధ్యత అని అర్థం చెబుతుంది.
·
ఇది వాజీబ్ (విధి) కాదని అల్-నవావి వివరించారు.
·
అల్-హాఫిజ్ అల్-ఫాత్ (10/117) లో ఇలా అన్నాడు:
ఇది వ్యక్తులకు విధి కాదు.
·
షేక్ ఇబ్న్ ‘ఉతైమీన్ “అల్-షార్హ్ అల్-ముమ్తి”లో ఇలా చెప్పారు
(5/173): ఇది మతపరమైన
బాధ్యత, మరియు ముస్లింలు తమ
తోటి ముస్లిం రోగులను సందర్శించాల్సిన అవసరం ఉంది.
జబ్బుపడినవారిని
సందర్శించే ధర్మం:
·
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రకారం“ముస్లిం తన
(జబ్బుపడిన) ముస్లిం సోదరుడిని సందర్శించినప్పుడు, అతను తిరిగి వచ్చేవరకు స్వర్గం యొక్క ఫలాలను పొందుతున్నాడు.
. ” ముస్లిం, 2568.
·
జబ్బుపడినవారిని సందర్శించేవాడు పొందిన
ప్రతిఫలం పండు సేకరించేవాడు కోసిన పంటతో పోల్చబడుతుంది
·
అల్లాహ్ యొక్క దూత (సల్లల్లాహు అలైహి వసల్లం)
ఇలా అన్నారు: "ఎవరైతే
అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని సందర్శిస్తారో, అతని గురించి ఒక విశ్వాసి ఇలా అంటాడు :‘ మీరు సంతోషంగా ఉండండి, మీ నడక
ఆశీర్వదించబడవచ్చు మరియు మీరు స్వర్గంలో గౌరవప్రదమైన స్థానాన్ని ఆక్రమించవచ్చు ’.-అల్-తిర్మిజి (2008)
· ఇమామ్ అహ్మద్
జాబీర్ ప్రకారం అల్లాహ్ యొక్క దూత (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: "అనారోగ్యంతో ఉన్న
వ్యక్తిని సందర్శించేవాడు అతను కూర్చునే వరకు దయ కల్గి ఉంటాడు మరియు అతను కూర్చున్నప్పుడు అతను దయ లో మునిగిపోతాడు."
· అల్-తిర్మిజి (969)ప్రకారం 'అలీ (ర)’ ఇలా అన్నారు: అల్లాహ్ యొక్క దూత
(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అనటం విన్నాను: “(జబ్బుపడిన) ముస్లింను ఉదయాన్నే సందర్శించే
ముస్లిం కు ఉదయo నుంచి సాయంత్రం వరకు
డెబ్బై వేల మంది దేవదూతలు ఆశీర్వాదం పంపుతారు, మరియు సాయంత్రం రోగిని సందర్శిస్తే, తిరిగి ఉదయం వచ్చే వరకు డెబ్బై వేల మంది దేవదూతలు అతని
పై ఆశీర్వాదం పంపుతారు, అతనికి స్వర్గంలో
ఒక తోట ఉంటుంది.”
· జబ్బుపడినవారిని
సందర్శించడం తెలిసిన వారికి మరియు తెలియని
వారికి కుడా సూచించబడింది. ఈ విషయాన్ని అల్-నవావి పేర్కొన్నారు.
జబ్బుపడిన వ్యక్తి యొక్క
నిర్వచనం:
ఎవరిని సందర్శించడం విధి
· అనారోగ్యం వల్ల జబ్బుపడిన వ్యక్తి, ఇతరులను చూడనప్పుడు అతనిని సందర్సించాలి. అతను అనారోగ్యంతో
ఉన్నప్పటికీ అతను బయటకు వెళ్లి ప్రజలను చూస్తుంటే, అతన్ని సందర్శించడం తప్పనిసరి కాదు-అల్-షర్హ్
అల్-ముమ్తి ’, 5/171
మహారాం కాని స్త్రీని
సందర్శించడం:
·
మహారామ్ కాని స్త్రీని సందర్శించే పురుషుడిలో, లేదా మహారామ్
కాని వ్యక్తిని సందర్శించే స్త్రీలో సరైన కవరింగ్, ఫిట్నా బయం మరియు ఒంటరిగా ఉండని వరకు ప్రమాదం
లేదు..
·
‘ఆయేషా’ (ర) నుండి పొందిన ఒక
హదీత్ గురించి ఇమామ్ అల్-బుఖారీ ఇలా వివరించారు: ఆమె అబూ బకర్
మరియు బిలాల్ (ర) ను సందర్శించారు, వారు మొదట మదీనాకు వచ్చినప్పుడు అనారోగ్యానికి
గురయ్యారు.
·
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించిన
తరువాత అబూ బకర్ 'ఉమర్ (ర) తో ఇలా
అన్నారు: "మనం ఉమ్ అమాన్ Umm Ayman వద్దకు వెళ్లి ఆమెను ప్రవక్త (స) సందర్శినట్లు ఆమెను సందర్శించుదాము, "అని వారు ఆమె వద్దకు వెళ్ళారు.
కాఫీర్ సందర్శించడం:
· అనారోగ్యంతో ఉన్న
ముష్రిక్ కాఫీర్‌ను సందర్శించడంలో పాపం లేదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)
ఒక యూదు బాలుడిని సందర్శించి ఇస్లాంకు అతనిని ఆహ్వానించినప్పుడు అతను ముస్లిం
అయ్యాడు.-. మరియు తన పేదతండ్రి అబూ తాలిబ్ చనిపోతున్నప్పుడు ప్రవక్త (సల్లల్లాహు
అలైహి వసల్లం) అక్కడ ఉన్నారు, మరియు వారు అతన్ని ఇస్లాంకు ఆహ్వానించారు కాని అతను
నిరాకరించాడు.-అల్-బుఖారీ (1356)
· ఈ సందర్భంలో ఉద్దేశ్యం వ్యక్తిని ఇస్లాంకు పిలవడం, లేదా అతని చెడును
అరికట్టడం లేదా అతని హృదయాన్ని మృదువుగా చేయడం మొదలైనవి కావచ్చు-ఫాత్ అల్-బారి, 10/125.
సందర్శన పునరావృతం కావాలా?
· జబ్బుపడిన
వ్యక్తికి భారంగా మారటట్లు ప్రతిరోజూ సందర్శించరాదని కొందరు పండితుల అభిప్రాయం.
సరైన అభిప్రాయం ఏమిటంటే
ఇది పరిస్థితికి అనుగుణంగా మారుతుంది.
· జబ్బుపడిన
వ్యక్తికి ప్రియమైనవారై ఉండవచ్చు మరియు అతను ప్రతిరోజూ వారిని చూడకపోతే అతనికి భాద
కలుగవచ్చు. అలాంటప్పుడు అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి అసౌకర్యం కలగనంత వరకు నిరంతరం సందర్శించడం సున్నత్ -హాషియత్ ఇబ్న్
ఖాసిమ్, 3/12
అనారోగ్యంతో ఉన్న
వ్యక్తితో ఎక్కువసేపు కూర్చోకూడదు:
·
సందర్శకుడు అనారోగ్య వ్యక్తితో ఎక్కువసేపు
కూర్చోకూడదు, బదులుగా సందర్శన
చిన్నదిగా ఉండాలి, తద్వారా అది
అతనికి లేదా అతని కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు కలిగించదు. జబ్బుపడిన వ్యక్తి తన
అనారోగ్యం కారణంగా నొప్పితో బాధపడుతున్న పరిస్థితి ఉండవచ్చు లేదా అతను ఎవరైనా చూడటానికి ఇష్టపడని పనిని
చేయగలడు, కాబట్టి అతనితో
ఎక్కువసేపు కూర్చోవడం అతనికి ఇబ్బంది కలిగిస్తుంది.
అయితే, ఇది పరిస్థితిపై
ఆధారపడి ఉంటుంది;
·
అనారోగ్య వ్యక్తి కొంతమంది తనతో ఎక్కువసేపు
కూర్చోవడం ఇష్టపడవచ్చు-హాషియత్ ఇబ్న్ ఖాసిమ్, 3/12; అల్-షర్హ్ అల్-ముమ్తి ’, 5/174
సందర్శించడానికి సమయం:
·
జబ్బుపడినవారిని సందర్శించడానికి ఒక నిర్దిష్ట
సమయం ఉందని సూచించే సున్నత్ ఏమీ లేదు. ఇబ్న్ అల్-ఖయీమ్ ఇలా అన్నారు: ప్రవక్త
(సల్లల్లాహు అలైహి వసల్లం) జబ్బుపడినవారిని సందర్శించడానికి ఏ ప్రత్యేకమైన రోజు
లేదా సమయాన్ని పేర్కొనలేదు,
బదులుగా వారు తన
ఉమ్మా కోసం రాత్రి మరియు పగటిపూట, అన్ని సమయాలను సూచించారు.-జాద్ అల్-మాద్, 1/497
· అల్లాహ్ యొక్క
దూత (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అనటం విన్నాను: “(జబ్బుపడిన) ముస్లింను ఉదయాన్నే సందర్శించే
ముస్లిం కు ఉదయo నుంచి సాయంత్రం వరకు
డెబ్బై వేల మంది దేవదూతలు ఆశీర్వాదం పంపుతారు, మరియు సాయంత్రం రోగిని సందర్శిస్తే, తిరిగి ఉదయం వచ్చే వరకు డెబ్బై వేల మంది దేవదూతలు అతని
పై ఆశీర్వాదం పంపుతారు, అతనికి స్వర్గంలో
ఒక తోట ఉంటుంది.” –తిర్మిజి
జబ్బుపడిన వ్యక్తి యొక్క పరిస్థితి మరియు అతనికి
అనువైన సమయం పట్ల మనం శ్రద్ధ వహించాలి; అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి లేదా అతని
కుటుంబానికి కష్టాలు కలుగుతుంటే, సందర్శకుడు తనకు అనుకూలమైన సమయాన్ని ఎన్నుకోకూడదు. సందర్శించే
సమయం అనారోగ్యంతో ఉన్న వ్యక్తితో లేదా అతని కుటుంబానికి అనుకూలంగా ఉండాలి..
తమ సందర్శనలను పరిమితం చేయడానికి లేదా సరైన
సమయాన్ని ఎంచుకోవడానికి శ్రద్ధ వహించని వ్యక్తులు తరచుగా సందర్శించడం అనారోగ్య వ్యక్తి యొక్క
అనారోగ్యాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది.
జబ్బుపడిన వ్యక్తి కోసం ‘దువా
’చేయడం
·
సున్నత్ లో వివరించిన పద్ధతిలో జబ్బుపడిన వ్యక్తి కోసం దువా
చేయాలి: “లా బాస్, తుహూర్ ఇన్ షా అల్లాహ్ (చింతించకండి, ఇది శుద్ధీకరణ, అల్లాహ్
ఇష్టపడితే).”-అల్-బుఖారీ.
· కోలుకోవడం కోసం దువా
’మూడుసార్లు చేయాలి.. ప్రవక్త (సల్లల్లాహు అలైహి
వసల్లం) సాద్ ఇబ్న్ అబీ వక్కాస్‌ను సందర్శించి ఇలా అన్నారు: “ఓ అల్లాహ్, సాద్‌ను నయం
చేయండి”. అల్-బుఖారీ (5659) మరియు ముస్లిం (1628)
·
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జబ్బుపడిన
వ్యక్తిపై తన కుడి చేతిని ఉంచి ఇలా అన్నారు: “అధీబ్ అల్-బాస్ రబ్ అన్-నాస్, వాష్ఫీ అంటా
అల్-షాఫీ, లా షిఫా ఇల్లా
షిఫాఆయుకా షిఫాఆ లా లా యుగాదిర్ సకామన్”(మానవజాతి ప్రభువా, బాధను తీసివేసి, స్వస్థత ఇవ్వండి, ఎందుకంటే మీరు
స్వస్థత పరిచేవారు మరియు మీ వైద్యం తో అనారోగ్యం పోవును) ” -ముస్లిం 2191.
·
అహ్మద్ మరియు అబూ దావూద్ (3106) ప్రకారం ప్రవక్త
(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఎవరైతే ఇంకా చనిపోని అనారోగ్య వ్యక్తిని
సందర్శించి, ఆయన సమక్షంలో
ఏడుసార్లు: 'అస్అలు అల్లాహ్
అల్-అజీమ్ రబ్ అల్-అర్ష్ ఇల్-అజీమ్ యాష్ఫియాకా (సర్వశక్తిమంతుడైన అల్లాహ్, శక్తివంతమైన
సింహాసనం ప్రభువు, మిమ్మల్ని
స్వస్థపరచమని నేను అడుగుతున్నాను), అంటారో,అల్లాహ్ ఆ అనారోగ్యం నుండి అతనిని నయం
చేస్తాడు. ”
·
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు
“సందర్శకుడు రోగి ని మీకు ఎలా ఉంది అని అడగాలి.” -అల్-తిర్మిధి (983)
అబూ బకర్ మరియు బిలాల్‌లను
సందర్శించినప్పుడు ‘ఆయేషా అలా చేశారని
సహీహ్ అల్-బుఖారీలో కూడా వివరించబడింది.
రోగికి భరోసా ఇవ్వడం
మరియు సుదీర్ఘ జీవితంపై ఆశను ఇవ్వడం
·
“మీరు అనారోగ్యంతో
ఉన్న వ్యక్తిని సందర్శించి,
అతను
జీవించబోతున్నాడని అతనికి భరోసా ఇచ్చినప్పుడు, అది అతని విశ్వాసం ను పెంచుతుంది. ”-అల్-తిర్మిధి (2087)
·
ప్రవక్త (అల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రకారం
రోగి తో “లా బాస్, తుహూర్ ఇన్ షా
అల్లాహ్ (చింతించకండి, ఇది శుద్ధి, అల్లాహ్
ఇష్టపడితే).” అనాలి అనగా మనము అతనిని
ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించాలి మరియు ఇన్-షా-అల్లాహ్ చికిత్స గురించి అతనికి
శుభవార్త తెలియజేయాలి, ఎందుకంటే అది
జబ్బుపడిన వ్యక్తిని ఓదార్చుతుంది.-అల్-షర్హ్ అల్-ముమ్తి 5 / 171-176.
No comments:
Post a Comment