1916లో
జన్మించిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు మరియు
నేతాజీ స్థాపించిన ఐఎన్ఎ సైనికుడైన ఎం కె
ఎం అమీర్ హమ్జా 99 ఏళ్ల వయస్సు లో జనవరి 1, 2016న మరణించాడు.
యుక్తవయసులో, హమ్జా కటుంబ వ్యాపారంలో
తన తండ్రికి సహాయం చేయడానికి బర్మా (నేటి మయన్మార్) వెళ్ళాడు.
హంజా మొదట ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌లో చేరినాడు ఆ తరువాత నేతాజీ సుబాష్
చంద్రబోస్ యొక్క ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఎ) లో చేరారు.
1942లో
రంగూన్ పగలు మరియు రాత్రి బాంబు దాడికి గురిఅయిన తరువాత వారు తమ వ్యాపారం ను థింగాంగ్యున్కు Thingangyunకు మారి అక్కడ కొనసాగించారు.
థింగాంగ్యున్ గణనీయమైన భారతీయ మరియు ముస్లిం జనాభాను కలిగి ఉంది.ఒక సంవత్సరం తరువాత, కుటుంబం తిరిగి రంగూన్ లోని ప్రధాన వీధి మొఘల్ వీధికి మారింది, అక్కడ వారు ఒక ఆభరణాల దుకాణాన్ని ఏర్పాటు చేశారు.
"ఇండియన్ నేషనల్ ఆర్మీ సభ్యుడు మహ్మద్ ఖయాత్ ఖాన్ మా దుకాణాన్ని మరియు హంజా ను సందర్శించేవారు.సిటీ
స్క్వేర్లో నేతాజీ ప్రసంగం హంజా లో ఉత్తేజం రేకెత్తించింది, తరువాత అతను INA లో చేరారు.
M.K.M అమీర్ హమ్జా, ఇండియన్ నేషనల్ ఆర్మీ
(INA) కోసం అనేక మిలియన్ రూపాయలు
విరాళంగా ఇచ్చారు. అతను INA యొక్క ఆజాద్ లైబ్రరీ
రీడింగ్ ప్రచారానికి నాయకత్వం వహించాడు
రెండోవ ప్రపంచ యుద్ధం తరువాత, హంజా కుటుంబం బర్మాలో ఉండి 1960 లో బర్మీస్ శరణార్థులను స్వదేశానికి రప్పించినప్పుడు భారతదేశానికి తిరిగి వచ్చింది.
అతని కుటుంబం ఇప్పుడు నిరు పేదలు మరియు వారు రామనాధపురం తమిళనాడులో
అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.
No comments:
Post a Comment