29 July 2022

భారతదేశ స్వాతంత్ర్యం కోసం మరచిపోయిన తిరుగుబాటు The forgotten mutiny for India’s independence

 

భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో అత్యంత ముఖ్యమైన సంఘటనలలో ఒకటి 1946 లో జరిగిన నావికా తిరుగుబాటు, దీని గురించి ప్రముఖ భారతీయ చరిత్రకారుడు సుమిత్ సర్కార్ ఇలా వ్రాశాడు, "ఈ తిరుగుబాటు విజయవంతమై ఉంటే, స్వాతంత్ర్యం కోసం భారతదేశం యొక్క పోరాటం వేరే మలుపు తిరిగి ఉండేది." ఆ సంవత్సరం ఫిబ్రవరి 18 నుండి 23 వరకు, రేటింగ్స్ అని పిలువబడే 20,000 కంటే ఎక్కువ సాధారణ నావికులు మరియు 74 యుద్ధనౌకలు మరియు 20 సంస్థాపనల (installations) కు చెందిన తక్కువ స్థాయి అధికారులు (low-ranking officers) సమ్మెలో పాల్గొన్నారు, దీనిని తిరుగుబాటు లేదా విప్లవం (mutiny or rebellion)అని పిలుస్తారు.

1757లో ప్లాసీ యుద్ధం భారతదేశంలోని బ్రిటిష్ రాజ్ రెండు పెద్ద సాయుధ తిరుగుబాట్లను ఎదుర్కొంది: మొదటిది. 1857 నాటి సైనిక తిరుగుబాటు మరియు రెండవది 1946 లో జరిగిన నావికా తిరుగుబాటు.

1757 మరియు 1857 లలో, స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటిష్ పాలకుల ఆయుధాలు మరియు వ్యూహాలతో ఓడిపోయారు, కాని భారతదేశంలోని రాజకీయ నాయకుల కారణంగా నౌకాదళ తిరుగుబాటు విఫలమైంది. భారత రాజకీయ నాయకత్వం రేటింగ్‌ల తిరుగుబాటు లేదా నావికా తిరుగుబాటు ను వారు ఖండించారు. నావికా తిరుగుబాటు విజయవంతం అయితే అది ఆనాటి ప్రభుత్వ పతనానికి కారణమై ఉండేది..

నావికా తిరుగుబాటు ముగిసిన మూడు రోజుల తరువాత మరియు దానిని అణిచివేసిన  తర్వాత, అప్పటి బ్రిటిష్ ప్రధాన మంత్రి క్లెమెంట్ అట్లీ ఫిబ్రవరి 26, 1946న హౌస్ ఆఫ్ కామన్స్‌లో  నావికా తిరుగుబాటు గురించి మరియు బొంబాయి, కరాచీ మరియు మద్రాసులో జరిగిన ప్రభుత్వ మరియు ప్రేవేట్  ఆస్తి నష్టం, జన నష్టం, విద్వంసం గురించి ఒక ప్రకటన చేసారు.  మిస్టర్ అట్లీ తన ప్రకటనలో, "కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ నాయకులు నావికా తిరుగుబాటు పలితంగా చెలరేగిన  అలర్లను ఖండించడంలో మరియు ఆపడానికి ప్రయత్నించారు. భారత రాజకీయ పార్టిలు ఈ నావికా తిరుగుబాటును సమర్ధించ లేదు  అందువల్ల 2021లో, నౌకాదళ తిరుగుబాటు 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉపఖండంలో పెద్ద సంఘటనేమీ జరగలేదు.

 



HMIS అక్బర్‌లో చివరి వరకు లొంగిపోవడానికి నిరాకరించిన చివరి 3,500 మంది నావికులు మరియు 300 మంది సిపాయిలలోఒకరైన  మహ్మద్ దీవాన్ అలీ నజీర్ (రాయల్ ఇండియన్ నేవీ, RIN, ఇండెక్స్ నంబర్: 34499) చిత్రం. 

లొంగిపోయిన తర్వాత తిరుగుబాటు చేసిన భారతీయ నావికులను అదుపులోకి తీసుకున్నారు మరియు అదే సంవత్సరం ఆగస్టులో విడుదల చేశారు.



ఈవెనింగ్ న్యూస్ వార్తాపత్రిక క్లిప్పింగ్

భారత జాతీయ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ నాయకులు విప్లవాన్ని కోరుకోలేదు - వారు శాంతియుతంగా అధికార మార్పిడిని కోరుకున్నారు. ప్రముఖ రాజకీయ నాయకులలో, కాంగ్రెస్ నాయకురాలు అరుణా అసఫ్ అలీ మాత్రమే రేటింగ్స్ సమ్మెకు తన మద్దతును అందించారు మరియు స్ట్రైకర్లకు అనుకూలంగా ఉండేలా తన పార్టీ నాయకులను ఒప్పించేందుకు ప్రయత్నించారు, ఫిబ్రవరి 22న వల్లభాయ్ పటేల్ తిరుగుబాటుదారులకు లొంగిపోవాలని సందేశం పంపారు. భారత కమ్యూనిస్టు పార్టీ మాత్రమే నౌకాదళ తిరుగుబాటుకు మద్దతుగా ముందుకు వచ్చి సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ మరియు ముహమ్మద్ అలీ జిన్నాతో సహా ఆ జాతీయవాద నాయకులు నౌకాదళ రేటింగ్‌లు'శాంతంగా ఉండమని  సలహా ఇచ్చారు.

నావికా దళ రేటింగ్స్ క్విట్ ఇండియా నినాదాన్ని సమర్ధించారు.తిరుగుబాటు చేసిన భారత నావికా రేటింగ్స్  చార్టర్ ఆఫ్ డిమాండ్స్:

1. భారతీయ రాజకీయ ఖైదీలందరి విడుదల; 2. ఇండియన్ నేషనల్ ఆర్మీ సిబ్బంది అందరినీ బేషరతుగా విడుదల చేయడం; 3. ఇండోనేషియా మరియు ఈజిప్ట్ నుండి అన్ని భారతీయ దళాలను ఉపసంహరించుకోవడం; 4. బ్రిటీష్ పౌరులు భారతదేశాన్ని విడిచిపెట్టాలి; 5. సిబ్బంది పై తిసుకిన్న  కఠినమైన చర్యల పై కమాండింగ్ అధికారి మరియు సిగ్నల్ బోసన్‌హెడ్‌పై చర్యలు తీసుకోవడం ; 6. ఖైదీలందరి విడుదల (నావల్ రేటింగ్స్); 7. RIN రేటింగ్‌లు మరియు అధికారుల వేగవంతమైన డీమోబిలైజేషన్; 8. జీతం, కుటుంబ భత్యాలు మరియు ఇతర సౌకర్యాలకు సంబంధించి బ్రిటిష్ నౌకాదళంతో సమాన హోదా; 9. ఉత్తమ తరగతి భారతీయ ఆహారం ఇవ్వాలి ; 10. సేవ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత దుస్తుల కిట్ తిరిగి ఇవ్వబడదు; 11. అధికారుల నుండి సబార్డినేట్‌లకు మెరుగైన చికిత్స; మరియు 12. భారతీయ అధికారులు మరియు పర్యవేక్షకుల సంస్థాపన.

ఇద్దరు తిరుగుబాటుదారుల (రేటింగ్స్)ఆత్మకథలు - BC దత్ మరియు బిస్వనాథ్ బోస్ - ఆనాటి తిరుగుబాటు విజయవంతమై ఉంటే అప్పటి (అవిభక్త) భారతదేశం లో  మత రాజకీయాల పెరుగుదల, రాష్ట్రాలు మరియు సమాజంలో వ్యాప్తి చెందుతున్న విభజన మరియు అస్థిరత ఉండేది కాదని సూచిస్తున్నాయి.

HMIS తల్వార్ నిర్వాహకులలో ఒకడైన BC దత్ ను ఫిబ్రవరి 18 తిరుగుబాటు ప్రారంభానికి మూడు వారాల ముందు, అనగా ఫిబ్రవరి 1న ఓడలో కొత్త నినాదం రాసినందుకు అరెస్టు చేసి ప్రయత్నించారు. BC దత్ యొక్క “ది మ్యూటినీ ఆఫ్ ది ఇన్నోసెంట్స్”, గ్రంధం సమ్మెకు ముందునాటి  రాజకీయ సాహిత్యం మరియు స్వాతంత్ర్య అనుకూల కార్యకలాపాల నిర్వహణ  అనే వివరాలను కలిగి ఉంది

అదేవిధంగా బిస్వనాథ్ బోస్ యొక్క “RIN Mutiny, 1946” పుస్తకం కూడా తిరుగుబాటు వివరణాత్మక వర్ణనలను అందిస్తుంది..

1857 తిరుగుబాటు తరువాత, బ్రిటీష్ పాలకులు అన్ని భారతీయ సాయుధ దళాలలో రాజకీయ కరపత్రాల పంపిణి మరియు చర్చను నిషేధించారు, అయితే BC దత్ HMIS తల్వార్ ఓడలో రాజకీయ పత్రాలను రహస్యంగా చర్చించేవారు. తిరుగుబాటుకు రెండు నెలల ముందు, డిసెంబర్ 1న నావికాదళ దినోత్సవం నాడు ప్రజల సందర్శనకు తెరిచినప్పుడు, వారు ఓడలో క్విట్ ఇండియామరియు జై హింద్తో సహా పలు నినాదాలు చేసారు.

 



హిందూస్థాన్ స్టాండర్డ్ యొక్క వార్తాపత్రిక క్లిప్పింగ్

 

ఫిబ్రవరి 22, 1946, జాతీయవాద నాయకులు రేటింగ్‌ల లొంగుబాటును ఏర్పాటు చేయడంలో బిజీగా ఉన్నప్పుడు, ప్రధాన మంత్రి క్లెమెంట్ అట్లీ పార్లమెంటులో  నావికులు రాజకీయ నినాదాలు ఇచ్చారని మరియు ఒక రాజకీయ నాయకుడికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారని అన్నారు.. తిరుగుబాటుతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని, అయితే కమ్యూనిస్టులు, వామపక్షాలు సానుభూతిని ఉపయోగించుకునేందుకు ప్రయత్నించవచ్చని కూడా ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

విలియం రిచర్డ్‌సన్ అనే బ్రిటీష్ పరిశోధకుడు, ది సొసైటీ ఫర్ నాటికల్ రీసెర్చ్‌లో భారత స్వాతంత్ర్యం కోసం జరిగిన రాజకీయ ఉద్యమం ఫిబ్రవరి 1946, బొంబాయిలో జరిగిన రాయల్ ఇండియన్ నేవీ యొక్క తిరుగుబాటు కు మూలం అని రాశారు

1946: ది అన్ నోన్ మ్యూటినీ1946: The Unknown Mutiny అనే పుస్తక రచయిత ప్రమోద్ కపూర్ కూడా తన పుస్తకం లో భారత నావికా తిరుగుబాటును చర్చించాడు.

రాజకీయ నాయకులు ఎవరినీ శిక్షించబోమని, నష్టపరిహారం చెల్లించబోమని, డిమాండ్ల సాధనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిజానికి అందుకు విరుద్ధంగా జరిగింది. తిరుగుబాటు నాయకులను అరెస్టు చేశారు, విచారించారు మరియు శిక్షించారు.

ప్రభుత్వ ప్రవర్తన మరియు రాజకీయ నేతల వాగ్దానాల ఉల్లంఘనతో తిరుగుబాటుదారులు ఎంత నిరుత్సాహానికి, ఆగ్రహానికి గురయ్యారో బిస్వనాథ్ బోస్ పుస్తకం ఒక సంగ్రహావలోకనం ఇస్తుంది. దేశభక్తి నేరమైతే, మనం నేరస్థులమై ఉండాలి బిస్వనాథ్ బోస్ అని రాశాడు.

తిరుగుబాటుదారులకు తగిన మద్దత్తు  ఇవ్వడానికి జాతీయవాద నాయకులు ఇష్టపడలేదు, నాటక రచయిత ఉత్పల్ దత్ ద్వారా తిరుగుబాటు ఆధారంగా బంగ్లా నాటకం కల్లోల్ (సౌండ్ ఆఫ్ ది వేవ్)ని భారత ప్రభుత్వం నిషేధించింది మరియు అతను జైలు పాలయ్యాడు. ఈ నాటకం మొదటిసారిగా 1965లో కలకత్తాలోని మినర్వా థియేటర్‌లో ప్రదర్శించబడింది మరియు ఇది పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించింది.

.



 

నావికాదళ సమ్మె ప్రారంభంలో, బొంబాయిలో నిలిచిన నౌకల ప్రతినిధులచే సెంట్రల్ స్ట్రైక్ కమిటీ (NCSC) ఏర్పాటు చేయబడింది. కమిటీ రాయల్ ఇండియన్ నేవీ పేరును ఇండియన్ నేషనల్ నేవీగా మార్చింది. ఈ కమిటీకి సిగ్నల్‌మ్యాన్ ఎంఎస్ ఖాన్ అధ్యక్షత వహించగా, మదన్ సింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. నౌకాదళ తిరుగుబాటు యొక్క ఒక విశేషమైన అంశం ఏమిటంటే, నావికాదళ రేటింగ్స్  మరియు వారికి మద్దత్తు గా వీధికి వచ్చిన పౌరులు  వివిధ విశ్వాసాల ఐక్యతను చాటారు. వారు బొంబాయి వీధుల్లో "హిందూ-ముస్లిం ఏకం" మరియు "ఇంక్విలాబ్ జిందాబాద్" నినాదాలు చేశారు.

BC దత్ పుస్తకం మత సామరస్యాన్ని గురించి మాట్లాడుతుంది. BC దత్ ఇలా వ్రాశాడు, “మేము వివిధ ప్రాంతాల నుండి మరియు హిందూ, ముస్లిం, క్రైస్తవ మరియు బౌద్ధ కుటుంబాల నుండి వచ్చాము, కానీ నావికాదళంలో సంవత్సరాలు గడిపిన తరువాత, మేము నావికులు భారతీయులమయ్యాము. విడ్డూరమేమిటంటే ఇప్పుడు ఉపఖండం అంతటా మత విభజన, విద్వేష రాజకీయాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.

మూల రచయిత:కమల్ అహ్మద్ ఒక స్వతంత్ర పాత్రికేయుడు మరియు లండన్, UK నుండి రాశారు.  

(కమల్ అహ్మద్ తండ్రి నావికాదళ శిక్షకుని ఉద్యోగం వదిలిపెట్టిన తర్వాత, ఇండియన్ సివిల్ సప్లై కార్యాలయంలో చేరారు, కోల్‌కతాలో కొంతకాలం గడిపిన తరువాత, తూర్పు బెంగాల్‌కు బదిలీ అయ్యాడు మరియు  మేజిస్ట్రేట్‌గా పదవీ విరమణ పొందాడు, ఆగస్టు 29, 2001 న మరణించాడు.)

మూలం: http://www.thedailystar.net / The Daily Star ది డైలీ స్టార్ జూలై 25, 2022

 

No comments:

Post a Comment