20 April 2023

ఈద్-ఉల్-ఫితర్

 



ఇస్లాం కాలెండర్ ప్రకారం  పవిత్ర మాసం,శుభకరమైన రమదాన్ మాసం లో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకూ మొత్తం ముప్పై  రోజులు చేసిన ఉపవాసం యొక్క ముగింపు వేడుక గా ఈద్-ఉల్-ఫితర్ పండుగను  నిర్వహిస్తారు.  ఈద్ యొక్క మొదటిరోజు షావ్వల్ నెల మొదటిరోజున వస్తుంది. ఈద్-ఉల్-ఫితర్ (అరబ్బీ: عيد الفطر Īdu l-Fir), ను ఈద్ అని సంక్షిప్తముగా  పిలుస్తారు.ఈద్ అనేది ఒక అరబిక్ పదం, దీనర్థం "పండుగ", ఫితర్ అర్థం "ఉపవాసం యొక్క ముగింపు" అని అర్ధం.

 

దివ్యఖురాన్‌లో దేవుడు చేసిన ఆదేశం ప్రకారం ముస్లింలు రమదాన్ యొక్క చివరి రోజున ఉపవాసంను ముగించాలి.ఈద్-ఉల్-ఫితర్ పుట్టింది. ఈ పండుగ యొక్క ఉద్దేశ్యం శాంతిని ప్రోత్సహించడం, సోదర భావనను బలోపేతం చేయడం.కొన్ని దేశాలలో ముస్లింలు మూడురోజుల సెలవుదినాలు పాటిస్తారు.  ఆగ్నేయ ఆసియా దేశాలలో, ఈద్-ఉల్-ఫితర్‌, "గొప్పది" గా భావించబడుతుంది మరియు అక్కడ ఉన్న ముస్లింలకు ఇది చాలా ముఖ్యమైన సంబంరంగా ఉంటుంది.

 

ఈద్ ఉల్ ఫితర్ దినాన విబిన్న దేశాలలోని ముస్లింలు అరబిక్ లో ఈద్ ముబారక్ ("ఆశ్వీరదించబడిన ఈద్") లేదా ఈద్ సాఈద్ ("ఆనందకరమైన ఈద్")అని, టర్కీలో “బయ్‌రామినిజ్ కుట్లు ఒల్సున్” లేదా "మీ బయ్‌రామ్ “– ఈద్ - సంతోషకరంగా ఉండుగాక" అని పరస్పరం అబినంధించుకొంటారు. ఆ సంవత్సర కాలంలో ఏర్పడిన వ్యత్యాసాలను లేదా శత్రుత్వాలను మరచిపోమని మరియు క్షమించమని కూడా ఆరోజు ముస్లింలు అబ్యర్ధించుకొంటారు.

 

ఈద్ ఉల్ ఫితర్ రోజు, ముస్లింలు సలాతుల్ ఫజ్ర్ (సూర్యోదయానికి ముందు ప్రార్థన) చేయటానికి సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు, మరియు సున్నా సంప్రదాయాలను నిర్వర్తిస్తూ దంతధావనాన్ని మిస్వాక్ లేదా టూత్‌బ్రష్ తో చేసుకుని, ఫజ్ర్ ప్రార్థనలు అయిన తరువాత స్నానం చేస్తారు(ఘుసుల్) , నూతన వస్త్రాలు ధరించి(లేదా ఉన్నవాటిలో మంచివి), అత్తరును పూసుకుంటారు.

 

ఈద్ రోజు ఉపవాసం ఉండడమనేది హరాం, లేదా నిషిద్ధమైనది. అందుచే ప్రత్యేకమైన ఈద్ ప్రార్థనకు హాజరయ్యేముందు తియ్యటి అల్పాహారంను, ముఖ్యంగా ఒక కర్జూరం పండును తినమని సిఫారుసు చేయబడింది మరియు ముస్లిం లు బీదలకు మరియు అవసరంలో ఉన్నవారికి జకత్ చెల్లించవలసిన మొత్తం ఈద్ ప్రార్థన ముందు చెల్లిస్తారు.ముస్లింలు ఈద్ ప్రార్థనకు వెళ్ళేటప్పుడు తక్బీర్‌ను చదువుతారు ప్రార్థనా మైదానాల (ఈద్-గా) నుండి మరియు అక్కడి వరకూ రెండు మార్గాలను ముస్లిం లు ఉపయోగించటం సున్నత్ గా భావించబడుతుంది. ప్రార్థనలు ముగిసిన తరువాత, ముస్లింలు వారి చుట్టాలు, స్నేహితులు మరియు పరిచయస్తుల గృహాలను సందర్శిస్తారు లేదా గృహాలలో, సామాజిక కేంద్రాలలో లేదా అద్దె సమావేశ మందిరాలలో పెద్ద సామాజిక వేడుకలు జరుపుతారు. ఈదిస్ (ఈద్ బహుమతులు)లను తరచుగా పిల్లలకు మరియు దగ్గరి బంధువులకు ఇస్తారు; కొన్ని సంస్కృతులలో చుట్టాలు లేదా స్నేహితులు, పిల్లలకు డబ్బులు(ఈదిస్) ఇవ్వటం అనే సంప్రదాయం ఉంది

 

No comments:

Post a Comment