15 April 2023

మధ్య ఆసియా ముస్లిం దేశాలు-సంబంధాలను పెంచుకొనేందుకు ప్రపంచ అగ్రరాజ్యాల ప్రయత్నాలు Central Asian Muslim countries-Big powers rushing to cultivate ties

 

తూర్పున మంగోలియా, పడమర కాస్పియన్ సముద్రం నుండి పశ్చిమ చైనా,  దక్షిణాన ఆఫ్ఘనిస్తాన్,ఇరాన్ మరియు ఉత్తరాన రష్యా వరకు మధ్య ఆసియా ప్రాంతం విస్తరించి ఉంది.

మధ్య ఆసియా ప్రాంతం లోని కజాఖ్స్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ మొదలగు దేశాలన్నీ ముస్లిం దేశాలే.

మధ్య ఆసియా ప్రాంతం లో మాజీ సోవియట్ రిపబ్లిక్‌లైన కజాఖ్స్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ Kazakhstan, Kyrgyzstan, Tajikistan, Turkmenistan, and Uzbekistan ఉన్నాయి. మధ్య ఆసియా ప్రాంతం తన భౌగోళిక స్థానం మరియు సహజ వనరుల కారణంగా వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం.

మధ్య ఆసియా ప్రాంతం చారిత్రాత్మకంగా సిల్క్ రోడ్ వాణిజ్య మార్గoతో ముడిపడి, ఐరోపా మరియు ఫార్ ఈస్ట్ మధ్య ప్రజలు, వస్తువులు మరియు ఆలోచనల కూడలిగా ఉంది.

19వ శతాబ్దం మధ్యకాలం నుండి దాదాపు 20వ శతాబ్దం చివరి వరకు, మధ్య ఆసియా రాజ్యాలు, రష్యన్‌ వలసరాజ్యలుగా ఉండి రష్యన్ సామ్రాజ్యంలో మరియు ఆతరువాత సోవియట్ యూనియన్‌లో విలీనం చేయబడినవి.

2019 నివేదిక ప్రకారం, మధ్యాసియా లోని ఐదు ముస్లిం దేశాలు  సుమారు 72 మిలియన్ల జనాభా కలిగి ఉన్నాయి: కజకిస్తాన్ (19 మిలియన్లు), కిర్గిజ్స్తాన్ (7 మిలియన్లు), తజికిస్తాన్ (10 మిలియన్లు), తుర్క్మెనిస్తాన్ (6 మిలియన్లు) మరియు ఉజ్బెకిస్తాన్ (35 మిలియన్లు).

సోవియట్ పాలనలో మధ్యాసియా ప్రాంతం లో కమ్యూనిజo బలవంతంగా అమలు చేయబడి  ఇస్లాం ధర్మం పూర్తిగా నిషేధించబడింది మరియు క్రూరంగా అణచివేయబడింది. మసీదులు నైట్ క్లబ్‌లుగా మార్చబడ్డాయి. కాని 1981లో సోవియట్ యూనియన్  పతనంతో ఇస్లాం మధ్యాసియా ప్రాంతంలో పుంజుకోవడం ప్రారంభించింది. మధ్యాసియా ప్రాంతం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో ముఖ్యంగా ముస్లిం దేశాలతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడం ఆరంభించినది.

మధ్యాసియా ప్రాంతం దేశాలు స్వేచ్ఛకలిగి ఉన్నప్పటికీ, సోవియట్ యూనియన్ పతనం తర్వాత కొత్తగా ఏర్పడిన "కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ -CIS లో భాగస్వాములు అయినాయి. కాని మొత్తం ఐదు మాజీ సోవియట్ సెంట్రల్ ఆసియా రిపబ్లిక్‌లు ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడికి మద్దతు ఇవ్వలేదు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో రష్యా దాడిని ఖండిస్తూ జరిగిన ఓటింగ్‌లో ఐదుగురు గైర్హాజరయ్యారు.

అయితే ఉక్రెయిన్‌ యుద్ధంలో నిమగ్నమై రష్యా, మధ్య ఆసియా దేశాలపై నెమ్మదిగా నియంత్రణను కోల్పోతున్న సమయంలో యునైటెడ్ స్టేట్స్, యూరప్, చైనా, భారతదేశం, మొదలగు దేశాలు వనరులు సమృద్ధిగా ఉన్న మధ్యాసియ ప్రాంతంతో సన్నిహిత సంబంధాలను మెరుగుపరచుకోవడం  ప్రారంభించాయి.

మధ్యాసియా ప్రాంతం తో మతపరమైన, సాంస్కృతికపరమైన,రాజకీయ, ఆర్థిక మరియు వ్యూహాత్మక మరియు రక్షణ సంబంధాలను ఏర్పరచుకోవడానికి అనేక ప్రపంచ ఆగ్రరాజ్యాలు ముందుకు వచ్చాయి. యునైటెడ్ స్టేట్స్, యూరప్, చైనా, భారతదేశం మొదలగు దేశాలు వనరులు సమృద్ధిగా ఉన్న మధ్యాసియా ప్రాంతంతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకోవటానికి ప్రయత్నాలు ఆరంభించాయి.

మధ్య ఆసియాలో US ప్రభావాన్ని తగ్గించడానికి రష్యా సంవత్సరాలుగా కృషి చేసింది. కాని ఇటివల అమెరికా, మధ్య ఆసియాలోకి ప్రవేశించాలనే కోరికతో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్‌ను మధ్య ఆసియాలోకి పంపింది. ఆంటోనీ బ్లింకెన్‌ మధ్య ఆసియా నాయకులను కలుసుకున్నాడు. ఈ ప్రాంతంలో ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్న దేశాలకు అమెరికా తన ఆర్ధిక సహకారం వాటాను పెంచుతుంది అని ప్రకటించాడు.

అమెరికా అద్యక్షుడు జో బిడెన్ కొత్త వాణిజ్య మార్గాలతో సహా ఈ ప్రాంత ఆర్థిక వృద్ధికి మద్దతుగా ఇప్పటికే కట్టుబడి ఉన్న $25 మిలియన్ల కు తోడు అదనంగా $25 మిలియన్ల కొత్త నిధులను ప్రకటించారు మరియు కొత్త ఎగుమతి మార్కెట్లను కనుగొనడంలో వ్యాపారానికి సహాయం చేస్తానని వాగ్ధానం చేసారు. US ఈ ప్రాంతంలో ప్రాంతీయ వాణిజ్య మార్గాలను మరియు ఎగుమతి మార్కెట్‌లను $50 మిలియన్లకు విస్తరించడానికి ఒక చొరవను పెంచింది.అదే సమయంలో, మధ్య ఆసియా పై  రష్యా ప్రాభల్యం ను తగ్గించాలని అమెరికా కోరింది. కజాఖ్స్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ పర్యటన సందర్భంగా ఐదు మధ్య ఆసియా రిపబ్లిక్‌లతో బ్లింకన్ యొక్క శిఖరాగ్ర చర్చలు అమెరికా ఆసక్తిని నొక్కిచెప్పాయి.

చైనా గ్రీన్ ఎనర్జీ మరియు సహజ వాయువు ఒప్పందాల కోసం మధ్య ఆసియా వైపు చూస్తోంది. చైనా లోని జిన్‌జియాంగ్‌లోని ఉగైర్ ఇస్లామిక్ ఉద్యమాలను చైనా అణిచివేసేటప్పుడు, మధ్య ఆసియాతో - ముఖ్యంగా ఈ ప్రాంతంలోని అత్యంత ధనిక దేశమైన  కజకిస్తాన్‌తో చైనా తన సంబంధాలను పెంచుకోవాలని  ముఖ్యంగా  ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో కీలకమైన పాత్ర వహించాలని చూస్తుంది.

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కజాఖ్స్తాన్‌ను సందర్శించారు, ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో మూసివేయబడిన క్రాస్-బోర్డర్ మోటార్‌వేలు మరియు రైల్వేలను తిరిగి తెరవడం ద్వారా వాణిజ్యాన్ని మెరుగుపరచడం కోసం చైనా కృషి చేస్తున్నది.చైనాలో స్వతంత్ర ఇస్లామిక్ జిన్‌జియాంగ్ రాజ్యాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న వేర్పాటువాద సమూహాలను అడ్డుకోవడంలో బీజింగ్‌కు మధ్యాసియ దేశాల ప్రాంతీయ భద్రత సహకారం పొందాలని చైనా చూస్తుంది

ఫిబ్రవరిలో, చైనా తన మొదటి పరిశ్రమ మరియు పెట్టుబడి ఫోరమ్‌ను రష్యారహిత  ఐదు మధ్య ఆసియా దేశాలతో - తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిజ్స్తాన్ మరియు కజాఖ్స్తాన్‌లతో నిర్వహించినది.

సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) అనేది మధ్య ఆసియాలో చైనా యొక్క గొప్ప వ్యూహంలో ఒక భాగం, ఇది మధ్య ఆసియాలో ప్రాంతం యొక్క ప్రాముఖ్యతను తీవ్రతరం చేసింది. ఇంకా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) వంటి ప్రాంతీయ సంస్థల ద్వారా మధ్య ఆసియా ప్రాంతంలో చైనా ప్రభావం పెరిగింది.చైనా యొక్క ప్రాంతీయ వ్యూహాo లో పాకిస్తాన్ ఒక ముఖ్యమైన భాగం. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) అనేది చైనా యొక్క BRI యొక్క ప్రధాన ప్రాజెక్ట్.


మరోవైపు భారతదేశం వాణిజ్యం మరియు కనెక్టివిటీ, ఆర్థికాభివృద్ధి, ఇంధన భద్రత, భాగస్వామ్య ఆసక్తికి సంబంధించిన ప్రాంతీయ ఆందోళనలు మరియు ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్త సవాళ్లకు సంబంధించి ఇరు పక్షాల భాగస్వామ్య భౌగోళిక ఆందోళనలు వంటి అంశాలపై మధ్య ఆసియాతో తన సహకారాన్ని తీవ్రతరం చేసింది.

మధ్య ఆసియా ప్రాంతంలో భారతదేశ సంబంధాలు మరియు ప్రభావాన్ని వాణిజ్యం గణనీయంగా ప్రభావితం చేస్తుంది. మధ్య ఆసియా దేశాలతో ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి మరియు రాజకీయ మరియు సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి భారతదేశం యొక్క వాణిజ్యం,  సహాయపడుతుంది.

మధ్యాసియ  ప్రాంతం నుండి చమురు, గ్యాస్ మరియు ఖనిజాల దిగుమతులు  భారతదేశమునకు  క్లిష్టమైన వనరులకు ప్రాప్యతను అందిస్తాయి. అదేవిధంగా భారత దేశం నుండి వస్త్రాలు మరియు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, మధ్యాసియా ప్రాంతo లో  మార్కెట్ యాక్సెస్‌ను అందిస్తాయి.

 


No comments:

Post a Comment