13 April 2023

న్యాయం, సమానత్వం మరియు దయ మొదలగు ప్రవిత్ర ఖురాన్ విలువల నెల రంజాన్ Ramadan is the month of Quranic values of justice, equality and mercy

 

పవిత్ర   ఖురాన్ యొక్క అవతరణ రంజాన్ మాసం జరిగింది. దివ్య ఖురాన్ అవతరించడం ప్రారంబమైన  రాత్రిని దివ్య ఖురాన్‌లో ఘనమైన రాత్రిగా పేర్కొనబడింది:

·        మేము దీనిని (ఖురాన్)  శుభవంతమైన ఒక రాత్రి అందు అవతరిoపజేసాము. (44:2)

·        మేము దీని (ఖురాన్)ని ఘనమైన రాత్రియందు అవతరింప జేశాము- అల్-ఖద్ర్ రాత్రి (97:1).

దివ్య ఖురాన్ లోని ఆయతులు దివ్య ఖురాన్ అవతరించిన రాత్రిని అసాధారణ రాత్రిగా వర్ణించాయి.

మానవాళికి మార్గదర్శకత్వం మరియు ప్రమాణం (మంచి మరియు తప్పుల మధ్య) కోసం స్పష్టమైన రుజువు అయిన దివ్య ఖురాన్ అవతరించిన మాసం రంజాన్ " అని సర్వశక్తిమంతుడైన అల్లాహ్  మానవాళికి తన చివరి సందేశంలో చెప్పాడు.

ప్రవక్త ముహమ్మద్(స) యొక్క ప్రారంభ జీవితం మరియు సమాధానాల కోసం అన్వేషణ ప్రవక్త(స)వ్యక్తిత్వం రూపొందించడంలో కీలకమైనది మరియు ఇస్లాం యొక్క చివరి ప్రవక్తగా అతని మిషన్ ఈ దైవిక వెల్లడి(పవిత్ర అవతరణ)తో ప్రారంభించబడింది.

సమకాలీన అరబ్ సమాజం యొక్క పతనం పట్ల ప్రవక్త(స) ఆందోళన, అలాగే స్త్రీల పట్ల గౌరవం లేకపోవడం మరియు ఆడ శిశువులను సజీవంగా పాతిపెట్టడం పట్ల బాధ, తన  చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చడానికి ఒక మార్గాన్ని వెతకడానికి ప్రవక్త(స)ను ప్రేరేపించింద 

మౌంట్ జబల్-అల్-నూర్ వద్ద ఉన్న గుహలో అల్లాహ్ నుండి మార్గదర్శకత్వం మరియు సమాధానాల కోసం ప్రవక్త(స) అన్వేషణలో ప్రార్థన మరియు ధ్యానం వంటి ఆధ్యాత్మిక అభ్యాసం ద్వారా, ప్రవక్త(స)తన లక్ష్యాన్ని నిర్వహించడానికి అవసరమైన అంతర్గత శక్తిని మరియు స్థితిస్థాపకతను పెంపొందించుకోగలిగాడు

ప్రవక్త ముహమ్మద్ ప్రార్థనలు కేవలం తన కోసమే కాదు, మొత్తం మానవాళి పరివర్తన కోసం. తన తోటి మానవుల పట్ల ప్రవక్త(స)కున్న ప్రగాఢ సానుభూతి మరియు న్యాయం మరియు ధర్మం పట్ల ప్రవక్త(స)కున్న  అచంచలమైన నిబద్ధతను, ప్రపంచంలో సానుకూల మార్పును తీసుకురావాలనే ప్రవక్త (స)సంకల్పానికి ఆజ్యం పోశాయి.

ప్రవక్త(స) వారసత్వం నేటికీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉంది. ప్రవక్త(స)శాంతి, ప్రేమ మరియు కరుణ యొక్క సందేశం ముస్లింలు మరియు ముస్లిమేతరులకు కూడా  ఆశ మరియు మార్గదర్శకత్వం గా పనిచేస్తుంది మరియు ప్రవక్త(స)ఉదాహరణ మరింత న్యాయమైన మరియు సమానమైన ప్రపంచం వైపు పని చేయడానికి ప్రజలను ప్రేరేపిస్తుంది

న్యాయం, ధర్మం పట్ల ప్రవక్త(స) ఉన్న నిబద్ధత మరియు సంకల్పం ప్రవక్త(స)జీవితాంతం పరీక్షించబడ్డాయి, ఎందుకంటే ప్రవక్త(స) హింస, తిరస్కరణ మరియు యుద్ధంతో సహా జీవితం లోని  అనేక సవాళ్లు మరియు అడ్డంకులను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ, అల్లాపై ప్రవక్త(స)విశ్వాసం మరియు దైవక మిషన్ పట్ల ప్రవక్త(స) తన కున్న అచంచలమైన అంకితభావం ఎన్నడూ వదలలేదు.

ప్రవక్త ముహమ్మద్(స) యొక్క జీవితం మరియు బోధనలు విశ్వాసం యొక్క పరివర్తన శక్తికి మరియు మానవులు మంచిగా మారే సామర్థ్యానికి ఉదాహరణగా పనిచేస్తాయి. అజ్ఞానం, క్రూరత్వం మరియు అన్యాయాన్ని అధిగమించి, కరుణ, న్యాయం మరియు దయపై ఆధారపడిన సమాజాన్ని నిర్మించడం సాధ్యమవుతుందని ప్రవక్త(స) తన జీవిత కృషి ద్వారా చూపించాడు.

నిజమే, సంవత్సరాలపాటు అంకితభావంతో ప్రార్థన మరియు ధ్యానం చేసిన తర్వాత, అల్లాహ్ సుభానాహుతలా ఖురాన్ యొక్క ద్యోతకంతో దేవదూత జిబ్రేల్‌ను పంపడం ద్వారా ప్రవక్త ముహమ్మద్(స) ప్రార్థనలకు సమాధానమిచ్చాడు. అల్లాహ్ పంపిన  ద్యోతకం ప్రవక్త(స) జీవితంలో 23 సంవత్సరాలు కొనసాగింది మరియు ఇస్లాం యొక్క పవిత్ర గ్రంథంగా సంకలనం చేయబడింది.

పవిత్ర ఖురాన్ అల్లాహ్ యొక్క వాణిగా పరిగణించబడుతుంది, దివ్య ఖురాన్ మానవాళి అందరికీ మార్గదర్శకత్వం మరియు సూచనలను అందిస్తుంది. దివ్య ఖురాన్ ప్రవర్తనా నియమావళిగా పనిచేస్తుంది, ఇది విశ్వాసులు అనుసరించవచ్చు, విశ్వాసులు ధర్మబద్ధమైన మరియు సంతృప్తికరమైన జీవితాన్ని ఎలా జీవించాలనే దానిపై మార్గదర్శకత్వం అందిస్తుంది. దివ్య ఖురాన్ ప్రవక్త ముహమ్మద్(స) యొక్క జీవితం మరియు అతని దైవక మిషన్ యొక్క పోరాటం, కష్టాలు మరియు విజయాలను కూడా వివరిస్తుంది.

పవిత్ర ఖురాన్ ద్వారా, అల్లాహ్ సుభానహుతలా ప్రవక్త ముహమ్మద్‌(స)కు ఇస్లాం యొక్క ముఖ్యమైన బోధనలను వెల్లడించాడు, ఇందులో ఒకే దేవుడిపై విశ్వాసం, ప్రార్థన మరియు దాతృత్వం యొక్క ప్రాముఖ్యత మరియు ఇతరుల పట్ల  కరుణ మరియు న్యాయం చూపవలసిన అవసరం వివరించాడు.. దివ్య ఖురాన్ వివాహం, కుటుంబ జీవితం, వ్యాపారం మరియు పాలనతో సహా అనేక విషయాలపై మార్గనిర్దేశం చేస్తుంది.

వాస్తవానికి, ఖురాన్ యొక్క అవతరణలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పాత్రను గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ముహమ్మద్(స)అల్లాహ్ చివరి దూతగా మరియు దైవిక సందేశాన్ని స్వీకరించే వ్యక్తిగా ఎంపిక చేయబడ్డాడు. ముహమ్మద్ ప్రవక్త(స) జీవితాన్ని అధ్యయనం చేయడం మరియు బోధనలను అనుసరించడం ముస్లింలకు దివ్య ఖురాన్‌పై లోతైన అవగాహన మరియు ప్రసంశను ఇస్తుంది..

మనం పవిత్ర రంజాన్ మాసాన్ని జరుపుకుంటున్నప్పుడు దివ్య ఖురాన్‌లో బోధించిన కరుణ, న్యాయం మరియు దయ వంటి విలువలు మరియు సూత్రాలను రూపొందించడానికి, అమలు పరచడానికి  కృషి చేద్దాం. మన దైనందిన జీవితంలో అల్లాహ్ నుండి మార్గదర్శకత్వం కోరుకుందాం మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఉదాహరణను అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం.

అల్లాహ్ మనందరినీ సరళమైన మార్గంలో నడిపిస్తాడు మరియు ఖురాన్ యొక్క బోధనలు మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఉదాహరణను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి మరియు అనుసరించే సామర్థ్యాన్ని ప్రసాదిoచుగాక . అమీన్.

 

 

No comments:

Post a Comment