1917లో మహాత్మా గాంధీ చేసిన సత్యాగ్రహంతో చంపారన్ ఆగలేదు, తరువాత అది స్వతంత్ర భారతదేశంలో రైతాంగ ఉద్యమానికి, భూ సంస్కరణలకు నాయకత్వం వహించింది
భారత స్వాతంత్ర్య పోరాటం ఒక ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందిన ప్రదేశంగా చంపారన్‌కు ఘనత దక్కుతుంది. కానీ, జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని స్వతంత్ర భారత ప్రభుత్వానికి చంపారన్ మొట్టమొదటి సవాలును విసిరిందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కొన్ని నెలల్లోనే భారత రాజ్యాంగానికి మొదటి సవరణ తీసుకురావాల్సిన ఒత్తిడిని చంపారన్ నెహ్రు పై మోపింది.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు, రామ్ మనోహర్ లోహియా నేతృత్వంలోని సోషలిస్టులు,కమ్యూనిస్టులు మరియు హిందూ మహాసభతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదటి ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీ వలె సమస్యల చుట్టూ భారత ప్రజలను సమీకరించాలని లోహియా భావించారు. ఇందుకోసం, గాంధీ తన ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రదేశమైన చంపారన్‌ను లోహియా ఎంచుకున్నారు, 1947లో, లోహియా నేతృత్వంలోని సోషలిస్ట్ పార్టీ జాతీయ కార్యవర్గం ‘చంపారన్ జిల్లాలో భూసేకరణ ప్రక్రియ process of land accumulation, రైతుల నిరంతర భూమి హరణం continual dispossession of farmers, పెద్ద వ్యవసాయ క్షేత్రాలు మరియు భూస్వాముల ఆవిర్భావంపై విచారణ జరపాలని’ నిర్ణయించింది.
‘భారతదేశంలో భూసేకరణ గరిష్ట స్థాయి accumulation of holdings కి చేరిన ఏకైక ప్రదేశం బహుశా’ చంపారన్ కావడంతో, ఈ విచారణ కోసం చంపారన్‌ను ఎంపిక చేశారు. కానీ, మే 1950 వరకు ఈ విచారణ కమిషన్ కాగితాలకే పరిమితమైంది. ఆ తర్వాత భారత రాజ్యాంగం ఆమోదం పొందడంతో, నెహ్రూ ప్రభుత్వం వాగ్దానం చేసిన భూ సంస్కరణలను (జమీందారీ రద్దు) నెరవేర్చలేదని స్పష్టమైంది. మరో రెండు సంవత్సరాలలో సార్వత్రిక ఎన్నికలు కూడా జరగనున్నాయి, మరియు నెహ్రూ చేసిన భూసంస్కరణల వాగ్ధనం నెరవేర్చడం కష్టమని సోషలిస్టులు భావించారు.
కాబట్టి, లోహియా, ఖుర్షెద్‌బెన్ నౌరోజీ మరియు రామానందన్ మిశ్రాలతో కలిసి మే 29న చంపారన్‌లో పర్యటన ప్రారంభించి, జూన్ 8, 1950న తమ నివేదికను సమర్పించారు. 4,000 లిఖితపూర్వక విజ్ఞప్తులను స్వీకరించి, 400 మంది సాక్షులను విచారించి, 1,000 మంది రైతుల వాంగ్మూలాలను నమోదు చేసిన తర్వాత, లోహియా నేతృత్వంలోని కమిషన్ ఇలా పేర్కొంది: "1867 నుండి 1917 వరకు చంపారన్ రైతాంగం ఎవరిపై అయితే తీవ్ర పోరాటం సాగించిందో, ఆ బ్రిటిష్ తోటల యజమానులు రైతులను ఆర్థికంగా పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. 1918తో ముగిసిన దశాబ్ద కాలంలో, రైతాంగం తాకట్టుల రూపంలో రూ. 84 లక్షలు అప్పు చేసి, 1,04,000 ఎకరాల భూమిని వడ్డీ వ్యాపారులకు అప్పగించాల్సి వచ్చింది. రైతులు కాస్త ఊపిరి పీల్చుకునేలోపే, 1930 నాటి ఆర్థిక మాంద్యం వారిని తీవ్రంగా దెబ్బతీసింది. దానికి తోడు 1931లో వడగళ్ల తుఫాను మరియు 1934 నాటి భూకంపం రైతుల విధ్వంసక ప్రక్రియను పూర్తి చేసింది. వీటన్నింటి ఫలితంగా, రైతులు పెద్ద స్థాయిలో తమ భూములను కోల్పోవాల్సి వచ్చింది." మహాత్మా గాంధీ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టిన తర్వాత, కనీసం 40,000 ఎకరాల భూమిని చక్కెర మిల్లు యజమానులు అత్యంత తక్కువ ధరలకు చేజిక్కించుకున్నారని కమిషన్ గుర్తించింది
జూన్ 9న, పాట్నాలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో లోహియా మాట్లాడుతూ, ప్రతి కుటుంబానికి ఉండవలసిన గరిష్ట భూ పరిమితిని 30 ఎకరాలకు తగ్గించాలని సూచించారు. లోహియా సూచించిన ఇతర మార్పులు ఇవి: (a) వ్యక్తిగత భూ యజమానుల తరపున జరిగే అన్ని భూ కేటాయింపులను నిలిపివేసి, ఒక 'ఆహార సైన్యం' (Food Army) ద్వారా సాగు చేయించే ఉద్దేశంతో, సాగుకు యోగ్యమైన బంజరు భూములన్నింటినీ భారత మరియు బీహార్ ప్రభుత్వాలు సంయుక్తంగా స్వాధీనం చేసుకోవాలి; (b) పశుగ్రాస భూములు, రహదారులు, పచ్చిక బయళ్లు, శ్మశాన వాటికల వంటి ఉమ్మడి భూములను తిరిగి గ్రామ పంచాయతీలకు అప్పగించాలి మరియు వాటిపై జరిగే తదుపరి ఆక్రమణలన్నింటినీ నిలిపివేయాలి; మరియు (c) సాగు భూముల విషయంలో గానీ, పట్టణ ప్రాంతాల్లో గానీ భూ కేటాయింపులు లేదా వాటి సవరణలు సంబంధిత గ్రామం లేదా పట్టణ పంచాయతీ ద్వారా మాత్రమే జరగాలి. ఈ మార్పులకు ఆధారమైన సూత్రాలను భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తింపజేయాలని డాక్టర్ లోహియా ఆకాంక్షించారు. అయితే, ప్రాథమిక దశలో మొదట్లో ఈ మార్పులను చంపారన్‌లో తక్షణమే అమలు చేయాలని లోహియా కోరారు. ఒకవేళ నెహ్రూ ప్రభుత్వం నెల రోజుల్లోపు ఈ సూచనలను అంగీకరిస్తే, తమ పూర్తి నివేదికను ప్రచురించబోమని లోహియా పేర్కొన్నారు.
అదే సమయంలో,
జమీందారీ
వ్యవస్థ రద్దును సులభతరం చేసే ఉద్దేశంతో, భారతదేశ
శాసనసభ (మొదటి సార్వత్రిక ఎన్నికలు అప్పటికి ఇంకా జరగాల్సి ఉంది) మొదటి రాజ్యాంగ
సవరణపై చర్చలు జరుపుతోందని గమనించాలి. జూన్ 18న,
ఈ
మొదటి సవరణ ఆమోదించబడింది; తద్వారా ఇది భూ
సంస్కరణలకు మార్గం సుగమం చేసింది.
.
No comments:
Post a Comment