నేతాజీ సుభాష్ చంద్ర
బోస్,
వి.
డి. సావర్కర్, అలాగే అనుశీలన్ సమితి ప్రకారం బెంగాల్
నవాబ్ సిరాజ్ ఉద్ దౌలా ఒక జాతీయ వీరుడు.1941
జనవరిలో బోస్ బ్రిటిష్ వారి గృహ నిర్బంధం నుండి తప్పించుకున్న విషయం దాదాపు
భారతదేశం మొత్తానికి తెలుసు.
కాంగ్రెస్ అధ్యక్ష
పదవికి రాజీనామా చేసిన తర్వాత సుభాష్ చంద్ర బోస్ తన ఫార్వర్డ్ బ్లాక్‌ను బలోపేతం
చేస్తున్నారు. సిరాజ్ ఉద్ దౌలాను ఒక నిరంకుశుడిగా చిత్రీకరించిన హోల్వెల్ స్మారక
చిహ్నం Holwell
memorial,
హిందువులు,
ముస్లింలు
అనే తేడా లేకుండా ప్రతి భారతీయుడికి ఒక భావోద్వేగమైన అంశమని సుభాష్ చంద్ర బోస్అన్నారు.
1757లో
సిరాజ్ ఉద్ దౌలా ను బ్రిటిష్ వారు ఉరి తీసారు. 1940
జూలై 3వ
తేదీని సిరాజ్ ఉద్ దౌలా దినోత్సవంగా జరుపుకోవాలని సుభాష్ చంద్ర బోస్ ప్రకటించారు.
1940
మే 30న,
బోస్,
కోల్‌కతాలోని ఆల్బర్ట్ హాల్‌లో ఒక భారీ సభను ఉద్దేశించి ప్రసంగించారు. హోల్వెల్
స్మారక చిహ్నాన్ని తొలగించాలని, సిరాజ్
ఉద్ దౌలాను ఒక నిరంకుశ పాలకుడిగా లేదా మతతత్వవాదిగా చిత్రీకరించే చరిత్రను
పాఠ్యపుస్తకాల నుండి తొలగించాలని అన్నారు. జూలై 3వ
తేదీని సిరాజ్ ఉద్ దౌలా దినోత్సవంగా పాటించాలని, ఆ
రోజున బోస్ నాయకత్వంలో ఒక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.
జూలై 2,
1940న, డిఫెన్స్ ఆఫ్ ఇండియా
చట్టంలోని సెక్షన్ 129 కింద బోస్‌ను
అరెస్టు చేశారు. బోస్‌కు ఇదే చివరి అరెస్టు.
జూలై 3న
బోస్ అనుచరులు తమ కార్యక్రమాలను కొనసాగించారు. సిరాజ్ ఉద్ దౌలా వేడుకలను బెంగాల్‌లోని
ముస్లింల కంటే హిందువులే ఎక్కువగా జరుపుకున్నారు.
బెంగాల్ గవర్నర్, వైస్రాయ్‌కి ఇలా తెలియజేశారు,
“ ముస్లింలు శాంతంగా ఉండటానికి మొగ్గు చూపుతున్నారని,
కానీ
సుభాష్ హిందూ అనుచరులు మరియు కొంతమంది అతివాద ముస్లింలు గొడవలు సృష్టించడానికి
ఆత్రుతగా ఉన్నారని సాధారణ అభిప్రాయం వ్యక్తమైంది... సుప్రసిద్ధ మాజీ ఉగ్రవాదులు
(అనుశీలన్ సమితి మరియు హెచ్‌ఎస్‌ఆర్‌ఏ HSRA)
మరియు ఫార్వర్డ్ బ్లాక్ హిందూ ఉద్యమకారులు ప్రముఖంగా ఉన్నారు.”
సుభాష్ చంద్ర బోస్‌ను
ఖైదు చేసి, డిసెంబరులో గృహ నిర్బంధానికి మార్చారు,
అక్కడి
నుంచి బోస్ చివరికి తప్పించుకున్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ కమాండర్‌గా,
బోస్
సిరాజ్ ఉద్ దౌలా మరియు ప్లాసీ జ్ఞాపకాలను పదేపదే గుర్తుచేసుకునేవారు.
హిందుత్వ
సిద్ధాంతకర్తలలో అత్యంత ప్రముఖుడైన వినాయక్ దామోదర్ సావర్కర్,
1857లో జరిగిన ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామానికి సంబంధించి తాను
రచించిన ప్రామాణిక చరిత్ర గ్రంథంలో, ప్లాసీ
యుద్ధంలో సంభవించిన పరాజయాన్ని భారతీయుల పరాజయంగా అభివర్ణించారు.
సావర్కర్ ఇలా రాశారు:
"1757
జూన్ 23వ
తేదీన,
భారతదేశం
భారతీయులకు చెందాలా లేక ఆంగ్లేయులకు చెందాలా అనే ప్రశ్న,
ప్లాసీ
యుద్ధభూమిలో మొట్టమొదటిసారిగా బహిరంగంగా చర్చకు వచ్చింది. సరిగ్గా ఆ రోజే,
ఆ
ప్రశ్న మొదట చర్చకు వచ్చిన ప్లాసీ యుద్ధభూమిలోనే, విప్లవ
బీజాలు నాటబడ్డాయి. ప్లాసీ యుద్ధం జరిగి ఉండకపోతే, 1857
నాటి స్వాతంత్ర్య సంగ్రామం కూడా జరిగి ఉండేది కాదు.
ఒక శతాబ్దం
గడిచిపోయినప్పటికీ, ఆనాటి జ్ఞాపకం
హిందుస్థాన్ హృదయంలో ఇంకా సజీవంగానే ఉంది. దీనికి నిదర్శనంగా,
1857 జూన్ 23వ తేదీన ఉత్తర
భారతదేశంలో చోటుచేసుకున్న భీకర దృశ్యాన్ని గమనించండి. పంజాబ్ నుండి కలకత్తా వరకు
విస్తరించి ఉన్న విశాల భారత దేశంలో, ఎక్కడ
మైదానాలు ఉన్నాయో అక్కడల్లా వేలాదిమంది విప్లవకారులు,
'ఈ రోజు మేము ప్లాసీ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోబోతున్నాము!'
అని
ఆంగ్లేయులకు బహిరంగంగా సవాలు విసురుతూ, ఉదయం
నుండి సాయంత్రం వరకు వివిధ ప్రదేశాలలో ఏకకాలంలో వారితో పోరాడారు."
సావర్కర్ అభిప్రాయం
ప్రకారం,
"ప్లాసీ యుద్ధభూమిలో, భారతదేశం
స్వాతంత్ర్య పోరాటం సాగిస్తానని ప్రతిజ్ఞ చేసింది."
సావర్కర్ దృష్టిలో
భారత స్వాతంత్ర్య సంగ్రామం ఒక 'యజ్ఞం'
వంటిది.
సావర్కర్ భారతీయ విప్లవకారులను ఇలా ఉద్బోధించారు: "యజ్ఞవేదికపై హోమగుండాన్ని
మరింత విశాలంగా, మరింత లోతుగా తవ్వండి! చాలా మంచిది.
ఇదిగో చూడండి! జాతీయ ఆగ్రహమనే అగ్నిజ్వాలలు అప్పుడే భగ్గున మండుతున్నాయి! ఈ
యజ్ఞానికి సంబంధించిన ప్రథమ సంస్కారంగా, 'సంకల్పం'
(ప్రతిజ్ఞా వాక్యం) ఇప్పటికే వంద సంవత్సరాల క్రితమే,
అంటే
క్రీ.శ. 1757లోనే
ప్రకటించబడింది. కాబట్టి, ప్రథమ యజ్ఞ ఆహుతిగా,
ఆ
'ప్లాసీ
యుద్ధభూమి'ని ఈ ప్రజ్వలిస్తున్న హోమగుండంలోకి
సమర్పించండి!"
హిందుత్వ సిద్ధాంత
ప్రతిపాదకుడైన సావర్కర్, ప్లాసీ యుద్ధంలో
సంభవించిన పరాజయాన్ని "జాతీయ అవమానం"గా అభివర్ణించారు.
No comments:
Post a Comment