ఆధునిక భారతదేశంలో ముస్లిం సమాజంలో కుల ఆధారిత అసమానతలను సవాలు చేయడానికి జరిగిన మొట్టమొదటి ప్రయత్నాలలో ఒకటిగా మరియు ముస్లిములలో అగ్రవర్ణ ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి ముస్లిం నేత కార్మికుల (జోలహా Jolaha) సంస్థ ప్రారంబించిన “అఖిల భారత మోమిన్ సదస్సు(AIMC)”కు గుర్తింపు లభిస్తుంది. ముస్లిం నేత కార్మికుల (జోలహా Jolaha) సంస్థ ప్రారంబించిన ఈ ఉద్యమo లో తర్వాత ముస్లిం ఇతర కులాల వారు కూడా చేరారు.
గోరఖ్‌పూర్ మాజీ పార్లమెంట్ సభ్యుడు (ఎంపీ) అష్ఫాక్ హుస్సేన్ అన్సారీ, 2000లో ప్రచురించిన తన ప్రామాణిక గ్రంథం 'డాక్యుమెంటరీ హిస్టరీ ఆఫ్ మోమిన్ కాన్ఫరెన్స్'లో ఇలా రాశారు: పస్మాందాలను (నిమ్న కుల ముస్లింలను) సంఘటితం చేసే మొదటి ప్రయత్నం 1912లో కోల్‌కతాలోని నేత కార్మికుల సంఘంలోని ప్రముఖ సభ్యులచే ప్రారంభించబడింది.
మౌలానా హాఫిజ్ అబ్దుల్లా ఘాజీపురి, షమ్సుల్ ఉలమా మౌలానా ముహమ్మద్ యహ్యా, ఇంజనీర్ షమ్సుద్దీన్ అహ్మద్ మరియు 'అల్-మోమిన్' సంపాదకుడు ముహమ్మద్ యహ్యా, పస్మాండాల సంక్షేమం కోసం కోల్‌కతాలోని యూరోపియన్ అసైలం లేన్‌లో కార్యాలయంతో 'జమియత్-అల్-మోమినీన్'ను ప్రారంభించారు. త్వరలోనే, దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘాలను ఏర్పాటు చేయించారు.
1976లో జరిగిన అఖిల భారత మోమిన్ సదస్సు (AIMC)లో మౌలానా ముహమ్మద్ ఇనాముద్దీన్ రామ్‌నగ్రి తన ప్రసంగంలో మాట్లాడుతూ మౌలానా అబ్దుల్ సలాం ముబారక్‌పురి మరియు అతని కుమారుడు మౌలానా ఉబైదుల్లా ముబారక్‌పురి రచించిన పుస్తకం కుల వివక్షపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తినందున అది ప్రజలపై గొప్ప ప్రభావాన్ని చూపిందని అన్నారు.. పుస్తక ప్రచురణ తర్వాతే ప్రజలు పస్మాందా కోసం ఒక సంస్థ యొక్క అవసరాన్ని గ్రహించడం ప్రారంభించారు
మోమిన్ ఉద్యమం అన్ని పస్మాందా వర్గాల అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, అది త్వరలోనే కేవలం నేత కార్మికుల ఉద్యమంగా మారిపోయింది.
1912 నుండి 1915 వరకు మోమిన్ ఉద్యమం కోల్‌కతా నుండి బీహార్, అవధ్, పంజాబ్, బొంబాయి మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించిందని అష్ఫాక్ హుస్సేన్ అన్సారీ రాశారు. 1915లో తన మరణం వరకు ఈ ఉద్యమ వ్యాప్తిలో ఖాజీ షేక్ అబ్దుల్ జబ్బార్ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించారు. హకీం అబ్దుల్ ఘనీ ఘాజీపురి, మౌలానా అబూ షోయబ్ సైఫ్ బనార్సీ, మౌలానా అబూ షోయబ్ ఖుర్జవీ, షమ్సుల్ ఉలమా మౌలామా ముహమ్మద్ యహ్యా, మహమ్మద్ యహ్యా (సంపాదకుడు), మౌలానా అబ్దుల్లా ఘాజీపురి మరియు ఇతరులు 1915 వరకు మోమిన్ ఉద్యమానికి కీలకంగా ఉన్నారు. కానీ, జబ్బార్ మరణం మరియు ప్రపంచ యుద్ధం మోమిన్ ఉద్యమానికి అడ్డుకట్ట వేశాయి.
మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, పస్మాందా సమస్యలకు అంకితమైన ఒక ఉర్దూ వార్తాపత్రికను మహమ్మద్ యహ్యా ప్రారంభించారు. కోల్‌కతా నుండి ముద్రించబడిన 'అల్ మోమిన్' అనే ఈ వార్తాపత్రిక, మరింత అవగాహన కల్పించడంలో సహాయపడింది. 1923వ సంవత్సరం డిసెంబర్ రెండవ వారంలో, జమియత్-అల్-మోమినీన్‌ను పునరుద్ధరించడానికి దేశం నలుమూలల నుండి ప్రతినిధులు కోల్‌కతాలో సమావేశమయ్యారు. మోమిన్ ఉద్యమ భవిష్యత్తు గురించి చర్చించడానికి మౌలానా ముహమ్మద్ యహ్యా, మౌల్వి ముహమ్మద్ యహ్యా (ఎంఏ, ఎల్‌ఎల్‌బి), మౌల్వి అబ్దుల్ హసన్, కాషిఫ్ షేక్‌పురి, మౌల్వి అబుల్ హసన్ బిస్మిల్, మాస్టర్ హిమాయత్ హుస్సేన్, మున్షీ షమ్సుద్దీన్ అహ్మద్ తంతి బాగ్, ఇంజనీర్ షమ్సుద్దీన్ అహ్మద్ మరియు మహమ్మద్ యహ్యా (అల్ మోమిన్ సంపాదకుడు) మాస్టర్ కరామత్ ఇంట్లో సమావేశమయ్యారు.
1925 మార్చి 22 మరియు 23 తేదీలలో, అఖిల భారత మోమిన్ సదస్సు యొక్క మొదటి సమావేశం కోల్‌కతాలోని టౌన్ హాల్‌లో జరిగింది. ఈ సమావేశానికి బీహార్‌లోని మనేర్‌కు చెందిన ప్రొఫెసర్ హాఫిజ్ షమ్సుద్దీన్ అహ్మద్ షమ్స్ అధ్యక్షత వహించారు. ప్రొఫెసర్ హాఫిజ్ షమ్సుద్దీన్ అహ్మద్ షమ్స్ తండ్రి ఇంజనీర్ మౌల్వి జమీరుద్దీన్, హకీం మౌలా బక్ష్ (నూరానీ దవాఖానా) మరియు మాస్టర్ మహమ్మద్ జాన్‌లతో పాటు బీహార్‌లోని మోమిన్ ఉద్యమ మార్గదర్శకులలో ఒకరు.
తన ప్రసంగం ప్రారంభంలో, పస్మాండా నేత కార్మిక వర్గాన్ని మేల్కొల్పినందుకు మౌలానా అబ్దుల్ సలాం ముబారక్‌పురికి, షమ్సుద్దీన్ ఘన నివాళులర్పించారు. షమ్సుద్దీన్ తన ప్రసంగంలో, "నా సోదరులారా, మొట్టమొదట మనం ఎవరో గుర్తించుకోవాలి?" అని ప్రశ్నించారు. ఇంకా షమ్సుద్దీన్ ఇలా అన్నారు, "మన సమాజమే భారతదేశపు ఆదిమ నివాసులని కొందరు వాదిస్తారు. హిందూ కాలంలో మనల్ని తంతి Tanti అని పిలిచేవారని, ముస్లిం పాలనలో ఇస్లాంలోకి మారిన తర్వాత మోమిన్ వంటి పేర్లు వచ్చాయని అంటారు. మనలో చాలా మంది మూలాలు భారతీయేతర జాతులకు చెందినవని నిరూపించే కాదనలేని ఆధారాలు పుష్కలంగా ఉన్నాయి. మన పూర్వీకులను టర్కీ, ఇరాన్, ఇరాక్, అరబ్, యెమెన్ వంటి దేశాల నుండి ముస్లిం పాలకులు భారతదేశంలో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేయడానికి ఆహ్వానించారు."
భారతదేశపు తొలి ముస్లిం పాలకుల కాలంలో నేత కార్మికుల సమాజం సుసంపన్నంగా ఉండేదని, వారు ఇస్లామిక్ పండితులను తయారు చేసేవారని షమ్సుద్దీన్ పేర్కొన్నారు. కాలక్రమేణా, అక్బర్ పాలన నుండి నేత కార్మికులకు, ఇతర వర్గాల వారికి విద్యాసంస్థల తలుపులు మూసివేయబడ్డాయి. ఆ తర్వాత బ్రిటిష్ పాలన నేత కార్మికుల వ్యాపారాన్ని కూడా నాశనం చేసింది.
షమ్సుద్దీన్ 'మోమిన్'
అనే
పదం యొక్క మూలాన్ని కూడా తెలియజేశారు. 12వ
శతాబ్దంలో హజ్రత్ మోమిన్ ఆరిఫ్ (ర.అ) అనే ఒక సూఫీ యెమెన్ నుండి వచ్చి బీహార్‌లోని
మనేర్‌లో బస చేశారు. ఆయన బట్టలు నేయడంలో
నిపుణుడు. హజ్రత్ మోమిన్ ఆరిఫ్ (ర.అ) ప్రభావంతో ఇస్లాంను స్వీకరించిన వారు,
ఆయనతో
పాటు వచ్చిన వారు మరియు ఆయన సంతానం భారతదేశం అంతటా బట్టలు నేసే కళను సజీవంగా
ఉంచారు మరియు వారే 'మోమిన్'గా
ప్రసిద్ధి చెందారు.
1925 సమావేశానికి బదులుగా, వారణాసికి చెందిన మౌలానా అబ్దుల్ మజీద్ అల్-హరిరి అధ్యక్షతన 1928 ఏప్రిల్ 7, 8 తేదీలలో కోల్‌కతాలో జరిగిన సమావేశాన్ని మొదటి ఏఐఎంసీ (AIMC) సమావేశంగా పరిగణించాలని అష్ఫాక్ అభిప్రాయపడ్డారు.
తన అధ్యక్షోపన్యాసంలో అల్-హరిరి, ముస్లింలు ఇస్లాం యొక్క సమానత్వ బోధనలకు తిరిగి వెళ్లాలని అన్నారు. జాతి, కులం మొదలైన భేదాలను నిర్మూలించడానికి ఇస్లాం వచ్చిందని, కానీ భారతీయ ముస్లింలు బ్రాహ్మణ కుల వ్యవస్థను స్వీకరించారని అన్నారు. ఖురాన్ బోధనలను తిరస్కరించి, వంశపారంపర్య వ్యవస్థను అవలంబించిన ఉలేమాలను అల్-హరిరి వ్యతిరేకించారు..
బ్రిటిష్ ఉద్యోగాలు తీసుకోవద్దని, అలా చేయడం దీర్ఘకాలంలో సమాజానికి హాని చేస్తుందని అల్-హరిరి ప్రజలను కోరారు. ఇస్లాంను దాని నిజమైన అర్థంలో అర్థం చేసుకుని నేర్చుకోవాలని ప్రజలను కోరారు.
1929 మార్చి 30, 31 తేదీలలో అలహాబాద్‌లో జరిగిన తదుపరి సమావేశానికి అంబాలాకు చెందిన మౌల్వి షేక్ జహీరుద్దీన్ అధ్యక్షత వహించారు. షేక్ జహీరుద్దీన్. పస్మాండాలకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వ విధానాల గురించి ప్రజలకు తెలియజేశారు. షేక్ జహీరుద్దీన్ దృష్టిలో, పస్మాండా ఆ కాలంలోని ప్రపంచ సోషలిస్ట్ ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలి. ప్రజలను జాతీయ రాజకీయాల్లో పాల్గొనమని కోరారు. పలువురు కార్యకర్తలు ఈ సూచనను వ్యతిరేకించినప్పటికీ, ఇది నేత కార్మికుల సమాజంలో రాజకీయ చైతన్యానికి నాంది పలికింది.
తదుపరి సమావేశం 1931 అక్టోబర్‌లో ఢిల్లీలో జరిగింది. దీనికి ఖాన్ సాహెబ్ సర్దార్ మహమ్మద్ ఇస్లాం (గయా గౌరవ మేజిస్ట్రేట్) అధ్యక్షత వహించారు.
1933లో లాహోర్‌లో జరిగిన తదుపరి సమావేశానికి గోరఖ్‌పూర్ మున్సిపల్ కమిషనర్ షేక్ ముర్తజా హుస్సేన్ అధ్యక్షత వహించారు. ముర్తజా నేతకళను కాపాడుకోవాలని ప్రజలను కోరారు. షేక్ ముర్తజా హుస్సేన్ దృష్టిలో, కాలానికి అనుగుణంగా మారడం అవసరం. నేత కార్మికులు రుణాలు మరియు వ్యాపార కార్యకలాపాల కోసం వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా ఉండేందుకు ఒక సహకార నిధి అవసరం అనే అంశాన్ని లేవనెత్తారు.
1939
నుండి అంబాలాకు చెందిన మౌల్వి జహీరుద్దీన్ ఏఐఎంసీ AIMC
కి నేతృత్వం వహించారు. ప్రపంచ యుద్ధం మరియు క్విట్ ఇండియా ఉద్యమం కారణంగా,
భారతదేశానికి
స్వాతంత్ర్యం వచ్చేవరకు 1939 గోరఖ్‌పూర్ సమావేశం
తర్వాత,
1943 ఏప్రిల్‌లో ఢిల్లీలో కేవలం ఒకే ఒక్క సమావేశం జరిగింది. ఈ
సమయంలో,
పాకిస్తాన్
కావాలన్న ముస్లిం లీగ్ డిమాండ్‌కు వ్యతిరేకంగా జహీరుద్దీన్ నాయకత్వంలోని ఏఐఎంసీ
కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. జిన్నా యొక్క విభజన ప్రచారాన్ని ఎదుర్కోవడానికి 1940లో
ఆజాద్ ముస్లిం కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేసిన 19
ముస్లిం పార్టీలలో ఇది ఒకటి. ఆ తర్వాత ఇది ముస్లిం లీగ్‌తో పోరాడటానికి ఏర్పడిన
ఆల్ ఇండియా ముస్లిం మజ్లిస్ అనే రాజకీయ సంస్థలో కూడా చేరింది.
“మోమిన్ ఉద్యమం (అఖిల భారత మోమిన్ సదస్సుAIMC) సాధించిన గొప్ప విజయం ఏమిటంటే, అది (నేత Jolaha) కులం యొక్క మనస్తత్వాన్ని
మార్చింది. ఇప్పుడు వారు తమ కుల గుర్తింపు పట్ల సిగ్గుపడకుండా, దానిని గర్వంగా ప్రకటిస్తున్నారు.”
No comments:
Post a Comment