5 September 2015

ఒక ముస్లిం/ విశ్వాసి యొక్క సామాజిక బాద్యత



.

 ఇస్లాం మతం లో సామాజిక బాధ్యత అనగా సమాజంలోని సభ్యులు సమాజ సాధారణ అవసరాలకు అలాగే దాని లోని  సభ్యుల యొక్క వ్యక్తిగత అవసరాలు తీర్చుటకు  మరియు హాని నుండి సమాజం ను  రక్షించడానికి కలిసి పని పనిచేసే విధంగా  చెప్పవచ్చును.  సమాజం లోని  ప్రతి సభ్యునికి తనకు హక్కులు ఉన్నవని తెలుసు మరియు అతనికి ఇతరుల పట్ల ముఖ్యంగా వాటిని నేరవేర్చుకోలేని వారి పట్ల బాధ్యతలు  కలవని తెలుసు.  ఈ బాధ్యతలు ఇతరులను హాని నుండి రక్షింఛి  మరియు ఇతరులకు  అవకాశం కల్పిస్తాయి.

ఇస్లాం మతం లో సామాజిక బాధ్యతల పరిధి ఇస్లాం మత ఆశయం,ప్రవర్తన అందు నమ్మకం ఉంచడం మరియు ఇస్లాం మతo యొక్క చట్టాలు, అలాగే ఇస్లామిక్ విలువల  వ్యవస్థ, మరియు ప్రవర్తన అందు కన్పించును.ఇవి  అన్ని ఖురాన్ మరియు సున్నహ్ లో వ్యక్తీకరించిన మరియు ప్రవక్త (స)అతని సహచరుల ప్రవర్తన, ప్రవక్త(స) ద్వారా ఉదహరించిన హదీసులు మరియు రాషిదూన్ ఖలీఫాల చేతలలో  ఉన్నాయి. సమాజం ఈ సూత్రాలు మరియు విలువలు కట్టుబడి ఉన్నప్పుడు, సామాజిక బాధ్యత ఒక పరిగణింపబడే వాస్తవం అవుతుంది, ప్రతి కారకo నిజమవుతుంది

ఇస్లాం మతం సమాజ-భవన నిర్మాణం పై జాగ్రత వహించును. దివ్య ఖురాన్ ఆయతులు మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త (స) హదీసులు సమాజం ను ఇలా వర్ణించారు"నమ్మిన వారి ఆప్యాయత, దయ, మరియు ఇతరుల పట్ల కరుణ, ఒకే శరీరం లాగా ఉంటాయి; ఒక అంగము కు  నొప్పి అనిపిస్తే , మొత్తం శరీరం జ్వరం మరియు అవిశ్రాంతతో నిండి ఉంటుంది.
"అందువలన, ఇస్లాం మతం లో సామాజిక బాధ్యత బౌతిక  ఆసక్తుల(meterial interest) అందు  భాగమైన పూర్తిగా బౌతిక ఆసక్తుల మీద లేదు ఇది మొత్తం సమాజం అవసరాలకు (needs of the society)మరియు దాని సభ్యులకు బౌతిక  ప్రకృతి(material in nature), ఆద్యాత్మిక, బుద్ధివికాసం పైన ఉన్నది. ఈ విధంగా వ్యక్తిగతంగా మరియు సమాజానికి ఉన్న  అన్ని ప్రాథమిక హక్కులను రక్షించాలి.
అలాగే, ఇస్లాం మతం లో సామాజిక బాధ్యత ఇతర ముస్లింలకు సంబంధించి మాత్రమే కాదు వారి నమ్మకాలు మరియు జీవితం యొక్క వివిధ మార్గాలతో సంభంధం లేకుండా సమస్త మానవాళికి  విస్తరించింది. 
అల్లాహ్ చెప్పారు:"మీకు వ్యతిరేకంగా పోరాడని లేదా మీ  మతానికి వ్యతిరేకం గా ప్రవర్తించని లేదా మీ ఇళ్ళ నుండి మిమ్ములను బయటకి వేళ్ళగోట్టని వారిపట్ల అన్యాయం గా  ప్రవర్తించమని అల్లాహ్ అనడు  నిశ్చయంగా అల్లాహ్ ఇతరులను ప్రేమించేవారిని,ఇతరులపట్ల న్యాయంగా ప్రవర్తించే వారిని  ఇష్టపడతాడు”.
ఎందుకంటే ప్రతి మానవుడు గౌరవం గా ఉండటం లో ఈ పరస్పర బాధ్యత ఉన్నది. అల్లాహ్ అంటాడు "నిజానికి మేము ఆదమ్ యొక్క వారసులను  గౌరవించి భూమి మీద మరియు సముద్రంలో వారికి  మేము అన్ని మంచి విషయాలు అందించినాము  మరియు మేము సృష్టించిన వాటిలో వారికి చాలా ప్రాధాన్యత  ఇచ్చాము."
ఇస్లాం మతం లో సామాజిక బాధ్యత పరిధి
చాలా విస్తరించినది. ఇస్లాం మతం దాని ప్రాథమిక లక్ష్యాలలో  ఒకటిగా సామాజిక బాధ్యతను  భావించింది. ఇది విశ్వాసులకు  మరియు అవిశ్వాసుల అందరకు  విస్తరించింది. అల్లాహ్ అంటారు "ఓ మానవులారా. మేము మిమ్మల్లి ఒక పురుషుడు మరియు స్త్రీ నుండి సృష్టించాము మీరు ఒకరిని ఒకరు తెలుసుకోవటానికి మిమ్మల్లి మేము జాతులు మరియు తెగలుగా చేసాము.నిశ్చయంగా, అల్లాహ్ చాలా గౌరవనీయమైన  అత్యంత న్యాయమైన వాడు”.
సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిని చూస్తుంది.  ఇది ముస్లిం(విశ్వాసి)తో మొదలవుతుంది 
మరియు అతని జీవితం యొక్క వ్యక్తిగత అంశాలు, అతని కుటుంబం, అతనును నివసించే సమాజం చివరకు భూమి మీద ఉండే అన్ని విభిన్న సమాజాలకి విస్తరించుతుంది.

తన పట్ల ముస్లిం /విశ్వాసి భాద్యత:-1
ప్రతి వ్యక్తి తనకు తానూ  బాద్యుడు.తను స్వచ్ఛoగా ఉండేదుకు  మంచి మర్యాదలు పాటించాలి, తన తప్పిదాలను  సంస్కరించు కోవాలి,  మేలుచేసి చెడును  విడిచిపెట్టాల్సిన బాధ్యత అతని మీద  ఉంది.
అల్లాహ్ అంటారు:
" ఆత్మ మరియు అతనిని సముతుల్యంలో ఉంచాలి;  అప్పుడు అతనికి తప్పు ఏమిటో,ఒప్పు ఏమిటో చూపించాము.  నిజానికి, తనను తానూ సమస్కరించిన వాడు విజేత అవుతాడు.తనకు తానూ విఫలమైనవాడు  అవినీతిపరుడు అవుతాడు”.
అలాగే, అతను తనను తానూ కాపాడుకునేందుకు తన ఆరోగ్యoను  కాపాడు కోవాలి. ఇవన్ని ఒక చట్టపరమైన పద్ధతిలోజరగాలి.
అల్లాహ్ చెప్పారు:
“అల్లాహ్, మీకు  ప్రసాదించింది గ్రహించoడి మరియు ఈ ప్రపంచంలో మీ వాటా మర్చిపోవద్దు.అల్లాహ్ మీకు  మంచి చేసినట్లు ఇతరులకు మీరు  మేలు చేయండి. అన్యాయం చేయకండి.   నిశ్చయంగా, అల్లాహ్ అన్యాయం చేసే వారిని ఇష్టపడడు”.
ఇస్లాం లో ఒక వ్యక్తి తనను తాను చంపుకోవడానికి,   నిర్వీర్యం అవడానికి  లేదా తన పైన తాను నొప్పి విదించు కోవడం నిషేదించబడింది.
అల్లాహ్  ఆత్మహత్యను  నిషేధించినాడు:
అల్లాహ్ అంటాడు “మిమ్ముల్లి మీరు చంపుకోవద్దు. నిజంగా అల్లాహ్  చాలా దయగలవాడు”.
అల్లాహ్ యొక్క ప్రవక్త (స)అంటాడు: "ఎవరైతే ఇనుప బ్లేడుతో స్వయంగా తమను తాము  చంపుకొంటారో నరకం  యొక్క అగ్ని అతని  కడుపు లో శాశ్వతoగా పడుతుంది”.
అలాగే, తన ఆరోగ్యo కు  హాని లేదా ఆలోచించగల  సామర్థ్యాన్ని కోల్పోరాదు. జీవితాన్ని కాపాడుకోవటం, కారణం(reason) మరియు ఆస్తి ఇస్లామిక్ చట్టం యొక్క అత్యంత ముఖ్యమైన లక్ష్యాలు.
అల్లాహ్ మత్తుపదార్ధాలు గురించి చెప్పినది వినండి:
"ఓ విశ్వాసులారా మీకు సారాయి,జూదం, విగ్రహారాధన, మరియు భవిష్యవాణి సాతాను నేర్పుతున్నదుష్ట క్రియలు కాబట్టి వాటిని దూరం గా ఉంచండి బహుశా మీరు   విజయవంతo కావచ్చు.  సాతాను మీ మధ్య శత్రుత్వం మరియు ద్వేషం ప్రేరేపించేందుకు సారాయి మరియు జూదం వాడ వచ్చు మరియు అల్లాహ్ యొక్క జ్ఞాపకాల నుండి ప్రార్ధనల నుండి మిమ్ములను దూరం చేయవచ్చు.  మీరు, అప్పుడు వాటికి దూరంగా ఉండారా?
తన కుటుంబం పట్ల విశ్వాసి/ముస్లిం బాద్యత-2
ఇస్లాం కుటుంబ సభ్యుల మధ్య పరస్పర బాధ్యత పై విశ్వాసం ఉంచుతుంది, అది స్థిర పునాదితో  విభజన నుండి కుటుంబం ను  రక్షిస్తుంది
ఈ బాధ్యత భర్త మరియు భార్య తో మొదలవుతుంది. వారుఅల్లాహ్ సూచించిన  పద్దతిలో బాధ్యతలు మరియు కుటుంబ జీవితం యొక్క విధులను  ఉమ్మడిగా నెరవేర్చాలి. ప్రవక్త(స) ప్రకారం “పురుషుడు తన కుటుంబానికి రక్షకుడు, స్త్రీ తన భర్తకు, తన ఇంటికి, తన ఆదీనం లో ఉన్న వాటికి బాద్యురాలు”. కుటుంబ పునాదుల కోసం ఇంటిపనులు స్త్రీ, పురుషుల మద్య విభజింపబడి ఉన్నాయి. అల్లాహ్ ప్రకారం “ ఓ విశ్వాసి! నిన్ను నీవు కాపాడు కో మరియు వ్యక్తులు రాళ్ల తో కూడిన అగ్ని నుండి నీ కుటుంభం ను కాపాడు”.
ఈ రక్షణ సరైన విద్య, స్పష్టమైననిజం మరియు స్పష్టంగా ధర్మానికి మార్గం చూపేతే తప్ప అంగికరించబడదు. కుటుంబ విద్య మరియు సాంస్కృతిక అభివృద్ధికి భర్త మరియు భార్య కలసి బాధ్యత పంచుకోవాలి. వాటిలో ఒకరు   ఈ విధులను (భార్య/భర్త లో ఒకరు)   నిర్లక్ష్యo  చేసినప్పుడు, (అతను / ఆమె ) రెoడోవాని   దృష్టికి తీసుకుని వెళ్లి ఒప్పు ఏమిటో వారికి తెలియ చేయాలి.  అల్లాహ్ చెప్పారు"నమ్మే పురుషులు మరియు మహిళలు ఒకరి ఒకరు  రక్షణ. వారు మంచిని పెంచి చెడును దూరంగా ఉంచాలి”. "
ఇస్లాం మతం వైవాహిక జీవితంలో స్త్రీ-పురుషుల  మధ్య ప్రేమ మరియు ఆప్యాయతలను  ప్రోత్సహిస్తుంది. అల్లాహ్ చెప్పారు:
"మీకు సౌకర్యం ఇవ్వడానికి మీ నుంచే మీ భాగస్వాములను సృష్టించినాడు మరియు వారి మద్య   ప్రేమ మరియు దయ ఉంచినాడు". ఇస్లాం మతం దీనిని తీసుకురావడం కోసం అనేక సూత్రాలు ఏర్పాటు చేసింది:
A. భర్త మరియు భార్య హక్కులను కాపాడటం:
అల్లాహ్ చెప్పారు:
" వారు (స్త్రీలు) వారి భర్త  పై హక్కులు కలిగి ఉన్నారు మరియు  వారి భర్తలు(భార్యల) పై హక్కులు కలిగి ఉన్నారు”.
B. ఒక మంచి వివాహ భాగస్వామి ని ఎంచుకోవడం:
 పిల్లలను సక్రమం గా పెంచడం కోసం  కుటుంబం ఒక సాధనం . ఈ సాధనం  సరైన పునాది మీద స్థాపించబడాలి. అల్లాహ్ యొక్క ప్రవక్త(స) అన్నాడు:
"ఒక మహిళను  నాలుగు కారణాలతో  వివాహం చేసుకోవాలి. ఆమె సంపద, ఆమె స్థితి, ఆమె అందం, లేదా ఆమె  మతం కోసం. ధార్మిక సంపద ఉన్న స్త్రీ ని వివాహమాడoడి  లేదా మీ చేతులు దుమ్ము తో కప్పబడి ఉంటాయి”.
భర్త కోసం విశ్వాసురాలు అయిన స్త్రీకి ప్రవక్త (స) కొన్ని సూచనలు ఇస్తాడు. “మంచి నడత,మంచి మతం కల మీ కుటుంభం లోని వ్యక్తి అడిగినప్పుడు అతనిని వివాహమాడండి. అల చేయక పోతే ధరణి మీద చాల అక్రమం మరియు నైతిక పతనం ఎక్కువవుతుంది”.
అల్లాహ్ యొక్క ప్రవక్త(స)అన్నారు:
“విగ్రహారాధకులు విశ్వాసులు గా మారనంతవరకు వారిని వివాహమాడకండి. విశ్వాసి అయిన ఒక బానిస స్త్రీ మిమ్మల్లి మెప్పించిన విగ్రహారాధకురాలు కన్నా మేలు. మీ స్త్రీలను విగ్రహారాధకులకు ఇవ్వకండి వారు విశ్వాసులుగా మారనంత వరకు. విశ్వాసి అయిన ఒక బానిస  మీరు ఇష్టపడిన విగ్రహారాధకుని కన్నా మేలు. వారు అగ్నిని పిలుస్తారు, అల్లాహ్ స్వర్గంను ప్రసాదిస్తాడు మరియు క్షమిస్తాడు. అతను మానవజాతి కి తన సూచికలను స్పష్టం చేస్తాడు మీరు జాగ్రత్త పడతారని”.
C. మంచి ప్రవర్తన:
 ఇస్లాం మతం భార్యాభర్తల మధ్య మంచి ప్రవర్తన ప్రోత్సహిస్తుంది. ఇది దివ్య  ఖుర్ఆన్ మరియు సున్నత్ యొక్క గ్రంధాలలో లిఖించబడింది. మంచిగా వారితో జీవించండి. మంచిగా వారిని  నిలబెట్టుకొనండి  లేదా మంచిగా వారిని  విడుదల చేయండి.
అల్లాహ్ యొక్క ప్రవక్త(స) అన్నారు.
"మీలో చాలా ఖచ్చితమైన విశ్వాసం కలిగిన వారు అత్యుత్తమ ప్రవర్తన కలిగిన వారు. మీలో తమ భార్యలను అత్యుత్తమoగా చూసుకొనే వారు అత్యుత్తమ  పురుషులు”.
అల్లాహ్ యొక్క ప్రవక్త (స) తన భార్యల పట్ల దయ మరియు కరుణ, మృదుత్వం ప్రదర్శించే వారు.
ఆయన వారితో మృదు సంభాషణ చేస్తూ  గృహకార్యాలలో  సహాయంచేసేవారు. వారు  చాలా మన్నించే మరియు ఓర్పుగల వారు. అల్లాహ్ యొక్క ప్రవక్త (స) అన్నారు.
"మీలో తన కుటుంబం పట్ల ఉత్తమం గా ఉండే వారు అందరిలోకి ఉత్తములు మరియు నేను నా  కుటుంబం పట్ల ఉత్తమoగా ప్రవర్తిస్తాను”.
D.  కుటుంబం కోసం సంపాదించడం: సంపద జీవితం యొక్క బౌతిక అవసరాలు తీర్చడం కొరకు అవసరం. భర్త తన భార్య బాధ్యత గలవాడు అగుట వలన ఆమె కోసం సంపాదించడo అతని  బాధ్యత.
అల్లాహ్ చెప్పారు:
"సంపన్న వ్యక్తి తన ఇష్ట ప్రకారం ఖర్చు చేయనియండి మరియు సంపద వనరులు పరిమితం చేయబడ్డ వ్యక్తి అల్లాహ్ అతనికి ఇచ్చినoత మేరకు  ఖర్చు పెట్టాలి. అల్లాహ్ తాను ఇచ్చిన దాని కంటే ఎక్కువ ఒక వ్యక్తి మీద భారంవేయడు. అల్లాహ్ ఇబ్బందులు తర్వాత వాటిని తొలగించి సులభం చేస్తాడు”.
ఇస్లాం మతం భర్త మీద విధిగా భార్య నిర్వహణ పెట్టింది. అతను ఆమెకు  విడాకులు ఇచ్చినా  అతను స్త్రీ వేచివుండాల్సిన పూర్తి కాలం(ఇద్దత్) వరకు  ఆమె నిర్వహణ మరియు గృహ వసతి అందించాలి - ఆమె వివాహం చేసుకునేందుకు అనుమతి ఇచ్చే ముందు - ఆమె గర్భవతి లేదా అనేది నిర్ధారించేందుకు. విడాకులు తీసుకున్న మహిళ అతని నుండి పిల్లలను కలిగి  ఉంటే  అతను ఆ పిల్లల పోషణ అందించాలి.
అల్లాహ్ చెప్పారు:
"మీరు నివసించు ఇంట్లో వారిని ఉంచండి మరియు వారి జీవితాలను కష్టం చేయ వద్దు.  ఆమె  గర్భవతి గా ఉంటే బిడ్డ పుట్టె వరకు ఖర్చు ఇవ్వండి. వారు మీకు పుట్టిన పిల్లల కోసం  ఉంటే అప్పుడు, ఆమెకు  తగిన చెల్లింపు ఇవ్వండి.  మరియు మీరు ఇరువురు ఇతరుల  సలహా అంగీకరించడానికి వీలు కల్పించండి. మీరు ఒకరిని ఒకరు ఇబ్బందులు చేస్తే, అప్పుడు కొoదరు  ఇతర మహిళలు  ఆ పిల్లవాడికి  దాదిగా ఉండవచ్చు”.
అల్లాహ్ అన్నారు: తల్లి  తన  పిల్లలకు  రెండు సంవత్సరాల వరకు పాలు ఇవ్వవచ్చు.తండ్రి పిల్లవాని తల్లికి  ఆహార ఖర్చులు మరియు వస్త్రాలు తగినంతగా ఇవ్వవలసి ఉంటుంది.వ్వ విధంగా  పిల్లల సరియిన పెంపకం స్పష్ట పరచబడినది.
E. సంరక్షణ మరియు పిల్లలు పెంచడం:
 ఇస్లాం మతం చిన్న పిల్లల హక్కుల  కోసం ఆలోచించినది  మరియు దీనిని తల్లిదండ్రుల అత్యంత ముఖ్యమైన విధి అని అజ్ఞాపించినది. ఇస్లాం తల్లిదండ్రుల సహజ కోరికల మీద  ఆధారపడలేదు.   పిల్లలు సరైన పెంపకo కు  హామీ మరియు పిల్లల హక్కులకు రక్షణకు   నిర్దిష్ట నిబంధనలను బలపరచినది. పుట్టిన సమయం నుండి, పెంపక కాలం పూర్తి అయ్యే  వరకు  పవిత్ర గ్రంథాలు చర్చించినవి.
 అల్లాహ్ చెప్పారు:"ఓ విశ్వాసులారా! మీరు మరియు అగ్ని  నుండి మీ కుటుంబాలను  రక్షించండి. " అల్లాహ్ యొక్క ప్రవక్త (స) అన్నాడు:"వారు ఏడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ప్రార్థన కు పంపండి, మీ పిల్లలు పది సంవత్సరాలు గా మారినప్పుడు అలా చేయడం లో  విఫలమైతే, వారిని శిక్షంచండి. వారు అలా చేస్తే  వారి నిద్ర పడకలు వేరు చేయండి”.

సమాజం పట్ల ముస్లిం/విశ్వాసి బాద్యత-3
ఇస్లాం మతం అందు వ్యక్తి మరియు సమాజం ఒకదానికి ఒకరు  బాధ్యత వహిస్తారు. ప్రతి ఒక్కరు ఇతరుల  కోసం తమ విధులను నెరవేర్చాలి. వ్యక్తి  ప్రయోజనాలను కాపాడటం లోనే సమాజ ప్రయోజనం ఉంది, సమాజ ప్రయోజనం కాపాడటం లోనే వ్యక్తి ప్రయోజనం ఉంది.
ముస్లిం  సమాజంలో వ్యక్తి సమాజ సాధారణ పరిస్థితిని పరిరక్షించడంలో సహాయం పడాలి మరియు సమాజ ప్రయోజనాలకు వ్యతిరేకంగా లేదా సమాజంకు  హాని చేసే  ప్రవర్తన ను విడిచిపెట్టాల్సిన బాధ్యత వ్యక్తి పై ఉంది.
అల్లాహ్ చెప్పారు:
"నమ్మిన, పురుషులు మరియు మహిళలు, ఒకరి కి   మరొకరు రక్షణ గా ఉన్నారు ; వారు ఒప్పు చేయాలి మరియు తప్పుచేయరాదు మరియు ప్రార్ధన, ఉపవాసం చేయవలయును  మరియు అల్లాహ్ మరియు అతని ప్రవక్త(స) కు విధేయులుగా ఉండాలి. అల్లాహ్ కు  వారి పై  దయ ఉంటుంది. ఖచ్చితంగా అల్లాహ్ ఉన్నతుడు మరియు  వివేకవంతుడు. "
వ్యక్తి, సమాజంలో చురుకైన మరియు సమర్థవంతమైన పాత్రనునిర్వహించాలి.. అల్లాహ్ చెప్పారు:"ధర్మము  మరియు దైవభక్తి లో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు, కానీ పాపం మరియు  అపరాధములో  ఒకరికొకరు సహాయం లేదు."
అల్లాహ్ యొక్క ప్రవక్త(స) అన్నాడు:
"నమ్మిన పురుషులు మరియు మహిళలు,    భవనం లోని ప్రతి భాగానికి మద్దతు దారులు
అల్లాహ్ యొక్క ప్రవక్త(స) అన్నారు: సమాజ సభ్యుల  మద్య ఐక్యత మరియు పంచుకొనే  పరస్పర బాధ్యతా  భావాలు ఈ విధముగా ఉంటాయి:
"నమ్మిన వారి ఆప్యాయత, దయ, మరియు ఇతరుల పట్ల కరుణ, ఒకే శరీరం లాగా ఉంటాయి; ఒక అంగము కు  నొప్పి అనిపిస్తే , మొత్తం శరీరం జ్వరం మరియు అవిశ్రాంతతతో నిండి ఉంటుంది "
మరొక కోణం నుండి, వ్యక్తి కి  హక్కులు మరియు స్వేచ్ఛలు ఉన్నాయి. సమాజం  వ్యక్తి యొక్క పవిత్రత రక్షించడానికి మరియు వ్యక్తిగత హక్కులు మరియు స్వేచ్ఛ ను కాపాడాటానికి  బాధ్యత వహిస్తుంది.
అల్లాహ్ చెప్పారు:
"ఓ విశ్వాసులారా! మీలో  ఒక గుంపు మరో గుంపు కు చులకన కాదు; రోoడవది మొదటి దాని కన్నా ఉత్తమం కావచ్చు. కొoదరు  మహిళలు ఇతర మహిళల కన్నా తక్కువ కాదు;  రోoడవారు మొదటి వారి  కన్నా ఉత్తమం కావచ్చు ;  ఒకరినొకరు నిందించుట  లేదా మారుపేర్లు పెట్టి మరొకరిని  అవమానించడం చేయరాదు; వారు నమ్మిన  తర్వాత వారికి  దోషమును అంటగట్టడం  ఎంత చెడ్డ.  పశ్చాత్తాపాన్ని ప్రదర్సించని వారు  నిజానికి   ద్రోహులు. ఓ విశ్వాసులారా! అనుమానం నివారించoడి; నిజానికి కొన్ని అనుమానాలు పాపాలు. మరియు గూఢచర్యం లేదా ఒకరి  పై మరొకరు  చాడిలు చెప్పు రాదు. "
అల్లాహ్ యొక్క ప్రవక్త(స) క్రింది ఉదాహరణ చెప్పడం ద్వారా పరస్పర బాధ్యతలను గురించి  స్పష్టమైన చిత్రాన్నిఇచ్చారు:
" ఒక ఉపమానం  ఒక  ప్రజల సమూహము ఓడెక్కు పరిస్థితి ని తెల్పుతుంది. వారిలో కొందరు ఓడ అప్పర్ డెక్ మీద కొందరు క్రింద డెక్ మీద ఉన్నారు. క్రింద ఉన్నవారికి దప్పిక అవుతే వారు  మేము ఓడ క్రింద   భాగం లో ఒక రంధ్రం వేస్తే  పై  డెక్ మీద వారికి   ఇబ్బందుల్లో లేకుండా మాకు  నీరు లభిస్తుందా' అని అన్నారు. అప్పర్ డెక్ మీద వారు వారిని  ఆ విధంగా చేయనిస్తే ఓడ నశించుతుంది మరియు వారు వారిని  నిరోధించడo చేస్తే  ఓడ రక్షించ   బడుతుంది”.

అన్ని మానవ సమాజాల మధ్య పరస్పర బాధ్యత సంబంధించి నంతవరకు, అల్లాహ్ చెప్పారు:
"ఓ మానవులారా. మేము మిమ్మల్లి ఒక పురుషుడు మరియు స్త్రీ నుండి సృష్టించాము మీరు ఒకరిని ఒకరు తెలుసుకోవటానికి మిమ్మల్లి మేము జాతులు మరియు తెగలుగా చేసాము.నిశ్చయంగా, అల్లాహ్ చాలా గౌరవనీయమైన  అత్యంత న్యాయమైన వాడు”.
ఈ ఆయతు అన్ని జాతుల మద్య  సార్వత్రిక సంక్షేమo  తెలుపుతుంది. ఒక ప్రపంచ స్థాయి సమాఖ్య ను  ఏర్పాటు చేయడం ద్వారా  ప్రపంచ స్థాయి ప్రయోజనం మరియు ప్రపంచ స్థాయి హాని ని నిరోధించడం ద్వారా ప్రయోజనకరమైన మార్పిడి వృద్ధి, దేశాల మధ్య శాస్త్రీయ, సాంస్కృతిక మరియు ఆర్థిక పరస్పర బాధ్యత సూత్రాన్నితెల్పుతుంది. అలాగే అదే సమయం ప్రతి సమాజం దాని ప్రత్యేక లక్షణాలను మరియు గుర్తింపును నిలుపుకోoటుంది. ఈ అసాధారణ లక్షణాలను నాశనం లేదా రద్దు చేసే ఎలాంటి ముప్పు ఉండదు.

ఎందుకంటే వారి మూలాలకు  వారి అంతిమ గమ్యస్థానo ఒకటి అనే భావన వారిలో ఉంటుంది. .
ఈ బాధ్యత ప్రస్తుత తరానికి మాత్రమే  పరిమితం కాదు. భవిష్యత్ తరాలకు కూడా వర్తిన్తుంది.   ఈ విధంగా  జరిగితే  మన ప్రస్తుత సమస్యలను  భవిష్యత్తు తరాలు  ఎదుర్కొనే అవకాసం ఖచ్చితంగా లేదు. ప్రస్తుత తరం భవిష్యత్తు పరిణామాలు పరిగణలోకి తీసుకోకుండా తన సొంత ప్రయోజనాలను ప్రాధాన్యత ఇవ్వడం  ప్రస్తుత ప్రపంచ సమస్యలన్నింటికి కారణం అవుతుంది.  ఈ సమస్యలు అనేకం వాటిలో సహజ వనరులు  తగ్గడం మరియు  తీవ్రమైన   వాతావరణం సమస్య మొదలగునవి ఉన్నాయి.
ఒక తరం భవిష్యత్ తరాలను  పరిగణనలోకి  తీసుకోవడం దాని బాధ్యత అని మనకు ఖలీఫా `ఉమర్ బిన్ అల్-ఖత్తాబ్ పరిపాలన  ఒక ఉదాహరణ గా కన్పిస్తుంది. ముస్లింలు ఇరాక్ ఆక్రమించినప్పుడు  సైనికులు యుద్ధ బహుమతి గా  వారి  మధ్య సారవంతమైన వ్యవసాయ భూమిని విభజించాలని  కోరారు. ఉమర్ ఈ అభిప్రాయం తిరస్కరించినాడు అతను " నేను ప్రస్తుతం మరియు భవిష్యత్తులో ప్రజలకు ఒక మంచి  పరిస్థితి కావలి అన్నాడు; అతను భూమి  ఉత్పత్తుల మీద  భూమి పన్ను విధించాలి, ఎవరైతే పన్ను ను  రాష్ట్ర ఖజానాకు చేల్లిస్తారో భూమి  వారి  చేతిలో ఉంటుందని అన్నాడు.
ఖురాన్ యొక్క ఈ క్రింది ఆయతు ముస్లింల ఒక తరం ఇతర తరాలకు మద్య ఉన్న  సంబంధాన్ని నిర్వచిస్తుంది:
వారి తరువాత వచ్చిన వారికి చెప్పు: "ప్రభువు  మమ్ములను, మా తరువాత వచ్చిన విశ్వాసులను క్షమించు మరియు మా హృదయాలలో విశ్వాసుల పట్ల విద్వేషాన్నిరగిలిoచకు.   అల్లాహ్ నిజంగా చాలా దయగల అత్యంత కృపాశీలి. "
భవిష్యత్ తరాల వారు వర్తమానo  పట్ల  ఒక మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండాలి, అది  వారి   పట్ల గౌరవం పెరుచుతుంది;  అల్లాహ్ నుండి వారిని క్షమాపణ కొరకు, మరియు అది ప్రస్తుత తరం వారి హృదయములలో  వారిపట్ల  మంచి భావాలు పెంపోదిస్తుంది. అదే విధంగా  ప్రస్తుత తరo వారు రాబోయే తరాల తో కూడా మంచి సంబంధం కలిగి ఉండాలి మరియు వారి చర్యల ప్రభావo  మంచిగా ఉండాలి. వారు తమ ఆధీనంలో ఉన్న సహజ వనరులు తగ్గిoచి , జీవితం యొక్క అవసరాలను  దుర్వినియోగం చేయరాదు.వారు భూమిని సారవంతం చేయాలి  తద్వారా భవిష్యత్ తరాల వారు  సంపన్న పునాది పై  ఒక ధనిక మరియు గౌరవనీయ  వారసత్వం నిర్మించాలి.

ఈ విధంగా, ప్రస్తుత తరo వచ్చే వారికి  ఆదర్శవంతమైన పరిపూర్ణ బాద్యత  అందిస్తుంది, మరియు తరువాతి తరం, క్రమంగా వారి హృదయపూర్వకంగా వారి నాలుకల ద్వారా   వారిని  క్షమించమని అడగటం  కనిపిస్తుంది. ఈ విధంగా ప్రతి వారు ఇతరుల  వైపు వారి పరస్పర బాధ్యత పూర్తి చేస్తారు ఈ విధంగా  చివరి తరం నుండి మొదటి తరం వరకు  ఇస్లాం మతం లో సామాజిక బాధ్యత యొక్క వ్యక్తీకరణ నిజమవుతుంది.

సామాజిక బాధ్యత సాధారణ స్వరూపం  ఏమిటొ ఇప్పటికే స్పష్టంగా వెల్లడయి ఉండాలి. మేము  ఈ బాధ్యత నిర్దిష్ట ఆవిర్భావములను దృష్టికి తెచ్చినప్పుడు ,  ఇస్లాం మతం నిర్ణీత వ్యక్తులు  ఎవరు ఎక్కువ ఇతరులు కంటే బాధ మరియు హాని పొందారో  మరియు వారికి సామాజిక బాధ్యతను  మరింత తరచుగా బహిర్గతమయ్యే అవసరాలకు కనుగొనేందుకు ఎక్కువ శ్రద్ధ వహిస్తారు .

No comments:

Post a Comment