.
జూలై 4, 1776 న ఫిలడెల్ఫియా సమావేశంలో
అమెరికా లోని 13 కాలనీలు సమావేశమై థామస్ జఫర్సన్ చే రచించబడిన
అమెరికా స్వాతంత్య ప్రకటనను
(Declaration
of Independence) ఆమోదించి తమ్ము తాము బ్రిటిష్ వలస పాలనా
నుండి విముక్తి కాబడి నూతన స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించు కొని కొత్త
రాజ్యం అమెరికా సంయుక్త రాష్ట్రం గా రూపొందినవి. ఆ రోజును అమెరికా స్వాతంత్య దినం
గా పరిగణిస్తారు.
అమెరికా రాజ్యాoగం
సెప్టెంబర్ 17,1787 లో రూపొందించబడి, జూన్ 21, 1778 ఆమోదం పొంది 1779 నుండి
అమలులోని వచ్చింది, దీనిని రచిoచినది జేమ్స్ మాడిసన్ అయినప్పటికీ ఆనాటి ప్రముఖ రాజ
నీతి వేత్తలు థామస్ జఫర్సన్, థామస్ పెయిన్, జాన్ ఆడమ్స్, జార్జ్ వాషింగ్టన్,
అలెక్జాందర్ హామిల్టన్, జాన్ లే వంటి వారి
తోడ్పాటు కూడా కలదు.
యునైటెడ్ స్టేట్స్ యొక్క చరిత్రలో మొదటి సారి డిసెంబర్ 9, 1805 న, అమెరికన్
అద్యక్షుడు థామస్ జఫర్సన్ వైట్ హౌస్ లో ట్యునీషియా రాయబారి గౌరవార్ధం ఇఫ్తార్
విందు నిర్వహించినాడు. దీనిని జఫర్సన్ మధ్యధరా సముద్రంలో అమెరికా ప్రయోజనాలకు భద్రతా
భరోసా కల్పించడం మరియు ఉత్తర ఆఫ్రికన్ దేశాలతో మంచి దౌత్య సంబంధాలు నడపటం కోసం ఏర్పాటు చేసాడు.
థామస్ జఫెర్సన్ కు ఇస్లాం తో పరిచయం, విలియం & మేరీ కళాశాలలో
విద్యార్థి సమయం నుండి ఏర్పడింది. దివ్య కురాన్ మరియు అరబిక్ బాషా తో అతనికి ఉన్న పరిచయం
అతను చదువు కొన్న కాలేజి లో ఒక ఓరియంటల్
భాషా శాఖ ఏర్పాటుకు దారి తీసింది. ఒక
పండితుడు మరియు దౌత్యవేత్తగా, జెఫెర్సన్ భావాలపై దివ్య ఖురాన్ మరియు ఇస్లాంప్రభావం కలదు.
ఇస్లాం మతం పట్ల అమెరికా ఆసక్తి
ఇస్లాం పట్ల అమెరికా నాయకులకు పరిచయం జఫెర్సన్ తో మొదలు
కాలేదు, అంతకు ముందే ప్యూరిటన్స్(puritans) తో
ప్రారంభమైనది చెప్పవచ్చు. ప్రస్సిద్ద ప్రసoగికుడు కాటన్ మతేర్, బెంజమిన్
ఫ్రాంక్లిన్, జాన్ ఆడమ్స్, దివ్య ఖురాన్
ను అబ్యసిoచినారు. ఇస్లాం యొక్క
ప్రభావం కొత్తగా స్థాపించిన అమెరికన్ రిపబ్లిక్ మీద ఉంది.
విలియం మరియు మేరీ కళాశాల లో తన లీగల్ స్టడీస్
పూర్తి చేసిన పిదప ఒక బుక్ సెల్లర్ వద్ద జఫెర్సన్ దివ్య ఖురాన్ యొక్క సేల్ (Sale) ఆంగ్ల అనువాద కాపీని కొనుగోలు చేసినాడు. సేల్(Sale) ఆ అనువాదానికి
ముందు మాట కూడా వ్రాసినాడు. సేల్ ప్రకారం ఇస్లామిక్ న్యాయానికి దివ్య ఖురాన్
మూలము.
న్యాయ విద్యార్ధి గా జఫెర్సన్ ను ప్రభావితం
చేసిన మరొక అంశము 17 వ శతాబ్దపు జర్మన్ న్యాయ వేత్త పుఫెన్ దొర్ఫ్ సమకాలిన న్యాయ
విధానాలపై వ్రాసిన ‘Of the Law of Nature and Nations’ గ్రంధము. ఆ
గ్రంధంలోజర్మన్ న్యాయ వేత్త పుఫెన్ దొర్ఫ్ దివ్య ఖురాన్ ను కొనియాడినాడు.దివ్య
ఖురాన్ లో ప్రస్థావించిన మానవ సద్గుణ ప్రవర్తన,వేషధారణ,రాజ్యాల మద్య శాంతి స్థాపన మున్నగు వాటిని అతను కొనియాడాడు. ఇస్లాం
చెప్పిన నైతికత, న్యాయ ప్రభావం యురోపియన్ పండితులను ఆకర్షించినవి. వీటన్నింటిని
చదివిన జఫెర్సన్ ఇస్లాం చే బాగా ప్రబావితుడు అయ్యాడు.
చట్టం,స్వాతంత్ర్య ఆలోచన మరియు దివ్య ఖురాన్
దివ్య ఖురాన్ ను జఫర్సన్ రెండు విధాలుగా అర్ధం
చేసుకొన్నాడు. అందులో మొదటిది దివ్య ఖురాన్ ఒక న్యాయ గ్రంధం. దివ్య ఖురాన్, హదీసులు,
సున్నహ్ పై షరియత్ లేదా ఇస్లామిక్ న్యాయం
ఆధారపడినది. దివ్య ఖురాన్ యొక్క ఈ న్యాయపరమైన అవగాహన అతనికి తరువాత కాలం లో ఉపయోగపడినది. రెండోవది స్వతంత్ర ఆలోచన అవలంబన.
“అల్లాహ్ ముగ్గురు లో ఒకడు అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడిన వారు. వాస్తవము ఏమిటంటే దేవుడు ఒక్కడే. మరొక దేవుడు లేదు.”-5:73 అని నమ్ముతున్న ఇస్లామిక్ విశ్వాసం క్రైస్తవం కన్నా గొప్పది అని జఫెర్సన్ భావించినాడు. అమెరికా రాజ్య నిర్మాణం లోను, మద్య తూర్పు ఆసియా దేశాలతో సంభoదల దిశలో జఫెర్సన్ కు దివ్య ఖురాన్ అధ్యనం తోడ్పడినది.
ముస్లింలకు–యూదులకు మద్య సంభందాలను వివరించే ప్రవక్త(స) చే రూపొందించ
బడిన ఆదర్శ మదీనా రాజ్యంగo ను జఫర్సన్
చదివినాడో లేదో తెలియదు. కాని శాసన చట్టంగా
అమెరికా స్వతంత్ర ప్రకటనా పత్రంకు,
అమెరిక రాజ్యాoగం కు దివ్య ఖురాన్ కు మద్య పోలికలు కలవు. ఆదర్శ మదీనా రాజ్యా౦గం లోని కొన్ని భాగాలు –
ఎకికరణ మరియు జాతి బేదం లేకుండా ప్రభుత్వం చే ప్రజలందరికి రక్షణ కల్పించడం, సమాన
హక్కులు, అన్ని మత వర్గాలకు రక్షణ కల్పించడం, అమెరికా స్వతంత్ర ప్రకటన లోను,
అమెరికా రాజ్యాoగం లోను కనిపిస్తాయి. అమెరికా చరిత్రలో ప్రముఖమైన ఈ పత్రాలు (అమెరికా
స్వతంత్ర ప్రకటన, అమెరికా రాజ్యాగం) రచిoఛినప్పుడు థామస్ జఫర్సన్ మదీనా ఆదర్శ
రాజ్యాoగం చే ప్రభావితుడు అయినట్లు కన్పిస్తుంది.
అమెరికా స్వాతంత్ర్య
ప్రకటన, అమెరికా రాజ్యాంగంమరియు దివ్య ఖురాన్
స్వాతంత్ర్య
ప్రకటన మరియు యునైటెడ్ స్టేట్స్ రాజ్యాంగం కొన్ని అంశాలపై ఇలాంటి భాగాలను కలిగి
ఉన్నాయి. మదీనా రాజ్యాంగం ప్రకారం . " యూదులు తాము తమ సొంత మతం అనుసరించవచ్చు
మరియు ముస్లింలు వారి సొంత మతం అనుసరించవచ్చు. యూదుల సన్నిహితులు ,వారిని
అనుసరించేవారు మరియు ముస్లింలు వారి
ఉమ్మడి శత్రువుల పట్ల సంఘీభావం గా ఉండాలి. చివరగా, రాజ్యాంగం ప్రకారం “రక్షణలో ఉన్న కోత్త వారు, వారి
రక్షకులు సమాన స్థాయి లో ఉంటారు, అతని తెగ సమ్మతితో తప్ప ఎవరికి రక్షణ కల్పించబడదు,
ఆమె కుటుంబం అనుమతి లేకుండా. ఏ మహిళ కు రక్షణకల్పించబడదు.” థామస్ జఫర్సన్ మదీనా
రాజ్యాంగం ప్రబావం తో అమెరికా స్వాతంత్ర ప్రకటనలో జీవిత, స్వేచ్ఛ, మరియు ఆనందం పోoదే హక్కులను చేర్చినాడు.
మదీనా రాజ్యాంగం
మరియు ఖురాన్ యొక్క ప్రభావం కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగంపై గలదు. . రాజ్యాంగం మొదటి సవరణ ద్వారా
మత స్వేచ్ఛకు హామీ లబించినది. దానిని అసలు
"మత స్వేచ్ఛ బిల్" గా పిలిచేవారు. తన స్వీయచరిత్రలో, జఫర్సన్ బిల్లు లో
" యూదుడు, జెంటైల్, , క్రైస్తవ మరియు మహమ్మదీయ, హిందూ,నాస్తికులు
అందరికి ఒకే చట్టం క్రింద సమాన రక్షణ”
ఉండాలి. అన్నాడు. జఫర్సన్ కు మదీనా రాజ్యాంగం తోపరిచయo ఉన్నది లేనిది ఏమి తెలియ నప్పటికీ, ముఖ్యంగా దివ్య ఖురాన్
సురా 2:62 అంశాల ప్రభావం అతనిపై చూడగలము : "అరేబియా ప్రవక్తను (స) నిశ్చయంగా
నమ్మేవారు కాని, యూదులు కాని, క్రైస్తవులుకాని, సాబియిలు కాని – ఎవరైనా సరే-అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసించి
మంచి పనులు చేసిన వారికి నిస్సందేహంగా వారి ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం ఉంది. వారికి
ఏవిధమైన భయంకాని, విచారం కాని, కలేగే అవకాసం లేదు”. ఈ ఆయాత్ యొక్క వ్యాఖ్యానం
సాంప్రదాయకంగా అబ్రహమిక్ మత సభ్యులను ఆధ్యాత్మిక మరియు సామాజిక అణచివేత నుండి
రక్షించడానికి ఉద్దేశిoపబడినది. బహుశా జఫర్సన్ ఈ సురా నుండి ప్రేరణపొంది ఉండవచ్చు?
1788 లో అన్ని అమెరికన్ రాష్ట్రాలు రాజ్యాంగంపై సంతకం చేయడంతో, క్రైస్తవేతర గుర్తింపు సమస్య చర్చలో భాగంగా ఉంది. ముఖ్యంగా, ఆర్టికల్ VI, సెక్షన్ 3 తీసుకుని చర్చ జరిగింది "అమెరికా లో ఎ పదవినైనా అధిస్థించడానికి మతం అడ్డు రాదు. ఇదే విధమైన నిబంధన మదీనా రాజ్యాంగం లో కనిపిస్తుంది ’ రాజ్యానికి విధేయత చూపటానికి మతపరమైన అనుబంధాలు అడ్డురావు. విధేయత చూపే యే తెగ కైనా రాజ్య రక్షణ హామీ లబిస్తుంది’ అని.
బార్బరీ యుద్దాలు:
జఫర్సన్
ఫ్రాన్స్తో యునైటెడ్ స్టేట్స్ అంబాసడర్ ఉన్న సమయంలో 1786 లో,మధ్యధరా సముద్రం
లో అమెరికన్ నౌకలు లో సముద్రపు దొంగల దోపిడీ కి గురిఅవినాయి.సముద్రపు
దొంగల దోపిడీ సమస్య కొత్తగా స్థాపించబడిన
యునైటెడ్ స్టేట్స్ కు చాలా తీవ్రమైన ఆర్థిక ముప్పు గా మారింది. అమెరికన్ నౌకలు మఘ్రేబ్ తీరం చుట్టూ ప్రయాణం చేయడానికి
ఒక అనిశ్చిత ఏర్పడినది. అల్జీరియా, లిబియా మరియు ట్యునీషియా
ప్రాంతంలో అమెరికన్ వ్యాపార నౌకలు దాడికి గురి అయినాయి.
జెఫెర్సన్, తన సమకాలీనుడు , జాన్ ఆడమ్స్ తో కలసి అమెరికన్ నౌకలు ఎందుకు దోపిడీకి గురిఅవుతున్నాయో తెలుసుకోవటానికి మరియు నౌక దోపిడీ సమస్యను అర్ధం చేసుకోవటానికి , అమెరికా లోని ట్రిపోలి దౌత్యాధికారి సిద్ది హాజీ అబ్దుల్ రహ్మాన్ అడ్జ ను కలిశారు.
దౌత్యాధికారి
ప్రకారం దివ్య ఖురాన్ లో ఈ విధంగా వ్రాయబడినది: “ప్రవక్త(స) ను అంగీకరించని వారు
పాపాత్ములు మరియు విశ్వాసి యొక్క కర్తవం వారిని దోపిడీ చేసి బానిసలు గా చేసుకోవాలి మరియు ఈ యుద్ధతంత్రం లో వధించబడిన
ప్రతి ముస్లింకి స్వర్గం లబిస్తుంది”.
1796 జరిగిన ట్రిపోలీ ఒడంబడిక మధ్యధరాసముద్రం లో అమెరికన్ నౌకలకు రక్షణ కల్పించినది. ఈ ఒడంబడిక జెఫర్సన్ చే రూపొందించబడింది అందులో అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వం, క్రిస్టియన్ మతం చే స్థాపించబడలేదు అది ఎ కోణంలోనూ ముస్లిం చట్టలు, మతం లేదా ముస్లిం ప్రశాoతతకు వ్యతిరేకం కాదు అని స్పష్టం చేయడం జరిగింది.
ఈ ఒడoబడిక అనoతరం జరిగిన బార్బరీ యుద్దాలో అమెరికా విదేశి
తీరాలలో విజయాన్ని సాదించినది. సంధి జరిగినది అందులో భాగం గా ప్రెసిడెంట్ థామస్ జఫెర్సన్
టునీషియా రాయబారికి వైట్ హౌస్ లో విందు ఇఫ్తార్ విందు ఇచ్చినాడు.ఈ పరిణామాలు
జెఫెర్సన్ కు ఉన్న ఇస్లామిక్ మరియు ఖురానిక్ జ్ఞానానికి అద్దం పడుతున్నవి.
అద్యక్షుడు థామస్
జఫర్సన్ మత విషయాల మీద ఏనాడు మాట్లాడలేదు
కాని ఇస్లాం పట్ల సానుభూతి ప్రదర్శించినాడు. దివ్య కొరాన్ లోని నైతిక, మానవీయ
విషయాలు , మదీనా రాజ్యాంగం గురించి అధ్యయనం చేసినాడు. అమెరికా తోలి తరం వారికి
దివ్య ఖురాన్ తో పరిచయం ఉంది మరియు జఫర్సన్,జాన్ ఆడమ్ యొక్క ఇస్లామిక్ జ్ఞానము నూతన అమెరికా రాజ్య నిర్మాణం
లోను, నూతన సార్వబౌమ రాజ్య వికాసంలోను ప్రముఖ పాత్ర వహించినవి అనిచెప్పవచ్చును.
సంగ్రహం :
అమెరికా కు
ముస్లింల మద్య ఉన్న సంబంధం:
1.
కొలoబస్ కన్నా ముందే అమెరికాను కనుగొన్నవారు ముస్లింలు :14వ
శతాబ్ధం లో ఆఫ్రికా లోని సెనెగల్-జాంబియా
ప్రాంతానికి చెంది,స్పెయిన్ నుండి వెలివేయబడిన
“మూర్లు” కరేబియన్, మెక్సికో జలసంధి ప్రాంతాలలో స్థిర నివాసం
ఏర్పర్చుకొన్నారు. 16వ శతాబ్ధం లో ఇస్తఫాన్ అనే ముస్లిం స్పానిష్ గైడ్ సహాయం తో
స్పెయిన్ వారు నూతనప్రపంచం ముఖ్యం గా ఆరిజోనా,న్యూ మెక్సికో
ప్రాంతాలను జయించినారు.
2.
అమెరికా స్వతంత్ర యుద్దంలో
ముస్లింలు పాల్గొన్నారు: అమెరికా విప్లవ
పోరాటం లో పాల్గొని పేరు సంపాదించిన ముస్లిం మతస్తులలో సలీం పూర్ (Salem Poor,)యూసఫ్
బెన్ అలీ, బంపేట్
ముహమద్,ఫ్రాన్సిస్ సబా,జోసఫ్ సబా
చెప్పుకోదగిన వారు.
3.
అమెరికా ను గుర్తించిన మొదటి
దేశం మొరాకో: 1777 లో అమెరికా ను స్వతంత్ర దేశం
గా మొదట మొరాకో గుర్తించినది.
4.
మొదటినుండి అమెరికా లో ముస్లిం లకు మతస్వాతంత్రం
ప్రసాదించబడినది.
5.
1805 లోనే అమెరికా ప్రెసిడెంట్ థామస్ జఫర్ సన్
అద్యక్ష భవనం వైట్ హౌస్ లో ఇఫ్తార్ విందు ఇచ్చినారు.
6.
ఇస్లాం స్వీకరించిన
తొలి ప్రముఖ ఆంగ్లో-అమెరికన్ లలో అలెక్సాండర్ రస్సెల్ వెబ్ ముఖ్యుడు ఇతడు 1893
లో జరిగిన ప్రపంచమతాల పార్లమెంట్ లో ఇస్లాం కు ప్రాతినిద్యం వహించినాడు.
7. అమెరికా
స్వాతంత్ర్య ప్రకటన మరియు అమెరికా రాజ్యాంగం పై దివ్య ఖురాన్ ప్రభావం కలదు.
8.
ఆదర్శ మదీనా రాజ్యా౦గం లోని కొన్ని భాగాలు – ఎకికరణ మరియు
జాతి బేదం లేకుండా ప్రభుత్వం చే ప్రజలందరికి రక్షణ కల్పించడం, సమాన హక్కులు, అన్ని
మత వర్గాలకు రక్షణ కల్పించడం, అమెరికా స్వాతంత్ర ప్రకటన లోను, అమెరికా రాజ్యాoగం
లోను కనిపిస్తాయి.
9.
థామస్ జఫర్సన్ మదీనా రాజ్యాంగం ప్రబావం తో
అమెరికా స్వాతంత్ర ప్రకటనలో జీవిత, స్వేచ్ఛ, మరియు ఆనందం
పోoదే హక్కులను చేర్చినాడు.
10.అమెరికా పూర్వపు
అద్యక్షులు థామస్ జఫర్సన్ మరియుజాన్ ఆడమ్ లకు ఇస్లామిక్ జ్ఞానము దివ్య ఖురాన్ తో
పరిచయం కలదు.
11. నేటి అమెరికా
అద్యక్షుడు బారక్ హుస్సియన్ ఒబామా తండ్రి కీన్యా దేశ ముస్లిం మతస్తుడు.
12.బారక్ అనగా
ఆశ్విరదింప బడిన వాడు అని అరబిక్ లో
అర్ధం.
హుస్సియన్ అనగా ప్రవక్త (స) మనుమని పేరు.
ఒబామా అనగా నేను మీతో ఉన్నానని పార్శి లో
అర్ధం.
No comments:
Post a Comment