6 September 2015

జకాత్ -సంపదను శుద్ది చేయును . -



ఒక అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఇస్లాం మతం యొక్క ఐదు మూల స్తంభాల్లో ఒకటి అయిన జకాత్ మాధ్యమం ద్వారా ప్రతి సంవత్సరం పేదవారి కోసం $200 బిలియన్లు  నుండి ఒక ట్రిలియన్ డాలర్ల వరకు  వ్యయం చేస్తారు. - అన్ని స్వచ్ఛంద సంస్థలతో సహా  యునైటెడ్ నేషన్స్ చేపట్టె అన్ని  మానవతా ప్రాజెక్టులతో  సహా UN బడ్జెట్ $ 5.5 బిలియన్ల మొత్తం గా ఉంది.  చాలా దేశాలలో ముస్లింల పేదరికం తో భాదపడు తున్నారు మరియు జకాత్ వసూలు పంపిణీ పద్ధతి పై    పరిశోధన మరియు ఆత్మశోధన అవసరం ఉంది.
 
 జకాత్ -పన్ను కాదు సంపదను  శుద్దిపరిచే సాధనం.
జకాత్ యొక్క నిఘంటు అర్థం "పరిశుభ్రత, క్రమేపి పెరుగుదల, అదనo, ప్రశంసలు" అని ఉంది. అల్లాహ్ పవిత్ర ఖురాన్ లో చెప్పారు: "ప్రవక్తా! నీవు వారి సంపదల నుండి జకాత్  తీసుకోని వారిని పరిశుద్దపరుచు. ఇంకా సన్మార్గం లో వారిని ముందుకు నడుపు. వారి కొరకు దేవువి కారుణ్యానికై ప్రార్ధించు ఎందుకంటే మీ ప్రార్ధన వల్ల వారికి ఉపశమనం కలుగుతుంది. అల్లాహ్ అంత వింటాడు, ఆయనకు అంతా తెలుసు."(ఖురాన్ 9: 103)

ఇస్లాం మతం లో వ్యక్తిగత సంపద భావన లౌకిక మరియు ప్రపంచ భౌతిక వాదనలకు  చాలా భిన్నంగా ఉంటుంది. ఒక ముస్లిం తన సంపద అల్లాహ్ ద్వారా అతనికి అప్పగించినది  అని నమ్ముతాడు. అతను తన సంపదను తన మేధస్సు మరియు తన కఠిన పరిశ్రమ  ద్వారా సంపాదించినది కాదు కేవలం   తాత్కాలికoగా తన  అధినం లో ఉంది అని నమ్ముతాడు సంపాదకు అసలు యజమాని అల్లాహ్ అని నమ్ముతాడు మరియు అల్లాహ్ ఆజ్ఞలను అనుసరించి ఒక పద్ధతిలో ఆ సంపద ఖర్చు బాధ్యతను కలిగిఉంటాడు. అందువలన ఒక ముస్లిం పేదవారికి మరియు అవసరం ఉన్నవారికి  తన వార్షిక పొదుపు నుండి  2.5% చేల్లిo చమని అల్లాహ్ ఆదేశించి నప్పుడు అది పన్ను అను భావన పొందుట లేదు. జకాత్ సంపద ను   పరిశుద్ధ పరిచేది అంతియే కాని పన్ను కాదు.

 జకాత్ అమలు మరియు పన్ను ఎగవేత
వ్యక్తులు, సంస్థలు మరియు ట్రస్ట్ ల  ద్వారా పన్నుల అక్రమ ఎగవేత ఉంది. పన్ను ఎగవేత దారులు తరచుగా ఉద్దేశపూర్వకంగా తమ సంపాదనను తక్కువ ఆదాయం, లాభాలు లేదా తక్కువ లాభాలు లేదా తగ్గింపులు  హెచ్చు  గా ప్రకటిస్తారు. ప్రపంచ పన్ను ఎగవేత పై  ఒక బ్లూమ్బెర్గ్ కథలో  ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది  పౌరులు డేటా గ్రిడ్ ఆఫ్ వ్యాపారాలు నిర్వహించడం ద్వారా పన్నులు తప్పిoచుకొంటారిని తెలిసింది.

"నీడ ఆర్ధికవ్యవస్థలలో "(“shadow economies”) ఆరోగ్య రక్షణ, రహదారులు, విద్య, లేదా మరింత మెరుగైన పన్ను సేకరణకు  లేదా తగినంత ప్రజా సేవలను  అందించడానికి ప్రభుత్వానికి  తగినన్ని ఆదాయ వనరులు ఉండవు. నిజానికి  2007 లో 162 దేశాలలో, అధికారిక స్థూల జాతీయోత్పత్తిలో 35.5 శాతం వ్యవస్థీకృత నేరాలు, డ్రగ్స్   వంటి అక్రమ కార్యకలాపాల తగ్గిపోయింది అని  అంచనా. ముస్లింల జకాత్ పై  ప్రపంచ స్థాయిలో ఖచ్చితమైన డేటా అందుబాటులో లేనప్పటికీ, మొత్తం జకాత్ లో పెరుగుతున్న సంఖ్యలు అది సాధారణ పన్ను ఎగవేత వంటి చెడు కాదు అని రుజువు చేసాయి.
 
 ఎందుకు జకాత్ 2.5% ఫ్లాట్ రేట్?

ఫ్లాట్ రేట్ పన్ను వ్యవస్థ యొక్క ప్రతిపాదకులు ప్రకారం : "ఒక ఫ్లాట్ రేట్ పన్ను పాలన లో అందరు  సమానం. అందరు సమాన స్థాయి లో పన్ను చెల్లిస్తారు,  తద్వారా అందరి పట్ల  సమానం గా ఉండడం  జరుగుతుంది. ఉదా: సాలినా $ 100,000 సంపాదించే వక్తి 20% టాక్స్ చొప్పున  $ 20,000 చెల్లిస్తాడు. అదే $ 50,000 సాలిన సంపాదించే వక్తి   20% పన్ను చొప్పున వ్యక్తి, $ 10,000 చెల్లిస్తాడు. అనగా ఒక వేరియబుల్ లేదా ప్రగతిశీల పన్ను వ్యవస్థ లో అధికంగా సంపాదించే వ్యక్తి తక్కువ శాతం పన్ను, తక్కువ సంపాదించే వ్యక్తి ఎక్కువ పన్ను చెల్లించవలసి ఉంటుంది.

ఫ్లాట్ రేట్ పన్ను విధానంను వ్యతిరేకించే వారి అభిప్రాయం ప్రకారం:  " ఫ్లాట్ పన్ను రేట్ లో పేదలను  శిక్షించడం జరుగుతుంది. ఉదాహరణకు, మీరు $ 100 సంపాదిస్తే ప్లాట్ పన్ను రేట్ 30% గా ఉంటె మీ ఖర్చులకి $ 70 మాత్రమే మిగులుతావి.  మీరు $ 1000 సంపాదిస్తే  , ఫ్లాట్ పన్ను30% పోగా  మీ ఖర్చులకి $ 700 మిగులుతావి. పన్ను అధికంగా చెల్లించే వ్యక్తి అధికంగా భాదపడరు  ఎందుకంటే పన్ను చెల్లించిన తరువాత అతని దగ్గిర అధికంగా మిగులుతుంది
  సహజంగానే, అధికంగా పన్ను చెల్లిoచే వ్యక్తి పన్ను ద్వారా అంతగా ప్రభావితం కాడు. ఈ విధానం  పేదవాళ్లును మరింత పేదవారిగా, ధనికులను మరింత ధనికులుగా చేస్తుంది. ప్రగతిశీల పన్ను విధానం లో  పన్నులు  ధనికుల మీద ఎక్కువ  మరియు పేదల పై తక్కువగా ఉండాలి.

ఈ రెండిటికి సమన్వయంగా ఇస్లాం మతం  ఒక ఫ్లాట్ 2.5% రేటు విధించింది. జకాత్ సాహిబ్ ఇ నిసాబ్  పై (జకాత్ చెల్లించడానికి తగినవారు) విధించినది. నిసాబ్ విధించటానికి రెండు పద్దతులు కలవు -బంగారం లేదా వెండి గాని కలిగి ఉండటం : నిసాబ్   బంగారం ప్రమాణం  3 ఔన్సులు  (87.48 గ్రాములు) లేదా దాని నగదు తో  సమానం. ఈ బంగారం మార్కెట్ విలువ మారుతుంది. సిల్వర్: నిసాబ్ వెండి ప్రమాణం 21 వెండి ఔన్సుల (612.36 గ్రాముల) లేదా దాని సమానం నగదు.
 జకాత్ మరియు సంక్షేమ రాజ్యం:

సంక్షేమం రాజ్యం పౌరుల యొక్క ఆర్థిక మరియు సామాజిక శ్రేయస్సు పెంపోదించటం లో   కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అవకాశం, సంపద,ప్రజా బాద్యత లో  సమానంగా పంపిణీ కోరుతుంది.
పవిత్ర ఖురాన్ లో జకాత్ పంపిణీ గురించి ఇలా వ్రాయబడినది: "ఈ జకాత్ నిధులు అసలు కేవలం నిరుపేదలకు, అక్కరలు తీరని వారికి, జకాత్ వ్యవహారాలకై నియక్తులైన వారికి, ఇంకా ఎవరి హృదయాలను గెల్చుకోవటం అవసరమో వారికి, ఇంకా బానిసల విముక్తికి, రుణగ్రస్తుల సహాయానికి, దేవుని మార్గం లోను బాటసారుల అతిద్యానికి వినియోగించడం కొరకు, ఇది అల్లాహ్ తరుపు నుండి నిర్ణయిoచబడిన ఒక విధి. అల్లాహ్ అన్ని ఎరిగినవాడు వివేకవoతుడును”.  (దివ్య ఖురాన్ 9-60).

జకాత్ నిధులు జకాత్ సేకరించే  వారి వేతనాల కోసం ఉపయోగించబడవచ్చు. జకాత్ రాజ్యం  ద్వారా సేకరించబడి  మరియు దివ్య ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ (స) సూచనల  మేరకు పంపిణి చేయబడతాయి. జకాత్ పొందే రెండు ప్రధాన కేటగిరీలు: (1) పేదవారు  (Fuqara) – ఇది ఆదాయం లేనివారిని  సూచిస్తుంది. సేకరించిన జకాత్ నిధుల పరిమాణం పేదరిక నిర్మూలనలో దీర్ఘకాల ప్రణాళిక రూపకల్పన కు సహాయం చేస్తుంది మరియు పేదవారు  వారి కాళ్ల మీద నిలబడటానికి సహాయం చేస్తుంది. (2) అవసరం ఉన్నవారు (Masakeen) - వారు ఉదాహరణకు, ఒక ఉద్యోగం, ఒక ఇల్లు మరియు ఒక కారు కలిగి ఉండవచ్చు కానీ వారి ఆదాయం కనీస అవసరం కంటే తక్కువగా ఉంది.

జకాత్ నిధులను  పౌరులకు జీవన నాణ్యత మెరుగుదలకు , ఉపాధి హామీ పథకం, కనీస వేతనం కార్యక్రమాలు, కారు మరియు గృహ వడ్డీ లేని రుణాలు వంటి ప్రాజెక్టులను  అమలు చెయ్యవచ్చు. అందువలన జకాత్ చెల్లించటం  ఒకరి సంపద శుద్ధీకరణను మరియు సంపద మరింత సమానంగా పంపిణీ చేయటానికి దారితీస్తుంది. ప్రతి ఒక్కరూ ఒక మంచి జీవితం గడపటానికి  ఒక రాజ్య  సంక్షేమం కొరకు దారితీస్తుంది.

No comments:

Post a Comment