9 September 2015

ఇస్లాం మూలసూత్రాలను అపహాస్యం చేస్తున్న తూర్పు మద్య ఆసియా (Middle East Asia) ముస్లిం పాలకులు.




ఆరో శతాబ్దంలో
శక్తివంతమైన రోమన్ సామ్రాజ్యం మరియు బైజాంటైన్ రాజ్యం ఉచ్చ దశలో ఉన్నప్పుడు, అనైతిక మరియు అమానవీయ వ్యవహారం తో పాలకులు సాధారణ ప్రజలను  హింసిస్తూ ఉన్నప్పుడు  అరేబియన్ ద్వీపకల్పం లోని హిజాజ్ ప్రాంత  వాయువ్య మూలన ఇస్లాం మతం ఆవిర్భవించినది.  ఆ రోజుల్లో పాలకులు పూర్తిగా ధిక్కారం మరియు క్రూరత్వం తో   పురుషుల, మహిళల  మరియు పిల్లల పట్ల వ్యవరించేవారు.

అసహాయులకు శక్తీవంతుల దౌర్జన్యల నుండి రక్షణ లేనప్పుడు అల్లాహ్ ప్రవక్త(స) ను  మానవులందరూ సమానులే అనే సర్వ సోదరభావం చాటే ఇస్లాం మతం భోదించమని అరేబియా లో జన్మిoప చేసినాడు.  ప్రవక్త(స) అనుచరులు అందరు సామాన్యులే. వారు బుద్ది జీవులు కారు లేదా శిక్షణ పొందిన సైనికులు కారు  లేదా ధనవంతులు కారు. వారు సాధారణ అరేబియా వాసులు మరియు వారిలో అధిక సంఖ్యాకులు నిరక్షరాస్యులు.

ప్రజలు ప్రవక్తను(స) అల్లాహ్ పంపగా వచ్చినవాడు అని నమ్మటానికి మహిమలు ప్రదర్శించమని అడిగినప్పుడు ప్రవక్త(స) తన మహిమలు ఇస్లాం మూల సూత్రాలు అని అవి దివ్య ఖురాన్ లో ఉన్నాయని మరియు అది దైవ వాణి అని బదులు  ఇచ్చినాడు. ప్రవక్త(స) అరేబియా వాసులను దివ్య ఖురాన్ పటించమని దాని సూత్రాలను పాటించమని కోరినాడు. 50 సంవత్సరాలలో అరేబియా అంతట ఇస్లాం వ్యాపించినది మరియు వేలాది సంవత్సరాల చరిత్రగల గొప్ప సామ్రాజ్యలైన రోమ్, బైజాంటైన్,పర్షియా ఇస్లాం పాదాక్రాంతం అయినాయి.
 
నేడు సిరియా, ఇరాక్ మరియు ఆఫ్గనిస్తాన్, ISI లోని నియంతలు  వారి నియంత్రణలో ఉన్న జనాభా ను లోబరుచుకొని  మరియు వారు ఇతర ముస్లింలకన్నా తాము  అధికులమని  ఇస్లాం మతం యొక్క పేరు తో   దౌర్జన్యం చేస్తున్నారు. వారు భోదించే  ఇస్లాం మతం అనుసరించని వారిని  అంతమొందించడం, జంతువుల వలే  హింసించడం చేస్తున్నారు. వృత్తినిపుణులు, విద్యావేత్తలు మరియు చదువుకున్న వారిలో చాలా మంది మరియు  సాధారణ పౌరులు   తీవ్రమైన హింస కు నిస్సహాయంగా వారి గృహాలను ఉద్యోగాలను  మరియు నగరాలను  వదిలి బంజరు మరియు కఠినమైన శరణార్ధి శిబిరాల్లో నివసిస్తున్న శరణార్థులుగా  మారారు. వారి సంఖ్య 6  మిలియన్ల చేరింది. వృద్ధులు , మహిళలు, పిల్లలు ఐదు సంవత్సరాలు గా  దుర్భరమైన ముగింపు తో ఈ శరణార్ది శిబిరాల్లో కొట్టుమిట్టాడుతున్నారు.టర్కీలో 2 లక్షల మంది శరణార్థులు , జోర్డాన్ లో 1 మిలియన్, లెబనాన్ లో  1.5 మిలియన్, ఇరాక్ లో అరమిలియన్, ఈజిప్ట్ లో పావు మిలియన్ల మంది ఉన్నారు.

ఈ శరణార్థులలో  చాలా మంది ముస్లింలు ఉన్నారు మరియు వారు దారితప్పిన మరియు మంచి ముస్లింలు, మంచి పాలకులు గా చెప్పుకునే వారిచే  అవమానించ బడుతున్నారు. ప్రతి రోజు వారు ఇస్లాం మతం యొక్క ప్రధాన సందేశం ఉల్లంఘించే వారి అమానుష ప్రవర్తనకు  గురి అవుతున్నారు మరియు ఆ పాలకులు తమవి   శుద్ధమైన ఇస్లామిక్ ప్రభుత్వాలు అని వాదించుచున్నారు.  వారు 6 మిలియన్ తోటి ముస్లింల నిరంతర కష్టాలను పట్టించుకోనుటలేదు. దివ్య ఖుర్ఆన్ మరియు ప్రవక్త(స) యొక్క సందేశాలను  గాలి  కి వదిలి ఏ విధంగా అయిన  అధికారంలో ఉండాలనుకొంటున్నారు. వారికి  మిలియన్ల ముస్లిం శరణార్ధుల  దారుణమైన బాధలు పట్ల సానుభూతి లేదు.

చివరకు ఒక సంవత్సరం క్రితం ఈ శరణార్థ శిబిరాల్లోని  వాసులు బయటకు రావడం ప్రారంభించారు  మరియు స్థిరమైన ఆర్థిక వ్యవస్థలు కలిగిన యూరోప్ దేశాలకు వలస వెళ్ళడానికి కృషి ప్రారంభించారు. అంతర్జాతీయ సమాజం వారి దురవస్థపై  దృష్టి పెట్టనoదువలన వారు గత్యంతరం లేక  అంతర్జాతీయ అక్రమ రవాణాదారులు మరియు వ్యవస్థీకృత నేర సిండికేట్లను వలస పోవడానికి ఆశ్రయిoచారు. పడవలలో మద్యదార సముద్రం ను దాటి వారు గ్రీస్, ఇటలీ ఇతర బాల్కన్ దేశాలు మరియు దక్షిణ యూరోపియన్ దేశాల  తీరాలుకు అక్రమం గా ప్రయాణించడం ప్రారంభించినారు.  వారు వాయువ్య ఐరోపా దేశాల కు భూమార్గాన  పోవడం ప్రారంభించారు. సముద్ర మార్గాన మరియు భూమార్గాన  ప్రయాణo లో  అనేక విషాదాలు  చోటు చేసుకొని చిన్న పిల్లలు  మరియు వారి తల్లులతో సహా అనేకమంది  మరణానికి  గురి అయినారు.

ఒక వారం క్రితం సంక్షోభం అంచులకు చేరి ఐదు సంవత్సరముల కింద వయస్సు గల  అనేక మంది  చిన్న పిల్లలతో  సహా, యవ్వనం  లో ఉన్న వారి తల్లులు, యువకులు,ముసలి వారు   దాదాపు అర మిలియన్ శరణార్థులు, గ్రీస్, సెర్బియా మరియు మేసిడోనియా దాటి హంగేరి ద్వారా  ఆస్ట్రియా, జర్మనీ, స్వీడన్  మరియు నార్వే చేరడానికి  ప్రయత్నించారు.కాని  వారిని  హంగేరి పోలీసులు  వేధించడానికి ప్రయత్నించారు, జర్మనీ మరియు ఇతర  స్కాండినేవియా దేశాలు  వారికి ఆశ్రయం ఇచ్చాయి. ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రియా మరియు పశ్చిమ యూరోప్ దేశాల సాధారణ పౌరులు తమ ప్రభుత్వాల ఉదాసీనత ఆపడానికి మరియు శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేoదుకు  డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీలు నిర్వహించారు
మానవత్వం దృష్ట్యా క్రైస్తవులు ఎక్కువగా ఉన్న జర్మనీ, స్వీడన్, నార్వే మరియు ఆస్ట్రియా లాంటి  ఆర్థికంగా బలమైన దేశాలలోని  ప్రభుత్వాలు మరియు సాధారణ ప్రజలు , శరణార్ధులకు శరణ ఇవ్వడం అందరిని ఆశ్చర్యం లో ముంచెత్తింది. ఇవి తూర్పు మద్య ఆసియా ముస్లి౦ మత శరణార్థులకు అత్యంత ఉదారంగా సహాయం చేసాయి. ఇది ఆయా  దేశాలలోని   కొన్ని కుడి పక్ష  క్రైస్తవులు  నిరసనలు తెలిపినప్పటికీ, చాలామంది  ప్రజలు  మరియు ప్రభుత్వాలు మానవత్వం యొక్క సూత్రం అంగీకరించారు మరియు ఆశ్రయం ఇచ్చాయి. ఇలా ఎక్కువగా ముస్లిం మతం శరణార్థులకు  సహాయపడటం  నిజానికి ఒక ఉత్కంఠభరితమైన దృగ్విషయం. రోడ్డు పక్కన నిలబడి సాధారణ యూరోపియన్ పౌరులు, ఆహారం, పానీయం మరియు ఇతర సరఫరాలు  ప్రయాణిస్తున్న మరియు బాధిత నిస్సహాయ శరణార్థులు కు ఇవ్వడం మరియు స్వాగత నినాదాల  దృశ్యాలు  కనిపించ సాగినవి.

అదే సమయంలో సౌదీ అరేబియా, UAE, కువైట్ వంటి అదిక  సంపన్న ముస్లిం మత అరబ్ దేశాలు  అరబ్  శరణార్థుల పట్ల మానవత్వరహితంగా దారుణమైన అహంకారంతో  ప్రవర్తించారు. ఈ దేశాల్లో పాలకులు మరియు ప్రజలు తమను తాము ముస్లిం మతం, ఇస్లాం మతం యొక్క ఊయల గా భావిస్తారు కాని శరణార్థులు పట్ల  భయంకర విషాదాల జరిగిన తర్వాత కూడా, వారు ఒక్క  శరణార్థని కుడా  అంగీకరించ లేదు  లేదా మిలియన్ల సంఖ్యలో ఉన్న శరణార్ధులకు సహాయం చేయలేదు. అధిక సంపద మరియు తక్కువ జనాభా కల సంపన్న అరబ్ దేశాలు శరణార్థులు పట్ల వారు  విచక్షణాజ్ఞానం మరచి  అమానవీయ  ప్రవర్తనతో  ప్రవర్తించ సాగినారు.ఇస్లాం కే మచ్చ తెచ్చినారు. వారి కన్నా క్రైస్తవ జనాభా అధికం గా కల పశ్చిమ ఐరోపా దేశాలు మానవతా ప్రవర్తన ప్రదర్శించాయి.

 ఈ ముస్లిం మత దేశాలు ముస్లిం  కమ్యూనిటీ మరియు ఇస్లాం మతం యొక్క పేరు మరియు ప్రతిష్ఠలు  తగ్గించినవి.  అదే సమయంలో యూరోప్ లోని  క్రిస్టియన్ దేశాలు  క్రైస్తవ మతం మరియు క్రైస్తవులు పేరు  ప్రతిష్టలు పెంచినవి. నేను ఒక  ముస్లింగా  అలాంటి  వ్యాఖ్య చేసినందుకు నన్ను  విమర్శించుతారని   తెలుసు. కానీ నేను మానవత్వం వైపు ముస్లింలు తమ బాధ్యతలు జవాబుదారీతనం మరిచారని అనుకొoటునాను.

 దివ్య  ఖుర్ఆన్ మరియు ఇస్లాం మతం యొక్క ప్రధాన సందేశం ఆపదల ఉన్న వారిని ఆదుకోవాలని! ప్రార్థనలు  తోటి మానవుల పట్ల  అమానుష, అహంకార మరియు క్రూరత్వం ను  భర్తీచేయవు. ఇస్లాం మతం లో చాలా అద్భుతమైన ఉపదేశములు పాటించుట కొరకే గాని కేవలం ప్రచారం  కోసం కాదు. దివ్య ఖుర్ఆన్ లో అల్లాహ్ అతిచిన్న కీటకం  నుండి సమస్త  మానవజాతికి పోషకుడు మరియు ప్రభువు,అత్యంత దయామయుడు మరియు రక్షకుడు  అని స్పష్టం చేయడం జరిగింది.



No comments:

Post a Comment